Birth to a daughter
-
7 నెలలుగా కోమాలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 నెలలుగా అచేతన స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ(23) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణీ యువతి గత వారం బిడ్డకు జన్మనిచ్చినట్లు ఢిల్లీ ఎయిమ్స్ ట్రామాకేర్ విభాగం వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఆ యువతి అచేతన స్థితిలోనే ఉందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతున్నట్లు తెలిపారు. ఒక్కోసారి కళ్లు తెరిచి చూస్తోందని, కొన్ని సంవత్సరాల్లోనే తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు 10-15 శాతం అవకాశం ఉందని వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఏడాది మార్చి 31న గర్భిణీ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో భార్యాభర్తలు హెల్మెట్ ధరించలేదు. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్తకు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవటంతో ఆయన కోలుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బూలంద్శహర్లో జరిగింది. తొలుత బాధితురాలికి బులంద్‌శహర్‌లోని అబ్దుల్లా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడి నుంచి ఏప్రిల్ 1న తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు మార్చారు. తలకు తీవ్ర గాయాలవగా మెదడులో ఎముక ఉండిపోయినట్ల వైద్యులు గుర్తించారు. ఇప్పటి వరకు 5 రకాల న్యూరోసర్జికల్ ఆపరషన్లు నిర్వహించారు. ఆమె కళ్లు తెరుస్తుందని, కానీ కదల్లేని స్థితిలో ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ‘ప్రమాదం జరిగిన సమయానికి ఆమె 40 రోజుల గర్భిణీ. కడుపులో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. కుటుంబ సభ్యులు అబార్షన్‌కు ఒప్పుకోలేదు. నెలలు నిండిన ఆమెకు అక్టోబర్ 22న ప్రసవం చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు 2.5 కిలోలు ఉంది. తల్లి అచేతన స్థితిలో ఉండడం వల్ల బిడ్డకు పాలు ఇచ్చే ఆస్కారం లేదు. ప్రస్తుతానికి డబ్బా పాలే అందిస్తున్నాం. ’ అని డాక్టర్లు తెలిపారు. ఇదీ చదవండి: లాటరీలో ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్‌పాట్.. బీజేపీ మనీలాండరింగ్ ఆరోపణ -
బోల్ట్ తండ్రయ్యాడు
కింగ్స్టన్: ఎనిమిదిసార్లు ఒలింపిక్ పసిడి పతక విజేత, జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ తండ్రి అయ్యాడు. బోల్ట్ భాగస్వామి కాసీ బెన్నెట్ ఇక్కడి హాస్పిటల్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం నిజమేనంటూ స్వయంగా జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్ సామాజిక మాధ్యమం ద్వారా తెలపడం విశేషం. ‘ఆడబిడ్డకు జన్మనిచ్చిన స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్–కాసి బెన్నెట్ జంటకు శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు. గత మార్చిలోనే బోల్ట్... తమకు ఆడబిడ్డ పుట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో తెలిపాడు. దాదాపు దశాబ్దంపాటు పురుషుల స్ప్రింట్‌లో తన హవాను చాటిన బోల్ట్ 2017లో రిటైర్ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పిన బోల్ట్... 2008, 2012, 2016 ఒలింపిక్స్ క్రీడల్లో 100, 200 మీటర్లలో పసిడి పతకాలు గెల్చి ఈ ఘనత సాధించిన ఏకైక స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించాడు. -
స్వరాష్ట్రానికి వెళ్తూ రోడ్డుపై మహిళ ప్రసవం
చేగుంట (తూప్రాన్): కూలీపనుల కోసం హైదరాబాద్‌కు వచ్చి లాక్డౌన్ సందర్భంగా తమ సొంత రాష్ట్రానికి వెళ్తున్న ఓ గర్భిణి దారిలో రోడ్డుపక్కనే ప్రసవించింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూర్ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో కూలికోసం అనితాబాయి లోకేశ్ దంపతులు కొంతకాలం కిందట ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వచ్చారు. లాక్డౌన్ నిబంధనలను కేంద్రం సడలించడంతో తమ రాష్ట్రానికి వెళ్లాలనుకున్న అనితాబాయి కుటుంబీకులు ఓ వాహనంలో సోమవారం రాత్రి బయలుదేరారు. నార్సింగి వద్ద అనితాబాయికి పురిటి నొప్పులు రావడంతో వాహన డ్రైవర్ వారిని జప్తిశివునూర్ శివారులో దింపేసి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం అనితాబాయి రోడ్డుపక్కనే ప్రసవించి పాపకు జన్మనిచ్చింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న నార్సింగి ఎస్ఐ రాజేశ్ ఉన్నతాధికారుల సూచనలతో తల్లిపాపలను అంబులెన్స్‌లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రామాయం పేట సీఐ నాగార్జునగౌడ్ ఆస్పత్రికి చేరుకొని తల్లీపాపల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. స్థానికుల సాయంతో బేబీకిట్‌ను అందజేసి ఎలాంటి అవసరం ఉన్నా తాము ఆదుకుంటామని సీఐ అనిత కుటుంబీకులకు హామీ ఇచ్చారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకురావడంతో తల్లీపాపలకు మెరుగైన వైద్యం అందించినట్లు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. -
ఆడపిల్లకు జన్మనిచ్చిన హెచ్ఐవీ బ్లడ్ బాధితురాలు
చెన్నై : గతేడాది డిసెంబర్లో ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా తమిళనాడు వైద్యులు ఓ గర్భిణీకి హెచ్ఐవీ బ్లడ్ ఎక్కించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సదరు మహిళకు కూడా హెచ్ఐవీ సోకింది. ఈ క్రమంలో ఆ గర్భిణీ మదురైలోని రాజాజీ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం గురించి డాక్టర్లు మాట్లాడుతూ.. ‘సాధరణంగా అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైనా 2.5 - 3.5 కిలోగ్రాముల బరువు ఉండాలి. కానీ ఈ చిన్నారి కేవలం 1. 75 కిలోగ్రాముల బరువు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ పాపను చిన్న పిల్లల ఐసీయూలో ఉంచామ’ని తెలిపారు. అంతేకాక తల్లి నుంచి బిడ్డకు హెచ్ఐవీ రాకుండా నిరోధించే ‘నెవిరాపిన్ సిరప్’ను కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మెడిసిన్‌ను 6 - 12 వారాల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేకాక హెపటైటీస్ బీ వైరస్ రాకుండా నిరోధించడం కోసం హెపటైటీస్ బీ టీకాను కూడా ఇచ్చామన్నారు. దాంతో పాటు 45 రోజుల తర్వాత చిన్నారికి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గత డిసెంబర్ 6న సదరు గర్భిణీకి ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రక్తాన్ని ఎక్కించారు. అయితే ఆ రక్తాన్ని దానం చేసిన వ్యక్తికి హెచ్ఐవీ ఉన్నట్లు తేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్దపడుతున్న ఆ వ్యక్తి.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో రక్త పరీక్ష చేయించుకోగా హెచ్ఐవీ పాజిటీవ్‌గా తేలింది. వెంటనే అతను బ్లడ్ బ్యాంకు వారికి సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణీకి ఎక్కించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే రక్త దానం చేసే నాటికే సదరు యువకుడికి హెచ్ఐవీ, హెపటైటిస్ బీలు ఉన్నాయని పరీక్షల్లో తేలిందని గుర్తించారు. ఈ విషయాన్ని ల్యాబ్ టెక్నిషియన్లు సదరు యువకుడికి తెలియజేయకపోవడంతో ఈ దారుణం జరిగింది. -
కన్న కుమారైనే గర్భవతిని చేసిన తండ్రి
కన్న కుమార్తనే గర్బవతిని చేసిన కీచక తండ్రి విషయం బయటికి తెలియడంతో పరారి. బొమ్మనహళ్లి : కడుపున పుట్టిన కుమారైనే కన్న తండ్రి గర్బవతిని చేసిన దారణం ఆదివారం వెలుగలోకి వచ్చింది. గత ఎనిమిది నెలల నుంచి కన్న కుమార్తె పైనే నిరంతరం అత్యాచారం చేశాడు. బాలికకు ఆడ పిల్ల జన్మించడంతో విషయం తెలుసుకున్న తండ్రి ఊరు వదిలి పరారయ్యాడు. మంగళూరులోని సురత్కల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ససిహిత్లు ప్రాంతానికి చెందిన వామన బంగేరా తన కన్న కూతురుపైనే అత్యాచారం చేశాడు. శనివారం బాలిక ప్రభుత్వాస్పత్రిలో బాలికకు జన్మనిచ్చింది. తీవ్ర కడుపు నొప్పి రావడంతో బాలిక ఆస్పత్రికి వెళ్లడంతో డాక్టర్లు బాలికను గర్బవతిగా గుర్తించారు. గర్బం ఎలా వచ్చిందన్న విషయం బాలిక ఎంతకి చెప్పక పోవడంతో, బాలిక మైనర్ కావడంతో ఈ విషయాన్ని వైద్యులు సురత్కల్ పోలీసులకు తెలిపారు. సంఘటణ స్థలానికి వచ్చిన పోలీసులు బాలిక నుంచి వివరాలు సేకరించారు. కన్న తండ్రి తన కుమార్తెని బెదరించి ఎవరికి చెప్పకుండా 8 నెలల నుంచి బాలిక పైన నిరంతర అత్యాచారం చేసినట్లు పోలిసులు తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేపట్టారు.