two students
-
భిమిలి బీచ్ లో ఇద్దరు విద్యార్థులు గల్లంతైన ఘటనలో ఒకరి మృతదేహం లభ్యం
-
భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా కంటైనర్..
సాక్షి, బెంగళూరు(బొమ్మనహళ్లి): కాలేజీ విద్యార్థులు భోజనం చేయడానికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి కంటైనర్ లారీ వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు విద్యార్థులు మరణించిన సంఘటన బెంగళూరు శివార్లలో ఆనేకల్ తాలూకా బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. మృతులు బెంగళూరు సారక్కిలో నివాసం ఉంటున్న కౌశిక్ (21), సుష్మా (20). వీరు ఎ.ఎం.సీ కళాశాల్లో బీఎంహెచ్ కోర్సు చదువుతున్నారు. మధ్యాహ్నం భోజనం చేద్దామని ఇద్దరూ బైక్‌పై బయల్దేరారు. బన్నేరుఘట్ట సమీపంలో ఉన్న కెంపనాయకనహళ్ళి అక్వేరియల్ గార్మెంట్స్ ముందు బైక్‌ను వేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో కౌశిక్, సుష్మా తీవ్రగాయాలతో మృతి చెందారు. కంటైనర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
విషాదం: కలిసి చదివారు.. కలిసున్నారు.. చివరికి కలిసే..
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్/ఆత్రేయపురం: వారిద్దరూ కలిసి చదువుకుంటున్నారు. కలసిమెలసి ఉండేవారు. చివరికి మృత్యువులోనూ వారి స్నేహబంధం వీడలేదు. ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద గోదావరిలో స్నానాలకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. రాజమహేంద్రవరం ఐఎల్టీడీ బొగ్గులదిబ్బ ప్రాంతానికి చెందిన కొల్లాబత్తుల దయాకరుణ్ ఎలియాస్ సన్నీ (20), రైల్వే క్వార్టర్స్‌కు చెందిన బాణావత్ సత్యనారాయణ (20) ధవళేశ్వరం వివేకానంద ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. గురువారం సాయంత్రం తరగతులు ముగిశాక ఇద్దరూ గోదావరి స్నానానికి పిచ్చుకలంక వెళ్లారు. ప్రమాదవశాత్తూ కాలు జారి నదిలో పడ్డారు. పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి వారి మృతదేహాలు శుక్రవారం గోదావరి ఒడ్డున లభ్యమయ్యాయి. దయాకరుణ్ తండ్రి శేఖర్ పెయింటింగ్ పనుల కాంట్రాక్టు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరో మృతుడు సత్యనారాయణ తండ్రి సీతనాయక్ రైల్వే శాఖలో పని చేస్తున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. ఐటీఐ చదివి ఉద్యోగాలు పొందుతారని భావించిన తరుణంలో విద్యార్థులిద్దరూ మృత్యువాత పడడాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఇద్దరే ఇద్దరు !
సాక్షి, బి.కొత్తకోట : 2014 నవంబర్ 5న అంగళ్లులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బి.కొత్తకోటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసి, అందులో వృత్తిపరమైన కోర్సులు అందిస్తామని ప్రకటించారు. దానికోసం నిరుపేద విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లు గడిచినా కదలికలేదు. 2016 చివర్లో కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీచేసి చేతులు దులుపుకుంది. తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. రెండు నెలల క్రితం ప్రభుత్వం మరో జీఓ జారీ చేస్తూ అధ్యాపకులు, సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశాలిచ్చింది. పుంగనూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్రామను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఖాళీ భవనాల్లో తరగతులు తాత్కాలికంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల చేరిక కోసం ఇన్చార్జ్ ప్రిన్సిపాల్, కొందరు అధ్యాపకులు పల్లెల్లో పర్యటించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించారు. అయినా ఫలితం మాత్రం శూన్యం. చేరింది ఇద్దరే.. కళాశాలలో మంగళవారం నాటికి ఇద్దరు విద్యార్థులు మాత్రమే చేరారు. వీరిలో పెద్దతిప్పసముద్రం మండలం కమ్మపల్లెకు చెందిన సి.నరేంద్ర, రంగసముద్రానికి చెందిన షేక్ వలీ ఉన్నారు. డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల చేరికపై ఉన్నత విద్యాశాఖ ఈనెల 18న ప్రకటన చేసింది. తొలివిడతలో ఈ కళాశాలలో చేరిన వారు ఇద్దరే. ఈ నెలాఖరులో మరోసారి ప్రకటన ఇవ్వనుంది. బి.కొత్తకోట కళాశాలలో ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభించాలంటే బీఏకు 25మంది, బీకాంకు 25 మంది విద్యార్థులు అవసరం. ఈ సంఖ్యను ఈనెల 30వ తేదీలోగా చేరుకోకుంటే తరగతులు ప్రారంభమయ్యేది ప్రశ్నార్థకమే. కారణాలేమిటి? డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తున్నా విద్యార్థులు చేరకపోవడానికి ప్రభుత్వ పరంగా చర్యలు సక్రమంగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆలస్యంగా జీఓ జారీ చేయడం, విద్యార్థుల చేరిక విషయంలో సరైన ప్రచారం లేకపోవడం కనిపిస్తోంది. ప్రయివేటు కళాశాల సిబ్బంది పల్లెలకు వెళ్లి ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులను చేర్పించుకోవడం, టీసీలు తీసుకోవడం లాంటి చర్యలతో ప్రభుత్వ కళాశాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించే ఈ కళాశాల తరగతుల నిర్వహణకు తగిన సంఖ్య లేకపోవడం ఆవేదన కలిగిస్తోందని ప్రభుత్వ అధ్యాపకులు చెబుతున్నారు. మిగిలిన 10 రోజుల్లోనైనా ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడుకునే వీలుంది. -
ఇంటర్ ఫెయిల్ అయ్యామనే ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్య
-
సెల్ఫీ తీసుకుంటూ ఇద్దరు విద్యార్థినుల దుర్మరణం
-
ఏమయ్యారు!
♦ ఖుడుకు ఆదివాసీ సేవాశ్రమ హాస్టల్లో కనిపించని ఇద్దరు విద్యార్థులు ♦ ఓ వ్యక్తి తీసుకెళ్లినట్టు తోటి విద్యార్థుల వెల్లడి ♦ ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువెళ్లాడని పోలీసుల అనుమానం జయపురం : నవరంగపూర్ జిల్లా రాయిఘర్ సమితి ఖుడుకు గ్రామంలో ఆదివాసీ సేవాశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు కనిపించడం లేదు. ఈ నెల 13వ తేదీ నుంచి వీరి ఆచూకీ లేదని సమాచారం. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల భద్రతకు సంబంధిత అధికారులు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారో ఈ సంఘటన వెల్లడిస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఖుడుకు ఆదివాసీ సేవాశ్రమ పాఠశాలలో 13వ తేదీ నుంచి ఇద్దరు విద్యార్థులు కనిపించకపోయినా ఈ విషయం 14వ తేదీన గాని పాఠశాల అధికారులు తెలుసుకోలేకపోయారు. కనిపించకుండా పోయిన ఆ విద్యార్థులు 6వ తరగతి చదువుతున్న సంజయ గోండ్, జోగేశ్వర హరిజన్. 13వ తేదీన ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు రాలేదని తెలిసింది. 14వ తేదీన వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు సబిత ముఝుందార్ విద్యార్థుల హాజరు వివరాలు తీసుకుంటున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు లేకపోవటం గుర్తించారు. హాస్టల్లో ఉండాల్సిన ఆ ఇద్దరు విద్యార్థులు ఏమయ్యారని ఆమె విచారణ జరిపారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ ఇరువురు విద్యార్థులను పిలిచి తీసుకువెళ్లారని మిగతా విద్యార్థులు వెల్లడించారు. ఎవరు వచ్చారు, అనుమతి లేకుండా వారిని ఎవరు తీసుకువెళ్లారు, అన్నదానిపై చర్చించిన ఆమె ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియజేసేందుకు వారిని పాఠశాలకు పిలిపించారు. వారు వచ్చిన తర్వాత వారి పిల్లలు కనిపించటంలేదని ఎవరో వచ్చి వారిని తీసుకువెళ్లినట్టు విద్యార్థులు తెలిపిన విషయాన్ని వారికి చెప్పారు. ప్రధానోపాధ్యాయురాలు తెలిపిన విషయం విని వారి తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. హాస్టల్లో ఉన్న విద్యార్థుల భద్రత మీది కాదా అని వారు ఆమెను ప్రశ్నించినట్టు సమాచారం. అయితే వారికి సముదాయ పరచి ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయమని వారికి సూచించగా సంజయ గోండ్ తండ్రి నంద గోండ్ అతని భార్య కలిసి కుందెయి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బయట ప్రపంచానికి శనివారం వెలుగుచూచిన ఈ సంఘటన జిల్లాలో చర్చనీయమైంది. ఆదివాసీ హరిజన సంక్షేమ హాస్టల్ల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తమ బిడ్డలు కనిపించకుండా పోయేందుకు కారణం ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల, హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తక్షణం దర్యాప్తు జరిపించి తమ బిడ్డలను కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇరువురు విద్యార్థులను తీసుకుపోయిన వ్యక్తి వారిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువెళ్లినట్టు అనుమానాలు ఉన్నాయని పోలీసు అధికారి భవానీ మిశ్ర సూచనప్రాయంగా విలేకరులకు తెలిపారు. ఎవరు తీసుకుపోయారు, ఎందుకు తీసుకువెళ్లారు, వారిని విక్రయించేందుకా లేదా కార్మికులుగా చేర్చేందుకా అన్న చర్చ జరుగుతుంది. ఇద్దరు విద్యార్థుల అపహరణపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయమని ఆ సేవాశ్రమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలిని నవరంగపూర్ జిల్లా సంక్షేమ అధికారి ఆదేశించినట్టు తెలిసింది. తరచూ ఇటువంటి ఏదో ఒక సంఘటన ప్రభుత్వ ఆదివాసీ హరిజన సేవాశ్రమాలలో చోటు చేసుకుంటున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలవబిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అపహరించబడినట్టు ఆరోపించబడుతున్న ఆ ఇద్దరు విద్యార్థులను కాపాడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
నీళ్లనుకొని యాసిడ్ తాగారు
మోత్కూరు: నీళ్లనుకొని యాసిడ్ తాగారు ఇద్దరు విద్యార్థులు. ప్రస్తుతం వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గురు వారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూ రు మండల కేంద్రంలోని సేక్రెడ్ హార్ట్ పాఠశాలలో చోటుచేసుకుంది. అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెంకు చెందిన ఇటి కాల సైదులు, మమతకు ముగ్గురు సం తానం. సైదులు ఇదే పాఠశాలలో బస్సు క్లీనర్‌గా, మమత తల్లి ఎల్లమ్మ ఆయాగా పనిచేస్తున్నారు. సైదులు పెద్ద కుమారుడు సాగర్ రెండో తరగతి చదువుతున్నాడు. ఎల్లమ్మ యాసిడ్‌తో బాత్రూమ్లను క్లీన్ చేసి.. మిగిలిన యాసిడ్‌ను బాటిల్లో వేసి పక్కనే ఉన్న నీళ్ల బాటిళ్ల వద్ద పెట్టింది. అమ్మ మ్మతో అప్పటికే అక్కడే ఉన్న మూడో మన మడు మణికంఠ, ఇంటర్వెల్ సమయంలో అక్కడికి వచ్చిన పెద్ద మనుమడు సాగర్ బాటిల్లో ఉన్న యాసిడ్‌ను నీళ్లుగా భావించి తాగారు. దీంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం 108లో భువ నగిరి ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. సాగర్ పరిస్థితి విషమంగా ఉండగా మణికంఠ చికిత్స పొందుతున్నాడు. కాగా, మణికంఠ తమ స్కూల్లో చదవడం లేదని ఆయాగా పనిచేస్తున్న ఎల్లమ్మ వద్దకు వచ్చాడని ప్రిన్సిపాల్ జోసఫ్ తెలిపారు. -
అనంతలో నారాయణ కాలేజీ నిర్వాకం
-
ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
గుంటూరు: అమరావతిలోని అమరేశ్వర స్నానఘాట్ వద్ద కృష్ణా నదిలో ఈత కొట్టడానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. మృతులిద్దరూ విజయవాడలోని శ్రీమేథ కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఆదివారం సెలవు కావడంతో మర్రిచెట్టు నారాయణ(20), ఎర్రగోళ్ల మనోహర్(19)లు అమరావతిలో ఉన్న స్నేహితుల వద్దకు వచ్చారు. సరదాగా మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈత కొడదామని కృష్ణా నది వద్దకు వచ్చారు. ఈ ఇద్దరూ లోపలికి దిగి ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. నారాయణది కృష్ణా జిల్లా మైలవరం మండలం తాడవ గ్రామం కాగా..మనోహర్‌ది అనంతపురం జిల్లా ధర్మవరం. ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు విద్యార్థుల ఘర్షణ: ఒకరి మృతి
చంద్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక చుండ్రుగొండ జడ్పీ పాఠశాలలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఘర్షణ పడగా ఒకరు మృతి చెందారు. తరగతి గదిలో ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో తంబళ్ల భానుప్రకాశ్(15) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ఇంటర్వెల్ సమయంలో భానుప్రకాశ్, మరో విద్యార్థి ఘర్షణ పడ్డారని తరగతికి వెళ్లిన తర్వాత కూడా తీవ్రంగా కొట్టుకున్నారని తోటి విద్యార్థులు తెలిపారు. కాగా ఇద్దరి మధ్య ఘర్షణలో మర్మావయవాలపై తీవ్రంగా దెబ్బ తగలడంతో భానుప్రకాశ్ తరగతిలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించారు. -
ఇద్దరి ప్రాణాలు తీసిన సెల్ఫీ మోజు
-
గుండేరులో ఇద్దరు గల్లంతు
-
గుండేరులో ఇద్దరు గల్లంతు
ఘంటసాల : గుండేరు డ్రెయిన్‌లో ఇద్దరు విద్యార్థినులు గల్లంతైన ఘటన అన్నదమ్ముల ఇళ్లలో విషాదం నింపింది. ఈ ఘటన మండల కేంద్రమైన ఘంటసాలలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామంలోని జ్ఞానోదయకాలనీకి చెందిన చెందిన చేనేత కార్మికులు మునగాల సాంబశివరావు, మునగాల శ్రీనివాసరావు అన్నదమ్ములు. సాంబశివరావు, శైలజ దంపతులకు కుమార్తె నళిని, కుమారుడు గోపి ఉన్నారు. నళిని బీఎస్సీ ద్వితీయ చదువుతూనే ఇంటి వద్ద 20 మంది విద్యార్థులకు ట్యూషన్ చెబుతోంది. ఆమె కాలేజీ టాపర్. గోపి పదోతరగతి చదువుతున్నాడు. శ్రీనివాసరావు, శశిరేఖ దంపతుల పెద్ద కుమార్తె శ్రీలత బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, రెండో కుమార్తె చైతన్య బీఎస్సీ మొదటిసంవత్సరం చదువుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో నళిని, చైతన్య తమ సోదరుడు గోపి, స్నేహితులు కె.మౌనిక, తులసితో కలసి ఆటోలో గ్రామ శివారులోని ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి గుండేరు బెడ్ రెగ్యులేటర్‌ను చూడటానికి వచ్చారు. అక్కడ కాళ్లు కడుక్కుందామని మెట్లు దిగారు. అయితే కాళ్లు జారి చైతన్య, నళిని నీటిప్రవాహంలో కొట్టుకెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాముటిన గుండేరు బెడ్ రెగ్యులేటర్ వద్దకు వచ్చి పిల్లల కోసం గాలించారు. అయినా ఫలితం కనిపించలేదు. ఘంటసాల ఎస్ఐ కె.వి.జి.వి. సత్యనారాయణ ప్రమాద స్థలానికి చేరుకుని స్థానిక ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులతో పాటు మొవ్వ అగ్నిమాపక శాఖ సిబ్బందికి తెలపడంతో వారు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు.అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సాంబశివరావు, శైలజ శ్రీనివాసరావు, శశిరేఖ దంపతులు తమ కుమార్తెల కోసం కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు విద్యార్థినులు నీటిలో గల్లంతవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
లారీ-ఆటో ఢీ: విద్యార్థులు మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం దోచిపర్రు వద్ద ఆదివారం లారీ - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మాయి కోసం విద్యార్థుల ఫైటింగ్..!
కురబలకోట : మండలంలోని అంగళ్లులో శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ పడ్డారు. పోలీసుల కథనం మేరకు... అంగళ్లులో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న అమ్మాయిని మరో విద్యార్థి ఇష్టపడ్డాడు. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె అంగళ్లు వద్ద మరొకరి కారు ఎక్కడం చూసిన అతను స్నేహితులతో కలిసి అటకాయించాడు. దీంతో పరస్పరం గొడ వ పడ్డారు. ఒకరికొకరు కొట్టుకోవడంతో పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. కొంత సేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వారించారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమని విచారణలో తేలింది. -
పాఠశాల ఫ్లెక్సీ కడుతూ..
విద్యుదాఘాతంతో మతిస్థిమితం కోల్పోయిన ఇద్దరు విద్యార్థులు మునుగోడు: పాఠశాల ప్రచారం కోసం ఫ్లెక్సీ కడుతూ ఇద్దరు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమం గా ఉంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో చోటుచేసుకుంది. గూడపూర్లోని శాంతినికేతన్ పాఠశాల ఎదుట బడి ప్రచారం కోసం ముద్రించిన ఫ్లెక్సీని అదే పాఠశాలకు చెందిన విద్యార్థులు దోటి రాజేశ్ (బీరేల్లిగూడెం), ఏరుకొండ వినోద్ (చీకటిమామిడి) కడుతున్నారు. బ్యానర్ కట్టేందుకు అవసరమైన కట్టెలకు బదులు పాఠశాల యాజమాన్యం పొడుగాటి ఇనుపకడ్డీలు ఇచ్చింది. వాటిని నాటేందుకు పలువురు విద్యార్థులతో కలసి రెండు గుంతలను తవ్వా రు. వాటిపైన సమాంతరంగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్‌ను గమనించకుండా విద్యార్థులు పైప్‌లను ఏర్పాటు చేసేం దుకు ప్రయత్నించారు. ఇనుప కడ్డీలు కరెంటు తీగలకు తగలడంతో విద్యా ర్థులు విద్యుదాఘాతానికి గురయ్యా రు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు పూర్తిగా కాలిపోయి స్పృహ లేకుండా పడిపోయారు. చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు మతిస్థితిమితం కోల్పోయి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. -
ఇఫ్లూలో ఇద్దరు విద్యార్థుల అరెస్టు
అన్యాయాన్ని ప్రశ్నించినందుకు వర్సిటీ నుంచి బహిష్కరణ సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ) యాజమాన్యం గురువారం ఇద్దరు విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించింది. ఎంఏ ఇంగ్లిష్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకుగానూ ఈ ఇద్దరు విద్యార్థులను వర్సిటీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ని ఆన్లైన్లో నిర్వహించారు. గతంలో క్యాంపస్‌లోనే ఈ పరీక్షల నిర్వహణ జరిగేది. కానీ ఈసారి నగరంలోని కొన్ని ప్రైవేటు కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్లో ఆన్లైన్ పరీక్షను నిర్వహించారు. పరీక్ష హాలుకి అరగంట ముందు వస్తే చాలని ప్రకటించిన యాజమాన్యం తీరా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందు చేరుకున్నా పరీక్షకి అనుమతించలేదు. దీంతో 70 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవకుండానే తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఆన్లైన్ పరీక్షా కేంద్రానికి సమయానికే వచ్చినా పరీక్ష రాయలేకపోయామని నాచారంలోని పరీక్ష కేంద్రం నుం చి తిరిగి వెళ్లిపోయిన నాగేంద్ర, రవికుమార్ అనే విద్యార్థులు ‘సాక్షి’కి తెలిపారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించకపోవడంపై ఇఫ్లూ ప్రొక్టర్ కోనా ప్రకాశ్‌రెడ్డిని విద్యార్థి నాయకులు ప్రశ్నించారు. విద్యార్థులు ప్రశ్నించడమే నేరంగా భావించిన ఇఫ్లూ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు కేరళ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగడంతో అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేశారు. అయితే ఈ విద్యార్థులను వర్సిటీలోనికి మాత్రం అనుమతించలేదు. సెక్యూరి టీసిబ్బంది వారిని వర్సిటీ గేటువద్దే అడ్డుకున్నారు. -
ఒకరు గొంతు కోసుకొన్నారు.. మరొకరు ఉరేసుకున్నారు!
హైదరాబాద్: తాజాగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో తాము పాస్ కాలేదన్న మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న చిన్న కారణంతో బలవన్మరణానికి యత్నించారు. ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరో విద్యార్థిని గొంతు కోసుకొని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించింది. శృతి ఆత్మహత్య! భువనగిరి అర్భన్ (నల్లగొండ): పరీక్ష ఫెయిలవ్వడంతో తార్నాకలోని నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న శృతి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరికి చెందిన వీ కృష్ణ కూతురు శృతి నారాయణ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె ఓ సబ్జెక్టు ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన శృతి మధ్యాహ్నం భువనరిగిలోని తన ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బిడ్డ బలవన్మరణంతో తల్లిదండ్రుల గుండె చెదిరింది. బోరున విలపిస్తున్న వారిని చూసి స్థానికులూ కంట తడి పెట్టారు. గొంతు కోసుకున్న విద్యార్థిని లాలాగూడ (హైదరాబాద్‌సిటీ): ఇంటర్ పరీక్ష తప్పాననే బాధతో ఇంటర్ విద్యార్థిని ఒకరు గొంతుకోసుకుంది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తీవ్ర రక్తస్రావమైన విద్యార్థినిని గాంధీకి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఢీకొన్న వాహనంపైనే ఎగిరిపడ్డారు!
