దర్శి: జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని జిల్లాలకు యూనివర్సీటీ, పలు రకాల కేంద్ర సంస్థల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నారు కానీ
ప్రకాశం జిల్లాను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
జిల్లాలో దర్శి నియోజకర్గంలో ఎన్నికైన మంత్రి సొంత నియోజకవర్గమైన దొనకొండలో 55 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములున్నా గుంటూరు, విజయవాడ మధ్యలోనే రాజధాని అనడంపై విడ్డూరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ప్రకాశం జిల్లాపై ఎనలేని మమకారం ఉందని గుర్తు చేశారు. వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చెయ్యాలనే ఉద్ధేశ్యంతో జలయజ్ఞంలో భాగంగా రూ.700 కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లా తూర్పు భాగంలో వేలాది ఎకరాలు సాగులోకి తీసుకువచ్చిన ఘనత వైఎస్‌దే అన్నారు.
రూ.3 వేల కోట్లతో వెలుగొండ పనులు కూడా ప్రారంభించి జిల్లాను మొత్తం సస్యశ్యామలం చెయ్యాలని చూశారని, దుర దృష్ట వశాత్తు ఆయన మరణించటంతో ఆపనులన్నీ ఆగి పోయాయన్నారు. టిడీపీ ప్రభుత్వం గత బడ్జెట్‌లో వెలుగొండ ప్రాజెక్టుకు రూ.70 కోట్లు మాత్రమే ఇచ్చిందని, కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలకే ఈ డబ్బు సరిపోదని చెప్పారు. ప్రాజెక్టు పనులు జరగాలంటే రూ.200 కోట్లు నిధులైనా వెంటనే విడుదలయ్యేలా ప్రజలు చంద్రబాబుపై ఒత్తిడి తేవాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, నేను కార్యకర్తలకు అండగా ఉంటామని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
జిల్లా సమస్యలపై దృష్టి...
ఈ రెండు నెలల్లోనే తాగు నీటిపై జిల్లా కలెక్టర్‌ను నాలుగుసార్లు కలిశానన్నారు. నడికుడి శ్రీ కాళహస్తి రైల్వే లైనుకు రూ.10 కోట్లు బడ్జెట్ మంజూరు చేశారని చెప్పారు. కేంద్ర మంత్రిని కలసి రైల్వే లైను విషయం మాట్లాడానని, ఆర్ధిక మంత్రితో మాట్లాడి తర్వాత బడ్జెట్ ఎక్కువగా నిధుల కేటాయింపునకు మంత్రులు హామీ ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధర లేక 20 లక్షల క్వింటాళ్ల శీతల గిడ్డంగులలో మూలుగుతున్నాయని, వాటిని రైతులు అమ్ముకోలేక అప్పులు పెరిగి పోయి నానా అవస్థలు పడుతున్నారని అన్నారు.
రుణమాఫీ హామీతోనే మోసం
చంద్రబాబు తొలి సంతకం రుణ మాఫీపైనే పెట్టి కమిటీల కోసం ఆ సంతకాలు పెట్టామని కాలక్షేపం చేస్తూ రైతులకు మరలా రుణాలు రాకుండా చేశారన్నారు. జిల్లాలో రూ.770 కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ కావాల్సి ఉందని, ఈ విషయాన్ని అధికారనేతలెవ్వరూ పట్టించుకోవడం లేదని, మాఫీ విషయంలో భరోసా ఇచ్చేవారే కరవయ్యారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటకు కట్టుబడే వ్యక్తి అని, ఒక్కమాట రుణమాఫీ చేస్తానని చె ప్పి ఉంటే ఈ రోజున టీటీపీ ప్రతిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేదన్నారు.
బూత్ స్థాయి నుంచి కమిటీలు వేసి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు పార్టీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దర్శి నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ మూడు నెలలుగా టీటీపీ నాయుకుల ఆరాచకాలు పెరిగిపోతున్నాయన్నారు. పోలీసులు, అధికారులు టీడీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు.
