దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలు
గణబాబు, శ్రీభరత్ చిత్రాలతో స్లిప్‌ల పంపిణీ
అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు
పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు
గోపాలపట్నం: టీడీపీ నాయకుల అరాచకాలు పోలింగ్ రోజు కూడా కొనసాగాయి. దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలు సాగించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచారు. అడ్డుకున్న వైఎసార్ సీపీనేతలపై దౌర్జన్యానికి దిగారు. గోపాలపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో టీడీపీ వ్యక్తి బూత్ లోపలికి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తుండడాన్ని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీకి చెందిన కార్యకర్త దాడికి తెగబడ్డాడు.
ఇదంతా చూసిన పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్పా ఆ వ్యక్తిని బయటకు పంపించలేదని విమర్శిస్తున్నారు. ఇదే విధంగా లక్ష్మీనగర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్తున్నానని చెప్పి ఓటు వేయకుండా లోపల క్యూలైన్లో ఉన్న వారిని ప్రలోభాలకు గురి చేసిన టీడీపీ కార్యకర్తను పోలీసుల సాయంతో బయటకు పంపించారు.
బుచ్చిరాజుపాలెంలో పలు చోట్ల టీడీపీ అభ్యర్థి గణబాబు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఫొటోలు ఉన్న స్లిప్‌లు ఓటర్లకు ఇచ్చారు. దీనిపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. అధికారులు వెళ్లి పోయిన తర్వాత తిరిగి వాటిని తీసుకు వచ్చి ప్రభావితం చేసేందుకు యత్నించారు. స్థానిక వైఎసార్ సీపీ నాయకులు దీన్ని అడ్డుకున్నారు. గతంలో మాదిరిగా దొంగ ఓట్లు వేసే అవకాశం లేకపోవడంతో టీడీపీ నాయకులు గొడవలకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment