Bommanahalli Road Accident: Two College Students Deceased In Road Accident - Sakshi
Sakshi News home page

భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా కంటైనర్‌..

Dec 24 2021 6:17 AM | Updated on Dec 24 2021 8:43 AM

Two Students Deceased In Road Accident at Bommanahalli - Sakshi

మృతులు సుష్మా, కౌశిక్‌  (ఫైల్‌)  

సాక్షి, బెంగళూరు(బొమ్మనహళ్లి): కాలేజీ విద్యార్థులు భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి కంటైనర్‌ లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులు మరణించిన సంఘటన బెంగళూరు శివార్లలో ఆనేకల్‌ తాలూకా బన్నేరుఘట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది.

మృతులు బెంగళూరు సారక్కిలో నివాసం ఉంటున్న కౌశిక్‌ (21), సుష్మా (20). వీరు ఎ.ఎం.సీ కళాశాల్లో బీఎంహెచ్‌ కోర్సు చదువుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేద్దామని ఇద్దరూ బైక్‌పై బయల్దేరారు. బన్నేరుఘట్ట సమీపంలో ఉన్న కెంపనాయకనహళ్ళి అక్వేరియల్‌ గార్మెంట్స్‌ ముందు బైక్‌ను వేగంగా వచ్చిన కంటైనర్‌ ఢీకొట్టడంతో కౌశిక్, సుష్మా తీవ్రగాయాలతో మృతి చెందారు. కంటైనర్‌ డ్రైవర్‌ పరారయ్యాడు.  పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement