bommanahalli
-
వేధించాడని ఇంటికి పిలిచి హత్య
సాక్షి, బొమ్మనహళ్లి: ఓ యువకుడి హత్య కేసులో పోలీసులు దంపతులతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ డీసీపీ చంద్రశేఖర్ వివరాల మేరకు...ఎలక్ట్రానిక్ సిటీలో రీనా, గంగేశ్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు యూపీకి చెందిన వారు. రీనాకు నిబాశిశ్ పాల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. ఈ క్రమంలో గంగేశ్ యూపీకి వెళ్లిన సమయంలో రీనా ఇంటికి నిబాశిష్ వచ్చి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆమె లేదని తిరస్కరించడంతో ఎలాగైనా ఇవ్వాలని, లేదంటే అన్ని విషయాలు భర్తకు చెబుతానని బెదిరించాడు. దీంతో రీనా భర్తకు ఈ విషయం చెప్పింది. వెంటనే అతను బెంగళూరు వచ్చాడు. అదే రోజు పథకం ప్రకారం నిబాశిశ్‌ను ఇంటికి పిలిపించి పీకల దాకా మద్యం తాపించి గంజాయి కూడా ఇచ్చారు. అనంతరం చీరతో గొంతు పిసికి చంపేశారు. మృతదేహాన్ని అక్కడికి నుంచి తరలించడానికి మరో స్నేహితుడు బిజోయ్‌ను పిలిపించారు. రాత్రి వేళ శవాన్ని బైక్‌లో పెట్టుకుని ఓ గుర్తు తెలియని చోట పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజే టాటాఏస్ వాహనం పిలుచుకుని వచ్చి ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. నిబాశిష్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి టాటాఏఎస్ వాహనం డ్రైవర్‌ను పట్టుకున్నారు. అతని ద్వారా నిందితులు శివమొగ్గ జిల్లా శికారిపురలో ఉన్నట్లు తెలుసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. (చదవండి: ప్రేమించమని వేధింపులు.. భయాందోళనతో..) -
భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా కంటైనర్..
సాక్షి, బెంగళూరు(బొమ్మనహళ్లి): కాలేజీ విద్యార్థులు భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి కంటైనర్ లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులు మరణించిన సంఘటన బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకా బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. మృతులు బెంగళూరు సారక్కిలో నివాసం ఉంటున్న కౌశిక్ (21), సుష్మా (20). వీరు ఎ.ఎం.సీ కళాశాల్లో బీఎంహెచ్ కోర్సు చదువుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేద్దామని ఇద్దరూ బైక్‌పై బయల్దేరారు. బన్నేరుఘట్ట సమీపంలో ఉన్న కెంపనాయకనహళ్ళి అక్వేరియల్ గార్మెంట్స్ ముందు బైక్‌ను వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో కౌశిక్, సుష్మా తీవ్రగాయాలతో మృతి చెందారు. కంటైనర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
3 అంతస్తుల భవనం కోసం
బొమ్మనహళ్లి : నేటి కలికాలంలో అనుబంధాల కంటే ఆస్తులే ముఖ్యమవుతున్నాయి. అందుకోసం రక్త సంబంధాలను కూడా రక్తతర్పణం చేస్తున్నారు. తల్లి పేరుపై ఉన్న ఆస్తి కోసం కుమారుడు తండ్రితో కలిసి కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి కన్నతల్లిని హత్య చేయించాడు. అయితే నేరం దాగలేదు. బండెపాళ్య పోలీసులు ప్రధాన నిందితులతో పాటు సుపారీ కిల్లర్స్‌ను అరెస్ట్ చేశారు. వివరాలు.. ఈ నెల 16న ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఔట్లో బూటీ పార్లర్ నిర్వహిస్తున్న గీత (40) హత్యకు గురైంది. బెంగళూరు నగర ఆగ్నేయ విభాగం డీసీపీ శ్రీనాథ్ జోషి వివరాల మేరకు... గీత, అంజన్‌లకు 21 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి వరుణ్ (20) అనే కుమారుడు ఉన్నాడు. 15 సంవత్సరాల క్రితం విడిపోయారు. కుమారుడు వరుణ్ తండ్రితో కలిసి ఉంటున్నాడు. భవనంపై అడ్వాన్స్ తీసుకుని.. గీతాకు ఆమె తండ్రి రాసిచ్చిన 3 అంతస్తుల భవనం మంగమ్మనపాళ్యలో ఉంది. ఆ భవనంపై తండ్రీ కొడుకుల కన్ను పడింది. గీత తండ్రి ఈ భవనాన్ని గీత కుమారుడు వరుణ్ పేరుపైనే రాసిప్పటికీ తల్లి బతికి ఉంటే తనకు ఆస్తి దక్కదని వరుణ్ అనుకున్నాడు. దీనిపై కొన్నిసార్లు గొడవలు కూడ జరిగాయి. ఆస్తి దక్కాలంటే తల్లిని చంపడమే మార్గమని తండ్రికి చెప్పి పథకం సిద్ధం చేశాడు. అప్పటికే ఈ భవనాన్ని అమ్ముతామని వరుణ్, తండ్రి ఒకరి నుంచి రూ. కోటి అడ్వాన్స్ తీసుకున్నారు. ఈ విషయాన్ని కొనుగోలుదారులు గీతకు చెప్పడంతో ఆమె కోర్టుకు వెళ్లింది. కోర్టులో కూడా గీతకు మద్దతుగా తీర్పు రావడంతో ఆమెను ఎలాగైన హత్య చేయాలని అంజన్, వరుణ్ హత్యకు పథకం పన్నారు. నవీన్ కుమార్ అనే వ్యక్తికి రూ. 7 లక్షలు చెక్కును సుపారీగా ఇచ్చారు. ఈ నెల 16న అర్ధరాత్రి గీతను హత్య చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు తండ్రీ కొడుకుల పాత్రను గుర్తించి అరెస్టు చేసి వివరాలను రాబట్టారు. కిరాయి హంతకులు నవీన్, నాగరాజు, ప్రదీప్, బనహళ్లి నాగరాజులను అరెస్ట్ చేశారు. -
చాయ్‌వాలా టు మిలీనియర్‌గా మారిన ఇండిపెండెంట్ అభ్యర్థి
-
సిగరెట్ ఇవ్వలేదని కత్తితో పొడిచాడు
బొమ్మనహళ్లి: సిగరెట్ ఇవ్వలేదని ఓవ్యాపారిపై దుండగుడు కత్తితో పొడిచిన సంఘటన నగరంలోని ఉత్తరహళ్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడి ఆంజద్చాన్ ఇక్కడి విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంజద్ ఉత్తరహళ్లిలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న బార్ వద్ద అగరబత్తిల వ్యాపారం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం మత్తులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ ఇవ్వాలని అంజాద్‌ను కోరాడు. లేదని చెప్పడంతో కత్తితో అంజద్‌ను పొడిచి పారిపోయాడు. క్షతగాత్రుడిని ఓ వ్యక్తి కారులో విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
24 గంటలూ అదే యావ
సాఫ్ట్వేర్ ఇంజినీరుపై భార్య ఫిర్యాదు సాక్షి, బొమ్మనహళ్లి (బెంగళూరు): ప్రతిరోజూ పదేపదే లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరులోని బొమ్మనహళ్లికి చెందిన ఈ జంట 2008లో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు బాగానే చూసుకున్న భర్త.. ఆ తర్వాతి నుంచి లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. ఉదయం అల్పాహారం తీసుకోగానే మళ్లీ పడక మీదకు రావాలని వేధించేవాడు. సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఒకసారి.. రాత్రి భోజనం అయిన తర్వాత మరోసారి, రాత్రి మధ్యమధ్యలో... మళ్లీ మళ్లీ కావాలంటూ బాధితురాలికి కంటిమీద కునుకు లేకుండా చేశాడు. అత్తమామలు కూడా అతనికే వంతపాడుతుండటంతో ఆ యువతి చివరకు పోలీసులను ఆశ్రయించింది. -
