జమైకా: ఆరుసార్లు స్పింట్ చాంపియన్‌గా నిలిచిన ఉసయిన్ బోల్ట్ దోషిగా తేలితే జమైకా మరణించినట్లేనని డోపింగ్ నిరోధక కమిషన్‌కు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించాడు. బోల్ట్ పై వచ్చిన నిషిద్ధ ఉత్ప్రేరకాల ఆరోపణలు నిజమైతే ఆ దేశ క్రీడా చరిత్ర ముగిసినట్లేనని తెలిపాడు.
ఇదిలా ఉండగా బోల్ట్‌కు డ్రగ్స్ నిపుణుడు పాల్ రైట్ మద్దతుగా నిలిచాడు. బోల్ట్ నిషిద్ద ఉత్పేరకాలు వాడినట్లు ఆరోపణలు రావడంతో పలుమార్లు టెస్టులకు హాజరైయ్యాడని, వాటి నుంచి బోల్ట్ బయట పడతాడని తెలిపాడు.
గతంలో జమైకా దేశంలో పలువురు డ్రగ్స్ వాడి పట్టుబడిన ఉదంత సంచలనం రేపింది. జమైకా పరుగుల రాణిగా గుర్తింపు పొందిన క్యాంబెల్ బ్రౌన్, మాజీ 100 మీ. పరుగుల వీరుడు పావెల్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సింప్సన్‌లు ఈ డ్రగ్ ఉచ్చులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ దేశానికే చెందిన బోల్ట్‌పై కూడా పలు ఆరోపణలు రావడంతో.. అతడు కూడా డ్రగ్స్ టెస్టులకు పలుమార్లు హాజరైయ్యాడు. బోల్ట్ నిజాయితీగా ఆ ఉచ్చు నుంచి బయట పడతాడని ఆశాభావాన్ని పాల్ వ్యక్తం చేశాడు.
బోల్ట్ దోషిగా తేలితే ‘జమైకా’ చరిత్ర ముగిసినట్లే!
Published Tue, Aug 6 2013 4:01 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement