రైతులను పక్కకు తీసుకెళుతున్న పోలీసులు
దర్శి: మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులను దొంగ ఓట్లు వేయడానికి వచ్చారంటూ టీడీపీ నేతలు చితకబాదిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మార్కెట్ యార్డ్‌లో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. దొనకొండ నుంచి మార్కెట్ యార్డుకు కొందరు రైతులు పురుగు మందుల కోసం వచ్చారు. లోనికి వెళ్లగానే మీరు ఇక్కడి వాళ్లు కాదు.. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారా అంటూ టీడీపీ నేతలు చితకబాదారు. దీంతో దర్శిలో 13వ పోలింగ్ బూత్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
తాము దొంగ ఓట్లు వేయడానికి రాలేదని, మార్కెట్ యార్డ్‌కు పనిమీద వచ్చామని చెప్పినా వినిపించుకోలేదని బాధితులు నాగేశ్వరరావు, కోటిరెడ్డి, అంకయ్య తెలిపారు. తమను అసభ్య పదజాలంలో తిట్టారని వాపోయారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో బతికి బయట పడ్డామని చెప్పారు. వారిని కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. బాధిత రైతులు ఈ మేరకు దర్శి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment