కన్న కుమారైనే గర్భవతిని చేసిన తండ్రి
Published Mon, Apr 3 2017 6:28 PM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
కన్న కుమార్తనే గర్బవతిని చేసిన కీచక తండ్రి
విషయం బయటికి తెలియడంతో పరారి.
బొమ్మనహళ్లి : కడుపున పుట్టిన కుమారైనే కన్న తండ్రి గర్బవతిని చేసిన దారణం ఆదివారం వెలుగలోకి వచ్చింది. గత ఎనిమిది నెలల నుంచి కన్న కుమార్తె పైనే నిరంతరం అత్యాచారం చేశాడు. బాలికకు ఆడ పిల్ల జన్మించడంతో విషయం తెలుసుకున్న తండ్రి ఊరు వదిలి పరారయ్యాడు.
మంగళూరులోని సురత్కల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ససిహిత్లు ప్రాంతానికి చెందిన వామన బంగేరా తన కన్న కూతురుపైనే అత్యాచారం చేశాడు. శనివారం బాలిక ప్రభుత్వాస్పత్రిలో బాలికకు జన్మనిచ్చింది. తీవ్ర కడుపు నొప్పి రావడంతో బాలిక ఆస్పత్రికి వెళ్లడంతో డాక్టర్లు బాలికను గర్బవతిగా గుర్తించారు.
గర్బం ఎలా వచ్చిందన్న విషయం బాలిక ఎంతకి చెప్పక పోవడంతో, బాలిక మైనర్ కావడంతో ఈ విషయాన్ని వైద్యులు సురత్కల్ పోలీసులకు తెలిపారు. సంఘటణ స్థలానికి వచ్చిన పోలీసులు బాలిక నుంచి వివరాలు సేకరించారు. కన్న తండ్రి తన కుమార్తెని బెదరించి ఎవరికి చెప్పకుండా 8 నెలల నుంచి బాలిక పైన నిరంతర అత్యాచారం చేసినట్లు పోలిసులు తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేపట్టారు.
Advertisement
Advertisement