darsi
-
దర్శిలో టీడీపీ నేతల ఓవరాక్షన్
-
టీడీపీ బంటుల్లా పేట్రేగిపోతున్న పోలీసులు
సాక్షి, ప్రకాశం: దర్శి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దర్శిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. దీంతో, దర్శి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి అరెస్ట్‌కు నిరసగా ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ధర్నాకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. దర్శిలో పోలీసులు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు, అరెస్ట్‌లు చేస్తున్నారు. దర్శి ఎస్ఐ మురళీని తక్షణమే తొలగించాలి. దర్శి స్టేషన్‌ని టీడీపీ పీఎస్‌గా ఎస్ఐ మురళీ మార్చుకున్నారు. బొట్లపాలెంలో నా వాహనంపై దాడి చేసిన వారిని వదిలేసి.. అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్త అంజిరెడ్డి మీద 307 కేసు పెట్టి అరెస్ట్ చేశారు. స్టేషన్లో అంజిరెడ్డిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.దర్శి ఎస్ఐని తొలగించాలని డీజీపీని కలుస్తాను. నాకు ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా అధికారులు ఇవ్వడం లేదు. నా హక్కులు కాపాడుకోవడం కోసం స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాను. శాంతియుతంగా నిరసన చేయాలనుకుంటే పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా?. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.అయితే, కొద్దిరోజులుగా దర్శి నియోజకవర్గంలో పచ్చ బ్యాచ్ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ వాహనంపై టీడీపీ కార్యకర్త దాడి చేశాడు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కార్యకర్త అంజిరెడ్డి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి చేసిన వారిపై కాకుండా అడ్డుకోబోయిన అంజిరెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేశారు.దీంతో, పోలీసు వైఖరికి నిరసనగా బూచేపల్లి ధర్నాకు పిలుపునిచ్చారు. అనంతరం, దర్శి వీధుల్లో వందల సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, ధర్నాకు అనుమతి లేదంటూ శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తర్వాత వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది?: బొత్స -
దర్శి టీడీపీ ఇంఛార్జ్ ఓవర్ యాక్షన్
-
వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా గెలిపించుకుందాం: బాలినేని
సాక్షి, ప్రకాశం : జిల్లా వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. దర్శి వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డిలు కలిసి ప్రారంభించారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి నియమించబడిన తర్వాత మొదటిసారిగా మాజీమంత్రి బాలినేనితో కలిసి పార్టీ కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. అంతకు ముందు.. ఈ ఉదయం ఒంగోలులో బాలినేని నివాసంలో బాలినేనితో భేటీ అయిన చెవిరెడ్డి ,అనంతరం ఇద్దరు కలిసి ఒకే కారులో దర్శి వచ్చారు. దీంతో పార్టీ కేడర్‌లో జోష్ నెలకొంది. దర్శి నియోజకవర్గ ఇంచార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని నేతలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లు గెలిపించుకునేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. నాయకులు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేద్దామన్నారు. మన నాయకుడు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పట్టుదలతో పని చేద్దాం. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని గెలిపించుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పేదలను గుండెల నిండా నింపుకున్న పార్టీ వైఎస్సార్సీపీ అని.. ప్రజా బలంతో పేదల అండతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారన్నారు. అసంతృప్తులు, మనస్పర్ధలను పక్కనపెట్టి అందం సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: వైఎస్సార్సీపీని వీడే ప్రసక్తే లేదు: ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి -
ప్రకాశం: దర్శి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు. చదవండి: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి -
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి
సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శి సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. ఎన్ఎస్పీ కాలువలోకి ఆర్టీసీ ఇంద్ర బస్సు దూసుకుపోవడంతో ఏడుగురు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అబ్దుల్ అజీస్(65), జానీబేగం(65), అబ్దుల్ హనీ(60), నూర్జహాన్(58), షేక్ రమీజ్(48), షబీనా(35), షేక్ హీనా(6) మృతిచెందారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వివాహ రిసెప్షన్ కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ బస్సును అద్దెకు తీసుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 నుంచి 40మంది వరకు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. బస్సు తలకిందులుగా పడటంతో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక 7 మంది మృతి చెందారు. దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్, సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. బస్సు ప్రమాద ఘటనాస్థలిని ఎస్పీ మలిక గర్గ్ పరిశీలించారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకుందని ఎస్పీ తెలిపారు. రాత్రి ఒంటి గంట సమయంలో ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందన్నారు. -
శాన్వికకు సీఎం జగన్ ఆపన్నహస్తం.. కలెక్టర్ దినేష్‌కుమార్‌కు ఆదేశాలు
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పట్టణానికి చెందిన తలసేమియా బాధిత బాలికకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆపన్నహస్తం అందించారు. దర్శిలో మంగళవారం జరిగిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి రిసెప్షన్ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన నిషితకుమారి ఏకైక సంతానం అయిన ఎనిమిదేళ్ల బసవనాట శాన్విక అనారోగ్య పరిస్థితిని స్థానికులు, నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శాన్విక తలసేమియాతో బాధపడుతోందని, నెలకు రెండుసార్లు రక్త మార్పిడి చేయించాల్సి వస్తోందని చెప్పారు. నెలకు రూ.12 వేలకుపైగా ఖర్చవుతున్నట్లు తెలిపారు. ఓ నెగిటివ్ గ్రూపు రక్తం దొరకటం కూడా కష్టంగా ఉందన్నారు. పాపకు బోన్‌మ్యారో (ఎముక మజ్జ) చికిత్స చేయించాలని, అందుకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు సీఎంకు తెలిపారు. గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నానని, సుమారు ఆరేళ్ల కిందట తన భర్త తనను పట్టించుకోకుండా వదిలేసి ఇంటినుంచి వెళ్లిపోయాడని బాలిక తల్లి నిషితకుమారి చెప్పారు. తన ఉద్యోగంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్థోమత లేదని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని, వారి పోషణ బాధ్యత కూడా తానే చూసుకుంటున్నానని తెలిపారు. చిన్నారి శాన్వికతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యే కంగా మాట్లాడారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని బాధితురాలి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అవసరమైన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ దినేష్‌కుమార్‌ను ఆదేశించారు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం పాపే నాకు ప్రాణం.. నా పాపకు ప్రాణం పోస్తానన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను జీవితాంతం రుణ పడి ఉంటా. నువ్వు బాధపడకు.. నేను చూసుకుంటానని ఆయన నాకు భరోసా ఇచ్చారు. వెంటనే నా పాపకు వైద్యం చేయించాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం కల్లా సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి, కలెక్టర్ దినేష్‌కుమార్ నుంచి, తహశీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్లు చేసి పాప వివరాలు తీసుకున్నారు. నా పాపకు ప్రాణం పోస్తున్నారు. నాకెంతో సంతోషంగా ఉంది. – నిషితకుమారి, శాన్విక తల్లి దర్శి పర్యటనలో సీఎంను కలిసిన చిన్నారి శాన్విక, తల్లిదండ్రులు. తలసేమియాతో బాధపడుతున్న శాన్వికకు వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన సీఎం. pic.twitter.com/LoI5tSCegA — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 20, 2022 -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, ప్రకాశంజిల్లా: దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు రాజీవ్, రోహితలను సీఎం జగన్ ఆశీర్వదించారు. జిల్లాకు వచ్చిన సీఎంకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. క్రిస్మస్ సందర్భంగా మంగళవారం సాయంత్రం విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందులో సీఎం జగన్ పాల్గొంటారు. ఇందుకోసం సాయంత్రం 5.30 గంటలకు ఏప్లస్ కన్వెన్షన్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్తారు. -
Viral Video: సెల్‌ఫోన్ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి..
సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శిలో ఓ కోతి సెల్ఫీలు దిగుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొబైల్ ఫోన్‌ను చేతిలో పట్టుకుని వాకింగ్ చేస్తూ ఉన్న ఓ వ్యక్తి నుండి మొబైల్ ఫోన్‌ను ఓ వానరం లాక్కెళ్లింది. అంతటితో ఆగకుండా దగ్గరలో ఉన్న గోడపై కూర్చొని సెల్ఫీలో దిగుతూ గంట పాటు మొబైల్ ఫోన్‌ను ఇవ్వకుండా ఆ వ్యక్తి కి ముచ్చెమటలు పట్టించింది. చదవండి: బెజవాడలో ఫేమస్.. రామకృష్ణ బుల్లెట్ గ్యారేజ్ ఆ కోతి చేష్టలకు వాకింగ్ చేస్తూ ఉన్నవారంతా ఒక్కసారి నోరెళ్ల పెట్టి అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత మొబైల్‌ను నోటితో పట్టుకొని చెట్లపై అటు ఇటు దూకుతూ తన కోతి చేష్టలను చూపెట్టింది. గంట తర్వాత చిన్నగా ఓ గోడపై వదిలి వెళ్లగా ఆ యువకుడు నానా కష్టాలు పడి గోడలు ఎక్కి మొబైల్ ఫోన్ తీసుకోవడంతో అక్కడి వారంతా కోతి చేష్టలకు ముక్కున వేలేసుకున్నారు. -
రైతులను చితకబాదిన టీడీపీ నేతలు
దర్శి: మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులను దొంగ ఓట్లు వేయడానికి వచ్చారంటూ టీడీపీ నేతలు చితకబాదిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మార్కెట్ యార్డ్‌లో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. దొనకొండ నుంచి మార్కెట్ యార్డుకు కొందరు రైతులు పురుగు మందుల కోసం వచ్చారు. లోనికి వెళ్లగానే మీరు ఇక్కడి వాళ్లు కాదు.. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారా అంటూ టీడీపీ నేతలు చితకబాదారు. దీంతో దర్శిలో 13వ పోలింగ్ బూత్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తాము దొంగ ఓట్లు వేయడానికి రాలేదని, మార్కెట్ యార్డ్‌కు పనిమీద వచ్చామని చెప్పినా వినిపించుకోలేదని బాధితులు నాగేశ్వరరావు, కోటిరెడ్డి, అంకయ్య తెలిపారు. తమను అసభ్య పదజాలంలో తిట్టారని వాపోయారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో బతికి బయట పడ్డామని చెప్పారు. వారిని కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. బాధిత రైతులు ఈ మేరకు దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
దర్శిలోనూ దౌర్జన్యం
దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ నామినేషన్ల ఘట్టం చివరి రోజున టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. దర్శి నగర పంచాయతీ 8వ వార్డులో టీడీపీ తరఫున చింతలపూడి శ్రీనివాసరావు, ఆయన తండ్రి సాంబయ్య ఇద్దరూ నామినేషన్ వేశారు. సోమవారం ఉపసంహరణకు ఆఖరి రోజు కావడంతో వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఆ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేడం మోహన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో సహనం కోల్పోయిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, నేతలు.. దామచర్ల జనార్దన్, నారపుశెట్టి పాపారావు, కందుల నారాయణరెడ్డి, పమిడి రమేష్ ఎన్నికల అధికారి కార్యాలయం ముందు నానా యాగీ చేశారు. కార్యాలయం లోపలికి వెళ్తామంటూ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల అధికారి అనుమతి ఉంటేనే లోపలికి పంపుతామని ఎస్ఐ చంద్రశేఖర్ నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఆర్వోనే బయటకు రావాలని, లేదంటే తామే లోపలికి వెళ్లి తేల్చుకుంటామంటూ ఎస్ఐకి వేలు చూపిస్తూ దురుసుగా వ్యవహరించారు. ఎట్టకేలకు తమ లాయర్ రావడంతో టీడీపీ నేతలు కార్యాలయంలోనికి వెళ్లారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు చూపడంతో నేతలు వెనుదిరిగారు. -
ఫైబర్ గ్రిడ్.. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్
-
ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో విషాదం
సాక్షి, దర్శి టౌన్: ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో విద్యుదాఘాతానికి గురై టీడీపీ కార్యకర్త మృతి చెందిన ఘటన దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెంలో జరిగింది. గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ వర్థంతి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక గ్రంథాలయం ఎదురుగా జెండా దిమ్మె వద్ద ఇనుపరాడ్‌కు టీడీపీ జెండా ఎత్తుతుండగా బ్యాలెన్స్ తప్పి ఇనుప రాడ్ పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడింది. రాడ్ పట్టుకొని ఉన్న టీడీపీ కార్యకర్త మద్దినేని వెంకటనారాయణ(36) విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. మృతునికి భార్య మహాలక్షి్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఆ పార్టీ నియోజక వర్గ నియోజక వర్గ సమన్వయకర్త పమిడి రమేష్‌లు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఘటన స్థలాన్ని ఎస్సై రామకోటయ్య సందర్శించి వివరాలు సేకరించారు. హెచ్‌సీ నారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. చదవండి: ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది -
కాలువలోకి దూసుకుపోయిన స్కూలు బస్సు..
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శిలో స్కూల్ విద్యార్థులు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్థానిక చింతలపాడు రోడ్డులో ఎస్వీఆర్ పాఠశాల బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి పంట కాలువలోకి దూసుకుపోయింది. బస్సు బోల్తా పడటంతో ఆరుగురు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సులో సుమారు 12 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చిన్నారులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
కన్నా.. కనిపించరా..!
రెండేళ్ల బాలుడు తోటి పిల్లలతో ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అప్పటి వరకు కళ్ల ముందే ఉన్నవాడు కనిపించకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. బిడ్డ జాడ కోసం చుట్టు పక్కలంతా వెదికింది. ఎంతకీ ఆచూకీ తెలియక కన్నీరు మున్నీరవుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదంతా నెల రోజుల కిందటి మాట. అప్పటి నుంచీ కంటి మీద కునుకు లేదు. కుమారుడి కోసం వెదకని చోటు లేదు. ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి చేరతాడని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ బాలుడి తల్లిదండ్రులు. మూడు రోజుల కిందట కిడ్నాపైన తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన బాలుడు జసిత్ క్షేమంగా ఇంటికి చేరడంతో తమ బిడ్డ కూడా తిరిగొస్తాడని ఆశ చిగురిచింది. దీంతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సాక్షి, దర్శి (ప్రకాశం): దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలోని రెడ్డినగర్‌కు చెందిన మేడగం అశోక్‌రెడ్డి, జ్యోతి దంపతుల కుమారుడు 25 నెలల వయసున్న ఆరూష్‌రెడ్డి. జూన్ 24 తేదీన ఇంటి వద్ద ఆరుబయట ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీనిపై ముండ్లమూరు ఎస్ఐ అంకమ్మ కేసు నమోదు చేశారు. దర్శి డీఎస్పీ రాంబాబు, సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. పలు చోట్ల వెదికినా ఫలితం లేదు. దీంతో ప్రతి రోజు ఆరూష్ కోసం తల్లిదండ్రులు తమ బంధువుల గ్రామాలలో చుట్టు పక్కల పట్టణాలలో, తండాలలో, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్, ఇతర పట్టణాలలో వెదుకుతూనే ఉన్నారు. 32 రోజులు అయినా ఫలితం లేక పోవటంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని ముక్కోటి దేవతలను వేడుకున్నారు. తమ వంతుగా ఎస్పీని కలసి విన్నవించుకున్నారు. అదే రోజు డీఎస్పీతో మాట్లాడి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట బాలుడు జసిత్ గురువారం తల్లిదండ్రుల చెంతకు చేరడంతో ఆరూష్‌రెడ్డి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. దీంతో గురువారం ఒంగోలు వచ్చి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్‌ను కలిసి, తమ బిడ్డ ఆచూకీ గుర్తించాలని విన్నవించుకున్నారు. ఒడిశా వారి పైనే అనుమానం... మొదటగా తల్లిదండ్రులు వెలు బుచ్చిన పలు అనుమానాల ప్రకారం పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ఈ సమయంలో దర్శి కేంద్రంగా పలు పరీక్షలు రాయటానికి వచ్చిన ఒడిశాకు చెందిన వారిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదిశగా విచారణ చేస్తే ఫలితం ఉండొచ్చని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బదిలీలతో దర్యాప్తు జాప్యం.. బాలుడు అదృశ్యమైన సమయంలో ఉన్న పోలీస్ అధికారులు తర్వాత వరస బదిలీలు కావటంతో ఈ కేసు దర్యాప్తు జాప్యమైందని స్థానికులు భావిస్తున్నారు. కిడ్నాప్ సమయంలో ఉన్న ఎస్ఐ అంకమ్మ రావు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో రామక్రిష్ణ వచ్చారు. దర్శి డీఎస్పీ నాగరాజు బదిలీపై వెళ్లి ప్రకాశరావు వచ్చారు. దర్శి సీఐ శ్రీనివాసరావు బదిలీపై వెళ్లిన సీఐ కరుణాకర్‌రావు ఆయన వెళ్లి సీఐ ఎండీ మొయిన్ వచ్చారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. -
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, ప్రకాశం జిల్లా : వైఎస్సార్సీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివప్రసాద్ రెడ్డి తండ్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కన్నమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. సుబ్బారెడ్డి మృతి పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి , మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సుబ్బారెడ్డి మానవత్వం ఉన్న గొప్ప నేత అని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. రేపు స్వగ్రామంలో సుబ్బారెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితవర్గాలు చెప్పాయి. 2004 ఎన్నికల్లో సుబ్బారెడ్డికి కాంగ్రెస్ దర్శి అసెంబ్లీ టికెట్ ను నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు శివప్రసాద్ కాంగ్రెస్ తరఫున గెలిచి వైస్సార్సీపీలో చేరారు. -
మేము ఓటేసేదెలా..?
సాక్షి, దర్శి టౌన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ విధుల్లో అధికారులు, సిబ్బందిని నియమించే విషయంలో హడావిడిగా తీసుకుంటున్న నిర్ణయాలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాజాగా వైద్యారోగ్య సిబ్బందిని, డాక్టర్లను పోలింగ్ విధులకు కేటాయించినప్పటికీ పోస్టల్ బ్యాలెట్ ఇవ్వకపోవడంతో ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల విధుల్లో ఉండటం వల్ల స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. జిల్లాలో 14 సీహెచ్‌సీలు, 90 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటిలో పనిచేస్తున్న దాదాపు 2,973 మంది ఆశా కార్యకర్తలు, ఎంపీహెచ్ఈఓలు, హెచ్‌ఎస్‌లు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బందిని మార్చి 26న పోలింగ్ విధులకు నియమించారు. వీరందరికీ పోస్టల్ బ్యాలెట్లు కేటాయించారు. అయితే, మరో 309 మంది ఆరోగ్య కార్యకర్తలు, హెచ్‌ఈఓలు, హెచ్‌ఎస్‌లను రెండు రోజుల క్రితం (గత నెల 31వ తేదీ) పోలింగ్ బూత్‌లలో విధులకు నియమించారు. ఏప్రిల్ 1వ తేదీ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న మరో 1,500 మంది ఆరోగ్య సిబ్బందిని, 150 మంది వైద్యాధికారులను పోలింగ్ బూత్‌ల వద్ద అత్యవసర సేవలు అందించడానికి నియమించారు. ఆయా పీహెచ్‌సీల పరిధిలోని పోలింగ్ బూత్‌ల వద్ద డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఆరోగ్య సిబ్బంది, సూపర్వైజర్లు విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ, వీరెవరికీ పోస్టల్ బ్యాలెట్లు కేటాయించలేదు. దీంతో మొత్తం 1959 మంది డాక్టర్లు, సిబ్బంది తమ స్వగ్రామాలకు వెళ్లి ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవా లంటూ ఆందోళన చెందుతున్నారు. స్వస్థలాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారికి ఇబ్బందే... వైద్యాధికారులు, సిబ్బంది ఎక్కడెక్కడో పనిచేస్తుండగా, వారిలో పనిచేసే ప్రాంతంలో కాకుండా ఎక్కడెక్కడో స్వస్థలాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న వారికి పోలింగ్ విధుల కారణంగా ఓటేయడం ఇబ్బందిగా మారే పరిస్థితి నెలకొంది. వైద్యాధికారులు, సిబ్బందిలో ఎక్కువ మంది పనిచేసే ప్రాంతాల్లో నివాసం ఉండటం లేదు. సమీపంలోని పట్టణాలు, నగరాల్లో నివాసం ఉంటూ పనిచేసే ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి వారంతా ఉదయాన్నే వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో, స్వస్థలాల్లో ఓటు హక్కును వినియోగించుకుని అనంతరం పోలింగ్ విధులకు హాజరుకావాలి. అలా చేయాలంటే సమయానికి పోలింగ్ విధులకు హాజరవడం జరగని పని. పోలింగ్ విధులకు సకాలంలో హాజరు కావాలంటే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో పోలింగ్ విధులకు నియమించిన వారందరికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. ఓటు వేసి వెంటనే విధులకు హాజరుకావాలి పోలింగ్ విధులకు నియమించడి పోస్టల్ బ్యాలెట్లు కేటాయించని వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది అందరూ తొలుత వారి ఓటు వేసి ఆ వెంటనే పోలింగ్ బూత్‌ల వద్ద విధులకు హాజరుకావాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ రాజ్యలక్ష్మి తెలిపారు. దూరప్రాంతాల్లో ఓటు హక్కు ఉన్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించగా, పోలింగ్ విధులకు మాత్రం కచ్చితంగా అందరూ హాజరుకావాల్సిందేని స్పష్టం చేశారు. - డీఎంఅండ్‌హెచ్‌ఓ -
దర్శి ప్రచార సభలో వైఎస్ జగన్
-
జగన్ హమారా
సాక్షి, దర్శి: ఆధ్మాత్మిక చింతనలో మనుగడ సాగిస్తున్న ఇమామ్, మౌజన్లకు స్థిరమైన ఆదాయం లేకపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం స్థానికులు అందజేస్తున్న విరాళాలతోనే కుటుంబాలు వెళ్లదీస్తున్న వారికి ప్రభుత్వ పరంగా అతి తక్కువ సాయం మాత్రమే అందుతుంది. ఇలాంటి తరుణంలో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ముస్లింల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. తాను అధికారంలోకి రాగానే ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేలు ప్రతి నెల గౌరవ వేతనంగా అందిస్తానంటూ ప్రకటించారు. జగన్ ఇచ్చిన భరోసాతో ఇమామ్, మౌజన్ల కుటుంబాల్లో వెలుగు నిండనున్నాయి. విరాళాలతో కాలం గడుపుతున్న తమకు ఇకపై జగన్ వల్ల సమాజంలో సముచిత గౌరవం దక్కనుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ పరిస్థితి జిల్లాలో సుమారుగా 520 మసీదులు ఉన్నాయి. ఒక్కో మసీదుకు ఒక ఇమామ్, ఒక మౌజన్ లెక్కన 1040మంది ఇమామ్‌లు, మౌజన్లు పనిచేస్తున్నారు. దర్శి నియోజకవర్గంలో 36 మసీదులు ఉండగా 72 మంది ఇమామ్‌లు, మౌజన్లు పని చేస్తున్నారు. జిల్లాలోని ముస్లిం ఆధ్యాత్మిక సంస్థల్లో పని చేస్తున్న మత పెద్దలు చాలీ చాలనీ వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. చాలా చోట్ల మసీదులను చందాలతో నిర్మిస్తారు. వాటికి ఎలాంటి ఆదాయ వనరులు ఉండవు. అక్కడికి వచ్చే ముస్లింలతో నమాజ్ చదివించే ఇమామ్‌లకు రూ.5వేలు, వాటి నిర్వహణ చూసుకునే మౌజన్లకు రూ.3వేలు ఇస్తుంటారు. ఈ మొత్తం ఎందుకూ చాలడం లేదు. ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నారు. బాబు హామీ..నిబంధనల కొర్రీ ఇమామ్, మౌజాన్లకు గౌరవ వేతనం ఇవ్వబోతున్నట్లు రెండేళ్ల క్రితం సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి ఎన్నో నిబంధనలు పెట్టారు. గౌరవ వేతనం అందుకోబోయే వారు పని చేస్తున్న మసీదులకు భూములు, చరాస్తులు, ఆదాయ మార్గాలు ఏవీ ఉండరాదని, వక్ఫ్ బోర్డులో ఆ మసీదు రిజిస్టర్ అయి ఉండాలని తదితర నిబంధనలు పెట్టారు. మసీదుతో పాటు స్థిర, చరాస్తి డాక్యుమెంట్లు, వాటి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంది. ఇన్నీ చేసిన తర్వాత ముతవల్లి కమిటీ ద్వారా సిఫారసు పత్రం జత చేయాలి. ఇలాంటి అర్ధ రహిత కారణాలతో గౌరవ వేతనాలు సక్రమంగా అందకుండా పోతున్నాయి. జగన్ అధికారంలోకి వస్తేనే ముస్లింలకు న్యాయం చేకూరుతుంది. – డాక్టర్ ఎస్ఎం బాషా, ప్రముఖ హోమియో వైద్యులు జగన్‌తోనే ముస్లింల సంక్షేమం ముస్లింల అభ్యున్నతి కోసం దివంగత మహానేత వైఎస్సార్ ఎంతో శ్రమించారు. ఆయనలా వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ముస్లిం సంక్షేమం కోసం పలు హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వస్తే ఆ హామీలన్ని ఆయన నెరవేర్చి తీరుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ముస్లింల సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జగన్ అధికారంలోకి వస్తే జిల్లాలోని అన్ని మసీదుల్లో పని చేస్తున్న ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం అందుతుంది. – బాబావలి, దర్శి ఎందరికో మేలు జరుగుతుంది ముస్లింలలో ఆధ్యాత్మిక భావన పెంపొందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్లకు తాను అధికారంలోకి రాగానే గౌరవ వేతనం ఇస్తానంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్షణీయం. అన్ని మసీదుల్లో పని చేస్తున్న ఇమాం, మౌజన్లకు గౌరవ వేతనం ఇస్తామంటూ జగన్ ముందుకు రావడం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. – షేక్ హుస్సేన్, మదీనా మసీద్ ప్రెసిడెంట్ వైఎస్సార్‌లా ఆదుకుంటారు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ఆదుకున్నారు. ఆయన తనయుడిగా వైఎస్ జగన్ కూడా మా సంక్షేమానికి పాటు పడతారని ఆశిస్తున్నాం. ప్రార్థనా మందిరాల్లో ఇమామ్‌లు, మౌజన్ల సేవలను గుర్తించి వారి కష్టాలను గుర్తించి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ముస్లింలు స్వాగతించాలి. – నాగూర్, దర్శి అభినందనీయం ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వాలనుకోవడం అభినందనీయం. జిల్లాలోని చాలా మసీదుల్లో ఇమామ్, మౌజన్లుగా ఉన్న వారు ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతున్నారు. గౌరవ వేతనం నేరుగా ఇమామ్‌ల అకౌంట్‌కు వేస్తే ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండదు. ఈ విషయంలో జగన్‌కు ఎంతో రుణపడి ఉంటాం. – పఠాన్ దస్తగిరి, మౌజన్, రాజంపల్లి మసీద్ రూ.3వేలతో ఎలా బతకాలి వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఇమాంమ్లకు రూ.10వేలు, మౌజన్లకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తామని చెబుతున్నారు. ఆయన ఇస్తారనే నమ్మకం మాకుంది. అందుకే జగన్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా. – షేక్ అబ్దుల్ బషీర్, మర్కస్ మసీద్, దర్శి రుణపడి ఉంటాం ఇమామ్‌లకు గౌరవ వేతనం పెంచాలని ఆలోచించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. ఆయన ముఖ్యమంత్రి అయితే మా కష్టాలు గట్టెక్కుతాయి. జగన్‌కు రుణపడి ఉంటాం. చాలీచాలని ఆదాయంతో కుటుంబం గడిచేది చాలా కష్టంగా ఉంది. ఈ తరుణంలో జగన్ ప్రకటన ఎంతో సంతోషం కలిగించింది. – షేక్ ఇమ్రాన్, ఇమామ్, రాజంపల్లి మసీద్ -
రిమాండ్ ఖైదీ ఆత్మహత్య
ప్రకాశం : అండర్ ట్రైల్లో ఉన్న ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి సబ్ జైలులో చోటుచేసుకుంది. రిమాండ్ ఖైదీ రమేష్(21) టాయిలెట్ రూంలో తన లుంగీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు రమేష్‌ను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓ దొంగతనం కేసులో రమేష్ రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు జైలు సూపరిండెంట్ వసంత రావు తెలిపారు. రమేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
దర్శికి చేరిన సాగర్ జలాలు
దర్శి: పట్టణానికి మంగళవారం సాగర్ జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్నెస్పీ ఈఈ రత్తయ్య మాట్లాడుతూ నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టులోని ఆరుదల పంటల కోసం సాగర్ జలాలు విడుదల చేసినట్లు తెలిపారు. ఇటీవల వర్షాలు లేక వేసిన పంటలు వాడు ముఖం పట్టడంతో ఆ పంటలను కాపాడేందుకు నీటి విడుదల చేశారన్నారు. ఈ నీరు 20 రోజుల పాటు వస్తుందని చెప్పారు. డ్యాంలో 538.80 అడుగుల నీటి మట్టం ఉన్నాయి. ఆర్సీఆర్లో 4 వేల క్యూసెక్కులు, బుగ్గవాగు 468.50 అడుగులు (5627 క్యూసెక్కులు), అద్దంకి బ్రాంచి కెనాల్ 1200 క్యూసెక్కులు, గుంటూరు బ్రాంచ్ కెనాల్ 1300 క్యూసెక్కులు, 57/2 మైలు రాయి వద్ద 2 వేల క్యూసెక్కులు, జిల్లా సరిహద్దు 85/3 మైలు రాయి వద్ద 1632 క్యూసెక్కులు, 126/0 మైలు రాయి వద్ద 1192 క్యూసెక్కులు, ఓబీసీ 883 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఆయకట్టు ప్రాంత రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
శ్మశానాలను వదలని తెలుగు తమ్ముళ్లు !!
► నీరు-చెట్టు పథకానికి దొరకని చోటు ► శ్మశానంలో అడ్డగోలుగా తవ్వకాలు ► అడ్డొచ్చిన దళితులకు బెదిరింపులు ► మితిమీరిన టీడీపీ నేతల దౌర్జన్యం ► ఎప్పటిలాగే కిమ్మనని అధికారులు అక్కడలా.. నిజాయితీకి నేను బ్రాండ్ అంబాసిడర్‌ను.. అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తా.. తప్పు చేస్తే నాయకులైనా.. అధికారులైనా వదిలే ప్రసక్తే లేదు.. నిర్లక్ష్యాన్ని సహించను.. నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను.. అంతిమంగా పేదలకు న్యాయం జరగాలి.. తిరుపతిలో మూడు రోజులు జరిగిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇక్కడిలా... అంతటి నీతి వాక్యాలు వల్లించే సదరు నేతకు క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్ల అక్రమాలు కనిపించకపోవడం విచారకరం. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశ పెట్టినా టీడీపీ నేతల చిలక్కొట్టుడుతో లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది.. నీరు-చెట్టు, పింఛన్లు, ఫారం పాండ్స్.. ఇలా ఒకటేమిటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్నీ పథకాల్లో అవినీతిదే సింహభాగం. దర్శి: నాడు సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం శ్మశానంలో కాపలా ఉండి దాన్ని కాపాడితే.. నేడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న తెలుగు తమ్ముళ్లు నీరు-చెట్టు పథకం పేరుతో శ్మశానాలను సైతం పూడ్చి నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు యత్నిస్తున్నారు. సదరు పథకం తమ్ముళ్లకు కాసుల వర్షం కురుపిస్తుండటంతో నిబంధనలకు నిలువునా నీళ్లొదులుతున్నారు. వాగులు, చెరువుల్లో పూడికలు తీసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం నీరు-చెట్టు పథకాన్ని ప్రవేశ పెట్టింది. తెలుగు తమ్ముళ్లు మాత్రం నిబంధనలు తమకు వర్తించవని శ్మశానాలను సైతం దున్నేస్తూ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకునే అధికారులు ఎలాగూ లేకపోవడంతో వారి అవినీతికి అడ్డే లేకుండా పోయింది. వివరాలు.. దర్శి మండలం యర్రఓబనపల్లి పంచాయతీ పరిధి అగ్నిపూరి కాలనీలో 20 ఏళ్లుగా 220 కుటుంబాలకు చెందిన ఎస్సీ,ఎస్టీలు నివాసముంటున్నారు. ఆ గ్రామ సర్వే నంబర్ 1,2లో ఐదెకరాలను చాలా ఏళ్లుగా శ్మశానం కింద వాడుకుంటున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నీరు-చెట్టు పథకాన్ని ఆసరా చేసుకుని శ్మశానంలో గుంతలు తీసేలా అధికారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనుమతి పొందారు. సమాధులున్నా పొక్లెయిన్‌తో కొండ వరకు తవ్వేశారు. సమాధులు కూల్చి మొత్తం చదును చేశారు. గ్రామస్తులంతా ఏకమై శనివారం రాత్రి టీడీపీ నేతలను అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన చింతా వెంకటేశ్వరరెడ్డి, చింతా వెంకటరామిరెడ్డి, పాలెం యోగిరెడ్డి, పేరం పోలిరెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై దౌర్జన్యానికి దిగారని పలువురు ఎస్సీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని, శ్మశానం జోలికి వస్తే ఊచకోత కోస్తామని హెచ్చరించారని బాధితులు వెంకటయ్య, జి.విల్సన్‌బాబు, పి.హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి కొందరు గ్రామస్తులు వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపినట్లు స్థానికుడు గుంటూరు వెంకటయ్య తెలిపారు. పూర్వీకుల ఆనవాళ్లు మాయం శ్మశానంలో తమ పూర్వీకుల సమాధులు మాయం చేశారని ఎస్సీలు జి.ఆదాం, టి.యలమంద, జి.ఏసు, కె.రమణమ్మ, మరికొందరు గ్రామస్తులు వాపోయారు. తమ పూర్వీకుల సమాధుల ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి చనిపోతే పూడ్చి పెట్టే ఆరడుగుల స్థలం కూడా లేకుండా చేస్తున్నారని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. మంత్రి వాదనేంటో? దర్శి నియోజకవర్గంలో పేదల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన శిద్దా రాఘవరావు ఈ విషయంలో పేదలకు ఏం చెబుతారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగడాలు అరికట్టాలని మంత్రిని కోరుతున్నారు. నీరు-చెట్టు పథకానికి చెరువులు, వాగులు, కుంటలకు నిధులు మంజూరు చేయాలిగానీ శ్మశానాల్లో నీరు-చెట్టు పనులు చేయడమేంటని నిలదీస్తున్నారు. నీరు-చెట్టు పనులపై దృష్టి పెట్టి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత మంత్రిపైనే ఉందని చెప్తున్నారు. మంత్రి స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే ఎస్సీ,ఎస్టీలను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
సంస్కృతానికి బదులు తెలుగు ప్రశ్నాపత్రం!
దర్శి (ప్రకాశం) : పదో తరగతి పరీక్షల సందర్భంగా ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నా పత్రం ఇచ్చిన ఇన్విజిలేటర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు మెదలైన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్లో సోమవారం ఉదయం ఇద్దరు విద్యార్థులకు సంస్కృతం ప్రశ్నా పత్రానికి బదులు తెలుగు ప్రశ్నా పత్రం వచ్చింది. కంగారులో ఈ విషయాన్ని పట్టించుకోని విద్యార్థులు పరీక్ష రాసే పనిలో బిజీ అయ్యారు. రెండు గంటల అనంతరం అసలు సంగతి గమనించిన విద్యార్థులు తమ ఆవేదనను డీఈవో దృష్టికి తీసుకెళ్లగా.. బాధ్యతారహితంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ ఆర్. శ్రీనివాస్‌రావును సస్పెండ్ చేశారు. -
భార్యను గొంతు కోసి చంపిన భర్త
దర్శి (ప్రకాశం జిల్లా) : దర్శి మండలం వెంకటాచలంపల్లి గ్రామంలో సోమవారం భార్యను గొంతు కోసి హత్య చేశాడు ఓ ప్రబుద్ధుడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భార్య అంకాల నర్సమ్మ(30) అక్కడికక్కడే మృతిచెందింది. నిందితుడు అంకాల నాగేశ్వరరావు పరారీలో ఉన్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.