కింగ్‌స్టన్: ఎనిమిదిసార్లు ఒలింపిక్ పసిడి పతక విజేత, జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ తండ్రి అయ్యాడు. బోల్ట్ భాగస్వామి కాసీ బెన్నెట్ ఇక్కడి హాస్పిటల్‌లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం నిజమేనంటూ స్వయంగా జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్ సామాజిక మాధ్యమం ద్వారా తెలపడం విశేషం. ‘ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్–కాసి బెన్నెట్ జంటకు శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు. గత మార్చిలోనే బోల్ట్... తమకు ఆడబిడ్డ పుట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపాడు. దాదాపు దశాబ్దంపాటు పురుషుల స్ప్రింట్‌లో తన హవాను చాటిన బోల్ట్ 2017లో రిటైర్ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్... 2008, 2012, 2016 ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెల్చి ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు.
Comments
Please login to add a commentAdd a comment