స్వర్ణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా: బోల్ట్
కింగ్స్టన్: బీజింగ్ ఒలింపిక్స్లో సాధించిన స్వర్ణాన్ని తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు విఖ్యాత అథ్టెట్ ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. ' నేను స్వర్ణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఇది నిజంగా హృదయ వేదనకు గురి చేసినా తప్పదు. మనం శ్రమించి స్వర్ణం సాధించినా, ఒక తప్పు కారణంగా పసిడిని తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. జీవితంలో ఇటువంటి అనుభవాలు జరడగం సహజం. నేను స్వర్ణాన్ని తిరిగి ఇవ్వాల్సిన విషయాన్ని ధృవీకరిస్తే, నాకు ఎటువంటి సమస్య లేదు' అని బోల్ట్ పేర్కొన్నాడు.
4/100మీ. రిలే పోటీలో తన సహచరుడు నెస్టా కార్టర్ డోపింగ్ పరీక్షలో విఫలమయ్యాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో తాను అందించిన ‘ఎ’ శాంపిల్‌ను మరోసారి పరీక్షించగా నిషేధిత మెథిలెక్సానియామైన్ ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. దీంతో బోల్ట్ అండ్ గ్యాంగ్ సాధించిన స్వర్ణాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.