'ఆయనతో సినీరంగానికి నష్టం'
బొమ్మనహళ్లి: కన్నడ సినిమా రంగం నిలబడటానికి డాక్టర్ రాజ్‌కుమార్ ఎంతో కృషి చేశారు. అయితే ఇటీవల మరో సీనియర్ నటుడు ఒకరు సినిమా రంగాన్ని మొత్తం పాడు చేస్తున్నారు. ఆయనెవరు, విషయం ఏమిటన్నది మరోసారి మీడియా ముందు చెబుతానని కన్నడ సినిమా హాస్యనటుడు బుల్లెట్ ప్రకాశ్ అన్నారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కన్నడ సినిమా రంగంలో నటుల మధ్య విభేదాలున్నాయని, కొంతమంది గ్రూపులుగా ఏర్పడి సినిమా రంగాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. -
కన్న కుమారైనే గర్భవతిని చేసిన తండ్రి
కన్న కుమార్తనే గర్బవతిని చేసిన కీచక తండ్రి విషయం బయటికి తెలియడంతో పరారి. బొమ్మనహళ్లి : కడుపున పుట్టిన కుమారైనే కన్న తండ్రి గర్బవతిని చేసిన దారణం ఆదివారం వెలుగలోకి వచ్చింది. గత ఎనిమిది నెలల నుంచి కన్న కుమార్తె పైనే నిరంతరం అత్యాచారం చేశాడు. బాలికకు ఆడ పిల్ల జన్మించడంతో విషయం తెలుసుకున్న తండ్రి ఊరు వదిలి పరారయ్యాడు. మంగళూరులోని సురత్కల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ససిహిత్లు ప్రాంతానికి చెందిన వామన బంగేరా తన కన్న కూతురుపైనే అత్యాచారం చేశాడు. శనివారం బాలిక ప్రభుత్వాస్పత్రిలో బాలికకు జన్మనిచ్చింది. తీవ్ర కడుపు నొప్పి రావడంతో బాలిక ఆస్పత్రికి వెళ్లడంతో డాక్టర్లు బాలికను గర్బవతిగా గుర్తించారు. గర్బం ఎలా వచ్చిందన్న విషయం బాలిక ఎంతకి చెప్పక పోవడంతో, బాలిక మైనర్ కావడంతో ఈ విషయాన్ని వైద్యులు సురత్కల్ పోలీసులకు తెలిపారు. సంఘటణ స్థలానికి వచ్చిన పోలీసులు బాలిక నుంచి వివరాలు సేకరించారు. కన్న తండ్రి తన కుమార్తెని బెదరించి ఎవరికి చెప్పకుండా 8 నెలల నుంచి బాలిక పైన నిరంతర అత్యాచారం చేసినట్లు పోలిసులు తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకోని ధర్యాప్తు చేపట్టారు. -
పరీక్షలు రాయడానికి ఊరేగించి పంపారు.
బొమ్మనహళ్లి: పరీక్షరాయడానికి వెళ్తూన్నారు..అంటే పెన్ను ఇవ్వడం. లేదా ఆశీర్వదించి పంపడం చూసుంటాం..కాని అందుకు భిన్నంగా ఈ ఊరి జనం చేశారు..వారి ఊరి పిల్లలు పదో తరగతి పరీక్షలు రాయడానికి వెళ్తున్నారని, వారు విద్యార్థులలో ఉండే భయాన్ని పోగోటాలనే ఉద్దేశ్యంతో గురువారం బాగలకోట జిల్లాలోని సంగానట్టి గ్రామంలో ఉన్న ప్రజలు, ఎస్ డీఎంసీ సభ్యులు విద్యార్థులను గ్రామంలో ఊరేగించి, వారి మెడలో పూలమాలలు వేసి దారి పొడవునా వారి పైన పూల వర్షం కురిపించారు. ఇలా చెయ్యడం ద్వారా విద్యార్థులలో పరీక్షల మీదున్న భయం పోయి వారు పరీక్షలు బాగా రాస్తారని చెబుతున్నారు. ఇంతే కాకుండా ఎవరయితే 95 శాతం మార్కులు సాధిస్తారో వారి పేరును ఊరిలో ఉన్న రోడ్డుకు పెడతామని బహిరంగంగా ప్రకటించారు. అచ్చం ఈ సంఘటన నటుడు సుధీప్ నటించిన రంగ ఎస్ఎస్ఎల్ సీ సినిమాలో ఉందని గ్రామాస్తులు గుర్తుచేసుకున్నారు.