
బోల్ట్‌పైనే దృష్టి
మాస్కో (రష్యా): ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు శనివారం తెరలేవనుంది. ఈనెల 18 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో అందరి దృష్టి ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌పైనే ఉంది. రెండేళ్ల క్రితం కొరియాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల ఫైనల్లో ‘ఫాల్స్ స్టార్ట్’ చేసి వేటుకు గురైన బోల్ట్ ఈసారి ఆ టైటిల్‌ను సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.
గాయం కారణంగా డిఫెండింగ్ చాంపియన్ యోహాన్ బ్లేక్ (జమైకా) వైదొలగడం... డోపింగ్‌లో పట్టుబడిన టైసన్ గే (అమెరికా), అసఫా పావెల్ (జమైకా) తప్పుకోవడంతో బోల్ట్ పని మరింత సులువైంది. తొలి రోజున రెండు విభాగాల్లో ఫైనల్స్ (పురుషుల 10 వేల మీటర్లు, మహిళల మారథాన్ రేసు) జరుగుతాయి. పురుషుల 100 మీటర్ల ఫైనల్ ఆదివారం జరుగుతుంది.