అదో పనికిమాలిన చర్య
కింగ్‌స్టన్: డోపింగ్‌లో దొరికి నిషేధానికి గురైన అథ్లెట్ టైసన్ గే తిరిగి ట్రాక్‌పైకి రావడంపై స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ విరుచుకుపడ్డాడు. అతడిపై జీవిత కాల నిషేధం విధించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘తమ చర్యలు అనైతికంగా ఉంటే ఏర్పడే పరిస్థితిపై ఆటగాళ్లకు భయం ఉండాలి.
డోపింగ్‌కు పాల్పడినా నామమాత్రపు శిక్ష విధిస్తే ఎవరు లెక్క చేస్తారు? గేపై రెండేళ్ల నిషేధాన్ని ఏడాదికి తగ్గించడం పనికిమాలిన చర్య. తాను తప్పు ఎలా చేశానో అధికారులకు చెప్పగానే అతడికి ఈ ఊరట లభించింది’ అని ఆరు ఒలింపిక్ స్వర్ణాలు సాధించిన బోల్ట్ ఆరోపించాడు.