శంఖరాపురంలో టిటీపీ నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి చేస్తే పోలీసుల పదోన్నతుకోసం సాటి ఎస్సైపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. . కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెవీ రమణారెడ్డి, విజయవాడ సెంట్రల్ సమన్వయ కర్త వెంకటేశ్వరరావు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు డీసీ క్రాంతి కుమార్, తాళ్లూరు ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ సభ్యుడు మారం వెంకటరెడ్డి, ఎంపీటీసీలు సోము దుర్గారెడ్డి, కేసరి శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కుమ్మిత అంజిరెడ్డి, యూత్ కన్వీనర్ వీసీరెడ్డి, నియోజకర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొళ్లా భాస్కర్, దర్శి, ముండ్లమూరు, కురిచేడు మండలా కన్వీనర్లు నర్లు వెన్నపూస వెంకటరెడ్డి, సుంకర బ్రహ్మానందరెడ్డి, రావుల పుల్లయ్య, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, ఎఎంసీ డెరైక్టర్ మిల్లర్ బుజ్జి, పట్టణ అధ్యక్షుడు పానుగంటి కోటేశ్వరావు, మహిళా నాయకురాలు సుశీలప్రతాప్, నాయకులు దామెర్ల చంద్రం, కొడవటి జాన్, కేవీరెడ్డి, సద్దిపుల్లారెడ్డి, మేడగం కోటిరెడ్డి, జింకల సుబ్బరామిరెడ్డి, నాగేశ్వరరావు, సుభాని, మజ్నువలి తదితరులు పాల్గొన్నారు.
ఆచరణ సాధ్యం కాని హామీలతో అందలమెక్కిన బాబు
కొండపి: ఆచరణ సాధ్యం కాని హామీలతో చంద్రబాబు అధికారాన్ని దక్కించుకున్నారని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్ధానిక పొదిలి రోడ్డులోని కల్యాణ మండపంలో మంగ ళవారం సాయంత్రం జరిగిన కొండపి నియోజకవర్గ స్ధాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ముందుగా తన విజయానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలు , నాయకులకు , ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇంత వరకు ప్రభుత్వం శనగ రైతు సంక్షేమం కోసం ఒక్క అడుగు ముందుకు వెయ్యలేదు.
శనగ దుస్ధితిపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసి వివరించినట్లు ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. జాబు కావాలంటే బాబు రావాలి అని ప్రచారం చేయించుకున్న చంద్రబాబు అందలమెక్కిన తరువాత రాష్ట్రంలో వందల మంది ఉద్యోగాలను ఊడగొడుతున్నారని తెలిపారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 1854 మంది ఆదర్శ రైతులతో పాటు వందల మంది యన్‌ఆర్‌ఈజియస్ సిబ్బంది, హౌసింగ్ సిబ్బందిని తొలగించటంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో కొండపికి సమన్వయకర్తను సైతం నియమించే విధంగా అందరి అభిప్రాయాలను తీసుకుంటామని తెలిపారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ నూకసాని బాలాజి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆరు మండలాల నుండి వచ్చిన కార్యకర్తలు , నాయకులు సైతం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపి వైవీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ నూకసాని బాలాజీని తాటిపర్తి చంద్రశేఖర్ ఘనంగా సన్మానించారు. వైయస్సార్‌సి.పి. జిల్లా యువజన అధ్యక్షుడు కె.వి. రమణారెడ్డి, టుబాకో బోర్డు మెంబర్ రావూరి అయ్యవారయ్య, పోతుల నరసింహరావు, డాక్టర్ అశోక్‌కుమార్‌రెడ్డి, కొండపి, జరుగుమల్లి మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు ఆరిక ట్ల వెంకటేశ్వర్లు , జయబాబు, పొన్నలూరు, టంగుటూరు, జరుగుమల్లి, మర్రిపూడి కన్వీనర్లు పాల్గొన్నారు.
జిల్లాపై బాబు చిన్నచూపు
Published Wed, Aug 27 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM
Advertisement