దర్శి (ప్రకాశం జిల్లా) : అక్రమంగా తరలిస్తున్న 13 ఇసుక ట్రాక్టర్లను దర్శి పోలీసులు సీజ్ చేశారు. వీరాయపాలెం వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న ఎస్‌ఐ సుబ్బారావు సిబ్బందితో కలసి సోమవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. 13 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.