fake votes
-
ఆగని టీడీపీ అరాచకాలు
గోపాలపట్నం: టీడీపీ నాయకుల అరాచకాలు పోలింగ్ రోజు కూడా కొనసాగాయి. దొంగ ఓట్లు వేయించేందుకు తీవ్ర యత్నాలు సాగించారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచారు. అడ్డుకున్న వైఎసార్ సీపీనేతలపై దౌర్జన్యానికి దిగారు. గోపాలపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో టీడీపీ వ్యక్తి బూత్ లోపలికి వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తుండడాన్ని గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీకి చెందిన కార్యకర్త దాడికి తెగబడ్డాడు. ఇదంతా చూసిన పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్పా ఆ వ్యక్తిని బయటకు పంపించలేదని విమర్శిస్తున్నారు. ఇదే విధంగా లక్ష్మీనగర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్తున్నానని చెప్పి ఓటు వేయకుండా లోపల క్యూలైన్లో ఉన్న వారిని ప్రలోభాలకు గురి చేసిన టీడీపీ కార్యకర్తను పోలీసుల సాయంతో బయటకు పంపించారు. బుచ్చిరాజుపాలెంలో పలు చోట్ల టీడీపీ అభ్యర్థి గణబాబు, ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ ఫొటోలు ఉన్న స్లిప్‌లు ఓటర్లకు ఇచ్చారు. దీనిపై ఎన్నికల అధికారుల ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. అధికారులు వెళ్లి పోయిన తర్వాత తిరిగి వాటిని తీసుకు వచ్చి ప్రభావితం చేసేందుకు యత్నించారు. స్థానిక వైఎసార్ సీపీ నాయకులు దీన్ని అడ్డుకున్నారు. గతంలో మాదిరిగా దొంగ ఓట్లు వేసే అవకాశం లేకపోవడంతో టీడీపీ నాయకులు గొడవలకు దిగారు. -
దొంగ ఓట్లూ పోయె.. పరువూ పాయె!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అడ్డూ అదుపూ లేకుండా అవకాశమున్న మేర అక్రమాలకు తెగబడితే ఏదో రోజు పట్టుబడి ఇట్టే ఇరుక్కు పోవడం ఖాయమన్న విషయం ఇప్పుడు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అవగతమైంది. తన నోవా అగ్రిటెక్ కంపెనీ మాటున ఎన్ఆర్ఐ, గ్రానైట్ నల్లధనంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిì ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏలూరి, ఆయన అనుచరులపైనా పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. సమగ్ర విచారణ జరిగితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. దీంతో ఏలూరి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. ఆయనకు నల్లధనం అందించిన ఆయన అనుచరులు బెంబేలెత్తి పోతున్నారు. కేసుల నమోదుతో ఎమ్మెల్యే వ్యవహారం పర్చూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. డైరీల్లో నిధుల వివరాలు! ఈ నెల 24న గుంటూరులో ఏలూరికి చెందిన నోవా అగ్రిటెక్ కార్యాలయంలో ఆర్డీఐ జరిపిన తనిఖీల్లో ఆయన ఖాతాలకు చేరిన నల్లధనం చిట్టాతోపాటు గత ఎన్నికల్లో పాల్పడిన అక్రమాల వ్యవహారం వెలుగుచూసింది. దీంతో ఇంకొల్లు పోలీసులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతోపాటు ఆయన కంపెనీ ఉద్యోగులపైనా 123(1), ఐపీసీ సెక్షన్ 171(ఇ) రెడ్‌విత్ 120(బి), సీఆర్పీసీ 155 (2) ల ప్రకారం కేసులు నమోదు చేసి లోతైన విచారణకు దిగారు. ఈ విచారణలో ఎమ్మెల్యే ఏలూరికి పెద్దఎత్తున నిధులు సమకూర్చే ఎన్ఆర్ఐలు, నియోజకవర్గంలోని గ్రానైట్ వ్యాపారుల అక్రమార్జన బయటపడే అవకాశం ఉంది. ఏలూరి కార్యాలయంలో దొరికిన డైరీల్లో ఆయనకు తరలివచ్చే నిధుల వివరాలు ఉన్నట్లు తెలిసింది. ఆయన అకౌంట్లకు వచ్చిన నిధులపైనా, గ్రానైట్ పరిశ్రమల ముడుపులపైనా పోలీసులు విచారణ జరపనున్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే, ఆయన కంపెనీ ప్రధాన ఉద్యోగులపై కేసులు నమోదు కావడంతో ఏలూరికి నిధులు సమకూర్చే ఎన్ఆర్ఐలు, గ్రానైట్ వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు. నిధుల వ్యవహారాలు బయటకు పొక్కితే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు. నిధులు ఇచ్చే ఎన్ఆర్ఐల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలో ఎన్ఆర్ఐలు అధికంగా ఉన్న గ్రామాలతోపాటు వారు ఉన్న దేశాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గంలోని మార్టూరు ప్రాంతంలో 250కి పైగా ఉన్న గ్రానైట్ పరిశ్రమలపైనా పోలీసులు విచారణకు దిగనున్నారు. గ్రానైట్ అసోసియేషన్ల నుంచి ఏలూరికి ముట్టిన ముడుపుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయనకు అతి సన్నిహితంగా ఉన్న గ్రానైట్ వ్యాపారుల బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తారు. ఏలూరి ఖాతాలకు, ఆయన నోవా అగ్రిటెక్ బ్యాంకు ఖాతాలకు వచ్చిన నిధుల వివరాలపైనా విచారణ జరుపుతారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత వచ్చిన నల్లధనం వివరాలను బట్టి ఆయా వ్యక్తులపైనా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దొంగ ఓట్లతోనే రెండు సార్లు గెలుపు! ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా ఏలూరి నియోజకవర్గ వ్యాప్తంగా 15 వేలకు మించి దొంగ ఓట్లను చేర్పించారు. ఇక్కడి వారికి చాలామందికి ఈ నియోజకవర్గంలోనే రెండు మూడు చోట్ల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో వారంతా పోలింగ్ నాడు పథకం ప్రకారం ఓట్లు వేయడం పరిపాటి. దొంగ ఓట్లు వేసేందుకు ఏలూరి ప్రత్యేక బ్యాచ్లనూ ఎంపిక చేస్తారు. నల్లధనంతో కోట్లు ఖర్చు చేసి అక్రమాలకు తెరలేపుతారు. ఓటుకు రూ.2 వేల నుంచి 5 వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేసిన ఉదాహరణలూ కోకొల్లలు. విపరీతంగా వచ్చిపడుతున్న అక్రమార్జన నిధులను వెచ్చించి ఎన్నికల అక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం ఆయనకు పరిపాటిగా మారింది. దీంతో ఆయన గత రెండు ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో సుమారు 10,775 ఓట్ల ఆధిక్యంతో, 2019 ఎన్నికల్లో కేవలం 1647 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే ఈ నియోజకవర్గంలో ఏలూరి గెలిచే అవకాశమే లేదన్నది ఓట్ల గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది. పర్చూరు నియోజకవర్గంలో దొంగ ఓట్లపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎన్నికల అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు దిగిన అధికారులు నియోజకవర్గంలోని సుమారు 12 వేలదొంగ ఓట్లను తొలగించారు. దొంగ ఓట్ల తొలగింపును అడ్డుకునేందుకు ఏలూరి కోర్టును సైతం ఆశ్రయించినా అది వీలుకాలేదు. -
బయటపడ్డ బాబు దొంగ నాటకం...
-
తప్పుడు సమాచారంతో కుట్ర..టీడీపీకి షాక్ ఇచ్చిన ఈసీ
-
ఏపీలో దొంగఓట్ల చేరికలో జనసేన భారీ కుట్ర
-
టీడీపీ ఓట్ల దందాపై సీఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
-
ఎల్లో బ్యాచ్ కొత్త ప్లాన్.. భారీ సంఖ్యలో బోగస్ ఓట్లు!
సాక్షి, అమరావతి: నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం కోల్పోయిన విపక్షం అడ్డదారులు పడుతోంది! రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల దొంగలు స్వైర విహారం చేస్తున్నారు! అధికార పార్టీ చేపట్టిన సామాజిక సాధికారయాత్ర, ఏపీకి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో వైఎస్సార్సీపీని ఒంటరిగా ఎదుర్కోవడం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేనతో చేతులు కలిపినా ఫలితం శూన్యమని గుర్తించారు. పొత్తుపై అధికారిక ప్రకటన తర్వాత పవన్ పర్యటనలు – లోకేశ్ పాదయాత్రకు స్పందన లేకపోవడమే దీనికి తార్కాణం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న టీడీపీ పెద్దలు 2019 ఎన్నికలకు మించి మరోసారి ఘోర పరాజయం తప్పదని పసిగట్టి దొడ్డిదారి పట్టారు! తమకు మాత్రమే సాధ్యమైన వ్యవస్థలోకి వైరస్‌లా చొరబడి చాపకింద నీరులా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. 40,76,580కిపైగా దొంగ ఓట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లో 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో సుమారు 40,76,580కిపైగా దొంగ ఓట్లను టీడీపీ నేతలు చేర్పించినట్లు ప్రజాసంఘాలు, రాజకీయ పరిశీలకులు గుర్తించారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను పలు నియోజకవర్గాల్లో ఒకే ఫోటోతో ఇంటి పేర్లు మార్చి జాబితాలో చేర్పించారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న తమ పార్టీ సానుభూతిపరుల పేర్లను సైతం రాష్ట్రంలోని ఓటర్ల జాబితాలో చేర్పించారు. ఒకే డోర్ నెంబర్‌పై వందల ఓట్లను నమోదు చేయించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 46,165 పోలింగ్ బూత్‌ల పరిధిలోనూ ఇదే కథ. ఇప్పటికీ దొంగ ఓట్లను నమోదు చేయించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు జీవించి ఉన్నా చనిపోయినట్లు, స్థానికంగా నివాసం ఉంటున్నా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినట్లు చిత్రీకరిస్తూ ఆ ఓట్లను తొలగించేందుకు కుప్పలు తెప్పలుగా ఫారం–7 దరఖాస్తులు సమర్పిస్తున్నారు. బీఎల్వోల (బూత్ లెవల్ ఆఫీసర్లు) విచారణలో ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. దాడులు.. బ్లాక్ మెయిల్ మరోవైపు ఫారం 7లపై విచారణ జరిపి దొంగ ఓట్లను ఆధారాలతోసహా తేల్చి ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్న బీఎల్వోలు, తహసీల్దార్లపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో శావల్యాపురం తహసీల్దార్‌పై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఇటీవల దాడికి తెగబడ్డారు. తాము చేర్పించిన దొంగ ఓట్లను తొలగించకుండా ఏకంగా కలెక్టర్లను సైతం టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, అంబేడ్కర్ కోనసీమ, గుంటూరు, అన్నమయ్య, బాపట్ల, తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లపై ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే అందుకు నిదర్శనం. 63 నియోజకవర్గాల్లో అసాధారణంగా పెరుగుదల సాధారణంగా ప్రతి వెయ్యి మంది జనాభాకు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వారు 721 మంది ఉంటారు. కానీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలిస్తే ప్రతి వెయ్యి మంది జనాభాకు 729 మంది ఓటర్లు ఉన్నారు. అంటే ప్రతి వెయ్యి మంది జనాభాకు సాధారణం కంటే ఎనిమిది ఓట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. సుమారు 63 నియోజకవర్గాల్లో ఓటర్లు అసాధారణంగా పెరిగారు. ఆ నియోజకవర్గాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకు 800 కంటే ఎక్కువ ఓట్లు ఉండటం గమనార్హం. దీన్ని బట్టి టీడీపీ నేతలు ఏ స్థాయిలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడ్డారో ఊహించవచ్చు. ఒకే వ్యక్తికి వేర్వేరు ఓటరు గుర్తింపు కార్డులతో 2019 జాబితాలో రెండు ఓట్లు ఉండగా 2023 ఓటర్ల జాబితాలోనూ వాటిని కొనసాగిస్తున్నారు. ఒకే ఇంటి నెంబరుపై టీడీపీ సానుభూతిపరుల ఓట్లను వందల సంఖ్యలో చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఒకే ఇంటి నెంబరుపై 50 కంటే ఎక్కువగా సుమారు 20 లక్షలకుపైగా దొంగ ఓట్లను చేర్పించారు. ప్రజాస్వామ్యం అపహాస్యం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండటం చట్టవిరుద్ధం. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ కీలకమే. ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మార్చేస్తుంది. గెలుపోటములను నిర్దేశిస్తుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని టీడీపీ 1995 నుంచే అలవాటుగా మార్చుకుంది. దేశంలో దొంగ ఓట్ల కార్ఖానాగా టీడీపీ గణతికెక్కింది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలోకి వైరస్‌లా చొరబడి భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ అదే కథ. ఆ దొంగ ఓట్లు అలాగే కొనసాగుతున్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గట్టెక్కుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. కుట్రలు ఛేదించి అధికారంలోకి.. టీడీపీ అధికారంలో ఉండగా ప్రజలకు సంబంధించిన డేటాను చౌర్యం చేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన చంద్రబాబు వాటిని సేవామిత్ర యాప్‌తో అనుసంధానం చేసి వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించారు. 2015లో 22,76,714, 2016లో 13,00,613, 2017లో 14,46,238 వెరసి 50,23,565 ఓట్లను చంద్రబాబు తొలగింపజేశారు. తనకు అలవాటైన రీతిలో అమలు చేసిన కుట్రను ప్రజాసంఘాలు బహిర్గతం చేశాయి. దీనిపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. అర్హుల ఓట్లను కూడా తొలగించినట్లు తేల్చిన ఎన్నికల అధికారులు 2019 ఎన్నికల నాటికి 31,97,473 ఓట్లను జాబితాలో చేర్చారు. దీంతో గత ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించి 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించింది. ఒక్కరే.. రెండు చోట్లా ► కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రెండో పోలింగ్ బూత్ పరిధిలో ఓటరు గుర్తింపు కార్డు నెంబరు ఎక్స్ఎన్సీ 1398916తో పిచ్చుక ఉమాదేవికి (ఇంటి నెంబరు 31–11–29) ఓటు ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 157వ పోలింగ్ బూత్ పరిధిలోనూ ఓటరు కార్డు నెంబరు టీఎంవో 1763820తో ఆమెకు మరో ఓటు ఉంది. ► విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పోలింగ్ బూత్ 127 పరిధిలో యాగంటి ఆదిలక్ష్మికి ఏక్యూడబ్ల్యూ 0892779 గుర్తింపు కార్డు నెంబర్‌తో ఓటు ఉండగా అదే నియోజకవర్గం పోలింగ్‌బూత్ 128 పరిధిలో ఏక్యూడబ్ల్యూ 0308692 గుర్తింపు కార్డు నెంబరుతో ఆమెకు మరో ఓటు ఉంది. హైదరాబాద్ ఓటర్లు.. ఏపీలోనూ ఓట్లు సరిహద్దు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో నివాసం ఉంటూ అక్కడ ఓటు హక్కు ఉన్న టీడీపీ సాను భూతిపరుల పేర్లను ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ ఓటర్లుగా చేర్చారు. హైదరాబాద్‌లో నివసిస్తూ అక్కడ ఓటర్లుగా నమోదైన 4.50 లక్షల మందికిపైగా ఏపీలోనూ పలు నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్నారు. నాడు.. ఐదు లక్షల దొంగ ఓట్లతో రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలో సుమారు 35 లక్షలకుపైగా దొంగ ఓట్లు ఉన్నట్లు ప్రజాసంఘాలు గుర్తించాయి. ఆ ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ దొంగ ఓట్లను తొలగించి ఉంటే 2014లోనే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని అప్పట్లోనే ప్రజా సంఘాలు, రాజకీయ పరిశీలకులు తేల్చిచెప్పారు. -
AP: టీడీపీ నిర్వాకం.. డూప్లి‘కేట్స్’..!
ఈ ఫొటోలోని చండ్ర సరళ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పదవిలో ఉన్నారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెనాలి మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఈమె నెల్లూరు జిల్లా పామూరుపల్లి కోడలు. అయితే పుట్టినిల్లైన తెనాలిలోనూ ఆమెకు ఓటుంది. ఇంటి పేరు మార్పుతో రెండు చోట్లా ఓటరుగా కొనసాగుతున్నారు. జాస్తి సరళ పేరుతో తెనాలిలో ఓటరుగా నమోదు చేసుకోగా చండ్ర సరళ పేరుతో పామూరుపల్లిలో ఓటు హక్కు పొందారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ ఎంతో కీలకం! ఒకే ఒక్క ఓటు సైతం అభ్యర్థుల తలరాతలను తారుమారు చేస్తుంది! గెలుపోటములను నిర్దేశిస్తుంది! ఒకపక్క ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడుతున్న విపక్ష టీడీపీ మరోపక్క చాపకింద నీరులా దొంగ ఓట్ల నమోదుకు బరి తెగించింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుల దొంగ ఓట్ల బాగోతం బహిర్గతమైంది. పలువురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లోనూ ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఓటర్ల జాబితా పరిశీలన, నమోదు, తొలగింపు, సవరణ లాంటి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన పలువురు రెండు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు బయటపడింది. అక్కడా ఉంటారు.. ఇక్కడా ఉంటారు! నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని పామూరుపల్లి 300 ఓటర్లు ఉండే చిన్న గ్రామం. అక్కడ టీడీపీ మద్దతుదారులకు సంబంధించి 30 ఓట్ల డబుల్ ఎంట్రీ వ్యవహారం తాజాగా బయటపడింది. గ్రామంలో ఓటు హక్కు ఉన్న చింతగుంపల ప్రసాద్, చింతగుంపల అరుణ, చింతగుంపల ముఖేష్‌కు కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం రాచెరువురాజుపాలెం గ్రామంలోనూ ఓటర్లుగా నమోదయ్యారు. చండ్ర చలపతిరావు, చండ్ర సరళకు పామూరుపల్లిలో పాటు తెనాలిలోనూ ఓట్లు ఉన్నాయి. చండ్ర ఈశ్వరమ్మకు వరికుంటపాడులోనే రెండు చోట్ల ఓట్లు ఉండటం గమనార్హం. వివాహమై అత్తారింటికి వెళ్లిన కొందరు మహిళలకు అటు మెట్టినింట్లోను, ఇటు పుట్టింటిలోనూ 2 చోట్ల ఓట్లున్నాయి. సోమిరెడ్డి – నారాయణ కుట్రలు ► సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలలో 11,291 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి తన అనుచరులతో ఫారం–7 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయించారు. వెరిఫికేషన్ సమయంలో అనుమానం రావడంతో పరిశీలించగా టీడీపీ నేతలు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. ► ఇదే తరహాలో నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీమ్ ప్రయత్నించింది. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను ఆన్లైన్లో ఫారం–7 ద్వారా తొలగించేందుకు దరఖాస్తు చేయించారు. అయితే నెల్లూరు కార్పొరేషన్ నుంచి సంబంధిత ఓటర్లకు సమాచారం వెళ్లడంతో ఈ కుట్రలు విఫలమయ్యాయి. నెల్లూరు నగర నియోజకవర్గం జనార్దన్‌రెడ్డి కాలనీ పోలింగ్ బూత్ నెంబర్ 10లో గౌస్‌బాషా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కావడంతో అతడి ఓటును తొలగించేందుకు ఎల్లో గ్యాంగ్ ఆన్లైన్లో ఫారం–7 ద్వారా దరఖాస్తు చేసింది. బూత్ నెంబర్ 9లో ఎస్ మస్తాన్, పెల్గగరి దేవయానం మృతి చెందినట్లు పేర్కొంటూ ఓటర్లుగా తొలగించేందుకు ఫారం–7 ద్వారా దరఖాస్తు చేశారు. -
బోగస్ ఓట్లకు బాబు బ్రాండ్ అంబాసిడర్ లా మారాడా ?
-
బోగస్ బాబు బాగోతం
-
టీడీపీ దొంగ ఓట్ల కుట్రలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం: మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో ఓటు వేసినవారితో కూడా ఏపీలో కూడా ఓటు వేయించేందుకు చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. డబల్ ఎంట్రీ ఓట్లను తొలగించాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్లకు వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. డబుల్ ఎంట్రీ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. -
టీడీపీ నేత ప్రవీణ్ ఇంట్లో దొంగ ఓట్లు..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్ రెడ్డిపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీ ఫిర్యాదు చేశారు. ప్రవీణ్‌తో పాటు ఆయన కుటుంబీకులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలతో సహా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. సొంత గ్రామం కోగొట్టంతో పాటు ప్రొద్దుటూరులోనూ ఓట్లు ఉన్నాయని, ఒక్క చోటే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫారం7లో భూమిరెడ్డి వంశీ ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో టీడీపీ నాయకులు దొంగ ఓట్లు చేర్చడంపై భూమిరెడ్డి వంశీ మండిపడ్డారు. ప్రవీణ్, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకు రెండు చోట్ల ఓట్లు సిగ్గుచేటు. దొంగ ఓట్లు అంటూ వైఎస్సార్సీపీని విమర్శించే ప్రవీణ్‌కి తన దొంగ ఓట్లు కనిపించలేదా?. తన ఇంట్లో దొంగ ఓట్లు పెట్టుకుని.. దొంగ ఓట్లు తొలగించాలంటూ అధికారులకు ఎలా ఫిర్యాదు చేస్తారు?. తక్షణం ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఓట్లపై అధికారులు చర్యలు చేపట్టాలని వంశీ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు -
దొంగ ఓట్ల దొంగలెవరు?
మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగబోతోంది. ఈ క్రమంలో దొంగ ఓట్ల అంశం మళ్లీ తెరపైకి రావడంతో ఓటర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే దొంగ ఓట్లకు సంబంధించి పోటాపోటీగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసలు దొంగ ఓట్లను ఎవరు ప్రోత్సహిస్తున్నారన్న దానిపై పలు కోణాల్లో అనేక మంది విశ్లేషణలు చేశారు. అయితే, ఎవరైనా దొంగతనం చేసినప్పుడు భయపడటం పరిపాటి. అదే పరిస్థితి తెలుగుదేశం ఎదుర్కొంటోంది. టీడీపీ పాలన కాలం నుంచి తమకు తెలియకుండా తమ ఇంటి నెంబరుతో కొన్ని ఓట్లు చలామణిలో ఉండటాన్ని ఇప్పుడు తెలుసుకుని ఇంటి యజమా నులు విస్తుపోతున్నారు. ఇదెలా సాధ్యమంటూ ముక్కున వేలేసు కుంటు న్నారు. ‘ఓటర్ల జాబితాల్లో అక్రమాలు’ అంటూ గావు కేకలు పెట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు మౌనం దాల్చడం అనుమానా లకు తావిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవడం కోసం పక్కనే ఉన్న తమిళనాడుకు చెందిన వందల మంది పేర్లను తన నియోజకవర్గంలో చేర్పించారన్న అపవాదు ఉండనే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ నకిలీ ఓటర్ల అంశం తెరపైకి రావడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయనీ, వాటిని సరిదిద్దాలనీ, ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్లను కలసి ఫిర్యాదు చేసింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో కలెక్టర్లకు వైసీపీ నుండి ఫిర్యాదులు అందాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని తమకు తెలిసిందనీ, వీటిని సరిదిద్దాలనీ వైసీపీ కోరింది. 2019కు ముందు నుంచే ఒకే డోర్ నెంబర్లో 50 నుంచి 100 ఓట్ల వరకు ఉన్నాయని వైసీపీ ఫిర్యాదులో పేర్కొంది. అదే విధంగా ఒకే వ్యక్తి ఏపీలోనూ, తెలంగాణ లోనూ రెండుచోట్లా ఓటుహక్కు కలిగి వున్నారని వివరించింది. ఒకే వ్యక్తికి మున్సిపల్ ఏరియాలోనూ, గ్రామంలోనూ, వేరు వేరు నియోజకవర్గాల్లో కూడా ఓటుహక్కు ఉందని పేర్కొంది. తమ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయనీ, ఆ చిరునామాలలో ఉంటున్న వారిని అడగగా తమకు ఈ విషయం తెలియదని చెబుతున్నారనీ వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ఉద్దేశ్యపూర్వకంగా దొంగ ఓట్లను చేర్చారనీ, ముసాయిదా జాబితా విడుదలైన తర్వాత ఇలాంటి ఓట్ల అవకతవకలు, బోగస్ ఓట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా తుదిజాబితా విడుదలకు ముందు ఇలాంటి బోగస్, అక్రమ ఓట్లపై విచారణ జరిపి ప్రజాస్వామ్యయుతంగా అర్హులైన ప్రతి ఓటరుకూ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకునేందుకు ఈసీ ఉపక్రమించబోతోందని తెలుస్తోంది. ఓటర్ల ఓట్లను ఇంటింటికీ వెళ్లి పరిశీలిస్తున్న టీడీపీ కార్యకర్తలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేయడం చట్ట విరుద్ధం. వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడమే కాక టీడీపీ యాప్‌లో సేకరించిన సమాచారాన్ని ఎక్కించే మిషతో టెలిఫోన్ నెంబర్ తీసుకుని ఓటీపీ సైతం అడుగు తున్నారని అన్నమయ్య జిల్లాలో ప్రజలు వాపోతున్నారు. ఓటీపీ కాని, వ్యక్తిగత సమాచారం కాని ఇవ్వని వారిపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని కూడా అనేక మంది చెబుతున్నట్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందుతున్నాయి. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఓ ఇంట్లోకి వెళ్లి సమాచారం అడగటం... వారు ఇవ్వటానికి ఇష్టపడక పోవడంతో వారిపై దౌర్జన్యానికి దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బాబు భరోసా, భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడానికి సమాచారం అడిగారనీ, 2024లో టీడీపీ ప్రభుత్వం రానుందని ప్రజలను మభ్యపెడుతూ మోసగిస్తున్నారని అనేక చోట్ల ప్రజలు బహిరంగంగానే అంటున్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించకుండా చూడటంతో పాటు దౌర్జన్యాలను అరికట్టడం ఇప్పుడు ఎన్నికల సంఘం ముందున్న తక్షణ కర్తవ్యం. అలా చేసినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుంది. దొంగ ఓట్లను అరికట్టడానికి ఆధార్ కార్డును అనుసంధానం చేయడం ఉత్తమమైన మార్గం. ఈ విధానాన్ని ఇటీవలికాలంలో తెలంగాణ ఎన్నికల సంఘం ప్రారంభించింది. అయితే, మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకో ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడానికి, దొంగ ఓట్ల గోల పోవడానికి ఇది ఎంతో మేలు చేకూర్చే అంశం. వైసీపీపై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్న తెలుగుదేశం పార్టీగానీ, ఆ పార్టీని భుజాన వేసుకుని మోసే మీడియా కానీ ఈ ప్రతిపాదనపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావట్లేదు. ఇలా కోరడానికి కూడా నిజంగా ధైర్యం ఉండాలి. తాము తప్పు చేయనప్పుడు భయమెందుకు అన్న రీతిలోనే వైసీపీ అధినేత జగన్ ఈ కార్యక్రమానికి తెరతీశారు. ఆ ధైర్యం మాత్రం తెలుగుదేశం పార్టీ అధి నేత చేయలేకపోతున్నారంటే ఏమను కోవాలి. ఆయనే దొంగ ఓట్లను ప్రోత్స హిస్తున్నారనుకోవాల్సి వస్తోంది. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో అటు తమిళనాడు, ఇటు కర్ణాటకల నుండి పెద్ద ఎత్తున (వేలల్లో) ప్రజల పేర్లను చేర్పించిన తాను తన కేడర్‌కు ఏం చెబుతారన్నది బహిరంగ రహ స్యమే. ‘ఆవు చేలో మేస్తే .. దూడ గట్టున మేస్తుందా’ అన్న సామెత ఇందుకు అతికినట్లు సరిపోలుతుంది. వివేకవంతులైన ఓటర్లు ఈ తంతు అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటి నుండే వారి వారి ప్రాంతాల్లో నివాసం లేని అనేకానేక మంది పేర్లను గుర్తించి బహిరంగ పరుస్తున్నారు. ఇది నిజంగా ప్రజల్లో వచ్చిన చైతన్యం. ప్రజల్లో ఈ తరహా చైతన్యం రావడం స్వాగతించదగ్గ పరిణామం. గ్రామాలు, వార్డులు, పట్ట ణాలు ఇలా... అన్ని చోట్లా తమకు తెలియని ఓటర్లు ఉంటే వెంటనే గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టేలా ప్రజలు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డా‘‘ పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మొబైల్: 98481 05455 -
కుప్పంలో బాబు ఓడిపోయినట్లే..బయటపడ్డ దొంగ ఓట్ల బాగోతం !
-
ఇక్కడే చంద్రబాబు అండ్ కో దొరికిపోయింది..!
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాపై వివాదం సృష్టించి ప్రజలలో అనుమానాలు కలిగించడానికి ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు ఈనాడు , ఆంధ్రజ్యోతి తదితర టీడీపీ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. దేశంలో ఎక్కడా బోగస్ ఓట్లు ఉండకూడదు. అలాగే అర్హత కలిగిన ఏ ఒక్కరూ ఓటును కోల్పోరాదు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. కాని ఏదో రకమైన సందేహాలు వ్యాప్తి చేయాలన్న లక్ష్యంతో వీరు చేస్తున్న గోలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి కౌంటరే ఇచ్చిందని చెప్పాలి. ప్రతి ఓటును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని ఆ పార్టీ సూచించింది. ఇది నిజంగా ఆహ్వానించదగ్గ సూచన. ఇప్పటికే ఎన్నికల సంఘం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా, న్యాయపరమైన కొన్ని అడ్డంకులు ఎదురవుతుండడం దురదృష్టకరం.హైదరాబాద్‌లో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటికి తిరిగి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అనుసంధానం అయ్యేలా ప్రయత్నాలు చేశారు. ✍️మరి మిగిలిన చోట్ల ఎందుకు అలా జరగడం లేదో తెలియదు. కాని ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడానికి,దొంగ ఓట్ల గోల పోవడానికి ఇది అత్యవసరం. వైసీపీపై ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్న తెలుగుదేశం పార్టీకాని, ఆ పార్టీని భుజాన వేసుకుని మోసే మీడియా కాని ఈ ప్రతిపాదనపై ఎందుకు స్పందించడం లేదు? తెలుగుదేశం నేతలు కూడా ఒక ప్రతినిధి బృందంగా ఎన్నికల ముఖ్య అధికారిని, అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఓటర్ కార్డుకు ఆధార్ కార్డుకు లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని ఎందుకు అడగడం లేదు? ఇక్కడే దొరికిపోతున్నారు. వీరికి చిత్తశుద్ది లేదని అర్ధం అయిపోతుంది. ఓటర్ కార్డును ఆదార్ కార్డును లింక్ చేయడం వల్ల ఒక ఓటరు రెండు చోట్ల ఓట్లు పొందే అవకాశం పోవచ్చు. ✍️ఇతర రాష్ట్రాలలో నివసిస్తూ ,అక్కడ ఆధార్ కార్డు ఉండి, ఓటు మాత్రం ఏపీలో ఉంటే వాటిని అరికట్టవచ్చు. కొందరు రెండు రాష్ట్రాలలో ఓట్లు వేస్తుంటారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి వందలాది బస్ లలో ఓటర్లను తరలిస్తుంటారు. వారిని దొంగ ఓట్లుగా పరిగణించాలా? లేక మరో రకంగా చూడాలా? వీరికి ఓటు కు ఇంత అని చొప్పున డబ్బు కూడా ఇస్తుంటారు. ఈ మొత్తం ఇటీవలికాలంలో రెండువేల రూపాయల వరకు వెళ్లింది. వీటన్నిటికి ఉన్న ఒక మందు ఆధార్ కార్డుతో ఓటర్ ఐడిని అనుసంధానం చేయడం. ఈ సూచన చేయడానికి నైతికంగా ధైర్యం ఉండాలి. ఆ పని వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయగలిగింది. వారికి తమ మీద తమకు నమ్మకం ఉండడం వల్ల, ప్రజలలో తమకు మద్దతు ఉందన్న విశ్వాసం వల్ల ఈ ప్రతిపాదనన చేసి సిఈఓ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఓటర్ల జాబితాలలో ఉన్న అక్రమాలను అధికారులు సరిచేస్తుంటే, దానిపై టీడీపీ గగ్గోలు పెడుతోందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీది ప్రత్యేక రికార్డే అని చెప్పాలి. ✍️ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గమైన కుప్పంలోనే వేలాది బోగస్ ఓట్లను చేర్పించారన్నది బహిరంగ రహస్యమే.కర్నాటక, తమిళనాడు సరిహద్దు గ్రామాల నుంచి కూడా ఓటర్లను తెచ్చి కుప్పంలో చేర్పించారట. అంటే వారు తమ సొంత రాష్ట్రంతో పాటు కుప్పంలో కూడా ఓట్లు వేస్తుంటారన్నమాట. ఇది చట్ట విరుద్దం. ఈ బోగస్ ఓట్లతోనే చంద్రబాబుకు అత్యధిక మెజార్టీ వస్తుంటుందని వైసీపీ తరచుగా విమర్శిస్తుంటుంది. గతంలో ఇక్కడ పోటీచేసిన మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి దొంగ ఓట్లను తొలగించడానికి విశ్వయత్నం చేశారు.కాని పూర్థి స్థాయిలో చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో ఈ బోగస్ ఓట్లను తొలగించడానికి యత్నిస్తున్నారు. ముందుగా దీనికి చంద్రబాబు జవాబు చెప్పగలగాలి.ఇంత అనుభవం కలిగిన నేత తన నియోజకవర్గంలోనే కనీస నిజాయితీతో వ్యవహరించకపోతే , ఇతరులకు ఆయన నీతులు చెప్పడం అనైతికం అవుతుంది. ✍️ఇతర టీడీపీ నేతలకు కూడా ఇలాంటి ఆలోచనలే ఆయన ఇస్తుంటారని అనుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు సేవామిత్రలని కొంతమందిని ఆయా నియోజకవర్గాలకు పంపించి, వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు మద్దతుదారులు అనుకుంటే వారి ఓట్లను తొలగిస్తున్న విషయాన్ని అప్పట్లోనే కనుగొన్నారు.దానిపై ఆందోళనకు దిగి కొంత కంట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు కన్నా ఈనాడు, ఆంద్రజ్యతి వంటివి మరీ ఎక్కువ గొడవ చేస్తూ వైసీపీపై బురద చల్లుతున్నాయి. ఎక్కడైనా దొంగ ఓట్లు ఉంటే వాటి గురించి రాయడం తప్పు కాదు. కాని ఆ మొత్తం అంతా వైసీపీపై నెట్టడమే దారుణంగా ఉంటుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు కొందరు బోగస్ ఓట్లపై ఒక ఫిర్యాదును సిఈఓకి అందచేశారు. పలు చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒక అడ్రస్ లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడితో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని వారు అధికారికి వివరించారు. విశేషం ఏమిటంటే టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ఇలాంటి ఓట్లను తొలగిస్తుంటే, అక్రమంగా టీడీపీ ఓట్లు తీసేస్తున్నారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. ✍️అదే వైసీపీ ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గాలలో ఎక్కడైనా బోగస్ ఓట్లు ఉంటే అవన్ని వైసీపీనేనని ప్రచార చేయడం అలవాటుగా మారింది. 2023 ఓటర్ల జాబితాను పరిశీలిస్తే, పేరు,అడ్రస్ లలో కొద్ది మార్పులు, పోటో మార్పు, ఒకరికే రెండు,మూడు చోట్ల నమోదు అవడం వంటివి చూస్తే సుమారు నలభై లక్షల మేర ఉన్నాయని వైసీపీనేతలు ఫిర్యాదు చేశారు. అలాగే తెలంగాణ,ఏపీ రెండు రాష్ట్రాలలో రెండు చోట్ల ఉన్న ఓట్ల సంఖ్య పదహారు లక్షల ఓట్లు ఉన్నాయని వీరు లెక్కగట్టారు. కొన్ని ఇళ్లలో వందకు మించి ఓట్లు ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వాటిలో అత్యధికం తెలుగుదేశం హయాం నుంచి ఉన్నాయని వైసీపీ సాధికారికంగా ఫిర్యాదు చేసింది. కాని ఈనాడు, జ్యోతి వంటివి మాత్రం అవన్ని ఇప్పుడే చేర్చినట్లు దుష్ప్రచారం చేస్తుంటాయి. ✍️2019 ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలను అప్పుడే పిర్యాదు చేసినా, అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు వాటిని సరిచేస్తుంటే తెలుగుదేశం గగ్గోలు పెడుతోందన్నది వీరి వాదన. నిజంగానే ఎక్కడైనా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పోతే , ఆ విషయాన్ని గుర్తించిన వెంటనే సంబంధితర ఫారం పూర్తి చేసి మళ్లీ ఓటు పొందవచ్చు.కాని అలాకాకుండా బోగస్ ఓట్లు కూడా యధావిధిగా కొనసాగాలన్నట్లుగా ప్రతిపక్షం కాని, వారికి మద్దతు ఇచ్చే మీడియా కాని వ్యవహరించడమే చోద్యంగా కనిపిస్తుంది.మరో విషయం ఏమిటంటే తెలుగుదేశం ఆరోపిస్తున్న విధంగా వేలాది ఓట్లను అక్రమంగా తొలగిస్తుంటే, ఓటర్ల సంఖ్య తగ్గాలి కదా? అలాకాకుండా గతంలో ఉన్నట్లుగానే దాదాపు నాలుగు కోట్ల ఓట్లు అలాగే ఉన్నాయి. ✍️అయినా టీడీపీ ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. వీటన్నిటికి పరిష్కారంగా ఓటర్ ఐడి కార్డుకు,ఆధార్ కార్డును అనుసంధానం చేయడమే సరైనది అని చెప్పాలి. ఇదే విషయాన్ని వైసీపీనిర్దద్వందంగా ప్రకటించగా, టీడీపీ ఎందుకు వెనుకాడుతోంది?చంద్రబాబు ఏమి చేసినా డబుల్ గేమ్ గానే చేస్తుంటారు. తాను బోగస్ ఓట్లను చేర్పించి,ఎదుటివారిపై ఆరోపణ చేస్తుంటారు. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ముఖ్య అధికారి వద్దకు వెళ్లి నానా రచ్చ చేశారు. అదే ఇంకెవరైనా వెళితే వారికి అధికారులను గౌరవించడం తెలియదని విమర్శిస్తుంటారు.తాను ఓడిపోతే ఈవిఎమ్ ల లో మోసం జరిగిందని అంటారు. అదే తాను గెలిస్తే మాత్రం ఆ ఊసే ఎత్తరు. ప్రస్తుతం దొంగ ఓట్లు అంటూ పెద్ద గొంతుతో అరిస్తే, రేపు ఎన్నికలలో ఓటమి ఎదురైనా, ఎన్నికలలో అక్రమాలు జరిగాయని ప్రచారం చేయాలన్నది వారి ఉద్దేశం కావచ్చు. లేదా తాము ఆశించిన రీతిలో టీడీపీ బోగస్ ఓట్లు అన్ని పోతున్నాయన్న దుగ్ద కావచ్చు. ఏది ఏమైనా కేంద్ర ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థను ఒప్పించి దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనడం అవసరం అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బోగస్ ఓట్ల ఏరివేతపై బోగస్ బాబులో ఆందోళన
-
నకిలీ ఓట్ల వ్యవహారంపై నెల్లూరు YSRCP నేతలు మండిపడ్డారు
-
దొంగ ఓట్ల ఆరోపణలపై విశాఖ వైఎస్ఆర్ సీపీ నేతల ఆగ్రహం
-
ప్రతి ఓటరూ ఆధార్‌తో లింక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేష్‌కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించడంతోపాటు ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఈవో ముఖేష్‌కుమార్ మీనాను మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, పార్టీ నేత దేవినేని అవినాశ్‌తో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కలిసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడీతో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని సీఈవో దృష్టికి తెచ్చామన్నారు. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. ప్రతి ఓటరునూ ఆధార్‌తో అనుసంధానం చేయాలన్న తమ విజ్ఞప్తిపై సీఈవో సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రమిస్తున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అక్రమాలు టీడీపీ సర్కార్ నిర్వాకాలే.. ఓటర్ల జాబితాలను ప్రభుత్వం మార్చేస్తోందంటూ గత 15 రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2017, 2018, 2019 ఓటర్ల జాబితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2023లో ఓటర్ల జాబితా ఎలా ఉందనే విషయాన్ని సీఈవోకి ఉదాహరణలతో సహా తెలియచేశాం. పేరులో చిన్న మార్పు, అడ్రస్‌లో చిన్న మార్పుతో ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. అలా 59,18,631 ఓట్లు ఉన్నట్లు 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇవాళ 2023 జాబితాను చూస్తే పేరు, చిరునామాలో చిన్న మార్పులు, ఫోటోల మార్పుతో.. ఒకే మనిషికి రెండు మూడు చోట్ల దాదాపు 40 లక్షల ఓట్లు ఉండగా.. తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓట్లున్న వారు దాదాపు 16.59 లక్షల మంది ఉన్నారు. ► 9,242 ఇళ్లలో 20 నుంచి 30 ఓట్ల వరకు ఉండగా 2,643 ఇళ్లలో 31 నుంచి 40 ఓట్ల వరకు ఉన్నాయి. 1,223 ఇళ్లలో 41–50 ఓట్లున్నాయి. ఇంకా 1,614 ఇళ్లలో 51–100 వరకు ఓట్లున్నాయి. 386 ఇళ్లలో 101–200 ఓట్లున్నాయి. 96 ఇళ్లలో 201 నుంచి ఏకంగా 500 వరకు ఓట్లున్నాయి. 14 ఇళ్లలో 501 నుంచి 1,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ 2019 ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయి. ఇక ఏ డోర్ నెంబరూ లేకుండా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లున్నాయో కూడా సీఈవోకు వివరించాం. 2019లో కూడా ఆ ఓట్లపై చర్యలు తీసుకోవాలని మేం కోరినా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఓటర్ల జాబితాను సవరించాలని సీఈవోను కోరాం. నాడు కళ్లు మూసుకున్నావా రామోజీ? ► ఒకే డోర్ నెంబరుతో 500 ఓట్లున్నాయని ఈనాడు రామోజీరావు మమ్మల్ని నిందిస్తున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం విజయవాడ సూర్యారావుపేట పోలింగ్ బూత్‌ను పరిశీలిస్తే కడియాలవారి వీధి పేరుతో ఉన్న డోర్ నెంబర్లో 2019లో కూడా 500 ఓట్లు ఉన్నాయి. మరి ఆ ఆషాఢభూతి ఇప్పుడు కొత్తగా ఓట్లు చేర్చారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. పాపాలు చేసింది వారైతే నిందలు మోపేది మాపైనా? ► రేపల్లెలో ఎడాపెడా దొంగ ఓట్లున్నాయని ఒక పేపర్లో రాశారు. నిజానికి అది 2019 నాటి ఓటర్ల జాబితా. అప్పుడే అవకతవకలు చేశారు. ఒకే డోర్ నెంబర్లో 148 ఓట్లు న్నాయి. జర్నలిస్టుల ముసుగులో కుల పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఆ అవకతవకలన్నీ 2019 ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మరి ఆనాడు ఎందుకు వార్తలు రాయలేదు? ► పార్వతీపురం నియోజకవర్గంలో సున్నా నెంబర్ ఇంట్లోనూ వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మరి ఆనాడు మీకు ఇవేవీ కనిపించలేదా? ధృతరాష్ట్రుడిలా రామోజీకి కళ్లు కనిపించలేదా? ► 2019లోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అప్పుడే మేం వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వాటిని ఇప్పుడు మేం సవరిస్తుంటే దొంగ ఓట్లు చేరుస్తున్నామంటూ నిందిస్తున్నారు. జాబితాలో పెరిగిందెక్కడ? రాష్ట్రంలో 2019 జనవరి నాటికి 3,98,34,776 మంది ఓటర్లు ఉండగా 2023 జనవరి నాటికి 3,97,96,678 మంది ఓటర్లున్నారు. మరి అలాంటప్పుడు మేం కొత్తగా ఓటర్లను ఎక్కడ చేర్పించినట్లు? మేం నిజంగా ఆ పని చేసి ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాలి కదా? గజదొంగ చంద్రబాబు దొంగతనాలు చేసి నీతికధలు చెబుతున్నాడు. ఓటమి భయంతో మాపై ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలను కాకుండా కుట్ర రాజకీయాలను నమ్ముకున్న చంద్రబాబును సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తున్నాయి. డూప్లికేట్లనే తొలగించామని సీఈవోనే చెప్పారు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొంగ ఓట్లను గుర్తించి 2020లో 1,85,193 ఓట్లను తొలగించింది. 2021లో 1,11,076 ఓట్లు, 2022లో 11.23 లక్షల ఓట్లు వెరసి మొత్తం 14 లక్షలకు పైగా దొంగ ఓట్లను తొలగించారు. డూప్లికేట్ ఓట్లు, ఒకే ఫోటో ఉన్న ఓట్లకు సంబంధించి 10,52,326 ఓట్లను తొలగించినట్లు సీఈవోనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఒకవేళ మేం దొంగ ఓట్లను చేర్పిస్తే ఇలా తొలగిస్తామా? ఆ నీచ రాజకీయం బాబుదే.. రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితాలే ఇవాళ్టికి కూడా కొనసాగుతున్నాయి. ఆ లోపాలను సవరించమని మేం కోరుతున్నాం. దొంగ ఓట్లను చేర్చడం.. అవతల పార్టీ ఓట్లను తొలగించడం చంద్రబాబుకే అలవాటు. తప్పుడు మార్గాల్లో గెలవాలని ప్రయత్నించడం ఆయనకు ఆనవాయితీ. ► తెలంగాణకు చెందిన బీజేపీ నేత బండి సంజయ్ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాడు. చంద్రబాబు కోసం ఆయన పని చేస్తున్నారు. ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు? ► నాడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అంటే 2015 జనవరి నాటికి 22,76,714 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరో ఏడాదిలో అంటే 2016లో 13,00,613 మంది ఓటర్లను తొలగించారు. 2017లో మరో 14,46,238 మందిని తొలగించారు. అలా మూడేళ్లలో టీడీపీ హయాంలో మొత్తం 50,23,565 మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. ► సేవామిత్ర అనే యాప్ ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గుర్తించి వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దానిపై మేం పోరాడాల్సి వచ్చింది. కోర్టులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఆ ఓట్లను తిరిగి చేర్పించే ప్రయత్నం చేశాం. -
ఇసుకాసురుడు ‘నారా’సురుడే..!
