ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా శనివారం ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.25 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... దర్శి అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి సిద్ధా రాఘవరావుకు చెందినదని వారు వెల్లడించారు. నగదుతో పాటు కారును సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.
అలాగే అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓటర్లుకు నగదు పంచుతున్న ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 20 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.