
11 నెలల తర్వాత...
గ్లాస్గో: దాదాపు 11 నెలల తర్వాత ట్రాక్‌లో అడుగుపెట్టిన స్ప్రింట్ స్టార్ ఉసేన్ బోల్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో ఆకట్టుకున్నాడు. 4 x100 మీటర్ల రిలేలో జమైకా జట్టును ఫైనల్‌కు చేర్చాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన హీట్స్‌లో తొలి 100 మీటర్ల పరుగును ప్రారంభించిన రోచ్ మధ్యలో నొప్పితో వెనుకబడినా... చివరి 100మీ. పరుగులో బోల్ట్ దుమ్మురేపాడు. అందరికంటే ముందున్న నైజీరియా అథ్లెట్ మార్క్ జెల్క్స్‌ను వెనక్కి నెడుతూ అలవోకగా లక్ష్యాన్ని అందుకున్నాడు. దీంతో జమైకా జట్టు 38.99 సెకన్లలో రేసును ముగించి ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఈవెంట్‌కు మూడు రోజుల ముందు కామన్వెల్త్ గేమ్స్‌ను ‘షిట్’ అంటూ వ్యాఖ్యానించిన బోల్ట్... రేసు తర్వాత గ్లాస్గోపై ప్రశంసలు కురిపించాడు. అద్భుతం.. అమోఘం అంటూ... లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నంత ఆనందంగా ఉందని కితాబిచ్చాడు. రోచ్ నొప్పి గురించి మాట్లాడుతూ... ‘బాధలో కూడా ఎలా పరుగెత్తాలో మా కోచ్ నేర్పించాడు. అందుకే మేం ప్రపంచ చాంపియన్లుగా ఉన్నాం’ అని బోల్ట్ అన్నాడు.