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. ఇసుక మీద మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శలు చేశారు. వంశధార, నాగావళి, పెన్నా నదుల్లో ఇసుకను టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ప్రతీ నెల ఇసుక మీద నారా లోకేష్ ముడుపులు తీసుకునేవాడు అని అన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, మైనింగ్ శాఖల మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీపీటీ(పవర్ పాయింట్ ప్రజెంటేషన్) ద్వారా, ఇసుక పాలసీపై పూర్తి గణాంకాలతో సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో జరిగిన దోపిడీ- సీఎం జగన్ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక పాలసీ, తద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని వివరించారు. ఇసుకపై బాబు, లోకేశ్‌ల ఓవరాక్షన్ ఇసుక తవ్వకాలు, అక్రమాలంటూ చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. అనుమతులున్న ఓపెన్ రీచ్‌ల దగ్గరకు కూడా వెళ్లి సెల్ఫీలంటూ వాళ్లు ఓవర్ యాక్షన్ చేయడం అందరూ చూస్తున్నారు. ఇసుక దోపిడీపై మాకు గడువిచ్చామని.. 48 గంటల్లో సమాధానం చెప్పకపోతే.. తదుపరి చర్యలుంటాయని రంకెలేస్తున్నారు. అనుమతులున్న ఇసుక రీచ్‌ల దగ్గరకు పోయి టీడీపీ నేతలు ధర్నాలు చేయడాన్ని చూశాం. అందుకే, ఈ సందర్భంలో ఇసుక పాలసీకి సంబంధించి ఎవరి హయాంలో ఏం జరిగిందనేది నేను పీపీటీ ద్వారా వివరిస్తున్నాను. బాబు హయాంలో 19 జీవోలతో దోపిడీ ఇసుక గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. బాబు ఐదేళ్ల పాలనలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారంగా జరిగాయి. ఇసుక పాలసీకి సంబంధించి ఆయన హయంలో దాదాపు 19 సార్లు జీవోలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా జీవోలను మార్చుకుని మైనింగ్ దోపిడీ ఎలా చేశారనేది.. అప్పట్లో ప్రభుత్వ ఖజానాకు చేరిన ఆదాయమేంటి..? ఇప్పుడున్న ఆదాయమేంటనేది మేమూ పీపీటీ ద్వారా వివరిస్తున్నాం. పేరుకే ఉచితం.. బ్లాక్ మార్కెట్ తో రాష్ట్ర ఖజానాకు సున్నం చంద్రబాబు ఇసుక పాలసీపై మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఆయన నోటి వెంట ఇసుక దోపిడీ గురించి మాటలు వినిపిస్తుంటే.. దొంగే.. దొంగా దొంగా.. అని కేకలేసినట్లుగా ఉంది. 2014 నుంచి 2019 వరకు కృష్ణానది కరకట్ట మీదనున్న చంద్రబాబు ఇంటి వెనుకే కృష్ణా నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరగలేదా..? అని ప్రశ్నిస్తున్నాను. మొదట్లో డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక సప్లై అన్నాడు. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం అన్నాడు. పేరేమో ఉచితమన్నాడు గానీ.. ఇసుక బ్లాక్‌మార్కెట్ ను అమాంతం పెంచి ప్రభుత్వ ఖజనాకు సున్నంపెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్పుకోవాలి. నాడు పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే.. సామాన్యులకు ఇసుక దొరక్క, టీడీపీ నేతలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి. టీడీపీ హయాంలో నెలవారీ మామూళ్ళు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాల్ని జరిపారు. నెలవారీగా తమకు ఆదాయవనరుల్లో ఇసుకను ఒక భాగంగా చేసుకున్నారు కనుకే.. పశ్చిమగోదావరి జిల్లాల్లో అప్పట్లో తహశీల్దార్ వనజాక్షి గారు ఇసుక అక్రమ తవ్వకాల్ని అడ్డుకుంటే ఆమెపై దాడిచేశారు. ప్రభుత్వ అధికారిణి అని కూడా చూడకుంటా ఆమెను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చిపడేశాడు. అప్పట్లో వారిద్దర్నీ రాష్ట్ర సచివాలయానికి పిలిపించుకుని రాజీ చేసింది ఈ చంద్రబాబు కదా..? మహిళా అధికారిణిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. బాధితురాల్నే బెదిరించి రాజీచేసిన నీచుడు చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను. లోకేశ్‌కు ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం చంద్రబాబు హయాంలో, ఇసుక అక్రమ తవ్వకాలపై, ఎవరైనా ఫిర్యాదు చేయాలన్నా అది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా చేశాడు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి అనుచరుల్ని పెట్టి కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, గోదావరి నదుల్లో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేశారు. ఇదంతా చంద్రబాబు కొడుకు లోకేశ్ కనుసన్నల్లోనే జరిగిందని.. ఆయనకు ఇసుక దోపిడీకి సంబంధించి ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం కట్టి మరీ ఇసుకమాఫియా ముఠా వ్యాపారం చేసిందని అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలుసు. బాబు హయాంలో ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా శ్రీకాకుళం దగ్గర్నుంచి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ కూడా జరిపింది. అప్పట్లో ఇసుక తవ్వకాలపై ఆధారాలు రుజువైనందునే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్జీటీ తీర్పు సైతం వచ్చింది. దాదాపు రూ.100 కోట్ల జరిమానాను విధిస్తూ తీర్పిచ్చింది. ఈ కేసులో చంద్రబాబు ఇంటి వద్ద కరకట్ట పక్కన జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆధారాల్ని కూడా అప్పట్లో ఎన్జీటీ పరిగణలోకి తీసుకుంది. మరి, ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడు..? పారదర్శక ఇసుక పాలసీని సీఎం జగన్ తెచ్చారు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఇసుకను బుక్ చేసుకుని కొనుగోలు చేసుకునే మెరుగైన పారదర్శక ఇసుక పాలసీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేశాం. ప్రస్తుతం కూడా అమలు చేస్తున్నాం. సీఎం జగన్ ఇసుక తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది నూతన పాలసీని తేవడం జరిగింది. ఇసుకపై 04.09.2019న మెరుగైన నూతన పాలసీని తెచ్చారు. ఆ తర్వాత ఈ పాలసీపై 17.07.2020న మంత్రుల సబ్‌కమిటీ నియమించి ప్రజాభిప్రాయసేకరణ చేసి ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. దీంతో మరింత మెరుగైన ఇసుక విధానంపై 12.11.2020న జీవో.నెం. 78ను జారీ చేశాం. పాలసీ అమలును పరిశీలిస్తూనే.. నిబంధనల్లో మార్పులు చేస్తూ మరలా 16.04.2021న జీవో నెం. 25ను తెచ్చాం. ప్రస్తుతం ఇదే జీవో ద్వారా ఇసుక పాలసీని కొనసాగిస్తున్నాం. కేంద్రప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే టెండర్లు ఇసుక తవ్వకాలకు సంబంధించి గతంలో టీడీపీ మాదిరిగా మేము దొంగచాటుగానో.. ఎవరికీ తెలియకుండానో టెండర్లు ప్రక్రియను పూర్తిచేయలేదు. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన మెటల్ అండ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంటీసీ) ద్వారా టెండర్లును ఆహ్వానించడం, నిర్వహణ, పర్యవేక్షణ జరుగుతుంది. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేలా అవకాశమిచ్చాం. అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి.. అత్యధిక బిడ్ కోట్ చేసిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీకి టెండర్‌ను ఖరారు చేయడం జరిగింది. చంద్రబాబు,రామోజీ టెండర్లలో పాల్గొనలేదేం..? ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబు, రామోజీరావులు అప్పట్లో ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో ఎందుకు పాల్గొనలేదు..? రామోజీ కూడా పెద్ద వ్యాపార వేత్తనే కదా.. మరి ఆ టెండర్లో పాల్గొంటే.. ఎంత పారదర్శకంగా ఇసుక టెండర్ ప్రక్రియ జరుగుతుందో స్వయంగా తెలుసుకునే వారు కదా..? ఇలాంటి పారదర్శక పాలసీని చంద్రబాబు గతంలో ఏనాడైనా తెచ్చాడా..? అని నిలదీస్తున్నాను. దీనిపై దమ్ముంటే చంద్రబాబు, రామోజీ సమాధానం చెప్పాలి. టన్ను రూ. 475కే.. ఇంత పారదర్శకంగా ఇసుక పాలసీని తెస్తే చంద్రబాబు, పచ్చమీడియా కలిసి రోజుకో పిచ్చి ప్రేలాపన చేస్తుంది. రకరకాలుగా ఆరోపణలతో కథనాలు రాస్తున్నాయి. ఇసుక నూతన పాలసీ ప్రకారం ఒక కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఎక్కడ తవ్వకాలు జరిపినా అదే కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. అలాంటప్పుడు ఆ కంపెనీ అక్కడ తవ్వుతుంది..? ఇక్కడ తవ్వుతుంది..? అన్న వాదనలకు ఆస్కారం ఎక్కడుందని అడుగుతున్నాం. ఈ కంపెనీ ప్రస్తుతం టన్నుకు రూ.375 ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. దీనిపై వారు రూ.100 కలుపుకుని టన్ను ఇసుకను రూ.475కు అమ్ముకుంటున్నారు. వారు కలుపుకుంటున్న రూ.100లోనే అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయం మొత్తాన్ని భరించుకోవాల్సి ఉంటుంది. మరి, టీడీపీ నేతలు, చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఇసుకకు సంబంధించి ఏదో జరిగిపోతుందని ఎందుకు ఆరోపణలు చేస్తుంది..? అని అడుగుతున్నాను. ఇసుక సొమ్మంతా బాబు, లోకేష్ జేబుల్లోకే... ఇసుక నూతన పాలసీ ప్రకారం ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం వస్తుంది. అంటే, ఐదేళ్లకు రూ.3825 కోట్లు జమ అవుతున్నాయి. మరి, చంద్రబాబు హయాంలో ఇన్ని వేల కోట్లు ఏమయ్యాయి..? ఎక్కడ జమ అయ్యాయి..? లోకేశ్ జేబులోనా... చంద్రబాబు జేబులోనా..? అని నిలదీస్తున్నాను. ఇంత ఆదాయం ప్రభుత్వం కోల్పోయినప్పుడు ప్రశ్నిస్తానన్న నేతలు గానీ.. మీడియా గానీ ఎందుకు కళ్లుమూసుకుంది. అప్పట్లో టెండర్లు ఎందుకు పిలవలేదు..? ఇలాంటి మెరుగైన పారదర్శక విధానాన్ని చంద్రబాబు ఎందుకు తేలేదు..? దీనిపై వారు సమాధానం చెప్పాలి. ఇసుక తవ్వకాల అక్రమాలపై ఉక్కుపాదం ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్రమాలు ఎక్కడైనా జరిగితే... ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకు కఠిన చట్టాల్ని సైతం అమలు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎవరైనా ఎక్కువ అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకునేలా వ్యవస్థను నడిపిస్తున్నాము. అటువంటివారికి రూ.2 లక్షల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా కఠిన చట్టాన్ని తెచ్చాం. అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేయాలన్నా టోల్‌ఫ్రీ నెంబర్ 14500ను అందుబాటులో ఉంచి ప్రచారం కూడా చేయిస్తున్నాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ద్వారా ఇప్పటికే 18వేల కేసులు నమోదు చేశాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేయడం జరిగింది. చాలామందికి శిక్షలు కూడా పడటం జరిగింది. మరి, చంద్రబాబు హయాంలో ఇలాంటి కఠిన చట్టాలు అమలు చేయడం, జరిమానాలు, శిక్షలు విధించడం చేశారా..? నాడు ఆయన హయాంలో పట్టాభూముల్లో కూడా ఇసుకను యథేచ్ఛగా తవ్వుకుని అమ్ముకున్న దాఖలాలున్నాయి. ఇసుక కొరత లేకుండా చూస్తున్నాం... ఇసుక కొరత, అక్రమ తవ్వకాలు అంటూ.. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని మేం ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు రాష్ట్రంలో నిర్మాణ రంగానికి అండగా ఉన్నారు. వర్షాకాలంలో కూడా ఎక్కడా ఇసుక కొరత రాకుండా అన్నిరకాల జాగ్రత్త చర్యలు చేపట్టి.. ఎండాకాలంలోనే స్టాక్‌యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచేలా ఆదేశాలిచ్చారు. కనుకే, ఇప్పటి వరకు మాకు ఇసుక దొరకడం లేదని ఎవరూ చిన్నపాటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఇసుక కొరత రాష్ట్రంలో లేనేలేదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపుపై చెక్‌పోస్టుల ద్వారా ప్రత్యేక నిఘాను కట్టుదిట్టం చేశాం. చంద్రబాబుకు బంపర్ఆఫర్ ఇసుకపై చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. సంబంధంలేని అంశాలతో శిరోముండనం అంటూ ముడేస్తాడు. అన్నమయ్య ప్రాజెక్టుకూ ఇసుకకు ఏం సంబంధం ఉంది. ఆయన మతిచలించి మాట్లాడుతున్నాడు..? ఒక్కపక్కన లోకేశ్ ఏమో ఇసుక దోపిడీ రూ.4వేల కోట్లంటాడు. చంద్రబాబునేమో రూ.40వేల కోట్ల ఇసుక అక్రమాలంటాడు. కనుక, ఈ ఆరోపణలన్నీ పక్కనబెడితే.. ప్రభుత్వానికి రూ.4వేల కోట్లు ఇస్తే ఇసుక కాంట్రాక్ట్‌ను మొత్తం చంద్రబాబుకే అప్పగిస్తాం. ఆయనకు ఇది మా బంపర్ ఆఫర్. బాబూ.. వాస్తవాలివిగో.. ఈ నాలుగున్నరేళ్లలో ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70 కోట్ల టన్నులు ఇసుకను తవ్వితే మొత్తం రూ.2300 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. బాబు అడుగుతున్న జీఎస్టీ లెక్కలతో ప్రభుత్వానికేం సంబంధం ఉంటుంది. ఆ కాంట్రాక్టు సంస్థ కేంద్రానికి చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 136 స్టాక్ పాయింట్లు ఉంటే.. వాటిల్లో ఇప్పుడు సుమారు 64 లక్షల టన్నుల ఇసుక నిల్వలున్నాయి. ప్రస్తుతం 110 ఓపెన్రీచ్ల్లో సుమారు 77 లక్షల టన్నుల తవ్వకాలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లున్నాయి. కానీ, వరదలు, వర్షాల కారణంగా కొన్నిచోట్ల తవ్వకాలు నిలిచిపోయాయి. 42 డీసెల్టింగ్ పాయింట్లలో జరుగుతున్న ఇసుకకు సంబంధించి 90 లక్షల టన్నులకు అనుమతులున్నాయి. మైనింగ్ ఆదాయంలో పురోగతి మైనింగ్ రెవెన్యూ విషయానికొస్తే జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన నూతన సంస్కరణలు మెరుగైన ఫలితాల్ని తెచ్చిపెట్టాయి. చంద్రబాబు పాలనలో కంటే ఇప్పుడు మైనింగ్ రెవెన్యూలో చాలా పురోగతిని సాధించామని చెబుతున్నాం. 2018–19లో అంటే చంద్రబాబు హయాంలో రూ.1950 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తే.. 2022–23 నాటికి అంటే, ఇప్పుడు జగన్ గారి హయాంలో రూ.4756 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఏపీఎండీసీ విషయానికొస్తే చంద్రబాబు ఉన్నప్పుడు (2018–19) రూ.833 కోట్లు వస్తే.. మా హయాంలో (ప్రస్తుతం) రూ.1806 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి చేరింది. -ఇలా మేము ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సంస్కరణలతో ముందుకు పోతున్నాం. మరోవైపు చంద్రబాబు మాత్రం అసత్యాల్ని అల్లుతూ ప్రభుత్వంపై బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు అధికారం లేదనే తీవ్రమైన ఫ్రస్టేషన్‌తో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఉన్నాడు. -ఇసుక తవ్వకాలపై గతంలో పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు కూడా మాట్లాడినప్పటికీ.. వారిద్దరికీ ఈ విషయంపై అంతగా అవగాహన ఉండదు కనుక పెద్దగా పట్టించుకునేదిలేదు. చంద్రబాబు ఊహాజనితమైన లెక్కలతో ఆరోపణలు చేసి తన స్థాయిని మరింత దిగజార్చుకోవద్దని.. ఇలాగే మాట్లాడితే.. ప్రజల చేతుల్లో పరాభవం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నాను. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. జేపీ కాంట్రాక్టు కాలపరిమితి ఏడాది పెంపు జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ కాంట్రాక్టు కాలపరిమితిని మరో ఏడాదికి పొడిగించాం. ఆ ఉత్తర్వులతోనే ప్రస్తుతం జేపీ సంస్థ తవ్వకాలు జరుపుతుంది. సబ్ కాంట్రాక్టు అగ్రిమెంట్లతో ప్రభుత్వానికి ఏమీ సంబంధంలేదు. ప్రభుత్వంతో కాంట్రాక్టు కుదుర్చుకున్న కంపెనీ, వారికి అనుబంధంగా ఇతర సంస్థలకిచ్చిన సబ్‌కాంట్రాక్టుల వ్యవహారాలు కూడా మా దృష్టికి రాలేదు. ఇది కూడా చదవండి: వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన అభ్యర్థి -
టీడీపీ దొంగ ఓట్ల అడ్డా.. బాపట్ల
సాక్షి ప్రతినిధి, బాపట్ల: తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్లకు బాపట్ల జిల్లాను అడ్డాగా మార్చుకుంది. ఇక్కడ వెల్లడైన దొంగ ఓట్ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక్క పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని అధికారపార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ జిల్లా అధికారులు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను తొలగించాలని ఒక్క పర్చూరు నుంచే 12,944 ఫారం–7 దరఖాస్తులను స్థానికులు అధికారులకు సమర్పించారు. దశాబ్దాల క్రితం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు చాలా మంది ప్రస్తుతం ఉన్న ప్రాంతాలతోపాటు పర్చూరులోనూ ఓట్లు ఉంచుకున్నారు. కొందరు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వేల సంఖ్యలో ఉన్న అక్రమ ఓట్లతోనే పర్చూరు, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాల్లో టీడీపీ వరుసగా గెలుస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. వీటితోపాటు వేమూరు, బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లోనూ టీడీపీ దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్పించుకొన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని అధికారపార్టీకి చెందిన మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్, అద్దంకి ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు తొలగించాలని ఫారం–7 దరఖాస్తులను సమర్పించారు. వేమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,407 ఫారం–7 దరఖాస్తులు ఇవ్వగా రేపల్లెలో 5,544, బాపట్లలో 3,155, అద్దంకిలో 2,619, చీరాలలో 1,870 ఫారం–7 దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం. దీంతోపాటు అక్రమ ఓట్ల జాబితానూ ఎన్నికల అధికారులకు అందిస్తున్నారు. టీడీపీ ఉలికిపాటు దొంగ ఓట్ల తొలగింపునకు అధికార పార్టీ పట్టుబట్టడంతో టీడీపీ ఉలిక్కిపడింది. దీనినుంచి బయట పడేందుకు అధికారపార్టీ నేతలు టీడీపీ ఓట్ల తొలగింపునకు కుట్రలు చేస్తున్నారంటూ ఎల్లో మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. ఎన్నికల కమిషన్‌కూ తప్పుడు ఫిర్యాదులు చేసి రాద్ధాంతం చేస్తోంది. కృష్ణజిల్లా నాగాయలంకలో ఉంటున్న జాగర్లమూడి లక్ష్మీతులసికి బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి పోలింగ్ బూత్ 148లో, మార్టూరు మండలం బొల్లాపల్లి పోలింగ్ బూత్ నంబర్ 70లో రెండు చోట్లా ఓట్లు ఉన్నాయి. పర్చూరు మండలం నూతలపాడులో ఉంటున్న మిరియా చాయమ్మకు దేవరపల్లి 148 పోలింగ్ బూత్, నూతలపాడు 159 బూత్‌లో ఓట్లు ఉన్నాయి. సోమేపల్లి చిన్నవెంకటేశ్వర్లు తండ్రి వెంకటాద్రి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయనకి హైదరాబాద్‌లో ఓటు ఉంది. దాంతోపాటు దేవరపల్లి పోలింగ్ బూత్ 148లో సీరియల్ నంబర్ 631లో కూడా ఓటు ఉంది. హైదరాబాద్‌లో నివాసం ఉండే కొమ్మాలపాటి వీరాంజనేయులుకు దేవరపల్లి 148 పోలింగ్ బూత్‌లో సీరియల్ నంబర్ 581తో ఓటు ఉంది. హైదరాబాద్ శేరిలింగంపల్లి పోలింగ్ బూత్ నంబర్ 430లో సీరియల్ నంబర్ 247తోనూ ఓటు ఉంది. దొంగ ఓట్లు తొలగిస్తాం జిల్లావ్యాప్తంగా సుమారు 30 వేల వరకు ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. దీనిపై జాయింట్ కలెక్టర్‌తో విచారణ చేయిస్తున్నాం. ఫారం–7లను పూర్తిగా పరిశీలించాం. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లుంటే తొలగిస్తాం. నిబంధనల మేరకు దొంగ ఓట్లపై చర్యలు తీసుకుంటాం. ఫేక్ దరఖాస్తులు చేసిన వారిపైనా చర్యలు ఉంటాయి. – రంజిత్‌బాషా, కలెక్టర్, బాపట్ల జిల్లా -
బాబు ఫిర్యాదే ఓ బోగస్
సాక్షి, న్యూఢిల్లీ: దొంగ ఓట్ల నమోదులో ప్రపంచ ఛాంపియన్ అయిన చంద్రబాబు బోగస్ ఫిర్యాదులు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. దొంగే.. దొంగా..దొంగా అనడానికి సరైన అర్థం చంద్రబాబు అని తెలిపారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి తిరిగి అదే ఎన్టీఆర్‌కు పూలమాల వేయగలగడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. ఎన్టీఆర్‌ను బతికున్న రోజుల్లో బాగా చూసుకున్న వారిని వదిలేసి.. ఆయన్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈరోజు ఎన్టీఆర్ పేరుతో రూపొందించిన రూ.100 నాణెం ఆవిష్కరణ సభలో పాల్గొనడం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. విజయసాయిరెడ్డి సోమవారం సాయంత్రం వైఎస్సార్సీపీ ఎంపీలతో కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ బృందంతో భేటీ అయ్యారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో దొంగ ఓట్లు ఎలా నమోదయ్యాయో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందించడంపై చర్చించారు. దొంగ ఓట్ల నమోదుపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 2015 నుంచి టీడీపీ దొంగ ఓటర్ల వివరాలిచ్చాం చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓటర్ల మాల్‌ప్రాక్టీస్‌పై ఎన్నికల సంఘం అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం. అధికారులు సానుకూలంగా స్పందించారు. బాబు హయాంలో మా పార్టీ ఓట్ల గల్లంతు, టీడీపీ వ్యక్తుల దొంగ ఓట్లపై అన్ని ఆధారాలతో ఎన్నికల సంఘానికి వివరించాం. ఉదాహరణకు లక్ష్మి అనే మహిళ పేరును రకరకాల స్పెల్లింగ్‌లతో, వయస్సులు, ఇంటిపేర్లు, భర్త పేర్లు, డోర్ నెంబర్ సబ్‌డివిజన్ చేసి .. ఇలా రకరకాల మార్పులతో అనేక ఓట్లుగా చంద్రబాబు ఎలా చేర్పించారో ఆధారాలతో అందించాం. ఎన్నికల కమిషన్ ఉన్నతాశయాలను దుర్వినియోగం చేస్తూ రోడ్లపై అనాథల్లా తిరిగే వారిని, స్థిరనివాసం లేని సంచారులను సైతం ఏదో ఒక డోర్ నెంబర్ మీద ఓటర్లుగా చేర్చి పెట్టుకున్నాడు చంద్రబాబు. 2015 నుంచి 2017 వరకు అన్ని వివరాలు ఇచ్చాం. 2019 ఎన్నికలకు ముందు 3.98కోట్ల మంది ఓటర్లు ఉంటే.. ఈ రోజుకు 3.97 కోట్ల ఓటర్లు ఉన్నారు. తేడా లక్ష మాత్రమే. సగటున ప్రతి వెయ్యి మందికి ఓటర్ల వివరాల్ని చూశాం. రాష్ట్రంలో 63 నియోజకవర్గాల్లో 20 చోట్ల 15,800 దొంగ ఓట్లు నమోదైనట్లు తేలింది. 40 నియోజకవర్గాల్లో 5,800 నుంచి 6,000 వరకు దొంగ ఓట్లు తేలాయి. ఇవన్నీ ఏయే జిల్లాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయో టేబుల్ రూపంలో అందించాం. ఓటర్ల జాబితాలో వైఎస్సార్సీపీ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. చంద్రబాబు ఆనాడు ఏ విధంగానైతే రాజకీయంగా ఓటర్ల జాబితాలను తారుమారు చేశాడో.. ఆ విధానాల్ని మా పార్టీ అమలు చేయలేదు. చంద్రబాబు ఓటర్ల జాబితాలపై ఎందుకు వణుకుతున్నాడో కూడా ఎన్నికల సంఘానికి వివరించాం. 2019 ఎన్నికలకు ముందు చేర్చిన దొంగ ఓటర్లే ఈనాటి దాకా జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో జాబితాలపై రీసర్వే చేస్తూ.. ఆధార్‌తో ఓటర్ ఐడీని లింక్ చేస్తే ఆయన దొంగ ఓట్లన్నీ బయటకొస్తాయి. ఇదే జరిగితే మరోసారి ఆయన ఓటమి ఖాయం. ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే వైఎస్సార్సీపీపై ఎన్నికల సంఘానికి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. నాడు సేవా మిత్ర.. నేడు మై టీడీపీ యాప్‌తో గతంలో సేవామిత్ర యాప్ ద్వారా ఇతర పార్టీల సానుభూతిపరులెవరో తెలుసుకొని, వైఎస్సార్సీపీ ఓటర్లను జాబితాల్లో నుంచి తొలగించారు. ఈ విషయం తెలుసుకుని మేం ఆనాడు పోరాటం చేశాం. ఇప్పుడు అదే బాటలో ‘మై టీడీపీ’ యాప్ అంటూ ఓటర్ల నుంచి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నారో, దానిని చంద్రబాబు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. అశోక్ డాకవరం అనే వ్యక్తి టీడీపీ తరఫున ఓటర్ల సమాచారాన్ని సేకరించడం, దాంతో ఓటర్‌కు తెలియకుండానే ఓటు తొలగింపు, కొత్త ఓటర్లను చేర్చుకొనే దరఖాస్తుల్ని ఎలా మేనేజ్ చేస్తున్నాడో ఆధారాలతో సహా వివరించాం. ఓటరు సర్వేలో అభ్యంతరకరమైన ప్రశ్నలతో చంద్రబాబు మెథడాలజీని అశోక్ అమలు చేస్తున్నారు. ఓటర్ పొలిటికల్ ప్రిపేర్డ్నెస్, పార్టీ ఛాయిస్‌తో ఏం సంబం«దం ఉందని అశోక్ అడుగుతున్నారు? అతని అవసరమేంటి? ఓటరు కులం ఏమిటో కూడా అడుగుతున్నారు. దీన్నిబట్టి చంద్రబాబులో కుల ఉన్మాదం ఎంతగా పెరిగిందో అర్థమవుతుంది. సభ్య సమాజంలో ఏ వ్యక్తి, ఏ నాయకుడైనా ఓటరును కులం అడగగలరా? ఇవి చాలా నేరపూరితమైన విషయాలుగా వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. పారదర్శక ఓటర్ల జాబితా వైఎస్సార్సీపీ సిద్ధాంతం బోగస్ ఓట్లను ఏరివేయాలని, పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితాతో ఎన్నికలు జరగాలనేది వైఎస్సార్సీపీ సిద్ధాంతం. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ముందు ప్రధానంగా రెండు డిమాండ్లు ఉంచాం. ఓటరు ఐడీతో ఆధార్ కార్డు లింకు చేయాలని కోరాం. దీనిద్వారా చంద్రబాబు దొంగ ఓట్లు చేర్పించే దురాలోచనకు బ్రేకులు పడతాయి. అదేవిధంగా ఆధార్ లింకుతో బయోమెట్రిక్ సదుపాయం ఉంటుంది. ఒక వ్యక్తికి ఒకే ఓటు (వన్సిటిజన్.. వన్ ఓట్) అనే వైఎస్సార్సీపీ సిద్ధాంతం నెరవేరుతుంది. చంద్రబాబు ఈరోజు వైఎస్సార్సీపీ దొంగ ఓట్లు చేరుస్తోందంటూ దొంగే.. దొంగా, దొంగా.. అన్నట్లు రంకెలేస్తున్నారు. వాస్తవానికి ఆయన ఓటర్ల జాబితా మాల్‌ప్రాక్టీస్‌పై మేము వైఎస్సార్సీపీ తరఫున 2018లోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. 2014 నుంచి నేటి వరకు ఓటర్ల జాబితాలపై ప్రత్యేక విచారణ చేయాలని కోతున్నాం. దొంగ ఓట్లు చేర్చడం, నిజమైన ఓటర్ల వివరాల గల్లంతుకు ఎవరు పాల్పడ్డారనే వాస్తవాన్ని నిగ్గు తేల్చాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాం. -
ఈసీని కలవనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీలకు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఖరారైంది. ఈ నెల 28న సాయంత్రం 4.30 గంటలకు సీఈసీని కలవనున్నారు. ఓట్ల జాబితాపై టీడీపీ దుష్ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఎంపీలు.. సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్పించింది. వాటిలో దాదాపు 30 లక్షల దొంగ ఓటర్లను నాడే వైఎస్సార్సీపీ తొలగించి వేయించింది. 2019 నాటికి ఏపీలో ఓటర్ల సంఖ్య 3,98,34,776 కాగా, 2023 మార్చి 31 నాటికి ఏపీలో ఓటర్ల సంఖ్య 3,97,96,678. చంద్రబాబు హయాంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య తగ్గినప్పటికీ, దొంగ ఓటర్లను చేర్పిస్తున్నారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. దొంగ ఓట్లను తొలగిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దొంగ ఓట్లను తొలగిస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబు తథ్యమని, హిందూపురంలోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి అన్నారు. చదవండి: బుద్ధప్రసాద్‌కు షాకిచ్చిన దివిసీమ రైతులు -
ఓట్ల ప్రక్షాళనతో దొంగ వేషాలు! బాబు బాగోతం తెలిసి రామోజీ పాత పాట!
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాకు సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులు వెలుగులోకి వస్తుండటంతో టీడీపీ, అనుబంధ మీడియా రోజుకో రకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతోంది. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలించడంతోపాటు ఆధార్‌కార్డును అనుసంధానిస్తుండటంతో ఎల్లో గ్యాంగ్ బెంబేలెత్తుతోంది. దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈనాడు, తోక పత్రిక 2019లో జరిగిన తప్పులను కప్పిపుచ్చేందుకు తంటాలు పడుతుండగా మర్నాడు అవే వార్తలను చదువుతూ టీడీపీ నేతలు విలేకరుల సమావేశాలను నిర్వహిస్తున్నారు. కొన్ని పత్రికల్లో వెలువడ్డ కథనాల ప్రకారం ఓటర్ల జాబితాను పరిశీలించగా అవన్నీ 2019కి ముందునుంచే ఉన్నట్లు తేలిందని, ప్రత్యేక ఓటర్ల సవరణ ద్వారా తప్పులను సరి చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా ఇప్పటికే ప్రకటించినా ఎల్లో మీడియా విష ప్రచారం యథాప్రకారం కొనసాగుతోంది. ఇంటి నెంబరు లేకపోతే నేరమా? దేశంలో 18 ఏళ్ల వయసు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఇంటి నెంబరు లేకపోయినా ఓటరుగా నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పూరి గుడిసెల్లో నివసించే వారికి ఇంటి నెంబరు ఉండదు కాబట్టి ఇంటి నెంబరు అనే చోట సున్నా అని పేర్కొంటూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అదే ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటి నెంబరు లేకుండా కొన్ని ఓట్లు ఎప్పటి నుంచో నమోదవుతున్నాయి. ఇవన్నీ హఠాత్తుగా ఇప్పుడే జరిగినట్లు ‘సున్నా నెంబర్ ఇంట్లో 30 మంది ఓటర్లు’ అంటూ జూలై 1న ఈనాడు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఆధార్ కార్డులో ఇంటి నెంబరు లేనందున సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పుడు ‘సున్నా’ అని పొందుపరిచినట్లు అధికారులు వివరణ ఇచ్చినా రామోజీ పాతపాటే పాడారు. ఈ ఓటర్లకు సంబంధించి 2019 జాబితాను పరిశీలించగా అప్పుడు కూడా ఇంటి నెంబర్ అనే చోట సున్నాగానే ఉండటం గమనార్హం. అధికారులు వివరణ ఇచ్చినా పట్టించుకోకపోవడం, ఓ కథనాన్ని ప్రచురించే ముందు కనీసం నిర్ధారించుకోకుండా విషం చిమ్మడం ద్వారా తన దుర్బుద్ధిని రామోజీ మరోసారి చాటుకున్నారు. రేపల్లెలో ఎడాపెడా అంటూ.. రేపల్లెలో ఎడాపెడా దొంగఓట్లు అంటూ జూలై 1న ప్రచురించిన కథనాన్ని పరిశీలించగా అవన్నీ 2019లో కూడా ఉన్నట్లు వెల్లడైంది. అయితే అవన్నీ దొంగ ఓట్లు అని చెప్పలేమని, ఓటర్ల నమోదు సమయంలో చాలా మంది ఇంటి నెంబరు చెప్పలేనప్పుడు వీధి పేరు లేదా అపార్టుమెంట్ నెంబర్‌తో నమోదు చేయడం వల్ల ఒకే ఇంటిపై అధిక ఓట్లు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వీటిని ప్రస్తుత ఓటర్ల సవరణ జాబితాలో పరిశీలించి దొంగఓట్లు ఉంటే కచి్చతంగా తొలగిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. -
పచ్చ ఓట్ల బ్యాచ్.. దొరికిన దొంగలు
టీడీపీ దొంగ ఓట్ల వేషాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓట్ల సవరణ కార్యక్రమంలో భాగంగా నిశిత పరిశీలనకు తోడు, ఆధార్ సీడింగ్ చేస్తుండటంతో 2019లో టీడీపీ భారీగా చేర్పించిన దొంగ ఓట్ల బాగోతం బట్టబయలవుతోంది. ఈ విషయం ప్రజల్లోకి వెళితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని రాజగురివింద విలవిల్లాడిపోతున్నారు. ఈ తప్పులకు వక్రభాష్యాలు చెబుతూ విష ప్రచారానికి తెరలేపారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగినట్లు ఈనాడులో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ ఓట్లన్నీ ఒకే వీధి పేరుపై 2019లోనే నమోదయ్యాయనే విషయం నిజంగా మీకు తెలియదా రామోజీ? ఇప్పుడు ఆ నకిలీ ఓట్లను తొలగిస్తుంటే.. మీరు, మీ తోక పత్రిక విషపు రాతలతో రంకెలు వేయడం ఎవరి కోసం? మీ బాబు బాగోతం బట్టబయలైందని ఆక్రోశమా? ఈ బురద ప్రభుత్వంపై చల్లి టీడీపీని రక్షించాలనే తాపత్రయమా? ‘దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు’ దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయడం ద్వారా టీడీపీ కూని రాగాలు తీస్తుంటే.. ఎల్లో మీడియా తందానా అంటూ తబలా వాయిస్తుండటం అందరికీ కనిపిస్తోంది. సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో గెలవడం కోసం తెలుగుదేశం పార్టీ అనేక అడ్డదారులు తొక్కింది. ఏకంగా ప్రజల విలువైన వ్యక్తిగత సమాచారాన్ని హైదరాబాద్‌కు చెందిన ఐటీ గ్రిడ్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా తస్కరించింది. రాష్ట్రంలోని ప్రజల ఆధార్ డేటాను ఈ–ప్రగతికి అనుసంధానం చేసి, అక్కడి నుంచి ఆ సమాచారాన్ని దొంగిలించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌కు చేరవేసింది. ఈ యాప్ ద్వారా సర్వేలు నిర్వహించి ఓటు వేయరనుకున్న వారిని గుర్తించి, ఫారం–7 ద్వారా వారి ఓట్లను తొలగించింది. వారి స్థానంలో పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను చేర్పించింది. ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తించి, దొంగ ఓట్లను తొలగిస్తుంటే.. అదే పెద్ద తప్పిదమైనట్లు ఈనాడు, దాని తోకపత్రిక అడ్డగోలు కథనాలతో ప్రజలను పక్కదారి పట్టించేలా కథనాలు వండివారుస్తున్నాయి. ఈ పత్రికలు అచ్చేసిన దొంగ ఓట్ల కథనాలు, ఆయా ఇంటి నంబర్లను 2019 ఓటర్ల జాబితా, 2023 ఓటర్ల జాబితాలో పరిశీలించి చూస్తే బాబు బాగోతం స్పష్టంగా తెలిసిపోతోంది. ఇదే చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఇలా 36 వేలకు పైగా పక్క రాష్ట్రాలకు చెందిన దొంగ ఓటర్లను చేర్పించి గట్టెక్కారు. మరి దీనిపై కూడా ఓ కథనాన్ని వండివార్చగలరా? 2019కి ముందు చంద్రబాబు హయాంలో విజయవాడలో అసలు ఇంటి నంబర్ లేకుండా కడియాల వారి వీధి పేరుతో నమోదైన 575 ఓట్లు , 2023 ఓటర్ల జాబితాలో అదే అడ్రస్‌పై 459కు తగ్గిన ఓట్లు రామోజీ.. అప్పుడు కనిపించలేదా? విజయవాడలో ఒకే ఇంటి నంబర్‌పై 506 ఓట్లు అంటూ జూన్ 15న ఈనాడు ఓ కథనం అచ్చేసింది. ఇది దురుద్దేశంతో కూడిందన్న విషయం 2019, 2023 ఓటర్ల జాబితాను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్–80 సూర్యారావుపేటలో అసలు ఇంటి నంబరు లేకుండా కేవలం కడియాల వారి వీధి పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు నమోదై ఉన్నాయి. ఈనాడు రాసిన కథనంలో చెబుతున్నట్లుగా ఈ ఓట్లను పరిశీలిస్తే అవి 2019కి ముందు నమోదు చేసినవే. కొత్తగా ఒక్క ఓటు కూడా నమోదు కాకపోగా ఈ సంఖ్య ఇంకా తగ్గింది. కనీసం ఈ పూర్వాపరాలను పరిశీలించకుండా.. కేవలం ప్రభుత్వంపై బురద చల్లాలనే ఆలోచనలతో ఈనాడు దుష్ప్రచారం చేసిందని స్పష్టమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఇప్పుడు ఎన్నికల సంఘం సరిదిద్దుతుంటే వాటికి వక్రీకరణలు, అబద్ధాలు జోడించి, ఎల్లో మీడియాతో ప్రచారం చేయించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ వ్యూహం పన్నింది. ఈ కథనంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పందిస్తూ 2018 నుంచి ఈ ఓట్లు ఒకే వీధి పేరుతో ఉన్నాయని స్పష్టం చేయడమే కాకుండా గణాంకాలతో సహా వివరించారు. 2018లో 674 మంది ఓటర్లు ఉంటే 2019లో 675 మంది ఇప్పుడు 516 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నకిలీ ఓట్లు ఉంటే తొలగిస్తామని స్పష్టం చేశారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒకే ఇంటి నంబర్‌పై 800 ఓట్లు ఉన్నాయంటూ ఈనాడు తోకపత్రిక మరో కథనాన్ని వండి వార్చింది. చంద్రబాబు హయాంలోనే చేర్పించారన్న విషయాన్ని దాచిపెట్టిం ఈ ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై నింద వేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ 38కి సంబంధించి 2019, 2023 ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఈ ఓట్లన్నీ 2019 జనవరి నుంచే కొనసాగుతున్న విషయం స్పష్టం అవుతోంది. అంటే ఈ ఓట్లన్నీ చంద్రబాబు నాయుడే చేర్పించారని ఇట్టే స్పష్టమవుతోంది. ఇక ఆటలు సాగవని అక్కసు ఒక వ్యక్తి రెండు మూడు చోట్ల ఓట్లు కలిగి ఉంటే వాటిని గుర్తించి, వారు కోరుకున్న ఒక్క చోట మాత్రమే ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. ఇలా రాష్ట్రంలో 15 లక్షల మంది ఓటర్లు ఉంటే, పరిశీలించి 10.20 లక్షలు తొలగించినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కొంతకాలంగా ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులను ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ 2024లో సరిదిద్దనున్నట్లు హామీ ఇచ్చారు. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు బీఎల్వోలు ఇంటింటి సర్వే చేసి ఓటర్ల సవరణ చేస్తారని, ఈ సమయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బీఎల్వోలతో కలిసి సర్వేలో పాల్గొనాలని కోరారు. దీంతో ఇంతకాలం దొంగ ఓట్లతో గెలుస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ.. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని దుష్ప్రచారం సాగిస్తోంది. ఇందులో భాగంగానే ‘దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు’ దొంగ ఓట్లంటూ ఫిర్యాదులు కూడా చేస్తుండటం గమనార్హం. -
ఓటర్లను ‘చంపేస్తున్న’ టీడీపీ
పిఠాపురం: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కాకినాడ జిల్లాలో తమ అనుచరులకు భర్తలు బతికుండగానే వితంతు పింఛన్లు ఇప్పించారు ఇక్కడి టీడీపీ నేతలు కొందరు. ఇప్పుడు బతికున్న ఓటర్లను చనిపోయినట్లుగా చిత్రీకరిస్తున్నారు. టీడీపీ ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టగా, దాదాపు అందరూ జీవించే ఉన్నట్టు వెల్లడైంది. టీడీపీ తీరుపై జిల్లా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జిల్లాలోని కొందరి పేర్లు, వారి ఓటరు నంబరు ఇతర వివరాలు ఇచ్చి, వారు చనిపోయారని, ఓట్లను తొలగించాలని టీడీపీ ఎలక్టోరల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ పేరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు అందింది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ వేలాది నకిలీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు ఉన్నట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ ఎలక్టోరల్ సెల్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి విచారణ చేసి వీటిని గుర్తించినట్లు అందులో తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. బూత్ లెవల్ అధికారులు నాలుగు రోజులుగా గ్రామాల్లో విచారణ చేపట్టారు. టీడీపీ నేతలు చనిపోయారని చెబుతున్న వారిలో 90 శాతానికి పైగా ఓటర్లు బతికే ఉన్నారని గుర్తించారు. విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న విద్యార్థుల ఓట్లను డబుల్ ఎంట్రీలని, ఫేక్ ఓట్లని టీడీపీ ఫిర్యాదు చేయడం గమనార్హం. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. టీడీపీ ఫిర్యాదు తప్పుడుది అనడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఇవి. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొత్తపల్లి బూత్ నంబరు 206లో ఓటరు కార్డు నంబరు వైఓయూ 1794924 మామిడాల వెంకటరమణ, వైఓయూ 0130591 వి.బుల్లి అప్పారావు, వైఓయూ 1791920 చోడిశెట్టి మాణిక్యం, వైఓయూ 1791805 సానా సీతారాముడు చనిపోయినట్లుగా టీడీపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి వారంతా జీవించే ఉన్నారు. అధికారులు వారి ఇంటికి వెళ్లగా... వారే సమాధానాలిచ్చారు. ఈ విచారణకు అధికారులు రోజుల తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. దీనివల్ల అధికారుల విలువైన సమయంతోపాటు ప్రజా ధనమూ వృథా అవుతోంది. విచారణ జరుపుతున్నాం చనిపోయిన వారివి, నకిలీ ఓట్లు ఉన్నట్లు టీడీపీ ఎలక్టోరల్ సెల్ నుంచి ఎన్నికల కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదు మాకు పంపించారు. దానిపై గ్రామాల్లో విచారణ చేయిస్తున్నాం. నకిలీలు, చనిపోయిన వారు ఉంటే వాటిని తొలగిస్తాం. లేకపోతే యథావిధిగా ఉంటాయి. ఎవరో ఫిర్యాదు ఇచ్చినంత మాత్రాన ఎవరి ఓటు హక్కు పోదు. పూర్తిగా విచారణ చేసే ఎన్నికల కమిషన్‌కు పంపుతాం. – కె.సుబ్బారావు, ఎన్నికల ఓటరు జాబితా నమోదు అధికారి, పిఠాపురం నియోజకవర్గం నేను చనిపోవడం ఏమిటి? కొత్తపల్లి బూత్ నంబరు 206లో నాకు ఓటు ఉంది. 40 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. నేను చనిపోయానని, ఓటు తొలగించాలంటూ ఎవరో ఫిర్యాదు చేశారని అధికారులు వచ్చి అడిగారు. అసలు నేను చనిపోవడమేమిటో నాకు అర్థం కాలేదు. ఇలాంటి ఫిర్యాదులు ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవాలి. – మామిడాల వెంకట రమణ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కొత్తపల్లి బూత్ నంబరు 206లో నాకు ఓటు ఉంది. 50 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. ఇంతకు ముందు టీడీపీ వారెవరూ మా ఇంటికి వచ్చి విచారణ చేయలేదు. ఇప్పుడు అధికారులు వచ్చి మీరు ఉన్నారా.. అని అడుగుతున్నారు. నేను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వచ్చింది. తప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. – సానా సీతారాముడు నేను ఆరోగ్యంగానే ఉన్నా నాకు 86 సంవత్సరాలు. ఇప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నాను. కొత్తపల్లి బూత్ నంబరు 206లో 60 ఏళ్లుగా ఓటు వేస్తున్నా. అసలు నేను ఎక్కడ ఉంటానో ఎలా ఉంటానో కూడా తెలియకుండా ఎవరో ఫిర్యాదు చేయడం ఏమిటి? ఆరోగ్యంగా ఉన్న వారిని చంపేస్తారా? అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. – చోడిశెట్టి మాణిక్యం -
విశాఖ తూర్పులో దొంగ ఓట్ల రగడ
మహారాణిపేట: విశాఖ తూర్పు నియోజకవర్గంలో దొంగ ఓట్లు రగడ సృష్టిస్తున్నాయి. నియోజకవర్గంలో సుమారు 40 వేల నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ఇళ్లలో వాస్తవంగా ముగ్గురు, నలుగురు ఉంటే.. 10 నుంచి 15 వరకు ఓటర్లు ఉన్నట్లు జాబితాలో ఉండడం కలకలం రేపింది. దీంతో అధికారులు ఆ ఓట్లను తొలగించారు. వాటిని తిరిగి చేర్చాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు డిమాండ్ చేస్తున్నారు. అవన్నీ తెలుగుదేశం పార్టీ వారు చేర్పించిన దొంగ ఓట్లని, వాటిని తిరిగి జాబితాలో చేర్చవద్దని వైఎస్సార్సీపీ నేతలు కోరుతున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు మంగళవారం కలెక్టర్ మల్లికార్జునకు వినతిపత్రాలు సమర్పించారు. దీంతో ఈ ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీ వారే అక్రమంగా జాబితాలో చేర్పించారన్న ఆరోపణలు మరోసారి వెల్లువెత్తుతున్నాయి. ఎటువంటి వివాదాలు చెలరేగకుండా కలెక్టరేట్ వద్ద పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. దొంగ ఓట్లతోనే వెలగపూడి గెలుపు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నేత వెలగపూడి రామకృష్ణబాబు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతి ఎన్నికలకు ముందు వెలగపూడి దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఆ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారని వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల ఆరోపించారు. ఈమేరకు ఆమె కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దొంగ ఓట్లన్నింటినీ పూర్తిగా తొలగించాలని, తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చవద్దని కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వెలగపూడి స్థానికేతరుడు కావడం వల్ల విజయవాడ, గుంటూరు, గన్నవరం తదితర ప్రాంతాల ప్రజలు, గీతం కాలేజీ విద్యార్థులను ఓటర్ల కింద నమోదు చేశారని ఆరోపించారు. ఒకే ఇంటి నంబర్‌పై 20 ఓట్లు ఉంటున్నాయని, 2019 ఎన్నికల్లో జనవరి నుంచి మార్చి వరకు కనీసం 40,000 ఓట్లు నమోదు చేయించారని ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలవడం నిజమైన విజయం కాదన్నారు. ప్రజలకు మంచి చేసి ఓట్లు వేయించుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఇష్టానుసారం తొలగించేశారు: వెలగపూడి మరోపక్క టీడీపీ ఓట్లు తొలగించారంటూ ఎమ్మెల్యే రామకృష్ణబాబు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో అక్రమంగా 40,000 ఓట్లు తొలగించారని వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు మాత్రమే తొలగించారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేకు 30,000 నుంచి 40,000 ఓట్లు నమోదు చేసే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు. తొలగించిన ఓట్లన్నీ తిరిగి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓట్లు తొలగించిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరారు. -
‘మునుగోడు’ విచారణ నేటికి..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నకిలీ ఓట్లు సృష్టించి లబ్ధి పొందాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్లో గురువారం హైకోర్టులో విచారణ సాగింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఓటర్ల జాబితా, కొత్త దరఖాస్తులు, తిరస్కరించిన వాటి వివరాలతో నివేదిక అందజేయాలని ఆదేశించింది. అలాగే కొత్త ఓటర్ల నమోదుకు అనుసరించే విధానం చెప్పాలని స్పష్టం చేసింది. విచారణను నేటికి వాయిదా వేసింది. ఏడు నెలల కాలంలో 1,474 మంది మాత్రమే కొత్త ఓట్ల కోసం దరఖాస్తు చేసు కోగా, ఈ 6 నెలల్లో 24,781 దరఖాస్తు చేసుకోవడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందంటూ.. జూలై 31 నాటి జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. జూలై జాబితా మేరకే ఎన్నికలు జరపాలి.. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి గురువారం వాదనలు వినిపిస్తూ.. మును గోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ నకిలీ ఓట్లను చేర్పించిందన్నారు. రెండు నెలల్లో 24,781 కొత్త ఓట్ల నమోదు కావడా న్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని కోరా రు. జూలై 31 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా మునుగోడు ఎన్నికలు నిర్వహణకు ఈసీకి ఆదేశాలివ్వాలని కోరారు. ఈ నెల 14న ఈసీ కొత్త ఓటర్ల లిస్ట్ ప్రకటించకముందే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఫారం 6,7,8ల ద్వారా 24,781 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని, వీటిని ఆమోదిస్తే రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకం అవుతుందని నివేదించారు. ఈసీ తరఫున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల సమయంలో ఇలా కొత్త ఓటర్ల నమోదు జరగడం సర్వసాధారణమని చెప్పారు. కొత్త దరఖాస్తుల్లో 7 వేలను అధికారులు తిరస్కరించారన్నారు. ఈసీ యాక్ట్‌లోని సెక్షన్ 23(3) ప్రకారం నామినేషన్లు దాఖలు చేసే చిట్టచివరి రోజు వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉందన్నారు. దీని ప్రకారం మునుగోడులో ఈ నెల 14 వరకు ఓటర్ల నమోదుకు చాన్సుందని తెలిపారు. -
దొంగ రాతలు దొంగ మాటలు
‘దొంగ ఓట్ల దందా’ అంటూ మొదటిపేజీ పతాక శీర్షికలో సోమవారం ‘ఈనాడు’ వేసిన ఫొటో ఇది. దొంగ ఓటర్లను పట్టుకున్న పోలీసులు... అంటూ చంద్రబాబుకు మద్దతుగా వైఎస్సార్సీపీని టార్గెట్ చేసింది ఆ పత్రిక. కానీ ఈ ఫొటోలోని ఇద్దరూ ఎవరో తెలుసా? పోలీసు అధికారి ఎడమ చేతివైపు ఉన్నది అక్కడి గుడుపల్లి మండలం దిన్నేపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత నారాయణ. పక్క ఫొటోలో ఈయన్ను టీడీపీ కండువాతో చూడొచ్చు కూడా. ఇక పోలీసు అధికారికి కుడివైపున్నది టీడీపీ మాజీ జెడ్పీటీసీ. పేరు మామ కృష్ణప్ప. ఇది చూస్తే తెలియటం లేదా? టీడీపీ పెద్ద ఎత్తున స్థానికేతరులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నించిందని. ఎన్ని చేసినా తాము ఓడిపోతున్నామని తెలియటంతో... తిరిగి వైఎస్సార్సీపీ వైపు వేలు చూపించి దొంగ ఓట్ల డ్రామా ఆడిందని!. ఆ డ్రామాకు బాబు అనుకూల పత్రికలు వంత పాడాయని!!. సాక్షి, తిరుపతి: దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా కుప్పంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. ఇక్కడ సోమవారం జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో ఎక్కడా దొంగ ఓట్లు వేసేందుకు ఏమాత్రం అవకాశం లేకపోయినా.. ఎవరి నుంచీ ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా ఆ పార్టీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. నిజానికి.. టీడీపీ శ్రేణులే దొంగ ఓటర్ల అవతారం ఎత్తినట్లు ఈ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా టీడీపీ నాయకులే వారి అనుచరులను పట్టుకుని వైఎస్సార్సీపీకి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారంటూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగకుండా.. కుప్పం మీదుగా వెళ్లే ప్రయాణికులు.. పాఠశాలలో పనిచేసే సిబ్బందిపైనా దొంగ ఓటర్లుగా ముద్ర వేసి తమ అనుకూల మీడియా ద్వారా వారిపై విషప్రచారం చేశారు. వాస్తవానికి కుప్పం ఎన్నికల్లో ఎక్కడా దొంగ ఓట్లు పోలవ్వలేదు. అయినా, దొంగ ఓటర్లు వచ్చారంటూ ఆందోళనలకు దిగడంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారీ పోలింగ్‌తో బాబులో వణుకు.. అల్లర్లకు ఆదేశం కుప్పం మున్సిపాలిటీ ఏర్పడ్డాక సోమవారం మొదటిసారి ఎన్నికలు జరిగాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. భారీ పోలింగ్‌కు తోడు మహిళలు ఎక్కువ సంఖ్యలో బారులు తీరడంతో చంద్రబాబులో వణుకు మొదలైంది. వెంటనే ఎన్నికల్లో అలజడులు సృష్టించాలని జిల్లా టీడీపీ నాయకులను ఆదేశించారు. నిమిషాల్లో స్థానికేతరులైన టీడీపీ శ్రేణులు కుప్పంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. వారికి అమరావతి నుంచి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ శ్రేణులు నేరుగా 16, 17 వార్డులకు చేరుకున్నాయి. 16వ వార్డులోకి గుడుపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన కార్యకర్తలను రంగంలోకి దింపారు. పథకం ప్రకారం.. గుడుపల్లి మాజీ జెడ్పీటీసీ బేటప్పనాయుడు మామ ఓఎం కొత్తూరుకు చెందిన కృష్ణప్ప, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బాబు అనుచరుడు దిన్నేపల్లికి చెందిన నారాయణ, మరికొంత మందిని పోలింగ్ బూత్‌లోకి పంపారు. వారు బూత్‌లోకి వెళ్తుండగా టీడీపీ వారే దొంగ ఓట్లు వేసేందుకు వెళ్తున్నారంటూ కేకలు వేశారు. నిజానికి.. పోలింగ్ బూత్‌లోకి స్థానికేతరులు చొరబడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానికేతరులను పంపించే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కృష్ణప్ప, నారాయణ, మరికొందరు పోలింగ్ బూత్‌లోకి చొరబడుతుండగా స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. వారిని తీసుకెళ్లి స్టేషన్లో అప్పగించారు. అదే విధంగా మరో 15 మంది టీడీపీ శ్రేణులను కూడా స్టేషన్లో అప్పగించారు. ప్రయాణికులు.. స్కూలు సిబ్బందిపైనా దాడి ఇక విజయవాణి స్కూల్లో పనిచేస్తున్న సిబ్బంది పోలింగ్ రోజు సెలవు కావడంతో అక్కడే ఉన్నారు. వారిని గమనించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు స్కూల్లోకి చొరబడి వారిపై దాడిచేశారు. తాము దొంగ ఓటర్లు కాదని మొత్తుకుంటున్నా టీడీపీ శ్రేణులు, వారి అనుకూల మీడియా వినిపించుకోలేదు. అంతటితో ఆగకుండా వారిని ఫొటోలు, వీడియోలు తీసి విస్తృతంగా ప్రచారం చేసేశారు. ఇలా తమ పరువు తీశారని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు.. బస్టాండ్‌కు వెళ్లే ఇద్దరు ప్రయాణికులను పట్టుకుని వైఎస్సార్సీపీకి దొంగ ఓట్లేసేందుకు వచ్చారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వారిని టీడీపీ పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చి చితక్కొడుతుంటే గమనించిన స్పెషల్ పార్టీ పోలీసులు అడ్డుకున్నారు. విచారించి వారిని క్షేమంగా బస్సెక్కించారు. ఇక 17వ వార్డులో ఎవ్వరూ దొంగ ఓట్లు వేసేందుకు రాకపోయినా.. దొంగ ఓటర్లు అంటూ స్థానికులను చూపిస్తూ ఏకంగా పోలింగ్ బూత్‌లోని కుర్చీలను కూడా విరగ్గొట్టి నానా హంగామా చేశారు. లోకేష్ సూచించిన నేతలే ఏజెంట్లు ఎన్నికలకు ముందు ప్రచారానికి వచ్చిన నారా లోకేశ్.. ఏయే బూత్‌లలో ఎవరెవరు ఏజెంట్లు కూర్చోవాలో నిర్ణయించారు. లోకేశ్ నిర్ణయం మేరకే బూత్‌లలో టీడీపీ ఏజెంట్లను కూర్చోబెట్టారు. వీరంతా సీనియర్ నేతలే కూడా. దొంగ ఓట్లు వేసే అవకాశమే లేకుండా ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు తీసుకుంది. ఏజెంట్ల వద్ద ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితా ఇచ్చారు. ఓటు వేసే వారు కూడా ఆధార్ కార్డు తీసుకొచ్చి ఏజెంట్లకు చూపించి ఓటు వేశారు. ఎక్కడైనా ఎవరికైనా అనుమానం వస్తే వెనక్కు పంపేందుకు పక్కాగా ఏర్పాట్లుచేశారు. మరోవైపు.. కుప్పంలో ఎక్కడా ఒకరి ఓటు ఒకరు వేసినట్లు ఫిర్యాదులు అందలేదు. అయినా టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ దొంగ ఓట్లు వేయిస్తోందంటూ రచ్చరచ్చ చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. -
రైతులను చితకబాదిన టీడీపీ నేతలు
దర్శి: మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులను దొంగ ఓట్లు వేయడానికి వచ్చారంటూ టీడీపీ నేతలు చితకబాదిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి మార్కెట్ యార్డ్‌లో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. దొనకొండ నుంచి మార్కెట్ యార్డుకు కొందరు రైతులు పురుగు మందుల కోసం వచ్చారు. లోనికి వెళ్లగానే మీరు ఇక్కడి వాళ్లు కాదు.. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చారా అంటూ టీడీపీ నేతలు చితకబాదారు. దీంతో దర్శిలో 13వ పోలింగ్ బూత్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తాము దొంగ ఓట్లు వేయడానికి రాలేదని, మార్కెట్ యార్డ్‌కు పనిమీద వచ్చామని చెప్పినా వినిపించుకోలేదని బాధితులు నాగేశ్వరరావు, కోటిరెడ్డి, అంకయ్య తెలిపారు. తమను అసభ్య పదజాలంలో తిట్టారని వాపోయారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో బతికి బయట పడ్డామని చెప్పారు. వారిని కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. బాధిత రైతులు ఈ మేరకు దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
Tirupati Lok Sabha Bypoll 2021: ఆడలేక దొంగాట!
