దర్శి (ప్రకాశం) : పదో తరగతి పరీక్షల సందర్భంగా ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నా పత్రం ఇచ్చిన ఇన్విజిలేటర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు మెదలైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్లో సోమవారం ఉదయం ఇద్దరు విద్యార్థులకు సంస్కృతం ప్రశ్నా పత్రానికి బదులు తెలుగు ప్రశ్నా పత్రం వచ్చింది. కంగారులో ఈ విషయాన్ని పట్టించుకోని విద్యార్థులు పరీక్ష రాసే పనిలో బిజీ అయ్యారు. రెండు గంటల అనంతరం అసలు సంగతి గమనించిన విద్యార్థులు తమ ఆవేదనను డీఈవో దృష్టికి తీసుకెళ్లగా.. బాధ్యతారహితంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ ఆర్. శ్రీనివాస్‌రావును సస్పెండ్ చేశారు.