వాహనం ఢీకొని ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు రిమ్స్‌కు తరలింపు ఆమదాలవలస: మండలంలోని శ్రీహరిపురం వద్ద అలికాం బత్తిలి రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన వాహన ప్రమాదంలో ఇద్దరు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలివీ.. మున్సిపాలిటీ పరిధి కృష్ణాపురం సమీప సీపానోడిపేటకు చెందిన గురుగుబెల్లి సంధ్య, అన్నెపు శ్రావణి అనే విద్యార్థినులు ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 8వ తరగతి చదువుతున్నారు. ఆదివారం కావడంతో సైకిల్‌పై శ్రీహరిపురంలో ఉన్న తమ బంధువులు ఇంటికి బయలుదేరారు. అదేమార్గంలో ఎదురుగా సరుబుజ్జలి మండలం కూనజమ్మవాని పేట నుంచి నూతన వధూవరులతో ప్రయాణిస్తున్న టాటా సుమో కారు వీరిని ఢీకొట్టింది. బాలికలిద్దరూ ఎగిరి వాహనం ముందుభాగంలో ఉన్న అద్దంపైకి పడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ పరారయ్యాడు. వాహనంలోని నూతన వధూవరులు, వారి బంధువులు స్థానికులు 108కు సమాచారం అందించినా ఆమదాలవలసలో లేదని, బూర్జవాహనానికి సమాచారం అందించారు. బూర్జవాహనం కూడా దూర ప్రాంతంలో ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్ అంబులెన్సుకు సమాచారం అందిచారు. ప్రమాదం జరిగిన 45 నిమిషాలకు మూడు 108 వాహనాలు ఒకేసారి సంఘటన స్థలానికి చేరుకోగా, అప్పటికే క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనంలో రిమ్స్‌కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రిమ్స్ ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన వివరాలను బట్టి తాము కూడా కేసు నమోదు చేస్తామని ఆమదాలవలస పోలీసులు తెలిపారు. -
ఆటో,వ్యాన్ ఢీ: ఇద్దరు విద్యార్థులకు గాయాలు
పెనుగంచిప్రోలు (కృష్ణా జిల్లా) : పెనుగంచిప్రోలు మండలం వెంగనాయపాలెం వద్ద ఆటోను వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. పదవ తరగతి పరీక్ష రాసి పెనుగంచిప్రోలు నుంచి స్వగ్రామం శనగపాడుకు వెళ్తుండగా ఈ ఘటన చోటచేసుకుంది. -
భారత్‌తో మ్యాచ్ రోజున.. పాక్‌కు జై కొట్టారు
మంగళూరు: టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా ఈ నెల 19న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలవాలని దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కోరుకున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవగానే వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. కాగా అదే రోజు కర్ణాటకలో మంగళూరుకు సమీపంలోని పుట్టురులో ఇద్దరు డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాకిస్తాన్‌కు మద్దతుగా వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టారు. 'పాకిస్తాన్‌కు జై' అంటూ వాట్సాప్‌లో ఫోస్ట్ చేశారు. దీనిపై ఇతర కాలేజీ విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలేజీ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో పాక్‌కు అనుకూలంగా పోస్టింగ్ చేసిన ఇద్దరు విద్యార్థులను అదే రోజు అదుపులోకి తీసుకున్నారు. ఎగ్జిక్యూటీవ్ మేజిస్ట్రేట్ ముందు వారిని హాజరుపరిచగా, సత్ప్రవర్తనతో ఉంటామనే హామీపై వారిని విడుదల చేశారు. విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదు చేసే ఉద్దేశంలేదని పోలీసులు చెప్పారు. -
సంస్కృతానికి బదులు తెలుగు ప్రశ్నాపత్రం!
దర్శి (ప్రకాశం) : పదో తరగతి పరీక్షల సందర్భంగా ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నా పత్రం ఇచ్చిన ఇన్విజిలేటర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు మెదలైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్లో సోమవారం ఉదయం ఇద్దరు విద్యార్థులకు సంస్కృతం ప్రశ్నా పత్రానికి బదులు తెలుగు ప్రశ్నా పత్రం వచ్చింది. కంగారులో ఈ విషయాన్ని పట్టించుకోని విద్యార్థులు పరీక్ష రాసే పనిలో బిజీ అయ్యారు. రెండు గంటల అనంతరం అసలు సంగతి గమనించిన విద్యార్థులు తమ ఆవేదనను డీఈవో దృష్టికి తీసుకెళ్లగా.. బాధ్యతారహితంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ ఆర్. శ్రీనివాస్‌రావును సస్పెండ్ చేశారు. -
పాఠశాలను బాంబులతో పేల్చినా..
సిరియా: ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు ఇంతకు ముందు సిరియాలోని అలెప్పో పాఠశాలలో చదివేవారు. ఇప్పుడు ఆ పాఠశాల లేదు. దానిని ఉగ్రవాదులు బాంబులతో పేల్చేశారు. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు లండన్‌లోని హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆవరణను వేదికగా చేసుకున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో... శిథిలమైన పాఠశాల నమూనా మధ్య కూర్చొని ప్రపంచానికి తమ గోడును వెళ్లబోసుకున్నారు. -
ఆటలాడుతూ ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
* వరంగల్ జిల్లాలో ఒకరు.. * ఖమ్మం జిల్లాలో మరొకరు జూలూరుపాడు/కొత్తగూడ: రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో ఆటలాడుతూ శనివారం ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెంకు చెందిన భూక్యా భద్రాచలం(13), వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయికి చెందిన విజయ్‌కుమార్(14)లు మృత్యువాత పడ్డారు. ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం పోకలగూడెనికి చెందిన భూక్యా హరి, కళావతిల ఏకైక కుమారుడు భూక్యా భద్రాచలం జూలూరుపాడు మండలం సాధన పబ్లిక్ స్కూల్ ఏడో తరగతి చదువుతున్నాడు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. భద్రాచలం సహచర విద్యార్థులతో ఖోఖో ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఉపాధ్యాయులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే భద్రాచలం చనిపోయాడు. విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని, అందుకు వారు బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయికి చెందిన గుమ్మడి వీరస్వామి, వెంకటమ్మ దంపతుల రెండో కుమారుడు విజయ్‌కుమార్(14) ఇదే మండలం బత్తులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం విద్యార్థులతో కలిసి ఖోఖో ఆడుతూ ఆయాసానికి గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చి ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే విజయ్‌కుమార్ చనిపోయాడు. గుండెపోటుతో విద్యార్థి మృతి ఇబ్రహీంపట్నం: పాఠశాలలో ప్రార్థన చేస్తుండగా ఓ విద్యార్థి గుండెపోటుకు గురై మృతి చెందిన విషాద సంఘటన ఇది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శనివారం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడకు చెందిన యెంపల్ల తిరుమల్‌రెడ్డి, మంజుల దంపతుల పెద్దకొడుకు త్రిష్ రెడ్డి(10) ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లిన త్రిష్ రెడ్డి స్కూల్లో ప్రార్థన చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో త్రిష్ రెడ్డి మృతిచెందాడు. ఈ ఘటనతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కాగా, మూడేళ్ల క్రితం బాలుడి తండ్రి తిరుమల్‌రెడ్డి కూడా గుండెపోటుతోనే మృతి చెందాడు. ఇపుడు త్రిష్రెడ్డి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెల కొంది. ఉన్న కొడుకూ గుండెపోటుతో మృతి చెందడంతో తల్లి రోదనలు మిన్నంటాయి. -
బస్సు డ్రైవర్‌పై దాడి: ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
