బోల్ట్ మూడో విజయం.. అమెరికా డిస్ క్వాలిఫై!
ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మరో సారి జమైకన్ చిరుత సత్తాచాటాడు.. ముచ్చటగా మూడో గోల్డ్ మెడల్ కొట్టేశాడు. శనివారం జరిగిన 4X100 రిలే రేసులో తన టీమ్ ను అందరికంటే ముందు నిలబెట్టాడు. ఈ విక్టరీతో బోల్ట్ తన ఖాతాలో 11 గోల్డ్ మెడల్ వేసుకున్నాడు. చివరి లెగ్ లో పరుగుపెట్టిన ఈ ఏస్ రేసర్ మొత్తం 37.36 సెకండ్లలో రేస్ పూర్తి చేశాడు. 2011 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా 100 మీటర్ల రేస్ నుంచి డిస్ క్వాలిఫై కావడం మినహా.. పాల్గొన్న రేసులన్నింటిలో బంగారు పతకం సాధించడం విశేషం.
ఇదిలా ఉంటే.. రెండో స్థానంలో నిలిచిన అమెరికా జట్టు.. ఈ రేసు నుంచి డిస్ క్వాలిఫై అయ్యింది. చివరి బ్యాటన్ అందుకోవడంలో చేసిన పొరపాటు.. ఆతిథ్య చైనా పాలిట వరంగా మారింది. అమెరికా డిస్ క్వాలిఫై కావడంతో మూడో స్థానంలో రేస్ పూర్తిచేసిన చైనా రజత పతకాన్ని గెలుచుకోగా.. నాలుగో స్థానంలో ఉన్న కెనడా.. కాంస్య పతకం అందుకుంది.