
రియో బృందంలో బోల్ట్
కింగ్‌స్టన్: రియోకు వెళ్లే జమైకా అథ్లెట్ల బృందంలో ఉసేన్ బోల్ట్‌కు చోటు దక్కనుంది. ఈ మేరకు జమైకా అథ్లెటిక్స్ అడ్మినిస్ట్రేటివ్ సంఘం (జేఏఏఏ) బోల్ట్ పేరును రియోకు పరిశీలించాలని ఆ దేశ ఒలింపిక్ సంఘాని(జేఓఏ)కి సూచించినట్లు సమాచారం. దీంతో జేఓఏ 100మీ., 200మీ.లో పాల్గొనే నలుగురు అథ్లెట్ల బృందంలో బోల్ట్ పేరును చేర్చింది. నిబంధనల ప్రకారం ముగ్గురు అథ్లెట్లు మాత్రమే ఈవెంట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ బృందం నుంచి తుది జట్టును రియో టీమ్ మేనేజ్‌మెంట్ ఎంపిక చేస్తుంది.
జాబితాలో పేరు చేర్చినప్పటికీ... జూలై 22న జరిగే లండన్ డైమండ్ లీగ్ మీట్‌లో బోల్ట్ రియోకు అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్ అర్హత ట్రయల్స్‌లో తొడ కండరంలో అసౌకర్యం కారణంగా బోల్ట్ ఫైనల్ బరిలో దిగలేదు.