యాకుత్‌పురా (హైదరాబాద్): ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఇద్దరు విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. మీర్‌చౌక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డబీర్‌పురా కోమటివాడి ప్రాంతానికి చెందిన జాహేద్ హుస్సేన్ (19), బషీర్ అలీ (18) నాంపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. శుక్రవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు నాంపల్లి వద్ద ఫలక్‌నుమా డిపోకు చెందిన బస్సు ఎక్కారు. దారుషిఫా వరకు టికెట్టు కొనుగోలు చేశారు. స్టాప్ వచ్చినా బస్సు దిగకుండా మహిళలు వెళ్లే ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. దీంతో బస్సు దిగాలని డ్రైవర్ అనడంతో విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. మాటా మాటా పెరగడంతో హుస్సేన్, బషీర్‌లు డ్రైవర్ బాలకృష్ణపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన బాలకృష్ణ మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
గోదావరిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. కొవ్వూరు చైతన్య స్కూల్లో పదో తరగతి చదివే నందిగామ్ జయదేవ్, జి.సుమంత్ ఆదివారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల గల్లంతుతో స్థానికంగా విషాదం నెలకుంది. -
మిస్టరీగా ఇద్దరు విద్యార్థునుల మిస్సింగ్
-
ఇద్దరు విద్యార్థులు అదృశ్యం
హైదరాబాద్ : చింతల్లో ఇద్దరు విద్యార్ధులు అదృశ్యమయ్యారు. చింతల్ గౌతమి టెక్నో స్కూల్లో 9వ తరగతి చదువుతున్న డి.ప్రీతి(16), పి.ప్రేమ్(15) అనే విద్యార్థినీ విద్యార్థులు సోమవారం సాయంత్రం నుంచి కనపడుటలేదు. సోమవారం స్కూలుకు వెళ్లిన వారు రాత్రైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
క్రికెట్ బంతి కోసం నీట మునిగి ఇద్దరి మృతి
నిర్మల్: ఆదిలాబాద్ జిల్లాలో క్రికెట్ బంతి కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ నీట మునిగి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ సంఘటన నిర్మల మండలం మంజులాపూర్ గ్రామంలో మోతీ తలాబ్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొహమ్మద్ నవ్‌మాన్(14) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుండగా.. అబుల్(15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం.. స్నేహితులతో కలిసి గ్రామ శివారును ఉన్న చెరువు వద్ద క్రికెట్ ఆడటానికి వెళ్లారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతి వెళ్లి చెరువులో పడటంతో.. నవ్‌మాన్ బంతి తీసుకురావడానికి చెరువులోకి వెళ్లాడు. చెరువులోతు ఎక్కువగా ఉండటంతో.. నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన అబుల్ అతన్ని రక్షించడానికి చెరువులోకి దిగాడు. ఇతనికి కూడా ఈత రాకపోవడంతో.. ఇద్దరు నీట మునిగి మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నదిలో పడి ఇద్దరు విద్యార్థినుల మృతి
పార్వతీపురం (విజయనగరం) : పిక్నిక్ కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా డి.సిర్లాం సమీపంలోని సువర్ణముఖి నది వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మందలుక్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థినులు పిక్నిక్ కోసం సువర్ణముఖి నది వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కర్రి కవిత(13), తులసి(13) అనే ఇద్దరు ఆడుకుంటూ వెళ్లి సువర్ణముఖిలో పడి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. విద్యార్థినులు పిక్నిక్ వెళ్తున్న విషయం పాఠశాల యాజమాన్యానికి తెలియదని అంటున్నారు. -
ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు
బాపట్ల (గుంటూరు) : ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం పిట్లవారిపాలెంలో శనివారం జరిగింది. ఈ రోజు సెలవు రోజు కావడంతో ఆడుకుంటున్న విద్యార్థులు తుంగభద్ర డ్రైనేజి కాలువలో పడి గల్లంతయ్యారు. కాగా విద్యార్థుల కేకలు విన్న కొందరు స్థానికులు వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా విద్యార్థుల వివరాలు తెలియాల్సి ఉంది. -
బీహార్‌లో విషాదం.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
నవాడా: బీహార్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. 'స్వాతంత్ర్య వేడుకల్లో నాటు బాంబులు శనివారం కలకలం రేపాయి. నవాదాలోని ఓ పాఠశాలపై శనివారం దుండగులు నాటు బాంబులు విసిరారు. స్థానిక సెంట్ జోసెఫ్ స్కూల్లో పిల్లలందరూ ఉత్సవాల్లో మునిగి తేలుతుండగా, బాంబు దాడులు జరిగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘాట్‌లో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
రావులపాలెం : రావులపాలెం మండలం ఊబలంక గౌతమి ఘాట్‌లో గురువారం పుష్కర స్నానాలకు వె ళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. సాయంత్రానికి ఒకరి మృతదేహం లభ్యమైంది. ఊబ లంకకు చెందిన మేడపాటి భాస్కరరెడ్డి(16), కొమరాజులంక చెందిన వెలగల సాయి గణేష్‌రెడ్డి(16)లు స్నేహితులు. రావులపాలెంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఈ ఏడాది పదోతరగతి పూర్తి చేశారు. ప్రస్తుతం భాస్కరరెడ్డి రాజమండ్రి ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్లో చేరాడు. సాయిగణేష్రెడ్డి పాలిటెక్నిక్ చది వేందుకు సన్నద్ధమవుతున్నాడు. సాయిగణేష్రెడ్డి అమ్మమ్మ వాళ్లది ఊబలంక కావడంతో పుష్కరాలకు అక్కడే ఉంటున్నా డు. ఊబలంకలో అధికారికంగా ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ లో నీటి మట్టం తక్కువగా ఉంటడంతో చాలా మంది ఏటిగట్టుకు సుమారు రెండు కిలో మీటర్ల దూరంలోని ప్రధాన పాయ వద్దకు వె ళ్లి స్నానాలు చేస్తున్నారు. భాస్కరరెడ్డి, గణేష్‌రెడ్డి గురువారం ఉదయం 7 గంటలకు ఆ పాయ వద్దకు వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో రాత్రి 9 గంటలకు ఘాట్‌లోని అధికారులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మత్స్యకారులు వలలతో గాలించారు. సీఐ పీవీ రమణ, ఎస్సై త్రినాథ్ అక్కడకు చేరుకున్నారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఘాట్‌లో ఏర్పాట్ల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం ఊబలంక ఘాట్‌కు సంబంధించి అధికారులు చేస్తున్న ఏర్పాట్లలో నిర్లక్ష్యం కనిపిస్తుందని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల గల్లంతు సమాచారంతో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, డీఎీస్పీ అంకయ్య, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీ, జగ్గిరెడ్డి మధ్య వాగ్వివాదం ేసీ సత్యనారాయణ మాట్లాడుతూ తమ అధికారిక లెక్కల్లో ఊబలంక సీ గ్రేడ్ ఘాట్ అని, ఘటన జరిగిన ప్రాంతం అధికారిక ఘాట్ పరిధిలోకి రాదన్నారు. దీనిపై జగ్గిరెడ్డి మాట్లాడుతూ అధికార ఘాట్ పరిధిలోకి రాదని చెబుతున్న అధికారులు అక్కడ పడవ, ఈతగాళ్లను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. బాధితులకు నాయ్యం జరిగే వరకూ ఇక్కడే కూర్చుంటానని మృతదేహం వద్ద బైఠాయించారు. పరిహారం విషయం తేల్చేంతవరకూ మృతదేహాన్ని తీసుకువెళ్లనివ్వమని జగ్గిరెడ్డితోపాటు గ్రామస్తులు స్పష్టం చేయడంతో జేసీ అక్కడి నుంచి నిష్ర్కమించారు. అనంతరం జగ్గిరెడ్డి కలెక్టర్, డిప్యూటీ సీఎం చినరాజప్పతో ఫోన్లో మాట్లాడి పరిిస్థితిని వివరించారు. రూ. 3 లక్షల చొప్పున ఎక్రరగేషియా చెల్లించేందుకు చినరాజప్ప అంగీకరించారని జగ్గిరెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. -
స్కూల్‌పై దాడి.. నిప్పు
-
హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మునిపల్లి సాంఘిక సంక్షేమ వసతి గృహం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. పీటీపర్రు హైస్కూలులో 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థినులు శుక్రవారం సాయంత్రం ఇతర బాలురతో మాట్లాడుతుండగా తోటి విద్యార్థినులు చూశారు. టీచర్లతో ఆ విషయం చెబుతామనడంతో భయపడిన సదరు బాలికలు శనివారం ఉదయం హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. విషయం తెలిసిన హాస్టల్ అధికారులు విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అదృశ్యంపై తల్లిదండ్రులు హస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులు కనిపించక పోతే వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని వారు వార్డెన్‌ను ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. (పొన్నూరు) -
నీట మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
విజయనగరం: విజయనగరం జిల్లా సాలూరు మండలం పెద్ద బోరబందలో విషాధం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీట మునిగి మరణించారు. అక్కడే ఉన్న మరో విద్యార్థి వెంటనే స్పందించి... వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. దాంతో వారు చెరువు వద్దకు చేరుకుని... స్థానికుల సహాయంతో మృతదేహలను వెలికితీశారు. విద్యార్థుల మృతితో ఆ ఇంట రోదనలు మిన్నంటాయి. -
లెక్చరర్‌పై విద్యార్థుల దాడి
అన్నవరం : అల్లరి చేయవద్దని మందలించిన లెక్చరర్‌పై ఇద్దరు విద్యార్థులు మరో ఇద్దరితో కలిసి దాడి చేసిన ఘటన గురువారం అన్నవరంలోని శ్రీసత్యదేవ జూనియర్ కళాశాలలో జరిగింది. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం స్కూలు విద్యార్థినుల ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలను తిలకిస్తున్న ఆ జూనియర్ కళాశాల ఇంటర్(హెచ్ఈసీ) విద్యార్థులు మిరియాల నూకరాజు, కొల్లు తాతాజీ ఆటలాడుతున్న విద్యార్థినులను, అక్కడ ఉన్న వ్యాయామ టీచర్లను కామెంట్ చేశారు. ఇది గమనించిన కళాశాల బోటనీ లెక్చరర్ మలిరెడ్డి వేంకటరాజు ఆ విద్యార్థులను మందలించి అక్కడ నుంచి వెళ్లిపొమ్మని హెచ్చరించి పంపేశారు. దీనిని అవమానంగా భావించిన విద్యార్థులు నూకరాజు, తాతాజీ తమ స్వగ్రామం రౌతులపూడి మండలం డి.జగన్నాథపురం వెళ్లి వారి అన్నలు మిరియాల అప్పలరాజు, కొల్లు లోవరాజును తీసుకుని గురువారం మధ్యాహ్నం కళాశాలకు వచ్చారు. ఆ సమయంలో లెక్చరర్ వేంకటరాజు స్టాఫ్‌రూమ్‌లో ఉండగా ఆయనను దుర్బాషలాడుతూ ఆ నలుగురూ దాడి చేశారు. అప్పుడు కళాశాలలో ఉన్న ఇతర లెక్చరర్లు, విద్యార్థినులు వారిని అడ్డుకోగా, వారినీ తోసేశారు. ఆ దాడిలో వేంకటరాజుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆయన స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. లెక్చరర్ ఫిర్యాదుతో ఆ నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నవరం పోలీసుస్టేషన్ అడిషనల్ ఎస్ఐ వై.వి.రామ్మోహనరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎస్సీ బాలికల వసతి గృహం నుంచి ఇద్దరు విద్యార్థునులు అదృశ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతి గృహం ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రెండు రోజుల క్రితం అదృశ్యమైయ్యారని హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక కళాశాలలో వారు ఇంటర్ చదువుతున్నారని వార్డెన్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికల అదృశ్యంపై సమాచారం అందుకున్న వారి తల్లిదండ్రులు హస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులు అదృశ్యమైతే వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని వారు వార్డెన్‌ను ప్రశ్నించారు. హాస్టల్ వార్డెన్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. -
గుంటుపల్లిలో విషాదం
ఇద్దరి ప్రాణం తీసిన ఈత సరదా ఇబ్రహీంపట్నం : మండలంలోని గుంటుపల్లి కృష్ణానదిలో ఇద్దరు విద్యార్థులు ఈతకని దిగి మృతిచెందడం వారి కుటుంబ సభ్యులకు అంతులేని ఆవేదనను మిగిల్చింది. ఈత నేర్చుకోవాలన్న సరదా వారి ప్రాణాలను బలితీసుకుంది. గుంటుపల్లి జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుకుంటున్న పిన్నబోయిన తేజ (15), జంగాల వెంకయ్య(15), బోగ్యం గోపి (14), మునుగు సామ్యేలురాజు (13) బుధవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చారు. అనంతరం గ్రామ సమీపంలోని కృష్ణానది వద్దకు వెళ్లారు. వీరిలో గోపి, సామ్యేలురాజులకు కొద్దిగా ఈత వచ్చు. స్నానఘాట్ వద్ద కాకుండా కొద్ది దూరంలో ఈ నలుగురూ ఈతకు దిగారు. నది లోతుగా ఉన్న ప్రాంతంలోకి తేజ, వెంకయ్య వెళ్లారు. నీటి ఉధ్రుతికి కొట్టుకుపోతున్న వారిని గోపి, సామ్యేలురాజు కాపాడాలని చూశారు. అయితే తేజ, వెంకయ్య వీరిని గట్టిగా వాటేసుకుంటుండడంతో తమ ప్రాణాలు పోతాయన్న భయంతో వదలివేశారు. కొద్దిసేపటికే వారు నదిలో మునిగిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపి, సామ్యేలురాజు కేకలు విని ఆ ప్రాంతంలో ఉన్న విజయవాడకు చెందిన టిప్పర్ డ్రైవర్ వాకా సోములు వెంటనే నదిలోకి దిగారు. పిల్లలిద్దరి చేతులు పట్టుకుని ఒడ్డుకు లాగడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నది లోతు తెలియకే మృతి గుంటుపల్లి వద్ద కృష్ణానదిలో ఇటీవలే డ్వాక్రా గ్రూప్ మహిళల పేరుతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. నది ఓడ్డునే ఇసుక తవ్వడంతో అక్కడ కూడా లోతుగా ఉంది. ఈ విషయం తెలియక విద్యార్థులు ఈతకని దిగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మృతులిద్దరూ గుంటుపల్లి ఖాజీపేటకు చెందిన వారే. తేజ తండ్రి కోటేశ్వరరావు కూలి పనిచేస్తున్నాడు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. తేజ అకాల మరణంతో కోటేశ్వరరావు, నాగమణి దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనలో జంగాల వెంకయ్య ప్రాణాలు కోల్పోవడంతో అతడి తండ్రి బడేమియా, తల్లి వేదమ్మ, సోదరి సౌభాగ్యలక్ష్మి బోరున విలపిస్తున్నారు. గుంటుపల్లి ఖాజీపేట వాసులు వచ్చి ఇద్దరి మృతదేహాలను చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పరామర్శ మృతుల కుటుంబ సభ్యులను స్థానిక మండల పరిషత్ అధ్యక్షురాలు చీద్రాల ప్రసూన, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చెరుకూరి వెంకటకృష్ణ, జెడ్పీటీసీ సభ్యురాలు చెన్నుబోయిన రాధా, ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ హరిహర బ్రహ్మాజీ పరామర్శించారు. గోపి, సామ్యేలురాజును పరామర్శించారు. ఈ ఘటనపై ఎస్సై లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కడుపుకోత...
బియాస్ నదిలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం - మిన్నంటిన తల్లిదండ్రుల రోదన - వరంగల్ గిర్మాజీపేట, నర్సంపేటలో విషాదఛాయలు - నేడు హైదరాబాద్‌కు మృతదేహాలు - జిల్లాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి ఉంటారనే ఆశతో ఉన్న ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. 14 రోజుల నుంచి కుమారుల రాక కోసం ఎదురుచూస్తున్న వారికి కడుపుకోతే మిగిలింది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియూస్ నదిలో గల్లంతైన నర్సంపేటకు చెందిన చిందం పరమేశ్వర్, వరంగల్ నగరంలోని 21వ డివిజన్ గిర్మాజీపేటకు చెందిన అఖిల్ మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యూరుు. విద్యార్థులు కానరాని లోకాలకు పోయారని టీవీల ద్వారా తెలుసుకున్న వారి కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. కడుపుకోత మిగిల్చి.. కానరాని లోకాలకు.. - బియాస్ నదిలో లభ్యమైన పరమేశ్వర్, అఖిల్ మృతదేహాలు - శోకసంద్రంలో కుటుంబ సభ్యులు - గిర్మాజీపేట, నర్సంపేటలో విషాద ఛాయలు ఆ తల్లిదండ్రులు ఏది జరగకూడదని అనుకున్నారో.. అదే జరిగింది. ఎక్కడో ఒకచోట తమ కుమారులు బతికి ఉండే ఉంటారని.. క్షేమంగా రావాలని వారు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్లిన విద్యార్థులు విగతజీవులుగా బియాస్ నదిలో లభ్యమయ్యారు. కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చి వెళ్లారు. నర్సంపేటకు చెందిన పరమేశ్వర్, గిర్మాజీపేటకు చెందిన అఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయని పిడుగులాంటి వార్త తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా బోరున విలపించారు. అయ్యో కన్నా.. అఖిల్ వరంగల్ చౌరస్తా : వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్, సునీత దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు మౌనిక హన్మకొండలోని అల్లూరి ఇనిస్టిట్యూట్‌లో ఎంబీఏ చేస్తుండగా, అఖిల్(23) హైదరాబాద్ శివారు బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్(ఈఐఈ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. 1995 జూన్ 12న పుట్టిన అఖిల్ ఈనెల 3న ఇండస్ట్రీయల్ టూర్లో భాగంగా తోటి విద్యార్థులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లాడు. ఈనెల 8న సాయంత్రం అక్కడి బియాస్ నదిలో గల్లంతయ్యాడు. ఆ రోజు నుంచి అతడి రాక కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. నాలుగు గంటల మిస్టరీ బియాస్ నదిలో గాలిస్తున్న రెస్క్యూటీమ్‌కు ఆదివారం ఒక్కరోజే నాలుగు మృతదేహాలు లభించాయి. మృతుల్లో ఒకరు నర్సంపేటకు చెందిన పరమేశ్వర్‌గా, మరో ఇద్దరు హైదరాబాద్, ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. సాయంత్రం కనుగొన్న విద్యార్థి మృతదేహం ఏ మాత్రం గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతదేహం ఎవరిదనే సందేహాలు వెలువడ్డాయి. దీంతో అక్కడ గాలింపు చర్యల్లో నిమిగ్నమైన రాష్ట్రానికి చెందిన అదనపు డీజీపీ రాజీవ్ త్రివేది అఖిల్ పెద్దనాన్న సంజీవరావు, అక్క మౌనికతో ఫోన్లో మాట్లాడారు. అఖిల్ ఒంటిపై ఉన్న గుర్తులు, దుస్తులు, ఇతర వివరాల కోసం ఆరా తీశారు. అఖిల్ చేతి మణికట్టుకు ఉన్న దీపావళి కేదారి వ్రతం, ఆంజనేయ స్వామి దారాలతో గుర్తించగలిగారు. చివరికి ఈ చేదువార్తను రాత్రి 7.55 గంటలకు అఖిల్ కుటుంబ సభ్యులకు తెలిపారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు కొడుకు కోసం పదిహేను రోజులుగా ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అతడి స్వగృహానికి చేరుకున్నారు. అఖిల్ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి అఖిల్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకునే అవకాశాలున్నట్లు బంధువులు తెలిపారు. కాగా జిల్లా యంత్రాంగం నుంచి అఖిల్ కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. పరమేశా.. అప్పుడే నా కొడుకును తీసుకెళ్లావా.. నర్సంపేట : ఓ పరమేశా.. నీ పేరు పెట్టుకుంటే నా కొడుకు నిండు నూరేళ్లు జీవిస్తాడనుకున్నా.. ప్రమాదం జరిగి 14 రోజులైనా నా కొడుకు బతికి వస్తాడనుకున్నా.. నీ పేరు పెట్టుకున్న కొడుకును నీ వద్దకే తీసుకెళ్లి నాకు కడుపుకోత మిగిల్చావా తండ్రీ.. అన్ని దేవతలకూ మొక్కుకున్నా ఏ దేవునికీ నా మొరముట్టలేదా నాయనా.. మమ్మీ టాటా అని చెప్పుకుంటూ పోతివి కదరా కొడుకా.. అంటూ హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన చిందం పరమేశ్వర్ తల్లి ఉమ రోదనలు మిన్నుముట్టాయి. పరమేశ్వర్ మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైన విషయం టీవీ వార్తల్లో వస్తుండగా చూసి కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. నర్సంపేట పట్టణానికి చెందిన చిందం వీరన్న-ఉమల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరిలో చిన్నవాడు పరమేశ్వర్(24) బియాస్ నదిలో గల్లంతైన విషయం విధితమే. ప్రమాదం జరిగిన నాటి నుంచి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు పరమేశ్వర్ క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ మొక్కని దేవుడు లేడు. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడని భావించారు. చివరికి వారి ఆశలు నిరాశలయ్యాయి. మృతదేహం లభించిన విషయంతో తెలియడంతో చుట్టుపక్కల ప్రజలు పరమేశ్వర్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. నేడు మృతదేహం తరలింపు పరమేశ్వర్ మృతదేహం బియాస్ నదిలో గల్లంతైన ప్రదేశం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. మండీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని సోమవారం ఉదయం 6.30 గంట లకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు.. అక్క డి నుంచి నర్సంపేట తహసీల్దార్ సూర్యనారాయణ, ఆర్ఐ రాజు నర్సంపేటకు తీసుకురానున్నట్లు ఆర్డీఓ అరుణకుమారి తెలిపారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నేలరాలిన సరస్వతీ పుత్రుడు పరమేశ్వర్ చిన్ననాటి నుంచీ చదువులో ముందుండేవాడని, పాలిటెక్నిక్ కోర్సు చేస్తుండగానే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం కాల్‌లెటర్ వచ్చినా ఉన్నత స్థాయికి చేరోకోవాలనే లక్ష్యంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడని అతని సోదరుడు ప్రశాంత్ తెలిపాడు. పరమేశ్వర్ 1 నుంచి 5వ తరగతి వరకు పట్టణంలోని అరవింద పాఠశాల, 6 నుంచి 7 వరకు గీతాంజలి స్కూల్, 8 నుంచి టెన్త్ వరకు మహబూబాబాద్‌లోని మహర్షి పాఠశాలలో చదువుకున్నాడు. టెన్త్‌లో 500 పైచీలుకు మార్కులు సాధించాడు. తర్వాత హైదరాబాద్ ఈస్టు మారేడుపల్లి పాలిటెక్నిక్‌లో మూడున్నర సంవత్సరాలు అభ్యసించా డు. ఈ క్రమంలో థౌసెండ్ మిలియన్ కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చినా వదులుకుని ఈసెట్ కోచింగ్‌కు వెళ్లి రాష్ట్రం లో 8వ ర్యాంక్ సాధించాడు. వీఎన్ఆర్ కళాశాలలో ఇన్సుమెంటేషన్ గ్రూపులో సీటు రావడంతో రెండేళ్లు పూర్తి చేశాడు. -
‘ఎవరెస్టు’ వీరులకు ఘనస్వాగతం
సాక్షి,హైదరాబాద్: ఎవరెస్టు శిఖరంపై భారత పతాకాన్ని ఎగరువేసిన తెలుగు తేజాలు లావత్పూర్ణ, సాధనపల్లి అనంద్‌కుమార్‌కు ఆదివారం ఇక్కడ ఘనస్వాగతం లభించింది. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే అభిమానులు గురుకుల సంస్థ విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రపు బగ్గీలో ర్యాలీగా బయటికి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి ర్యాలీగా శంషాబాద్‌కు చేరుకున్న పూర్ణ, ఆనంద్‌లు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ర్యాలీగా పాతబస్తీకి చేరుకున్నారు. ఫలక్‌నుమాలోనూ స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మొజంజాహిమార్కెట్, గన్‌పార్కు మీదుగా ట్యాంక్‌బంక్‌కు భారీ ర్యాలీ చేరుకుంది. -
పరీక్ష రాయడానికి వెళుతూ..
* వాగులో కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థినులు మృతి * వీరిని రక్షించేందుకు యత్నించిన మరొకరు కూడా.. కర్నూలు, న్యూస్‌లైన్: కర్నూలు జిల్లాలో భారీ వర్షానికి ఇద్దరు విద్యా ర్థులు బలయ్యారు. వారిని రక్షించడానికి యత్నించిన మరొకరూ మృతి చెందా రు. కల్లూరు మండలం గోకులపాడుకు చెందిన సుశీల, కళావతి మంగళవారం ఉదయం ఏడుగంటల సమయంలో కర్నూలులో ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు బయలుదేరారు. అప్పటికే ఎగువ ప్రాంతాల నుంచి వర్షం నీరు భారీగా వస్తుండటంతో గ్రామ శివారులోని వక్కెర వాగు పొంగింది. సుశీల తండ్రి నారాయణ (55) విద్యార్థినిలిద్దరినీ వాగును దాటించేందుకు తోడుగా వెళ్లాడు. వారు వాగు మధ్యలోకి చేరుకునే సరికి ప్రవాహ ఉధృతి పెరిగి కొట్టుకుపోయారు. సల్కాపురం గ్రామం వద్ద వీరి మృతదేహాలను గుర్తించారు. వీరికంటే ముందు వాగు దాటే ప్రయత్నంలో ముగ్గురు మహిళలు కొట్టుకుపోతుండగా గ్రామస్తులు రక్షించారు. -
ఇంటర్ పరీక్షలకు వెళ్తు...
కర్నూలు జిల్లా గోకులపాడులో విషాదం చోటు చేసుకుంది. నెరవాడ వాగులో పడి తండ్రీకూతురు, మరో విద్యార్థిని గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా వాగులో కొట్టుకుని పోతున్న తండ్రి మృతదేహన్ని స్థానికులు కనుగొని, ఒడ్డుకు తీసుకువచ్చారు. విద్యార్థినుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు స్థానికులు ముమ్మరం చేశారు. కన్న కూతురితో పాటు మరో విద్యార్థిని ఇంటర్ పరీక్షలకు తీసుకుని వెళ్తుండగా ఆ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. -
ఎవరెస్టుకు చేరువలో తెలుగుతేజాలు
హైదరాబాద్: ఆ ఇద్దరు విద్యార్థుల సంకల్ప బలం ముందు ఎవరెస్టు తలవంచుతోంది. ఆ ఇద్దరు మారుమూల గ్రామాల విద్యార్థులు వయసుకు మించిన సాహసయాత్రకు నడుం బిగించారు. సాంఘిక సంక్షేమశాఖ సహకారంతో భారత జెండాను ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరాగ్రంపై ఎగురవేయబోతున్నా రు. అన్నీ సవ్యంగా సాగితే ఆదివారం ఉద యం 8కల్లా మువ్వన్నెల జెండాను ఎవరెస్టుపై రెపరెపలాడించేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వీరి యాత్ర అత్యంత ప్రమాదకరమైన డెత్జోన్లో సాగుతుందని యాత్రను పర్యవేక్షిస్తున్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ శనివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రస్తుతం వీరు బేస్ క్యాంప్‌కు 27,390 అడుగుల ఎత్తులో ప్రయాణం సాగిస్తున్నారన్నారు. మరో రెండువేల అడుగులు సాహసయాత్రను పూర్తిచేస్తే.. ఆదివారం ఉదయం 8 గంటల్లోపే లక్ష్యాన్ని చేరుకుంటారన్నారు. సాహసయాత్రకు చేయూత.. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ, ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ విద్యార్థులు సాహసయాత్రకు బయలుదేరారు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన లక్ష్మి, దేవదాస్ వ్యవసాయ కూలీలు. వారి కుమార్తె మాలావత్ పూర్ణ స్వేరోస్(14) ప్రస్తుతం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 9వ తరగతి చదువుతోంది. ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మి, కొండలరావు దంపతుల కుమారుడు ఆనంద్‌కుమార్(17) అన్నపురెడ్డిపల్లి ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఇద్దరు విద్యార్థులు ప్రముఖ పర్వతారోహకుడు, అర్జున అవార్డు గ్రహీత శేఖర్‌బాబు నేతత్వంలో ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరితో పాటు వివిధ దేశాలకు చెందిన 30 మంది ఈ సాహసయాత్ర చేస్తున్నారు. వీరు ఎవరెస్టు శిఖరం అధిరోహిస్తే పూర్ణ స్వేరోస్ అత్యంత పిన్నవయస్సులో ఎవరెస్టు అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. -
టీచర్లను చితక్కొట్టిన విద్యార్థినులు
-
వివాహితపై అత్యాచారం.. పథకం ప్రకారమే...
పరిగి, న్యూస్‌లైన్: ఒంటరిగా ఉన్న వివాహితను కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు సోమవారం రిమాండుకు తరలించా రు. నిందితుల్లో ఒకరు డిగ్రీ.. మరొకరు ఇంటర్ చదువుతున్నారు. సోమవారం పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి విలేకరుల సమావేశంలో ఎస్ఐలు లకా్ష్మరెడ్డి, నగేష్‌లతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. కుల్కచర్ల మండ లం కామునిపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత(23)పై గతనెల 30న మధ్యాహ్నం అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడి పరారయ్యారు. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివా రం నిందితులను అరెస్టు చేసి సోమవారం కటకటాల వెనక్కి పంపారు. పథకం ప్రకారమే అఘాయిత ్యం.. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల గ్రామానికి చెంది న వివాహిత(23) ఐదు నెలల క్రితం ప్రసవం కోసం పుట్టిల్లు అయిన కుల్కచర్ల మండలం కామునిపల్లి గ్రామానికి వచ్చింది. నాలుగు నెలల క్రితం ఆమెకు కాన్పు జరిగింది. 15 రోజుల క్రితం ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబీకులు పొలం పనులకు వెళ్తుండడంతో మహిళ ఇంటి వద్ద ఒంటరిగా ఉంటోంది. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి బోడ శ్రీశైలం(21) ఆమెపై కన్నేశాడు. ఎలాగైనా తన కామవాంఛను తీర్చుకోవాలనుకున్నాడు. ఇదే విషయం అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఇంటర్ విద్యార్థి రాజేందర్‌రెడ్డి(19)తో చెప్పాడు. ఇద ్దరు కలిసి పథకం పన్నారు. ఈక్రమంలో గత నెల 30న మధ్యాహ్నం వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండటంతో లోపలికి చొరబడ్డారు. అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించారు. ఒకరి తర్వాత ఒకరు రాజేందర్‌రెడ్డి, శ్రీశైలంలు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు కుటుంబీకుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసు లు ఆదివారం నిందితులను అరెస్టు చేశారు. తమదైన శైలిలో పోలీసులు వారిని విచారించగా చేసిన నేరం అంగీకరించారు. బాలింతను బెదిరిం చేందుకు ఉపయోగించిన కత్తి ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకొని సోమవారం రిమాండుకు తరలించారు. -
కాలువలోకి దూసుకెళ్లిన బైక్
లక్కరాజుగార్లపాడు (సత్తెనపల్లిరూరల్), న్యూస్‌లైన్: ప్రమాదవశాత్తూ ద్విచక్ర వాహనం కాలువలోకి దూసుకెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మరొకరు వాహనం పైనుంచి ఒడ్డున పడటంతో సురక్షితంగా బయట పడ్డాడు. ఈ సంఘటనలో విద్యార్థులు కట్టా శ్యామ్ ప్రసాద్, జంగి సాయి గల్లంతు కాగా, కాటేపల్లి సాయిరామ్ బయట పడ్డాడు. వీరు ముగ్గురూ మిత్రులు, దూరపు బంధువులు. గుంటూరుకు చెందిన కట్టా శ్యామ్ ప్రసాద్ జేకేసీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్, కాటేపల్లి సాయిరామ్ డిగ్రీ మొదటి సంవత్సరం, విజయవాడకు చెందిన జంగి సాయి అక్కడి ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. క్రిస్మస్ సందర్భంగా మంగళవారం ద్విచక్ర వాహనంపై ఫిరంగిపురం మండలం యర్రగుంట్లపాడులో వుండే జంగి సాయి బావ, పాస్టర్ అనోక్ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి రాత్రికి సత్తెనపల్లిలోని శ్యామ్ ప్రసాద్ నాయనమ్మ రాజమ్మ ఇంటికి వచ్చారు. తెల్లవారిన తరువాత ముగ్గురూ ద్విచక్ర వాహనంపై యర్రగుంట్లపాడు బయలుదేరారు. లక్కరాజుగార్లపాడు సమీపంలోకి రాగానే మూత్ర విసర్జన కోసం ఆగారు. అనంతరం జంగి సాయి తాను డ్రైవ్ చేస్తానంటూ స్టార్ట్ చేయడంతో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సాగర్ పంట కాలువలోకి దూసుకు వెళ్లింది. వెనుక కూర్చున్న సాయిరామ్ కింద పడగా వాహనంపై ఉన్న సాయి, శ్యామ్‌ప్రసాద్ బైక్‌తో పాటు కాలువలో పడి గల్లంతయ్యారు. గాలింపు చర్యలు... సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. సాగర్ కెనాల్ అధికారులతో మాట్లాడి నీటి ఉధృతి తగ్గేంచేలా చూసి సాయంత్రం వరకు గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ చిక్కలేదు. రూరల్ ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.