సాక్షి, తిరుపతి, సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి ఖాయమనే నిర్థారణకు వచ్చిన ప్రతిపక్ష పార్టీ నేతలంతా ఏకమై ‘దొంగ ఓట్లు’ రాగం అందుకున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు ఆస్కారం లేకున్నా ఏదో జరిగిపోయిందని చిత్రీకరించేందుకు నానాపాట్లు పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరుగుతున్నట్లు ప్రచారం జరిగితే ఓటర్లు దూరంగా ఉంటారనే వ్యూహంతో బరి తెగించిన బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు వారిని భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరించారు. విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నట్లుగా దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఓటర్ ఐడీ కార్డు ఫోటోతో కూడుకుని ఉంటుంది. ఒకవేళ ఓటర్లకు అది లేకపోతే ఆధార్ చూపాలి. ఓటర్ స్లిప్పు, పోలింగ్ బూత్‌లో ఉండే ఓటర్ లిస్టులో కూడా ఫొటో ఉంటుంది. పోలింగ్ ఏజెంట్లుగా అన్ని పార్టీల వారుంటారు. ఫొటోలను, సదరు ఓటరును ఒకటికి రెండుసార్లు పరిశీలించి నిర్ధారించుకున్నాకే ఓటు వేసేందుకు అనుమతిస్తారు. అనుమానం వస్తే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇన్ని దశల్లో తనిఖీలు చేసి నిర్థారించుకునే ప్రక్రియ ఉన్నప్పుడు ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ ఓట్లు వేశారంటూ అసంబద్ధమైన ఆరోపణలు చేయడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ‘పొరుగు ఊర్ల నుంచి వచ్చేవారు ఎలా దొంగ ఓట్లు వేస్తారు? అదెలా సాధ్యం? పోలింగ్ బూత్, చిరునామా, ఓటరు స్లిప్పు, ఆధార్ కార్డు, ఓటరు కార్డు ఇవన్నీ లేకుండా దొంగ ఓట్లు వేయడం ఎలా సాధ్యం? నిత్యం తిరుపతికి 50 వేల నుంచి లక్ష మంది దాకా భక్తులు వస్తుంటారు. అలాంటప్పుడు వీరంతా దొంగ ఓట్లు వేశారనేందుకు వచ్చారని ఆరోపణలు చేయడంలో ఏమైనా అర్థం ఉందా?’ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడులైనప్పటి నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా అసత్య ప్రచారాలకు దిగారు. పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని ఎత్తులు వేశారు. అందులో భాగంగా బీజేపీ, టీడీపీ ముఖ్య నేతలంతా అక్కడే తిష్టవేసి పోలింగ్ రోజైన శనివారం కుట్రలను కార్యరూపంలోకి తెచ్చారు. ప్లాన్ ప్రకారం వీడియో చిత్రీకరణ.. తిరుపతిలో పోలింగ్ రోజు హైడ్రామా నెలకొంది. కొందరు విపక్ష నాయకులు పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి వీడియో ఆన్ చేయగానే క్యూలో నిలుచున్న ఓ వ్యక్తి పారిపోయేలా ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. సదరు వ్యక్తి పరారయ్యే సమయంలో వీడియో చిత్రీకరించి దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని తాము పట్టుకుంటున్నట్లు ప్రచారం కల్పించారు. మరి అదే నిజమైతే పారిపోతున్న వ్యక్తిని తాము పట్టుకోవడం గానీ లేదంటే కనీసం అతడిని పట్టుకోవాలని ఇతరులను ఎందుకు అప్రమత్తం చేయలేదన్నది ప్రశ్న! టార్గెట్ పెద్దిరెడ్డి! సాక్షి ప్రతినిధి, తిరుపతి: దశాబ్దాలుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కోటకు బీటలు వారాయన్న నిర్వేదంతో తిరుపతి ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ప్రతి సందర్భంలోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు అసంబద్ధ ఆరోపణలకు దిగారు. 1983 నుంచి కుప్పంలో టీడీపీ అభ్యర్థులు 9 పర్యాయాలు గెలుపొందగా చంద్రబాబు 7 దఫాలుగా నెగ్గుతున్నారు. అయితే టీడీపీకి గట్టి పట్టున్న కుప్పం నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 89 పంచాయితీలకుగానూ 74 సర్పంచ్‌లను వైఎస్సార్సీపీ కైవశం చేసుకుంది. మూడున్నర దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యం వహించిన టీడీపీ కేవలం 14 సర్పంచ్‌లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. (స్వతంత్ర అభ్యర్థి ఒకచోట గెలుపొందారు) ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. దొంగే.. దొంగా దొంగా! దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా టీడీపీ వ్యవహరించింది. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వచ్చే బస్సులు, వాహనాలు నిలిపివేసి దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారా?’ అంటూ నిలదీస్తూ ఆ పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. పథకంలో భాగంగా చంద్రబాబు అనుకూల మీడియాతో ఫోటోలు, వీడియోలు తీసి హంగామా సృష్టించారు. కొందరు మహిళలు వీరి వికృత చేష్టలకు భయపడి చేతులతో ముఖాన్ని కప్పుకోవడంతో వాటికి విస్తృత ప్రచారం కల్పించారు. ఫలితంగా ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చేందుకు తటపటాయించారు. తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ అధికారులు, పోలీసులకు కూడా బీజేపీ, టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. ఎన్నికలు అయ్యాక మీపై చర్యలు ఉంటాయంటూ బెదిరిస్తూ పేర్లు రాసుకున్నారు. -
పుదిపట్లలో దొంగ ఓట్ల ఎఫెక్ట్..!
తిరుపతి రూరల్: మండలంలోని పుదిపట్లలో ఊహించినట్లే జరిగింది. ఊరు, పేరు, ఇంటి నంబర్లు లేని వందలాది దొంగ ఓట్లను తొలగించకుండానే ఎన్నికలు జరిగాయి. దొంగ ఓట్లకు నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించారు. అందుకోసం ఏకంగా మీ–సేవ కేంద్రాన్నే స్థావరంగా మార్చుకున్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మీ–సేవ కేంద్రంలో దొంగ ఆధార్‌కార్డులను తయారు చేస్తూ ఆదివారం పుదిపట్ల సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థి బడి సుధాయాదవ్ అనుచరులు పట్టుబడ్డారు. స్థానికులు ఫిర్యాదుతో ఎంఆర్‌పల్లె పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. వారిలో బడి సుధా యాదవ్, వెంకటముని మునిచంద్రా, రవీంద్ర, మణికంఠ ఉన్నారు. వివరాల్లోకి వెళ్లితే.. పుదిపట్లలో దాదాపు 1,262 దొంగ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. విచారణలో ద,త,మ,ప, ర, ఖ....ఇలా గుర్తు తెలియని పేర్లతో ఓటరు జాబితా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. ఒకే వ్యక్తి సెల్ నంబర్‌తో 470కు పైగా ఓట్లు ఉన్నట్లు గుర్తించినా చర్యలు లేవు. 0, 00, 000, 0000.... ఊర్లో లేని ఇలాంటివే ఇంటి నంబర్లుగా పెట్టి జాబితాను నింపేశారు. వాటిని ప్రక్షాళన చేయాలని మొ త్తుకున్నా పట్టించుకోలేదు. ఆదివారం పుదిపట్ల లో ఓటింగ్ జరిగింది. ఊహించినట్లుగానే దొంగ ఓట్లు వేసేందుకు బయట వ్యక్తులు వచ్చారు. వారిని ఊరు, పేరు లేని వారి ఓటరు కార్డును చూసి మరోక గుర్తింపు కార్డు చూపించాలని ఏజెంట్లు, పోలింగ్ అధికారులు అడిగారు. దీంతో ఆధార్‌కార్డులను చూపించారు. డూప్లికేట్ తరహాలో ఉన్న ఆధార్ అడ్రస్‌లపై స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో ఆరా తీశారు. దొంగ ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని నిలదీయడంతో నకిలీ ఆధార్‌కార్డుల గుట్టు బయటపడింది. ఫొటో ఉంచి, అడ్రస్ మార్చి.... దొంగ ఆధార్ కార్డులతో.. దొంగ అడ్రస్‌లతో ఓటరుగా నమోదు అయిన వ్యక్తులు, ఓటరు కార్డుతో పాటు గుర్తింపు కార్డు కోసం అడ్డదారులు తొక్కారు. అందుకోసం పేరూరు స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఉన్న మణికంఠ అనే వ్యక్తి మీ– సేవ కేంద్రాన్ని అడ్డగా మార్చుకున్నారు. ఫొటో మా త్రం ఉంచుకుని, పుదిపట్ల అడ్రస్‌తో నకిలీ ఆధార్‌కార్డులను తయారు చేసుకున్నారు. అక్కడ దాదాపు 500కు పైగా నకిలీ ఆధార్‌కార్డులు బయటపడ్డాయి. అక్కడే పుదిపట్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడి సుధాయాదవ్ అనుచరులు ఉన్నారు. వాళ్లే తమకు నకిలీ ఆధార్‌కార్డులు తయారు చేశారని చంద్రమౌళి అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. దీంతో మీ– సేవ నిర్వాహకుడు మణికంఠతోపాటు ఐదుగురిపై ఎంఆర్‌పల్లె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనలో కీలకమైన బడి సుధాయాదవ్ పుదిపట్ల సర్పంచ్‌గా గెలిచాడు. అతనిపై కూడా కేసు న మోదు అయ్యింది. దీంతో అతన్ని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చదవండి: నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..! నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ -
ఎంత పెద్ద కుట్రో!
-
ఓటు దొంగ బాబు సర్కారే !
2014 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 3,53,74,337 మంది. 2018 నాటికి ఆ సంఖ్య కనీసం ఒక శాతం పెరిగిందనుకున్నా ఓటర్ల సంఖ్య అదనంగా 3.5 లక్షలు పెరగాలి. ఎన్నికల సంఘం మాత్రం 2018 డిసెంబర్ నాటికి మన రాష్ట్రంలో 3,49,23,171 మంది ఓటర్లే ఉన్నారని చెబుతోంది. దేశంలోని 19 రాష్ట్రాల్లో 5 నుంచి10 శాతం వరకు ఓటర్లు పెరిగితే మన రాష్ట్రంలో ఏకంగా 4,51,166 మంది ఓటర్లు తగ్గారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రతి ఏటా ఓటర్ల సంఖ్య పెరగడం ఒక శాస్త్రీయ ప్రక్రియ. మరి ఆ సూత్రం ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు వర్తించలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాగే మన రాష్ట్రంలోనూ భారీగా దరఖాస్తులు చేసుకుని ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఆ ఓట్లన్నీ ఏమయ్యాయి? ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రంలో ప్రతీ ఏడాది ఓటర్ల సంఖ్య పెరగలేదంటే ఎక్కడో పెద్ద పొరపాటు జరిగిందనేది స్పష్టం. పైగా ఓట్లు తగ్గాయంటే తెరవెనుక భారీ కుట్ర చేశారని ఇట్టే తెలిసిపోతుంది. సాక్షి, అమరావతి : ఈసీ లెక్కల సాక్షిగా రాష్ట్రంలో ఓటు దొంగలెవరో తెలిసిపోయింది. చంద్రబాబు సర్కారే ఈ ఐదేళ్లలో జనాల ఓట్లకు చిల్లు పెట్టిందని తేలిపోయింది. ఎంతో రహస్యంగా సాగించిన గుట్టు రట్టయ్యింది. ప్రజాస్వామ్యంలో ఎంతో పవిత్రంగా భావించే లక్షలమంది ఓటు హక్కును ఈ ప్రభుత్వం హరించింది. అయితే తమకేం తెలియదంటూ బొంకుతున్న చంద్రబాబు సర్కారు.. ఓటర్లు తగ్గడంపై ఎందుకు నోరు మెదపడం లేదు? దేశమంతా ఓటర్ల సంఖ్య పెరుగుతుంటే.. అందుకు భిన్నంగా మన రాష్ట్రంలో తగ్గడంపై చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది? ఓ కుండలో నీళ్లు నింపుతుంటే.. మరోవైపున దానికి ఎవరైనా చిల్లు పెడితే ఆ కుండ ఎప్పటికీ నిండదు. ఆ కుండలా రాష్ట్ర ఓటర్ల జాబితాను తయారుచేశారు. ఓటరు చైతన్యంతో ఒక పక్క ఓటు నమోదు చేసుకుంటుంటే.. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఆ జాబితాకు చిల్లు పెట్టారు. ఐదేళ్లపాటు ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులు, తటస్థుల ఓటర్లను పక్కా పన్నాగంతో తొలగిస్తూ వచ్చారు. ఈ నాలుగేళ్లలో 18 లక్షల మంది యువ ఓటర్లే 2015 నాటికి రాష్ట్ర జనాభా 5,12,22,274గా ఉంటే... 2018 డిసెంబర్‌కు అది 5,30,01,971కు చేరింది. దాదాపు 18 లక్షల జనాభా పెరిగారు. 2014 నుంచి 2018 మధ్య రాష్ట్రంలో కొత్తగా 18 ఏళ్లు నిండినవారు దాదాపు 18 లక్షల మంది ఉన్నారని ఎన్నికల సంఘమే ప్రకటించింది. కొత్తగా 18 ఏళ్లు నిండినవారితోపాటు, గతంలో ఓటు హక్కులేని వారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో రాష్ట్రంలో కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరగాలి. 2009 – 2014 మధ్య ఉమ్మడి ఆంధప్రదేశ్‌లోని సీమాంధ్ర జిల్లాల్లో కొత్తగా దాదాపు 30 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 2014 తరువాత అందుకు విరుద్ధంగా ఓటర్లు తగ్గిపోవడం వెనుక భారీ కుట్ర ఉందని సులువుగా తెలిసిపోతోంది. ఎంత పెద్ద కుట్రో! ప్రతీ ఏడాది ఓటర్ల సంఖ్య పెరగడం అత్యంత సహజం. అందుకు భిన్నంగా ఏపీలో ఓటర్ల జాబితాకు చిల్లు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా వ్యూహం అనుసరించింది. 2014లో అధికారం చేపట్టిన తరువాత ద్విముఖ వ్యూహంతో భారీ అక్రమాలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, తటస్థుల ఓట్లను భారీగా తొలగించారు. అదే సమయంలో టీడీపీ మద్దతుదారుల పేర్లతో దొంగ ఓట్లను దొడ్డిదారిన జాబితాలో చేర్పించారు. ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఈ పన్నాగాన్ని అమలు చేశారు. ప్రజాసాధికారిక సర్వే నిర్వహించి ప్రజల పూర్తి వివరాల్ని ప్రభుత్వం సేకరించింది. ఆ సమాచారాన్ని ఆర్టీజీఎస్కు అనుసంధానించింది. అక్కడ నుంచి వివరాలు చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరాయి. అనంతరం ఆ సంస్థ ప్రత్యేక యాప్‌ను రూపొందించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దాంట్లో అప్లోడ్ చేసింది. అనంతరం సర్వే పేరిట ప్రజల అభిప్రాయాలు సేకరించారు. నకిలీ సర్వే బృందాలతో కుట్ర వెలుగులోకి సర్వేలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అసంతృప్తి, అగ్రహం వ్యక్తం చేసినవారు, వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, తటస్థుల్ని గుర్తించారు. అనంతరం వారి ఆధార్ కార్డు, ఇతర వివరాల ఆధారంగా వారి ఓట్లను గుట్టు చప్పుడు కాకుండా తొలగించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లపాటు చాపకింద నీరులా జరిగిపోయింది. కొన్ని నెలల క్రితం గ్రామాల్లోకి వచ్చిన నకిలీ సర్వే బృందాల తీరు సందేహాస్పదంగా ఉండటంతో అసలు బండారం బట్టబయలైంది. అప్పటికే ప్రభుత్వం ఓటర్లను అక్రమంగా తొలగించింది. దాదాపు 50 లక్షల వరకు ఓట్లను తొలగించి ఉంటారని ఓ అధికారి చెప్పడం గమనార్హం. దొంగ ఓట్లు చేర్పించేందుకు పలు ప్రయోగాలు ఓటర్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా ఓట్లు తొలగిస్తే గుట్టు బయటపడుతుందని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఓ వైపు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తూనే మరోవైపు టీడీపీ మద్దతుదారుల పేర్లతో దొంగ ఓట్లు భారీగా చేర్పించారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో స్పందించిన ఈసీ రాష్ట్ర ప్రభుత్వ అండతో భారీగా ఓట్లను తొలగించడంపై వైఎస్సార్సీపీ ఈసీకి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసింది. దాంతో ఎన్నికల సంఘం స్పందించి చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగడంతో టీడీపీ ప్రభుత్వ బాగోతం బట్టబయలైంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. అక్రమ ఓటర్ల తొలగింపునకు అడ్డుకట్ట వేసింది. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. దాంతో 2019 ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతానికి 1.72 లక్షల ఓట్లు పెరిగాయి. దొంగ ఓట్లపై అనుమానం రాకుండా ఈసీని బోల్తా కొట్టించేలా రకరకాల ప్రయోగాలు.. 1. సానుభూతిపరుల పేర్లు, ఇంటి పేర్లను మార్చారు 2. చిరునామాలు మార్పుతో కొన్ని దరఖాస్తులు 3. మహిళల ఓట్లయితే తండ్రి పేరు ఓసారి, భర్తపేరు మరోసారి దరఖాస్తుల్లో చూపించారు. సమీపంలో ఉండే వేర్వేరు గ్రామాల్లో ఓటు కోసం దరఖాస్తు చేశారు 4. దొంగ చిరునామాలతో మరిన్ని దరఖాస్తులిచ్చారు. ఇలా భారీగా దొంగ ఓట్లను చేర్చించారు. 2014 నుంచి 2018 చివరి వరకు చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా ఈ అక్రమాలకు పాల్పడింది. ప్రముఖుల మాట టీడీపీ నేతలకు ఓటమి భయం ‘ఏపీలో టీడీపీకి వ్యతిరేకంగా తుపాన్ గాలి వీస్తోంది. ఎవర్నీ కాపాడాల్సిన అవసరం మాకు లేదు. బీజేపీపై నిందలు మోపడమే పనిగా పెట్టుకున్నారు. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది.’ –ఎంపీ, జీవీఎల్ చట్టం అందరికీ వర్తించాలి ‘చట్టం ప్రతి ఒక్కరికీ వర్తించాలి. కేవలం ఎంపిక చేసుకున్న కొందరికే కాదు. అది వాద్రా అయినా మోదీ అయినా అందరినీ విచారించాల్సిందే’ – చెన్నైలో విద్యార్థుల సమావేశంలో రాహుల్ గాంధీ .. అందుకే ఎన్డీయే నుంచి బయటకొచ్చారు ‘వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయలేదన్న కారణంతోనే చంద్రబాబు నాయుడు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి నుంచి బయటకొచ్చారు.’ – వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య -
టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఏడు దొంగ ఓట్లు!
-
టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఏడు దొంగ ఓట్లు!
తూర్పుగోదావరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పిందే నిజమైంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఓటరు జాబితాలో దొంగ ఓట్లు చేర్పించారని వైఎస్సార్సీపీ ఆరోపించిన మాటలు రుజువయ్యాయి. అక్రమంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగించడం, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఒకే నియోజకవర్గంలో లేదా పక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్కరి పేరు మీద రెండు నుంచి మూడు దొంగ ఓట్లు చేర్పించడం చాలా చోట్ల జరిగింది. ఇదే విషయం సాక్షి పరిశీలనలో వెలుగు చూసింది. కాకినాడ రూరల్ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీతో పాటు వాళ్ల ఇంట్లోని సభ్యులకు ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు ఓట్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లోనే 7 దొంగ ఓట్లు ఉన్న విషయం బయటపడింది. నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల పేరు మీద ఎన్ని దొంగ ఓట్లు సృష్టించి ఉంటారో అంతుపట్టకుండా ఉంది. అధికారులు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించలేదని ఈ ఘటనతో స్పష్టంగా బయటపడింది. ప్రతి ఓటుకు ఆధార్ నంబర్ లింక్ చేస్తే గానీ దొంగ ఓట్ల బెడద పోయేలా లేదు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఈ విషయంపై దృష్టి పెడితే గానీ దొంగ ఓట్ల విషయం కొలిక్కి వచ్చేలా లేదు. పిల్లి అనంత లక్ష్మి కుటుంబ సభ్యులకు ఉన్న దొంగ ఓట్లను ఒక్కసారి పరిశీలిస్తే.. ఆమెకు పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెంబర్ 188లో HSF2456226 ఓటర్ నెంబర్‌తో ఒక ఓటు ఉంది. ఆమె ఫోటో, పేరుతోనే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 38లో IMZ2075331 ఓటర్ నెంబర్‌తో మరో ఓటు ఉంది. వాళ్ల కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఓట్లను పరిశీలించగా.. పిల్లి అనంతలక్ష్మీ(టీడీపీ ఎమ్మెల్యే) - 2 ఓట్లు. 1).పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెం: 188 ఓటర్ నెంబర్: HSF2456226 2).కాకినాడ రూరల్‌లో బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2075331 పిల్లి సత్యన్నారాయణ మూర్తి (ఎమ్మెల్యే భర్త) - 3 ఓట్లు. 1).పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెం: 188 ఓటర్ నెం: APO70430519155 2).కాకినాడ రూరల్‌లో... బూత్ నెం: 38 ఓటర్ నెం: INZ2078319 3).కాకినాడ రూరల్‌లో... బూత్ నెం: 106 ఓటర్ నెం: INZ1724087 పిల్లి కృష్ణ ప్రసాద్( ఎమ్మెల్యే మొదటి కుమారుడు)- 2 ఓట్లు 1). పెద్దాపురం నియోజకవర్గంలో బూత్: 188 ఓటర్ నెం: APO70430519410 2).కాకినాడ రూరల్‌లో బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2068310 పిల్లి కృష్ణ కళ్యాణ్(ఎమ్మెల్యే రెండవ కుమారుడు) - 3 ఓట్లు 1). పెద్దాపురం నియోజకవర్గంలో బూత్: 188 ఓటర్ నెం: HSF1182708 2).కాకినాడ రూరల్‌లో.. బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2068211 3).కాకినాడ రూరల్‌లో బూత్ నెం: 46 ఓటర్ నెం: IMZ1493402 పిల్లి రాధాకృష్ణ (ఎమ్మెల్యే మూడవ కుమారుడు)- 3 ఓట్లు 1).పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెం: 188 ఓటర్ నెం: HSF1182757 2).కాకినాడ రూరల్‌లో. బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2067205 3).కాకినాడ రూరల్‌లో .. బూత్ నెం: 46 ఓటర్ నెం:IMZ1493550 -
నకిలీ ఓట్లపై అధారలతో పాటు ఫిర్యాదు చేశాం
-
చంద్రబాబు చేసేది చేయకూడని తప్పు
-
చంద్రబాబు చేసేది చేయకూడని తప్పు: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్ బుధవారం సాయంత్రం 4.45 గంటలకు గవర్నర్ నరసింహన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. డేటా చోరీ కేసు విచారణను వేగవంతం చేయాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. డేటా చోరీపై చంద్రబాబు చేసిన పనిని గవర్నర్‌కు వివరించారు. ఒక పద్ధతి, పథకం ప్రకారం డేటా చోరీ.. గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...‘దేశ చరిత్రలో ఇంత పెద్ద సైబర్ క్రైమ్ జరగలేదేమో అని, ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డేటా చోరీకి పాల్పడటం సైబర్ క్రైమ్ కాదా?. గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన పనిని వివరంగా ఇచ్చాం. దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సైబర్ క్రైమ్ జరగలేదు. ఒక పద్ధతి, పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు రెండేళ్ల నుంచే ప్రజల డేటాను చోరీ చేస్తున్నారు. ఆయన రెండేళ్ల నుంచి ఎన్నికల ప్రక్రియను మేనేజ్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆరోపణలు చేస్తున్నామని కాదు. చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాలి. సేవా మిత్ర టీడీపీకి సంబంధించిన యాప్. ఆ యాప్‌ను తయారు చేసింది ఐటీ గ్రిడ్స్ కంపెనీ. ఆధార్ వివరాలు ప్రైవేట్ కంపెనీల వద్ద ఉండకూడదు. సేవా మిత్ర యాప్‌లో ఆధార్‌లో వివరాలు దొరకడం క్రైమ్ కాదా?. కలర్ ఫోటోతో ఉన్న ఓటర్ల జాబితా ఎలా బయటకు వచ్చింది. ఆ జాబితా ఐటీ గ్రిడ్స్ కంప్యూటర్లలో ఎలా కనబడతోంది. ఏపీ ప్రజల బ్యాంక్ ఖాతా వివరాలు సేవా మిత్ర యాప్‌లో ఎలా ఉన్నాయి. వ్యక్తిగత వివరాలు ప్రయివేట్ సంస్థల వద్ద ఉండనే ఉండకూడదు. ప్రభుత్వమే ఇంటింటికి పంపి సర్వేలు చేయించి ఆ డేటాను కూడా సేవా మిత్రలో పొందుపరిచారు. రెండేళ్ల నుంచి పథకం ప్రకారం ఓట్లను తొలగిస్తున్నారు. టీడీపీకి ఓటు వేయరనే అనుమానం ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, అనుకూలంగా ఉన్నవారి డూప్లికేట్ ఓట్లను నమోదు చేస్తున్నారు. మేం ఎన్నికల కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చంద్రబాబుకు ఎందుకు భయం. రాబోయే రోజుల్లో సీఈసీని కూడా కలుస్తాం. ఒక ప్రయివేట్ కంపెనీలో డేటా దొరకడం సబబేనా?. ఇది నేరం కాదా?. ఓటర్ల డేటా, కలర్ ఫోటోలతో మాస్టర్ కాపీ ఎలా ఐటీ గ్రిడ్స్ కంప్యూటర్స్‌లో కనబడుతుంది. కేంద్ర, సీఈసీ, హోంశాఖ పరిధఙలోని డేటా ఎలా వచ్చింది. బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా వచ్చాయి. వ్యక్తుల ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, కలర్ ఫోటోలతో ఓటర్ల వివరాలు మీ దగ్గర ఉన్నాయి. దీనితో మీరు ఏమి చేసినా ప్రజలు నాశం అవ్వరా?. ఇలాంటి సైబర్ క్రైం రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా జరిగి ఉండదేమో. ఐటి గ్రిడ్స్ అనే కంపెనిపై దాడులు జరిగినపుడు అనేక వివరాలు బయటకు వచ్చాయి. టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్. ఇది ఎవరు తయారు చేశారు అంటే ఐటీ గ్రిడ్స్ అనే సంస్ధ. ఈ యాప్ వద్ద ఉండకూడని డేటా ఉంది. ప్రైవేటు వ్యక్తులు సంస్థల వద్ద ఉండకూడని సమాచారం ఏ రకంగా కనబడతున్నాయి. ఆధార్ వివరాలు ప్రైవేటు కంపెని కంప్యూటర్లలో దొరకడం సబబేనా?. ఇది క్రైమ్ కాదా?. ఆధార్ వివరాలు కాకుండా ఓటర్ ఐడీ, డేటా విత్ కలర్ ఫోటోస్...మాస్టర్ కాపీ అనేది ఎవరికి అందుబాటులో ఉండదు. ఏ రకంగా అది ఐటి గ్రిడ్స్ కంపెనీలో కనబడుతోంది. టీడీపీ అధికారిక వెబ్సైట్లో ఏ రకంగా ఉంది. రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు కూడా వారి వద్ద లభించాయి. ఇవి ఏరకంగా ప్రత్యక్షం అవుతున్నాయి. సేవామిత్రాలో ప్రజలకు సంబంధించిన బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా వచ్చాయి. అంటే దీని అర్థం ఏమిటి?. గత రెండు సంవత్సరాలుగా చంద్రబాబు ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి సర్వేలు చేయించారు. అవన్నీ కూడా సేవా మిత్రలో అనుసంధానం చేశారు. ఈ డేటాను టీడీపీ నేతలకు పంపారు. ఆ నేతలు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశారు. ఈ ఓటర్ ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎవరికి ఓటేస్తారు అనే అంశాలను ఆరా తీశారు. ఆ తర్వాత ఎవరైతే వారికి ఓటెయ్యరో ఆ ఓట్లను ఓ పద్దతి ప్రకారం డిలీట్ చేయడం మొదలు పెట్టారు. వారికి ఓటేస్తారని తెలిసినవారి ఓట్లు రెండుగా నమోదు చేయించారు. ఇదంతా పథకం ప్రకారం చేస్తా ఉన్నారు. ఇలా జరుగుతుందని 2018 సెప్టెంబర్‌లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఎందుకంటే గతంలో మేం కేవలం 1 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. మా స్టడీలో 59 లక్షల ఓట్లు డూప్లికేట్ ఓట్లు కనిపించాయి. జనవరిలో ఎన్నికల కమిషన్‌ను కలసి 24 పెన్ డ్రైవ్‌లు ఇచ్చి 54 లక్షల ఓట్లకు సంబంధించి సమాచారం ఇచ్చాం. తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తుందని ఫిర్యాదు చేసి వచ్చాం. దానిలో భాగంగా ఫారం-7 పూర్తి చేసి ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించమని విచారణ చేసి ఆ నిర్ణయం తీసుకోమన్నాం. మేం ఈ కార్యక్రమం చేస్తుంటే ఏపీ పోలీసులను పంపించి ఫారం-7 పెట్టిన వారిపై వేధింపులు ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర సంస్థ. ఫారం 7 పూర్తి చేసి,1950 అనే నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే మీరు ఓటర్ అవునా కాదా అనే విషయం తెలుస్తుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇది ప్రతి పౌరుడి భాధ్యత. చంద్రబాబు నాయుడు దీనిపై విచారణ జరపకుండానే ఎల్లో మీడియాను ఉపయోగించి చేయాల్సిందంతా చేస్తున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు చేస్తున్న అక్రమాలను బయటపెట్టాల్సిన వారు ఇలా తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రైవేటు సంస్దల వద్ద ఆధార్, కలర్ ఓటర్ జాబితాలు, బ్యాంక్ అకౌంట్లు ఉండటం నేరం. ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఏమాత్రం తప్పు చేస్తున్నామనే భావన లేకుండా ఇష్టం వచ్చినట్లుగా ఓటర్లను తొలగించడం, అక్రమంగా నకిలీ ఓట్లు నమోదు చేయించడం నేరాలు. ఇలాంటి నేరాలకు పాల్పడ్డ వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం దారుణం. ఈ విషయాలు అన్నీ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాం. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇద్దరూ కూడా చేసింది జైలుకు వెళ్లాల్సిన నేరాలు. ఆ టాపిక్‌ను డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఫారం 7 దరఖాస్తు చేయడం తప్పన్నట్లుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. దొంగతనం ఎక్కడ జరిగితే అక్కడ కేసు పెడతారు. ఐటి గ్రిడ్స్ చేయకూడని పనులు హైదరాబాద్‌లో చేస్తుంటే ఇక్కడే కేసు పెడతారు కదా. ఇదేదో ఆంధ్రాకు, తెలంగాణా రాష్ట్రాల మధ్య గొడవన్నట్లు క్రియేట్ చేస్తున్నారు. తప్పుదోవ పట్టిస్తూ వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత అన్యాయం అండి. 59 లక్షల ఓట్లకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్‌కు అందించాం. వెరిపై చేసి దానిలో తప్పుంటే తీసేయండి అని కోరాం. ఫారం 7 అనేది రిక్వెస్ట్ ఫర్ ఎంక్వయిరీ. అలా చేయడం తప్పు కాదు, నేరం కాదు.’ అని అన్నారు. వైఎస్ జగన్‌తో పాటు గవర్నర్‌ను కలిసినవారిలో వైఎస్సార్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొలుసు పార్థసారధి, రాజన్న దొర, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని తదితరులు ఉన్నారు. -
నా భార్యతో పాటు మహిళలపై దాడి....
సాక్షి, తిరుపతి: పోలీసుల అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సత్యవేడు పీఎస్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేపట్టిన నిరసన దీక్షను విరమించారు. మంత్రి లోకేశ్ డైరెక్షన్లో పోలీసులు కుట్రలకు పాల్పడ్డారని చెవిరెడ్డి ఆరోపించారు. ఓట్ల దొంగలను పట్టించిన తమపై పోలీసులు అక్రమ కేసులు నమోదుచేసి, అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ.. ఆయన 23 గంటలపాటు పోలీసు స్టేషన్లోనే నిరసన తెలిపారు. అక్రమాలపై ఫిర్యాదు చేసినవారినే అరెస్ట్ చేసి కక్షపూరితంగా వ్యవహరించిన పోలీసులు.. పెల్లుబికిన జనాగ్రహంతో దిగివచ్చారు. సోమవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పోలీసులు చెవిరెడ్డిని విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తన భార్యతో పాటు వందలాది మంది మహిళలపై దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడ చూడలేదని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై దాడిచేసిన పోలీసులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓట్ల దొంగలు సర్వేల పేరిట పర్యటిస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్రమంగా అరెస్ట్ చేసిన తమ పార్టీ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ కార్యాలయం ఎదుట చెవిరెడ్డి ఆందోళనకు దిగారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు.. రాత్రంతా పోలీసు వాహనాల్లో తిప్పారు. చివరకు సోమవారం తెల్లవారుజామున సత్యవేడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. చెవిరెడ్డిపై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చెవిరెడ్డి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఆందోళనలు చేపట్టారు. చెవిరెడ్డి వెంటనే విడుదల చేయాలని ఆయన భార్య లక్ష్మీదేవి కూడా ఆందోళనకు దిగారు. దీంతో లక్ష్మీ దేవితో సహా 200మంది మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. (చిత్తూరులో పోలీసుల పైశాచికం) -
ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు!
సాక్షి, అమరావతి: ఒకవైపు విపక్షం సానుభూతిపరుల ఓట్ల తొలగింపు... మరోవైపు పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు! కీలకమైన ఎన్నికలకు ముందు రెండు లక్ష్యాలే పరమావధిగా అధికార పార్టీ పన్నుతున్న కుయుక్తులపై ప్రజాస్వామ్యవాదుల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం ఒకటి రెండు శాతం ఓట్ల వ్యత్యాసంతోనే పార్టీల జయాపజయాలు, జాతకాలు నిర్ణయమవుతున్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతున్న నకిలీ సర్వేలు, ఓట్ల దొంగలపై ఎన్నికల సంఘం గట్టి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఓటమి భయంతో అధికార టీడీపీ దొంగ ఓట్లను నమోదు చేయించడంతోపాటు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగింపచేస్తోంది. సర్వేల పేరుతో టీడీపీ బృందాలను నియోజకవర్గాల వారీగా తిప్పుతూ అడ్డగోలుగా అరాచకాలు సాగిస్తోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో నకిలీ ఓట్లను చేర్పించడంతో పాటు పెద్ద ఎత్తున విపక్షం సానుభూతిపరుల ఓట్లను ఏరివేస్తున్నా క్షేత్రస్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నకిలీ సర్వే బృందాలను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తున్నా ఫలితం ఉండటం లేదని పేర్కొంటున్నారు. సర్వేల పేరిట ఓట్లను తొలగిస్తున్న వారిని ఉపేక్షిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలపైనే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. ఇతర అధికారుల తీరు కూడా అలాగే ఉంటోంది. కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో సర్వే పేరిట ఓట్లు తొలగిస్తున్న వారిని అడ్డుకున్నందుకు పోలీసులు అర్థరాత్రి దౌర్జన్యంగా గ్రామస్థుల ఇళ్లలోకి చొరబడి అక్రమంగా అరెస్టు చేయడం తెలిసిందే. గ్రామస్థులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకొని రెండు రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలో కూడా నకిలీ సర్వే బృందాలను పట్టించిన వైఎస్సార్ సీపీ నేతలు మజ్జి శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా నిర్భంధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. లక్ష్యం సర్వే కాదు.. ఓట్ల తొలగింపే ఎన్నికల సర్వే పేరిట నకిలీ బృందాలు సాగిస్తున్న వ్యవహారాలను గమనిస్తే వీటి లక్ష్యం సర్వే కాదని వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేలా చేయడం, నకిలీ ఓట్లను నమోదు చేయడమేనని స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదని పలు సర్వేల్లో తేటతెల్లం కావడంతో అధికార పార్టీనే ఇలాంటి చర్యలకు దిగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో 70 నుంచి 90 మంది యువకులను బృందాలుగా ఏర్పాటు చేసి ఆజమాయిషీకి ఓ సూపర్వైజర్ను నియమించి రంగంలోకి దించుతున్నారు. ఓట్ల దొంగల ముఠా సభ్యుల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోతో టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులు బయటపడుతుండటం గమనార్హం. ఆరా తీసి వివరాలు ట్యాబ్‌ల్లో నమోదు.. ‘మీకు వైఎస్సార్ సీపీ అంటే ఇష్టమా?.. తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమా?.. వైఎస్ జగన్మోహన్రెడ్డిని అభిమానిస్తారా?... చంద్రబాబును అభిమానిస్తారా? .. ప్రభుత్వం పథకాలు ఎలా అమలవుతున్నాయి?... చంద్రబాబు బాగా పనిచేస్తున్నారా?.. వైఎస్ జగన్, చంద్రబాబులలో ఎవరంటే మీకు ఇష్టం?.., ఈ ఇద్దరిలో మీ ఓటు ఎవరికి?... అంటూ నకిలీ బృందాలు ఆరా తీస్తూ ఓటర్ల మనోగతాన్ని పసిగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ట్యాబ్‌లు, ఇతర అధునాతన సాంకేతిక పరికరాలను తమతోపాటు తెచ్చుకుంటున్న ఈ బృందాల్లోని యువకులు వీధి వాడా చుట్టుముడుతున్నారు. ఎక్కువగా వైఎస్సార్ సీపీకి పట్టున్న ప్రాంతాల్లో సర్వే పేరిట ఈ నకిలీ బృందాలు సంచరిస్తున్నాయి. అభిప్రాయాలు తెలుసుకొనే నెపంతో ప్రశ్నలు అడుగుతూ చివర్లో ఓటరు ఐడీ నెంబర్, మొబైల్ నెంబర్‌ను సేకరిస్తున్నారు. ఆ వివరాలను తమ వద్ద ఉన్న ట్యాబ్‌లలో పొందుపరుస్తున్నారు. ఈ వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్న వారిని ట్యాబ్‌లో వారికి నచ్చిన పార్టీ గుర్తుపై నొక్కాలని సూచిస్తున్నారు. తదుపరి ఆ ఓటరు ఓటు కాస్తా రద్దు అవుతోంది. ఓటు రద్దైనట్లు వచ్చిన సమాచారాన్ని తెలుసుకుని సర్వేలో పాల్గొన్న ఓటర్లు నివ్వెరపోతున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతు అవుతున్నాయి. ఆన్లైన్లో డిలిషన్ దాఖలు చేస్తున్న సర్వే బృందాలు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, అభిమానుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నకిలీ సర్వే బృందాలు ఆన్లైన్లో ఓటు తొలగింపు పత్రం (ఫారం–7) దాఖలు చేస్తున్నాయి. చాలా రోజులుగా ఈ పత్రాల ఆధారంగా ఎలాంటి నోటీసులు, పరిశీలన చేయకుండానే క్షేత్రస్థాయి అధికారులు ఓట్లను రద్దు చేస్తున్నారు. అధికారులు, బీఎల్ఓలపై అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చి విపక్షం సానుభూతిపరుల ఓట్లను రద్దు చేయిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని అనంతపురం పట్టణం, రాప్తాడు తదితర నియోజకవర్గాల్లో ఇలా భారీగా ఓట్లు తొలగింపునకు గురవుతున్నాయి. ఇలా ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల నమోదును ఓ ప్రణాళిక ప్రకారం అధికార తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తోందన్న ఆరోపణలకు పలు ఉదంతాలు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాపకింద నీరులా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. గ్రామస్థులు పట్టుకున్న నకిలీ సర్వే బృందాలపై ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం కేసులు నమోదు చేయాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వైఎస్సార్ సీపీ నేతలపైనే ఎదురు కేసులు బనాయిస్తూ వేధింపులు కొనసాగిస్తున్నారు. గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాల్లో నకిలీ బృందాలను గ్రామస్థులు, వైఎస్సార్ సీపీ నేతలు పట్టించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటివరకు నకిలీ బృందాలపై ఎక్కడా కేసులు నమోదు కాకపోవడం గమనార్హం. టీడీపీ కేంద్ర కార్యాలయమే అడ్డా... ‘సెంటర్ ఫర్ సోషియో పొలిటికల్ ఎనాలసిస్ (స్పా)’ అనే సంస్థ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థ బెంగళూరు కేంద్రంగా పని చేస్తోంది. ప్రతి బృందానికి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడొకరు నేతృత్వం వహిస్తున్నారు. ప్రతి గ్రూప్ కోసం వాట్సప్ ఏర్పాటు చేసుకున్నారు. వీరికి మొబైళ్లు, ట్యాబ్‌లు, ఇతర సాంకేతిక పరికరాలను టీడీపీ కేంద్ర కార్యాలయమే సమకూర్చిందని చెబుతున్నారు. ‘యువనేత’ ఈ సర్వే వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని, ప్రభుత్వంలోని ఉన్నత స్థాయినుంచి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే నకిలీ బృందాలపై స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. అడ్డగోలుగా ఓట్ల తొలగింపు, నకిలీ ఓట్ల నమోదు అంశాలను వైఎస్సార్ సీపీ నేతలు జిల్లా అధికారుల దృష్టికి తెస్తున్నా స్పందించడం లేదు. ఎన్నికల సంఘం నుంచి వచ్చామంటూ... మరోవైపు ఏకంగా ఎన్నికల సంఘం పేరిట మరికొన్ని బృందాలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ కోసం వచ్చామంటూ ఓటర్ల వివరాలు తీసుకొని చివర్లో ఏ పార్టీ అంటే అభిమానం? ఎవరికి ఓటు వేస్తారంటూ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఓటరు ఆంతర్యాన్ని పసిగట్టే యత్నం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సర్వేల పేరిట ఓట్లను ఏరివేస్తున్న ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజకీయ నిపుణులు, నేతలు కోరుతున్నారు. ఇలాంటి నకిలీ బృందాలకు వివరాలు చెప్పవద్దని, ఓటరు ఐడీ, ఫోన్ నెంబర్లను అసలు ఇవ్వకూడదని హెచ్చరిస్తున్నారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే నిలదీయడంతోపాటు పోలీసులకు అప్పగించి కేసు నమోదు కోసం ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. ఓ వ్యక్తి ఓటు హక్కును అతడికి తెలియకుండా అక్రమమార్గంలో తొలగించడం ఎన్నికల సంఘం నిబంధనావళి ప్రకారం నేరమని పేర్కొంటున్నారు. నకిలీ సర్వే బృందాల పట్ల ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈసీకి ఫిర్యాదు చేసినా ఆగని అక్రమాలు రాష్ట్రంలో దాదాపు 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నాలుగు నెలల క్రితమే ఫిర్యాదులందాయి. వైఎస్సార్ సీపీ సాక్ష్యాధారాలతో ఈమేరకు ఫిర్యాదు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన జాబితా ప్రకారం రాష్ట్రంలో ఓటర్లు 3.51 కోట్లుండగా తాజాగా జనవరి 11వ తేదీన ప్రకటించిన జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 3,69,33,091కి పెరిగింది. అంటే సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు దాదాపు 18 లక్షల వరకు ఓట్లు పెరిగాయి. నిజంగానే నకిలీ ఓట్లను తొలగించి ఉంటే మొత్తం ఓట్ల సంఖ్య తగ్గాలి. కానీ ఓటర్ల సంఖ్య గతంలో కన్నా భారీగా పెరిగింది. జనవరిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాను పరిశీలిస్తే కొత్తగా చేరిన ఓటర్లతోపాటు నకిలీ ఓట్లూ కోకొల్లలుగా ఉన్నాయని బోధపడుతోంది. సవరించిన జాబితాలోనూ అదే తీరు.. కొత్తగా నమోదైన ఓట్లలో దాదాపు 6 లక్షల వరకు నకిలీ ఓట్లు ఉన్నాయని ‘ఓటర్ అనలటిక్స్ అండ్ స్ట్రాటజీ టీమ్ (వాస్ట్) సంస్థ పేర్కొంది. నకిలీ ఓట్ల సంఖ్య ప్రస్తుతం 59,18,631కి చేరిందని ఆ సంస్థ తెలిపింది. గతంలో నకిలీ ఓట్లుగా గుర్తించినవి సైతం తాజా జాబితాలోనూ కొనసాగుతున్నాయి. ఇవేకాకుండా సెప్టెంబర్ జాబితాలో ఓటు హక్కు కలిగి ఉన్న వారికి ఈసారి వేరే నియోజకవర్గంలో కూడా ఓట్లు నమోదు అయ్యాయి. ఒకే బూత్‌లో ఒకే ఐడీ నెంబర్‌తో రెండేసి ఓట్లు ఉన్న వారూ ఈ కొత్త జాబితాలో దర్శనమిస్తుండడం విశేషం. 100 ఏళ్లకు పైబడి 351 ఏళ్ల వయసున్న వారి పేర్లు కూడా సవరించిన తాజా జాబితాలోనూ కొనసాగుతున్నాయి. ఇలాంటి ఓటర్లు 3307 మంది యధాతథంగా కొనసాగుతున్నారు. అలాగే చనిపోయిన వారి పేరిట కొనసాగుతున్న ఓట్లు లక్షకు పైగానే ఉన్నాయని గత సెప్టెంబర్ నివేదికలో తేలింది. అవే ఓట్లు ఈసారీ కొనసాగుతున్నాయి. నకిలీ ఓట్లతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు ఎన్నికల సంఘం ఇప్పటికైనా ఈ నకిలీ ఓట్లపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుందని, ఎన్నికలపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీల గెలుపోటముల మధ్య ఓట్ల వ్యత్యాసం దాదాపు 5 లక్షల ఓట్లేనని, ఈ నేపథ్యంలో ఈసారి అంతకు పదింతలుగా అరకోటికి పైనే నకిలీ ఓట్లు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు. ఓటరు కార్డు ఉండగానే సరిపోదు... సర్వేల పేరిట నకిలీ బృందాలు ఓట్లను తొలగింపచేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఓటర్లంతా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓటరు ఐడీ కార్డు ఉందిలే అనుకుంటే సరిపోదని, అది ఉన్నంతమాత్రాన ఓటు ఉన్నట్లు కాదని పేర్కొంటున్నారు. ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ఓటర్లు సరి చూసుకోవాలని సూచిస్తున్నారు. ఆ జాబితాలో పేరు లేకపోతే ఓటరు ఐడీ కార్డున్నా ఓటు వేయడానికి అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉందని, తమ ఓటు ఆ జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని సూచిస్తున్నారు. ఓటరు జాబితాలో పేరు లేనట్లుగా గుర్తిస్తే వెంటనే మళ్లీ ఫారం–6 ద్వారా సంబంధిత కార్యాలయంలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచన చేస్తున్నారు. ఆన్లైన్లో కూడా ఓటరుగా పేరు నమోదు చేసుకోవచ్చు. ‘సీఈఓఏఎన్డీహెచ్ఆర్ఏ.ఎన్ఐసీ.ఐఎన్’లో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. ఇంటి చిరునామా పత్రంతో పాటు ఎన్నికల సంఘం సూచించిన వ్యక్తిగత గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఆధారంగా చూపిస్తే సరిపోతుందని, ఆధార్ తప్పనిసరి కాదని ఎన్నికల సంఘం ఇదివరకే స్పష్టం చేసిందని వివరిస్తున్నారు. భారీగా బోగస్ ఓట్లు నమోదు.. సాక్షి నెట్వర్క్: కర్నూలు జిల్లాలో బోగస్ సర్వేలు నిర్వహించి వైఎస్సార్సీపీకి పట్టున్న ప్రాంతాల్లో దాదాపు 35 వేలకు పైగా ఓట్లను తొలగించారు. ప్రస్తుతం ఓటర్ల నమోదు కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు గుట్టుచప్పుడు కాకుండా బోగస్ ఓటర్లను నమోదు చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఓటరు నమోదు కోసం 1.50 లక్షల దరఖాస్తులు రాగా ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందినవే లక్ష వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు, డోన్, పత్తికొండ, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, నంద్యాల ప్రాంతాల్లో ప్రత్యేక కంప్యూటర్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్నారు. వీటిపై రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా విచారణ జరుపుతున్నారనే విమర్శలున్నాయి. కృష్ణాలో లక్షన్నరకు పైగా నకిలీ, డూప్లికేట్ ఓట్లు.. కృష్ణా జిల్లాలో 2014 నాటికి 33,37,071 మంది ఓటర్లు ఉండగా 2018 ఓటర్ల ముసాయి జాబితా సిద్ధమయ్యే నాటికి అందులో 2,85,949 మంది ఓట్లు గల్లంతయ్యాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే అధికారులు ఈ ఓట్లను గల్లంతు చేశారని ప్రతిపక్ష పార్టీ ఎన్నికల సంఘం, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇటీవల మళ్లీ 2,25,669 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 33,03,592 చేరింది. ఇందులో 1.50 లక్షలకుపైగా నకిలీ, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొంటున్నారు. తణుకులో బెడిసికొట్టిన పథకం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన సుమారు 2,000 మంది ఓట్లను తొలగించేందుకు అధికార పక్షం వేసిన పథకం బెడిసికొట్టింది. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం సందర్భంగా తణుకు నియోజవర్గంలోని వివిధ పోలింగ్ బూత్‌ల పరిధిలో సుమారు 2 వేల ఓట్లను తొలగించాలంటూ వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్ల పేరుతో కొందరు నకిలీ వ్యక్తులు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. సోమవారం సంబంధిత వీఆర్వోలు విచారణ నిమిత్తం ఓటరు ఇంటికి వెళ్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇరగవరం మండలంలోని పొదలాడ, ఇరగవరం, కంతేరు, తదితర గ్రామాలతో పాటు తణుకు మండలంలోని తేతలి గ్రామాల్లో వైఎస్సార్సీపీకి చెందిన ఓట్లను తొలగించాలని నకిలీ వ్యక్తులు దరఖాస్తు చేసినట్లు గుర్తించారు. ఏ ఒక్క ఓటరు వివరణ తీసుకోకుండా ఓటును తొలగించబోమని తహసిల్దార్ శివకుమార్ హామీ ఇచ్చారు. -
చిత్తూరులో పోలీసుల ఓవరాక్షన్.. చెవిరెడ్ది భార్య అరెస్ట్
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకుంటున్న ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదివారం అర్థరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. చెవిరెడ్డితో సహా సుమారు 100మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రాత్రంతా పలు ప్రాంతాల్లో తిప్పి...చివరకు తెల్లవారుజామున సత్యవీడు పోలీస్ స్టేషన్ తరలించారు. చెవిరెడ్డిపై ఐదు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీసుల దౌర్జన్యం, ప్రభుత్వ అరాచకానికి నిరసనగా చెవిరెడ్డి పీఎస్‌లోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. (సీఎం సొంత జిల్లాలో పోలీసుల అరాచకం) ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సత్యవీడు పోలీస్ స్టేషన్ వద్దకు తరలివచ్చి ఆందోళనకు దిగారు. చెవిరెడ్డిని విడుదల చేయాలంటూ ఆయన సతీమణి లక్ష్మీ దీక్షకు దిగారు. దీంతో పోలీసులు మరో సారి అత్యుత్సాహం ప్రదర్శించి లక్ష్మీతో సహా మరో 200 మంది మహిళలను అరెస్ట్ చేశారు. మహిళలను బలవంతంగా లాక్కెల్లి దీక్ష భగ్నం చేశారు. చెవిరెడ్డి భార్య లక్ష్మీతో పాటు శోభ అనే మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా జరిగిన తోపులాటలో శోభకు గాయాలయినట్లు తెలుస్తోంది. శోభ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మరో నాలుగు జీపుల్లో మిగతా మహిళలను వేరు వేరు ప్రాంతాలకు తరలించారు. కాగా చెవిరెడ్డి భార్య లక్ష్మీని పీఎస్‌కు తరలించకుండా పలు ప్రాంతాలకు తిప్పుతున్నారు. పోలీసులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు : చెవిరెడ్డి దీక్షకు దిగిన తన భార్య లక్ష్మీ, ఇతర మహిళలపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారని చెవిరెడ్డి ఆరోపించారు. తప్పు చేసిన వారిని వదిలేసి అప్పగించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. లక్ష్మీని పీఎస్‌కు తీసుకెళ్లకుండా పలు ప్రాంతాలకు తిప్పుతున్నారని చెప్పారు. తనను కూడా అరెస్ట్ చేసి పీఎస్‌కు తీసుకెళ్లకుండా రాంత్రంతా రోడ్లపైనే తిప్పారన్నారు. తమిళనాడుతో పాటు చాలాచోట్ల వాహనంలో తిప్పారని, తన ఆరోగ్యం బాగోలేదని, బీపీ టాబ్లెట్ ఇవ్వాలని అడిగినా పోలీసులు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా తన భార్య, బిడ్డలతో ఫోన్ లో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకు వెళతామన్నారు. పోలీసుల వేధింపులకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ ప్రమేయంతోనే వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్పీ భార్య చంద్రబాబు నాయుడు బంధువు అని, అందుకే ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. అరెస్ట్ తర్వాత పోలీసులు తమిళనాడుతో పాటు చాలాచోట్ల వాహనంలో తిప్పారని, తన ఆరోగ్యం బాగోలేదని, బీపీ టాబ్లెట్ ఇవ్వాలని అడిగినా పోలీసులు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా తన భార్య, బిడ్డలతో ఫోన్ లో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. మూడు రోజుల్లోనే 14,500 ఓట్లు తొలగించారని ఆరోపించారు. టీడీపీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. (ఓట్ల దొంగలను వదిలేసి గ్రామస్థులపై పోలీసుల దాడి) బాబుకు ఓటమి భయం పట్టుకుంది : వైవీ చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమ పార్టీ అనుకూల ఓట్లను తొలగిస్తున్నారని వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ చేయడం దారుణమాన్నారు. ఆరోగ్యం బాగాలేదన్నా చెవిరెడ్డిని పోలీసులు పట్టించుకోలేదన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బాబుకు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
బోగస్ ఓట్లపై స్పందించిన హైకోర్టు
-
బోగస్ ఓట్లపై స్పందించిన హైకోర్టు
సాక్షి, విజయవాడ: బోగస్ ఓట్ల తొలగింపుపై హైకోర్టు స్పందించింది. రాష్ట్రంలో 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై స్పందించిన కోర్టు ఎన్నికల కమిషన్‌కు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బోగస్ ఓట్లు తొలగించాలని న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. నెల రోజుల్లో ఎన్ని బోగస్ ఓట్లు తొలగించారో వివరాలు అందజేయాలని సూచించింది. బోగస్ ఓట్ల తొలగింపు వివరాలను ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిర్యాదుదారునికి తెలపాలని హైకోర్టు పేర్కొంది. -
బీపీ టాబ్లెట్ అడిగినా ఇవ్వలేదు
-
బీపీ టాబ్లెట్ అడిగినా ఇవ్వలేదు: చెవిరెడ్డి
సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పోలీసుల అరాచకం శ్రుతిమించింది. దొంగ ఓట్ల నమోదును అడ్డుకుంటున్న ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీంతో చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సత్యవీడు పోలీస్ స్టేషన్ వద్దకు తరలివచ్చి ఆందోళనకు దిగారు. గత అర్థరాత్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా సుమారు 100మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రాత్రంతా పలు ప్రాంతాల్లో తప్పి...చివరకు తెల్లవారుజామున సత్యవీడు పోలీస్ స్టేషన్ తరలించారు. అప్పటి నుంచి ఆయన పీఎస్‌లోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకు వెళతామన్నారు. పోలీసుల వేధింపులకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ ప్రమేయంతోనే వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్పీ భార్య చంద్రబాబు నాయుడు బంధువు అని, అందుకే ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. అరెస్ట్ తర్వాత పోలీసులు తమిళనాడుతో పాటు చాలాచోట్ల వాహనంలో తిప్పారని, తన ఆరోగ్యం బాగోలేదని, బీపీ టాబ్లెట్ ఇవ్వాలని అడిగినా పోలీసులు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా తన భార్య, బిడ్డలతో ఫోన్ లో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద గతరాత్రి ధర్నాకు దిగిన చెవిరెడ్డితో పాటు వందమందికి పైగా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ కార్యకర్తలను బంగారుపాళ్యం, గంగవరం, కార్వేటినగరం, గుడిపాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు మరో ఏడుగురిపై 143, 341, 353, 188తో పాటు రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. A1 చెవిరెడ్డి, A2గా చిత్తూరు ఇన్ఛార్జ్ అరణి శ్రీనివాసులు, A3 బాబురెడ్డి, A4 చిట్టి, A5 పురుషోత్తం, A6 జగదీష్, A7 నారాయణ, A8 కపిలేశ్వర్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. (ఓట్ల దొంగలను వదిలేసి గ్రామస్థులపై పోలీసుల దాడి) అయితే పోలీసుల వైఖరిని ఖండిస్తూ... చెవిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. చెవిరెడ్డి ఆరోగ్యం బాగోలేదని, మందుబిళ్లలు ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. మరోవైపు పీఎస్ వద్దకు భారీగా వైఎస్ఆర్ సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాంతో పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. చెవిరెడ్డి అరెస్ట్ దారుణం... చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం సత్యవీడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ స్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. పరిస్థితి చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. టెర్రరిస్టుల మాదిరిగా చెవిరెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని, సర్వేల పేరుతో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడినవారి ఓట్లు తొలగిస్తున్నారని నారాయణ స్వామి విమర్శించారు. ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
కదులుతున్న దొంగ ఓట్ల డొంక
సాక్షి, అమరావతి బ్యూరో: ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన అధికారులపై కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో డబుల్, ట్రిపుల్ అనుమానాస్పద, దొంగ ఓట్లపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనుమానాస్పద ఓట్లపై విచారణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన ఐదుగురు బీఎల్వోలపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయినవారిలో మండల కేంద్రమైన నాదెండ్లలోని 35వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్వో నాదెండ్ల శివయ్య (పంచాయతీ కార్యదర్శి), నాదెండ్ల మండలం తూబాడులోని 43వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్వో జంగు జరీనా (పంచాయతీ కార్యదర్శి), యడ్లపాడు మండలం ఉన్నవలోని 85వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చెందిన బీఎల్వో వై.ప్రమీల, (అంగన్వాడీ వర్కర్), చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెంలోని 212వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చెందిన బీఎల్వో గుంటి రవి (వీఆర్వో), చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెంలోని 214వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్వో అంగళ మరియమ్మ (అంగన్వాడీ వర్కర్) ఉన్నారు. వారితో పాటు చిలకలూరిపేట తహసీల్దార్ వీసీహెచ్ వెంకయ్య, నాదెండ్ల తహసీల్దార్ మేరిగ శిరీష, యడ్లపాడు తహసీల్దార్ ఆర్.రామాంజనేయులుకు షోకాజ్ నోటీసులిచ్చారు. పల్నాడు అధికారుల్లో భయం భయం.. అనుమానాస్పద ఓట్లపై విచారణ ప్రారంభించడం, చిలకలూరిపేట నియోజకవర్గంలో పలువురు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో జిల్లాలోని పల్నాడు ప్రాంత అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకోవడమే దీనికి కారణం. విచారణలో తమ గుట్టురట్టవుతుందని బీఎల్వోలు, తహసీల్దార్లు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అనుమానాస్పద ఓట్లపైనే ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షలకు పైగా అనుమానాస్పద ఓట్లు ఉన్నట్టు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలో అనుమానాస్పద ఓట్లు 2,07,209 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అధికంగా మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో 16,659, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో 15,498, నరసరావుపేటలో 14,746, గురజాలలో 15,498, పెదకూరపాడులో 15,314, మంగళగిరిలో 12,495, ప్రత్తిపాడులో 12,480, తాడికొండలో 11,971 ఉన్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిష్పక్షపాతంగా ఓట్ల మార్పులు, చేర్పులు చేస్తారా అనే విషయంపై రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రాల మార్పు, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి దొంగ ఓట్లను చేర్పించుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద పల్నాడు ప్రాంతంలోనే అధికంగా దొంగ ఓట్లు, అనుమానాస్పద ఓట్లుండటం గమనార్హం. అధికార పార్టీ నేతలు బూత్ లెవల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి.. తమకు అనుకూలంగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఓటర్ల జాబితాను పరిశీలించుకుని.. పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వైఎస్సార్సీపీ నేతలు సూచిస్తున్నారు. -
దొంగ ఓట్లకు తెరతీసిన చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు విచ్చలవిడిగా బోగస్ ఓట్లు సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్ నరసింహన్‌ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసిన అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల చాలామంది పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించడం లేదని మండిపడ్డారు. విచ్చలవిడిగా ఓట్లు తీసేశారని, మరికొందరికి రెండు మూడు ఓట్లున్నాయని అన్నారు. పల్లెలు, పట్నాల్లోని నకిలీ ఓట్లను తీయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటే.. దానికి బదులు ప్రభుత్వమే నకిలీ ఓటర్లను చేర్పించే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 3.69 కోట్ల ఓట్లుంటే.. ఇంచుమించు 60 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని చెప్పారు. వీటిని తొలగించకపోగా సాధికార సర్వే, ఆర్టీజీఎస్ అని సర్వేలు చేస్తూ.. చివరిలో మీరు ఏ పార్టీని ఇష్ట పడుతున్నారు? ఏ పార్టీకి ఓటేస్తారు? అనే ప్రశ్నల్ని సర్వేలో పెట్టారని, రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసేటపుడు ఇలా ఎక్కడైనా ఏ పార్టీకి ఓట్లేస్తారని అడుగుతారా? అని ప్రశ్నించారు. సర్వేల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో విచ్చలవిడిగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు, కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరో 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ప్రజలతో ప్రమాణాలు చేయిస్తూ అన్యాయమైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. అలాగే పోలీసు, రెవెన్యూ యంత్రాంగంలో టీడీపీ తమకు కావాల్సిన సామాజిక వర్గానికి చెందిన వారికి కీలక పదవులు కట్టబెడుతోందన్నారు. పోలీసు, రెవెన్యూ శాఖతో పాటు ఎన్నికల విధి నిర్వహణలో ఎవరు భాగస్వాములవుతారో అలాంటి పోస్టుల్లో తమకు అనుకూలమైన వారిని నవంబర్, డిసెంబర్ నెలల్లో నియమించుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే వారినే డీఎస్పీ, ఆర్డీఓ తదితర పదవుల్లో పెట్టుకున్న తీరును జగన్మోహన్రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎన్నికలు న్యాయంగా, స్వేచ్ఛగా జరగాలని, దొంగ ఓట్లను తొలగించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్టు వివరించారు. -
రాష్ట్రంలో 52 లక్షల నకిలీ ఓట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 52 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, ఒక్క నరసరావుపేట నియోజకవర్గంలోనే 43 వేల డూప్లికేట్ ఓట్లున్నాయని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ గురజాల సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాత్కాలిక సచివాలయంలోని ఎన్నికల ప్రధాన అధికారి ఆర్పీ సిసోడియాను కలిసి గురజాల నియోజకవర్గంలో ఓటర్ల నమోదులో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దొంగ ఓట్లు చేర్పించడంలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుది అందెవేసిన చేయి అని ఆరోపించారు. గురజాలలో డూప్లికేట్ ఓటర్ల పూర్తి వివరాలు తెలియజేస్తూ ఆన్లైన్ ద్వారా ఫారం నంబర్ 7లో ఆర్డీవోకు ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఆర్డీవో పట్టించుకోలేదన్నారు. యరపతినేని ఒత్తిళ్లు తట్టుకోలేక మాచవరం తహసీల్దార్ సెలవులో వెళ్లిపోయినట్లు తెలిపారు. ఫిర్యాదు చూసిన తరువాత పరిశీలించి వారు కూడా అన్యాయం అంటున్నారని, కానీ చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారన్నారు. అధికారం ఉన్నవాడి చేతుల్లో విచ్చలవిడితనం మంచిది కాదన్నారు. గురజాల నియోజకవర్గంలో 13 వేల దొంగ, నకిలీ ఓట్లున్నట్లు గుర్తించామన్నారు. సెప్టెంబర్ 30లోపే ఆర్డీవోకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వీటన్నింటి వివరాలు ఈసీకి ఆధారాలతో సహా అందజేశామన్నారు. 2004లో వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 96 లక్షల దొంగ ఓట్లున్నాయని ప్రతిపక్షం ఫిర్యాదు చేస్తే ఈసీ స్పందించి తొలగించిందని గుర్తు చేశారు. నకిలీ ఓట్లపై చర్యలు తీసుకోకుంటే హైకోర్టుకు వెళ్తామన్నారు. గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, రూరల్ మండలాల్లోనే 8 వేల దొంగ ఓట్లున్నాయని వీటన్నింటినీ తొలగించాలని కోరినట్లు తెలిపారు. చర్యలు తీసుకుంటాం ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసినందున తప్పకుండా విచారించి చర్యలు తీసుకుంటామని ఈసీ సిసోడియా వైఎస్సార్సీపీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్‌రెడ్డిలకు హామీ ఇచ్చారు. ఫిర్యాదును స్వీకరించిన ఈసీ హార్డ్‌కాపీలు కూడా తీసుకున్నారు. డూప్లికేట్, దొంగ ఓట్లను తొలగిస్తామని హామీ ఇచ్చారు. -
ఊరూపేరూలేని ఓటర్లు 3.90 లక్షల మంది
సాక్షి, అమరావతి: ఆలూ లేదు... చూలూ లేదు... కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా... ఉంది రాష్ట్రంలోని ఓటర్ల నమోదు ప్రక్రియ. రాష్ట్రంలోనే నివాసముంటున్నట్లు ఎలాంటి అడ్రసులు లేకుండానే లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇలాంటి ఓటరు సోమలింగాలు దాదాపు 3.95 లక్షలకు పైగా ఉన్నారు. అసలు ఆ వ్యక్తులున్నారో లేరో తెలియకుండానే ఓటర్లుగా అనుమతించడం ప్రజాస్వామ్యవాదులను విస్మయపరుస్తోంది. ఒకే ఇంటి నెంబర్‌తో వందల్లో పేర్లు నమోదుచేయడం ఒక ఎత్తయితే కొన్నిటికి నెంబర్లేమీ వేయకుండానే ‘సేమ్’ ‘ఓల్డ్’ అంటూ రాసి ఓట్లు నమోదు చేశారు. కొన్ని చోట్ల ఇంటినెంబర్ స్థానంలో ‘డాష్’ (––) పెట్టి లెక్కకు మించి ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ, బోగస్ ఓట్ల సంఖ్య కుప్పలు తెప్పలుగా ఉన్నట్లు ఇప్పటికే తేటతెల్లమైన విషయం తెలిసిందే. ‘ఓటర్ అనలటిక్స్ స్ట్రాటజీ టీమ్’ (వాస్ట్) నకిలీ ఓట్లపై అధ్యయనం చేసి నివేదికలు కూడా రూపొందించింది. ఆయా అంశాలపై ‘సాక్షి’లో వరుసగా విశ్లేషణాత్మక కథనాలూ వచ్చాయి. కనీసం అప్పటి వరకు ఉండి చనిపోయిన వారి పేరిట ఓట్లు కొనసాగుతున్నాయన్నా... లేదా ఒకరికే ఒకటికి మించి అయిదు వరకు ఓట్లు నమోదు అయ్యాయన్నా ఆ తప్పులను కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు ఆ వ్యక్తులున్నారో లేదో కూడా తెలియని పేర్లతో లక్షల కొద్దీ ఓట్లు నమోదు అవ్వడం విస్తుగొల్పుతోంది. క్షేత్రస్థాయిలో సిబ్బందిని ప్రలోభపెట్టో, బెదిరించో.. అధికారపార్టీ నేతలు తమకు అనుకూలంగా ఈ ఊరూ పేరు లేని ఓట్లను నమోదు చేయించి ఉంటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇలా చేసినట్లు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు ‘వాస్ట్’ అధ్యయనంలో ఇప్పటికే తేలిన సంగతి తెలిసిందే. ఒక వ్యక్తి పేరుతో రెండేసి ఓట్లు 36,404 ఉండగా ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటినెంబర్, వయసు, లింగం సమానంగా ఉన్న డూప్లికేట్ ఓట్లు 82,788 ఉన్నాయి. మిగతా వివరాలు ఒకేగా ఉండి వయసు మార్చి నమోదు చేసినవి 24,928 కాగా జెండర్ మార్పుతో ఉన్నవి 1006 ఓట్లు. ఇక తండ్రి/భర్త పేరు మార్పుచేసి నమోదు అయినవి 92,198 ఉన్నాయని వాస్ట్ పరిశీలనలో తేలింది. ఇక ఏకంగా ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకలకు మార్చి నమోదు చేసినవి 2,60,634 ఉన్నాయి. ఓటరు పేరు, తండ్రి/భర్త పేరులను అదే విధంగా ఉంచి మిగతా స్వల్పమార్పులతో నమోదైన నకిలీ ఓట్లు 25,17,164. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఓటు ఉన్నవారు 18,50,511 మంది ప్రజాస్వామ్యవాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇదే కోవలో అసలు ఊరూపేరూ లేకుండానే ఏకంగా 3,95,125కు పైగా నకిలీ ఓట్లు నమోదైనట్లు వాస్ట్ పరిశీలనలో తేలింది. ఇంకా లోతుగా పరిశీలన చేస్తే మరిన్ని వేల ఓట్లు ఇలాంటివి బయటపడతాయని ఆ అధ్యయన సంస్థ హెడ్ తుమ్మల లోకేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అధికార పార్టీ ఆధ్వర్యంలోనేనా ఇదంతా... ఓ ప్రణాళిక ప్రకారం అధికార తెలుగుదేశం పార్టీ ఇలా తమకు అనుకూలంగా ఓట్లు నకిలీ ఓట్లు ఓట్లు నమోదు చేయిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని చాపకింద నీరులా కొనసాగించినట్లు చెబుతున్నారు. సర్వే పేరుతో ఈ టీములు వెళ్లి వైఎస్సార్సీపీ అభిమానులను గుర్తించి వారి ఓట్లను తొలగించడం కూడా చేశాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ టీములు పట్టుబడడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. వారికి ఆధునిక సాంకేతిక పరికరాలను అందించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. వీరి వద్ద చంద్రబాబునాయుడి ఫొటోతో ఉన్న టీడీపీ గుర్తింపుకార్డులు కూడా పట్టుబడ్డాయి. పట్టుబడిన ఈ టీములపై ఎన్నికలసంఘం నియమావళి ప్రకారం కేసు నమోదు చేయాల్సి ఉన్నా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు మౌనం దాల్చుతున్నారు. విశాఖ వెస్ట్‌లో ఒకే ఇంటి నెంబర్‌తో 3,128 ఓట్లు ఇంటి చిరునామాలు ఏమీ లేకుండా పైన ఓటరు ఇంటి నెంబరుతో సేమ్ అని పేర్కొంటూ పలు పేర్లు దర్శనమిస్తున్నాయి. విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలో 3,128 ఓట్లు ఇలా తేలాయి. ఈ నియోజకవర్గంలోని బూత్‌నెంబర్ 154 పరిధిలో ఇంటినెంబర్ స్థానంలో సేమ్ అంటూ 394 (సీరియల్ నెంబర్ 340 నుంచి 733 వరకు) ఓట్లు నమోదు అయ్యాయి. అలాగే బూత్‌నెంబర్ 155లో 688 (సీరియల్ నెంబర్ 321 నుంచి 1036 వరకు), బూత్ నెంబర్ 161లో 118, బూత్‌నెంబర్ 181లో 555 ఓట్లు ఇలా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ‘ఎక్స్‌బీ01574863’ ఐడీనెంబర్‌తో చిరునామా ఏమీ లేకుండా ఇంటినెంబర్ ‘1ఏ’ అని ఓటు నమోదైంది. ఇలా 1ఏతో పలు ఓట్లున్నాయి. ఒకే ఇంటి నెంబర్‌తో ఇన్ని పేర్లుండడానికి వీల్లేదని, ఊరూ పేరు లేని పేర్లకు సేమ్ అని పెట్టి నమోదు చేయించినట్లుగా ఉందని చెబుతున్నారు. కొన్ని చోట్ల ఇంటి నెంబర్ వద్ద ఏమీ రాయకుండా రెండు గీతలు పెట్టి (డాష్) వేలాది ఓట్లు జాబితాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, కడప జిల్లా రాజంపేట, గుంటూరుజిల్లా సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఇంటి నెంబర్‌కు బదులు ‘ఓల్డ్’ అంటూ పేర్కొని నమోదు చేసిన ఓట్లు కూడా వేలల్లోనే ఉన్నాయి. -
లక్ష ఆత్మలకు ఓట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా చనిపోయిన వారి పేరుతో లక్షకుపైగా ఓట్లు ఉన్నట్లు తేలటం ఆందోళన కలిగిస్తోంది. వీటిని తొలగించకుంటే దొంగఓట్లుగా మారి ప్రజాస్వామ్య ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. మృతి చెందినవారి ఓట్లను రివిజన్ చేసే సమయంలో ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఫలితంగా చనిపోయిన వారి పేరుతో ఓట్లు ఏళ్ల తరబడి అలాగే కొనసాగుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని ఓటర్ల జాబితాలపై విస్తృతంగా అధ్యయనం జరిపిన ‘ఓటర్ ఎనలటిక్స్ స్ట్రాటజీ టీమ్’ (వాస్ట్) రాష్ట్రంలో చనిపోయిన వారి పేరుతో ఓట్లు లక్షకుపైగా ఉన్నట్లు తేల్చింది. వాస్ట్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకొని చనిపోయిన వారి పేరిట ఉన్న ఓట్ల సమాచారాన్ని నివేదికలుగా రూపొందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఓట్లు భారీగా ఉన్నాయి. ఓటరు పేరును జాబితాలోకి చేర్చినప్పుడు పక్కనే తండ్రి, / భర్త పేరును కూడా నమోదు చేస్తుం టారు. తండ్రి / భర్త చనిపోతే ఆ పేర్ల పక్కనే ‘లేట్’ అని పేర్కొంటారు. ఇలా ‘లేట్’ అని ఉన్న పేర్లతో కూడా ఓట్లు కొనసాగుతుండడం విశేషం. ‘లేట్’ అని పేర్కొంటూ చనిపోయినట్లుగా నిర్ధారించిన వ్యక్తుల పేర్లు అదే నియోజకవర్గం లేదా మరో నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. నకిలీ ఓటర్లు అరకోటికిపైనే.. దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో అరకోటికిపైగా నకిలీ ఓట్లు ఉన్నట్లు ఇప్పటికే ‘వాస్ట్’ నిర్వహించిన సర్వేలో వెలుగు చూడటం తెలిసిందే. ఏపీలోని మొత్తం 3.6 కోట్ల ఓట్లలో ఏకంగా 52.67 లక్షల నకిలీ ఓట్లు నమోద య్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోంది. కేవలం ఒకటి రెండు శాతం ఓట్ల వ్యత్యాసంతోనే పార్టీల జయాపజయాలు మారిపోతున్న నేపథ్యంలో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు ఉండటం కలవరం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ ఓట్లను గుర్తించి ఏరివేసేందుకు ఎన్నికల సంఘం చొరవ చూపాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పసిగుడ్డులకూ ఓటు హక్కు బతికి ఉన్న వారి పేరిట నాలుగైదు ఓట్లు నమోదు కావడం ఒక ఎత్తు కాగా ఏడాది కూడా నిండని చంటిబిడ్డల పేరిట కూడా ఓటరు కార్డులుండడం విస్మయం కలిగిస్తోంది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కొందరు ఓటర్ల వయసు ఏకంగా 352 ఏళ్లు కూడా ఉండడంపై నివ్వెరపోతున్నారు. ఇలాంటి వింతలు ఎన్నికల సంఘం రూపొందించిన ఓటరు జాబితాను పరిశీలిస్తే కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయి సిబ్బందితో కలసి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. స్థానికంగా పరిశీలన లేకుండా ఓటరుగా నమోదు చేస్తుండటం, సరైన సమాచారం లేకున్నా జాబితాలోకి చేర్చడం లాంటివి చోటు చేసుకుంటున్నాయి. ద్వంద్వ ఓటర్లు 18 లక్షలకుపైనే మరోవైపు ఏపీతో పాటు తెలంగాణలోనూ ఓటు హక్కు కలిగిన వారు 18,50,511 మంది ఉన్నట్లు వెల్లడైంది. ద్వంద్వ ఓట్ల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. ఎన్నికల సమయంలో ఇవి దొంగ ఓట్లుగా మారిపోతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ఓట్లలో ద్వంద్వ ఓట్లు ఏకంగా 5.14 శాతంగా ఉండటం విస్తుగొలుపుతోంది. వీరంతా తెలంగాణాతోపాటు ఏపీలోనూ ఓటు హక్కు వినియోగించుకోవడం ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో అసలైన ఓటర్ల మనోభీష్టాలతో నిమిత్తం లేకుండా ద్వంద్వ ఓట్లు ఎన్నికల ఫలితాలను శాసించేలా మారుతున్నాయి. నకిలీ ఓట్లు ఎన్నికల వ్యవస్థకే పెను సవాల్‌గా మారుతున్నాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే పేరుతో విపక్షం ఓట్లు తొలగిస్తున్న టీడీపీ బృందాలు.. ఎన్నికల సర్వే పేరుతో రాష్ట్రంలో సంచరిస్తున్న కొన్ని బృందాలు ప్రత్యర్థి పార్టీకి చెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ట్యాబ్‌లు, ఇతర అధునాతన సాంకేతిక పరికరాలతో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి పట్టున్న ప్రాంతాల్లో సర్వే పేరిట ఈ బృందాలను మోహరిస్తున్నారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు అంటూ ప్రశ్నలు అడుగుతూ చివర్లో ఓటరు ఐడీ నెంబర్, మొబైల్ నెంబర్‌ను సేకరిస్తున్నారు. ఈ నెంబర్‌ను నకిలీ బృందాలు ట్యాబ్‌ల్లో అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే తమ ఓటు రద్దు అయినట్లు సమాచారం అందటంతో ఓటర్లు నివ్వెరపోతున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది ఓట్లు గల్లంతు అవుతున్నాయి. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడమే ఈ బృందాల లక్ష్యమని స్పష్టమవుతోంది. ఈ బృందాల్లోని యువకుల వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ ఫొటోలున్న టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులుండడం గమనార్హం. ఆ ఓట్లను తొలగించాలి.. పలు నియోజకవర్గాల్లో ఓటర్లకు సంబంధించి తండ్రి/భర్త వివరాల్లో ‘లేట్’ అని పేర్కొంటున్నా అవే పేర్లతో అవే జిల్లాల్లోని ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు కొనసాగుతున్నాయని ‘ఓటర్ ఎనలటిక్స్ స్ట్రాటజీ టీమ్’ హెడ్ తుమ్మల లోకేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఇలా ‘లేట్’ పేర్లతో కొనసాగుతున్న ఓట్లు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఉన్నాయని, వీటిని పరిశీలించి తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ పేర్లను తొలగించకుంటే ఇవన్నీ చివరకు దొంగ ఓట్లుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటరు ఒకరే.. పలుచోట్ల ఓటుహక్కు విశాఖకే చెందిన దాడి కృష్ణవేణి (ఐడీ ఎక్స్‌బీ02166460) తండ్రి దాడి శ్రీనివాసరావు లేట్ అని జాబితాలో పేరు ఉంది. అయితే ఈ దాడి శ్రీనివాసరావుకు ‘ఏపీ060320090382’ నెంబర్‌తో ఓటు మరోచోట కొనసాగుతోంది. విశాఖలోని తాటిచెట్లపాలేనికి చెందిన మహ్మద్ బాషా మదీనా అనే మహిళకు ‘సీకే0936484’ ఐడీతో ఓటుహక్కు ఉంది. ఆమె తండ్రి/భర్త అబ్దుల్ కరీమ్ చనిపోయినట్లుగా ‘లేట్’ అని పేర్కొన్నారు. అయితే అబ్దుల్కరీమ్ పేరిట టీజీఎం0282012’ ఐడీ నెంబర్‌తో మరోచోట ఓటరు జాబితాలో ఓటు హక్కు కొనసాగుతోంది. ఇదే నియోజకవర్గంలో ఎల్లపు అప్పారావు అనే వ్యక్తి చనిపోయినట్లుగా ఒక జాబితాలో ‘లేట్’ అని గుర్తించగా మరో జాబితాలో టీజీఎం0343855 నెంబర్‌తో ఓటు హక్కు కొనసాగుతుండడం విశేషం. గుంటూరులో అమీరున్ షేక్ భర్త సుభాని షేక్ చనిపోయినట్లుగా ఆమె ఓటరు వివరాల్లో ‘లేట్’ అని నమోదు చేశారు. అదే సుభాని షేక్‌కు బాపట్ల నియోజకవర్గం ఇందిరాగాంధీనగర్ ఓటరు జాబితాలో ఎస్ఎస్వై0496000 ఐడీతో ఓటు హక్కు కొనసాగుతోంది. బాపట్ల నియోజకవర్గంలోని అక్ష గండికోట (ఎస్ఎస్వై0644741) తండ్రి శ్రీనివాసరావు చనిపోయినట్లుగా నమోదై ఉండగా ఆయన పేరు యాజలిలో (ఎస్ఎస్వై426767) ఓటరు జాబితాలో ఉండటం గమనార్హం. విజయనగరం జిల్లాకు చెందిన రమణ రొంగలి (యూసీజే0861352) తండ్రి అప్పలనాయుడు రొంగలి చనిపోయినట్లు ఓటరు జాబితాలో ఉంది. అయితే ఇదే వ్యక్తి పేరిట గజపతినగరంలో ఓటు నమోదై ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన మాధవి చేకూరి (ఓటర్ ఐడీ ఐఎంహెచ్1020437) పేరుతో ఉన్న ఓటరు తండ్రి సీతారామారాజు చేకూరి లేట్ అని జాబితాలో ఉంది. అయితే ఇదే సీతారామరాజు చేకూరికి ఆచంట నియోజకవర్గంలో ‘ఏపీ 100640504516’ ఐడీ నెంబర్‌తో ఓటు హక్కు ఉండడం విశేషం. చింతలపూడి నియోజకవర్గంలోని సత్యదేవి కాజ అనే ఓటరు (ఐడీ డబ్ల్యూఎక్స్‌డబ్ల్యూ 1113943) భర్త సత్యనారాయణ కాజ చనిపోయినట్లు ‘లేట్ ’ అని జాబితాలో పేర్కొన్నారు. అదే వ్యక్తి పేరుతో ఆచంటలో ఐడీ నెంబర్ టీవై00648206తో ఓటర్ల జాబితాలో ఓటు హక్కు కొనసాగుతోంది. విశాఖపట్నానికి చెందిన వెంకటరమణ కొల్లి (ఓటరు ఐడీ నెంబర్ జెడ్జెయ్యు1234731) ఓటరు తండ్రి కొల్లి దేముడు ‘లేట్’’ అని ఓటరు జాబితాలో ఉంది. చనిపోయినట్లున్నగా చూపిస్తున్న ఈ కొల్లి దేముడికి అనకాపల్లి నియోజకవర్గంలో ఓటరు ఐడీ నెంబర్ ‘జీఎం0035071’తో ఓటరు జాబితాలో ఓటు కొనసాగుతుండడం విశేషం. -
ఐదేళ్ల బాలికకు ఓటు.. ఆమెకు భర్త కూడా..!
సాక్షి, అమరావతి: ఆ పాప పుట్టి ఇంకా ఏడాది కూడా నిండలేదు. కానీ ఓటు హక్కు వచ్చేసింది. ఇంకో పసిబిడ్డ వయసు ఏడాదే. కానీ, కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్లు ఆ బిడ్డ పుట్టుకతోనే ఓటు హక్కుతో జన్మించింది. మరో బాలిక వయసు ఐదేళ్లే. ఆమెకు ఓటు హక్కుతోపాటు 50 ఏళ్ల భర్త కూడా ఉన్నాడట! రాష్ట్రంలో ఓట్ల నమోదు ప్రక్రియలో చిత్ర విచిత్రాలివీ. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడతాయి. అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి, లక్షల సంఖ్యలో అక్రమ ఓట్లను నమోదు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 52.67 లక్షలకు పైగా నకిలీ ఓట్లున్నాయని ఇప్పటికే ఎన్నికల సంఘానికి(ఈసీ) ఫిర్యాదులందాయి. తప్పుడు వయసు సమాచారంతో ఎన్నో ఓట్లు నమోదైనట్లు తేలుతోంది. వివిధ రకాలుగా నకిలీ ఓట్లు 25 లక్షలకు పైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం కూడా ధ్రువీకరిస్తూ ఆ జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసింది. బొడ్డూడని చిన్నారులూ ఓటర్లే దేశంలో ఎవరికైనా ఓటు హక్కు రావాలంటే కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ నిబంధనను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ఓటు హక్కు కల్పించారు. నెల్లూరు నగరానికి చెందిన పేరూరి సాయికుమార్ వయసు కేవలం ఏడాదే కాగా ఆతడి పేరిట ‘జెడ్‌ఏఎఫ్1714971’ ఓటర్ ఐడీ నెంబర్‌తో ఓటు హక్కు కల్పించారు. తూ.గో. జిల్లా తునికి చెందిన ఐదేళ్ల బాలిక టి.దివ్య ఓటరుగా నమోదైంది. కర్నూలు జిల్లా పాణ్యం పట్టణానికి చెందిన హుస్సేన్ సాహెబ్ వయసు 17 ఏళ్లు. ఆతడికి ‘ఎన్‌కేడీ0190108’ ఐడీ నెంబర్‌తో ఓటు ఉంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన బాలికకు ఐదేళ్లు నిండకుండానే ఓటు హక్కు కల్పించడమే కాకుండా ఆమెకు భర్త కూడా ఉన్నట్లు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని జె.రామలక్ష్మి అనే ఏడాది పసిపాపకు ఓటు హక్కు కల్పిస్తూ ఓటర్ల జాబితాలో పేరు చేర్చారు. కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏడాది వయసున్న బెజవాడ జ్యోతి అనే పాపకు ఓటు హక్కు కల్పించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రెండేళ్ల వయసున్న భద్రప్ప, జీలకర్ర దొర అనే ఇద్దరు బాలురకు ఓటు హక్కు దక్కింది. తూర్పు గోదావరి జిల్లా గన్నవరంలో ఆచంట అంజనీకుమార్ అనే రెండేళ్ల బాబుకు కూడా ఓటు హక్కు కల్పించారు. 300 ఏళ్లు నిండిన వారున్నారా! ప్రపంచంలో వంద నుంచి నూటమూప్పై ఏళ్లు బతికినవారు ఉన్నారు. అయితే ఏపీలో ఏకంగా 352 ఏళ్లున్న వృద్ధులు కూడా ఉన్నారట! ఇది ఇక్కడి ఓటర్ల జాబితాలోని ప్రత్యేకత. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పెద్దిపాలేనికి చెందిన ఎర్రంశెట్టి నర్సింగరావు వయసు 352 ఏళ్లు అని ఉంది. ఈయన ఓటరు ఐడీ నెంబర్ ఎఫ్‌జెఎక్స్0992941. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వనం నారాయణమ్మ అనే మహిళ వయసు 351 ఏళ్లట! ఈమె ఓటరు ఐడీ ఏపీ052740594072. కృష్ణా జల్లా గన్నవరంలో ‘యూఓజీ0077859’ అనే ఓటర్ ఐడీ నెంబర్ ఉన్న ఎ.సూర్యనారాయణ వయసు 344 ఏళ్లు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పి.సుధారాణి అనే ఓటర్ వయసు 248 ఏళ్లు. ఈమె ఓటరు ఐడీ ఎస్జీఈ0247270. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎస్ఏఏ0237545 ఐడీ నెంబర్‌తో ఓటు హక్కు ఉన్న వల్లభనేని జోజప్ప వయసు 225 ఏళ్లు. -
దొంగ ఓట్ల కార్ఖానా
సాక్షి, అమరావతి: ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్ దొంగ ఓట్ల కార్ఖానాగా మారింది. దేశంలో ఎక్కడా లేనంత విచ్చలవిడిగా రాష్ట్రంలో నకిలీ ఓట్లు నమోదవుతున్నాయి. ఏపీలో ఏకంగా 52.67 లక్షల మేర నకిలీ ఓట్లు నమోదైనట్లు ‘ఓటర్ అనలిస్టు అండ్ స్ట్రాటజీ టీమ్’ (వాస్ట్) స్పష్టం చేసింది. కేవలం ఒకటి, రెండు శాతం ఓట్ల వ్యత్యాసం ఎన్నికల్లో పార్టీల తలరాతలను మార్చేస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు కావడం పట్ల రాజకీయ పరిశీలకులతోపాటు సామాన్య ప్రజల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. నకిలీ ఓటర్ల నమోదు వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటే దీని వెనుక ఒత్తిళ్లు, ప్రలోభాలు ఉన్నాయనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఓటర్ జాబితాలో నివ్వెరపరిచే వాస్తవాలు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ దొంగ ఓట్లు నమోదయ్యాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ‘వాస్ట్’ అనే సంస్థ దీనిపై లోతైన అధ్యయనం నిర్వహించింది. పలువురు ఐటీ నిపుణులు, డేటా అనలిస్టులు వివిధ రంగాల ప్రముఖులతో కూడిన ‘వాస్ట్’ గత ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓటర్లు నమోదు తీరుపై అధ్యయనం చేపట్టింది. క్షేత్రస్థాయిలో పక్కా ఆధారాలను సేకరించింది. ఓట్ల నమోదు విషయంలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. పలు అంశాలతో సమగ్ర నివేదిక రూపొందించింది. జీవించి ఉన్నవారి పేరుతో నాలుగైదు ఓట్లు నమోదు కావడం ఒక ఎత్తయితే ఏడాది కూడా నిండని పసిబిడ్డల పేరుతో, చనిపోయిన వారి పేర్లతోనూ ఓటరు కార్డులుండడం గమనార్హం. కొందరు ఓటర్ల వయసును ఏకంగా 352 ఏళ్లుగా చూపించడం వింతల్లోకెల్లా వింత. ఎన్నికల సంఘం(ఈసీ) రూపొందించిన ఓటరు జాబితాను పరిశీలిస్తే ఇలాంటి నివ్వెరపోయే వాస్తవాలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల జాబితాలోని వివరాల ఆధారంగా ఈ నకిలీ ఓట్లను ‘వాస్ట్’ గుర్తించి, తన నివేదిక ద్వారా బహిర్గతం చేసింది. దొంగ ఓట్లకు దారులెన్నో... రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని 45,920 పోలింగ్‌బూత్‌ల పరిధిలో 3.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 52.67 లక్షల దొంగ ఓట్లు ఉన్నట్లు ‘వాస్ట్’ తేల్చింది. అంటే మొత్తం ఓట్లలో దాదాపు 15 శాతం నకిలీ ఓట్లేనని తేటతెల్లమవుతోంది. ఏకంగా అర కోటికిపైగా దొంగ ఓట్లు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో నకిలీ, రిపీట్, అక్రమ, చెల్లని, ఒకే విధమైన సమాచారం ఉన్న ఓట్లు 34.17 లక్షలున్నాయి. ఇవికాకుండా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటర్లుగా కొనసాగుతున్న వారి సంఖ్య 18.50 లక్షలుగా ఉంది. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు 18 ఏళ్లు నిండి ఉండాలన్నది నిబంధన. కానీ ఏడాది వయసున్న చంటిబిడ్డలు కూడా ఓటర్లుగా నమోదైన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇంటి నెంబరు, చిరునామా లేకుండా లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలో దర్శనమిస్తున్నాయి. ఒకే ఐడీ నెంబర్‌తో రెండుచోట్ల ఓటు సాక్షాత్తూ ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితాలోనే నకిలీ ఓటర్ల బాగోతం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో దొంగ ఓట్లను పలు రకాలుగా నమోదు చేయించినట్లు ‘వాస్ట్’ గుర్తించింది. వీటిని 10 కేటగిరీలుగా విభజించింది. ఒకటో కేటగిరీలోని నకిలీ ఓట్లను పరిశీలిస్తే.. ఉదాహరణకు అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 46వ పోలింగ్ బూత్‌లోని 362 సీరియల్ నెంబర్లో... ‘డి.అనిల్‌కుమార్ (ఐడీ నెం.వైడబ్ల్యూబీ0957993) తండ్రి డి.నందప్ప, ఇంటినెంబర్ 1–4–135, వయసు 36, సెక్స్ మేల్’ అనే ఓటరు పేరు నమోదై ఉంది. అయితే, ఇదే ఐడీ నెంబర్‌తో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 64వ పోలింగ్‌బూత్‌లో ‘అనిల్‌కుమార్ దొడ్డపనేని, తండ్రి నందప్ప దొడ్డపనేని, ఇంటి నెంబర్ 14/166–2డి’గా కూడా ఓటరు కార్డు ఉంది. వేర్వేరు ఐడీ నెంబర్లతో రెండు ఓట్లు రెండో కేటగిరీలోని నకిలీ ఓట్లను పరిశీలిస్తే... తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్ 20లోని 815 సీరియల్ నెంబర్లో ఐడీ నెంబర్ ‘డబ్ల్యూయూజెడ్1410737’ తో ‘శ్రీను యండపల్లి, తండ్రి సత్యనారాయణ యండపల్లి, ఇంటినెం.2–96, వయసు 36, సెక్స్ పురుష’ అనే వివరాలతో ఓటరు నమోదై ఉన్నారు. ఇవే వివరాలతో ఈ నియోజకవర్గంలోని 21వ పోలింగ్‌బూత్‌లో సీరియల్ నెంబర్ 513లో ఐడీ నెంబర్ ‘డబ్ల్యూయూజెడ్1412337’ నెంబర్‌తో ఓటు నమోదై ఉంది. ఒకే వ్యక్తికి వేర్వేరు వయసులా? మూడో కేటగిరీ నకిలీ ఓట్లను పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో 75వ నెంబర్ పోలింగ్ బూత్, సీరియల్ నెంబర్ 413లో ఐడీ నెంబర్ ‘ఐడీఎస్1243500’తో ‘కృష్ణారావు ఊబలంక, తండ్రి వీర్రాజు ఊబలంక, ఇంటి నెం.4–4–25, వయసు 54, సెక్స్ పురుష’ అనే ఓటరు ఉన్నారు. అయితే 54 ఏళ్ల వయసును మార్పు చేసి 53 ఏళ్లుగా పేర్కొంటూ ఇదే వ్యక్తి పేరుతో మండపేట నియోజకవర్గంలోని 27వ నెంబరు పోలింగ్ బూత్‌లో సీరియల్ నెంబర్ 9లో కూడా ఓటు నమోదైంది. పురుషుడిని మహిళలను చేశారు నాలుగో కేటగిరీకి సంబంధించి ‘వాస్ట్’ చూపిన ఉదాహరణల్లో తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 138వ నెంబర్ పోలింగ్‌బూత్, 133వ సీరియల్ నెంబర్లో ‘దుర్గా ప్రసాద్ ఇరుసుమల్ల, తండ్రి సత్తిబాబు ఇరుసుమల్ల, ఇంటినెంబర్ 4–89, వయసు 28. సెక్స్ మహిళ’ అనే వివరాలతో ఐడీ నెంబర్ ‘ఆర్‌హెచ్‌ఏ0983123’తో ఓటరు కార్డు ఉంది. విచిత్రం ఏమిటంటే ఇదే నియోజకవర్గంలోని 139వ పోలింగ్ బూత్‌లో 565 సీరియల్ నెంబర్లో ఇవే పేర్లు, సమాచారంతో సెక్స్ అనే దగ్గర మహిళకు బదులు పురుషుడిగా పేర్కొంటూ మరో ఓటు నమోదై ఉంది. వివరాలే అవే.. ఓట్లే వేర్వేరు ఐదో కేటగిరీ నకిలీ ఓట్లకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే... కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో 10 నెంబర్ పోలింగ్‌బూత్‌లోని 267 సీరియల్ నెంబర్లోని ఐడీ నెంబర్ ‘ఎక్స్ఎక్స్సీ0461293’తో ‘శివకుమారి వేమూరి, భర్త శ్రీహర్షవర్థన్ వేమూరి, ఇంటి నెం.1–110, వయసు 30, సెక్స్ మహిళ’ అనే సమాచారంతో ఓటు నమోదై ఉంది. ఇదే నియోజకవర్గంలోని 11వ నెంబర్ పోలింగ్‌బూత్‌లోని 624వ సీరియల్ నెంబర్లో ఇదే సమాచారంతో ‘ఎక్స్ఎక్స్సీఓ192641’ ఐడీ నెంబర్‌తో మరో ఓటును నమోదు చేశారు. పేరులోని పదాలను అటుఇటుగా మార్చేశారు ఆరో కేటగిరీలో ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకకు మార్చేసి 2,60,634 ఓట్లు నమోదు చేసినట్లు ‘వాస్ట్’ గుర్తించింది. ఉదాహరణకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం 253వ పోలింగ్‌బూత్‌లోని 553 సీరియల్ నెంబర్లో ‘కోటేశ్వరమ్మ అవుల, భర్త ఎంకటేశ్వర్లు, ఇంటి నెం.2–31, వయసు 45, సెక్స్ మహిళ’ అనే వివరాలతో ఓటరు ఐడీ నెంబర్ ‘ఎఫ్‌ఎల్‌ఆర్2587012’తో ఓటు నమోదై ఉంది. ఇదే నియోజకవర్గం 55వ పోలింగ్‌బూత్, 545 సీరియల్ నెంబర్లో ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకకు మార్చి ‘ఆవుల కోటేశ్వరమ్మ’గా మార్చి, వయసును 43 ఏళ్లుగా పేర్కొంటూ ఓటర్ ఐడీ నెంబర్ ‘కేబీబీ0940270’తో మరో ఓటును నమోదు చేయించారు. ఒకే వ్యక్తికి వేర్వేరు ఐడీలతో ఓట్లు ఏడో కేటగిరీలో ఒక్కొక్కరి పేరిట రెండేసి ఓట్లు నమోదయ్యాయి. ఓటర్ల పేర్లు, తండ్రి/భర్త పేర్లలో ఎలాంటి మార్పులు లేవు. ఎక్కువగా అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్ననియోజకవర్గాల్లో ఇలాంటి ఓట్లు 25,17,164 ఉన్నాయి. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఒకటో నెంబర్ పోలింగ్‌బూత్‌లోని సీరియల్ నెంబర్14లో ‘రామ ముద్గల, భర్త వెంకట్రావు ముద్గల, ఇంటి నెం.007. తిలక్ అపార్టుమెంట్స్, వయసు 44, సెక్స్ మహిళ’ అనే సమాచారంతో ‘జెడ్జెఓ1516988’ ఐడీ నెంబర్‌తో ఓటు నమోదై ఉంది. ఇదే నియోజకవర్గంలోని 61వ నెంబర్ పోలింగ్‌బూత్‌లోని 442 సీరియల్లో ఇవే పేర్లతో, ఇంటినెంబర్ 31–8–5/1గా పేర్కొంటూ ‘జెడ్జేఓ1512334’ మరో ఓటు నమోదైంది. ఆ ఓటరు వయసు 352 ఏళ్లట! ఎనిమిదో కేటగిరీలోని అక్రమాలను పరిశీలిస్తే ఓటరు వయసును తప్పుగా పేర్కొంటూ ఓటు నమోదు చేశారు. నెల్లూరు నగరంలోని 76వ పోలింగ్‌బూత్, 473 సీరియల్ నెంబర్లో ‘సాయికుమార్ పేరూరి, తండ్రి ఐజాక్ న్యూటన్ పేరూరి, ఇంటి నెం.20–2–881, వయసు 1, సెక్స్ పురుష’ వివరాలతో ఐడీ కార్డు ‘జెడ్‌ఏఎఫ్1714971’తో ఓటు నమోదు చేశారు. ఇక్కడ ఓటరు వయసు ఏడాది మాత్రమే ఉండడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో 208 పోలింగ్‌బూత్‌లోని 153వ సీరియల్ నెంబర్లో ‘దివ్య తాటిపాక, భర్త రవికుమార్ తాటిపాక, ఇంటి నెం.1–206, వయసు 5, సెక్స్ మహిళ’ సమాచారంతో ఐడీ నెంబర్ ‘యూడీఐ1123595’తో ఓటు నమోదై ఉంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని 85వ పోలింగ్‌బూత్‌లోని 342 సీరియల్ నెంబర్లో ‘నర్సింగ్‌రావు ఎర్రంశెట్టి, తండ్రి అప్పన్న ఎర్రంశెట్టి, ఇంటి నెం.1–69/2, వయసు 352, సెక్స్ పురుష’ అనే వివరాలతో ‘ఎఫ్‌జెఎక్స్0992941’ ఐడీ నెంబర్‌తో ఒక ఓటు నమోదైంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం 107 పోలింగ్‌బూత్‌లోని 386 సీరియల్ నెంబర్లోని ఓటర్ వయసును ఏకంగా 248 ఏళ్లు. ‘సుదర్శన పుల్లగుర్ర, భర్త శ్యామ్, ఇంటి నెం.8–110, వయసు 248, సెక్స్ మహిళ’ అనే వివరాలతో ఐడీ కార్డు‘ఎస్జీఈ0247270’తో ఓటు నమోదైంది. ఇంటి నెంబర్ల మార్పుతో ఒక్కరికే వేర్వేరు ఓట్లు తొమ్మిదో కేటగిరీలో ఇంటి నెంబర్ లేకుండానే 3,95,877 ఓట్లు నమోదు చేశారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం 81వ పోలింగ్‌బూత్‌లోని ఒకటో సీరియల్ నెంబర్లో ‘టీక్యూక్యూ0809160’ ఐడీ నెంబర్‌తో గంగా భవానీ, భర్త భూలోక మధుమతి అనే పేరుతో ఇంటినెంబర్ లేకుండానే ఓటు నమోదు చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ‘ఎస్ఏఏ0761990’ ఐడీ నెంబర్‌తో నమోదైన ఓటరు సమాచారంలో ఇంటి నెంబరును ‘నన్’గా పెట్టి వదిలేశారు. విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గంలోని ‘ఎక్స్బీఓ1319673’ నెంబర్ ఓటరు సమాచారంలో ఇంటి నెంబర్‌ను సేమ్ అని పేర్కొన్నారు. ఇక ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ‘ఐయూడబ్ల్యూ0647810’ నెంబర్‌తో నమోదైన ఓటరు సమాచారంలో ఇంటి నెంబర్‌ను ఓల్డ్ అని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు పదో కేటగిరీలో.. చాలామంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు చోట్లా ఓటర్లుగా నమోదయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని 6వ నెంబర్ పోలింగ్‌బూత్‌లోని 164వ సీరియల్ నెంబర్లో ‘ఎస్జీఏ0592551’ ఐడీ నెంబర్‌తో మౌనిక తమ్మన తల్లి ఎన్వీఎస్కే పద్మజ అనే మహిళ పేరుతో ఓటు నమోదై ఉంది. ఇదే పేరుతో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని 112వ పోలింగ్‌బూత్‌లోని 407 సీరియల్ నెంబర్లో ‘ఎస్జీఏ0592551’ ఐడీ నెంబర్‌తో మరో ఓటు ఉంది. తుని నియోజకవర్గంలో పోలింగ్‌బూత్ నెంబర్ 152, సీరియల్ నెంబర్ 26లో ‘యూడీఐ1300144’ ఐడీనెంబర్‌తో నాగభూషణరావు దిడ్డి, తండ్రి లక్ష్మీనరసింగరావు పేరుతో ఒక ఓటు ఉండగా, ఇదే పేరుతో తెలంగాణలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 564 పోలింగ్‌బూత్, 217 సీరియల్ నెంబర్లో ‘ఎస్‌డబ్ల్యూడీ0424507’ ఐడీ నెంబర్‌తో మరో ఓటు ఉంది. -
అధికార పార్టీలో దొంగ ఓట్ల జాతర
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రానున్న ఎన్నికల్లో అధికారమే పరమావధిగా టీడీపీ నాయకులు బరితెగించారు. ఓటర్ల జాబితా తమకు అనుకూలంగా ఉండేందుకు దొంగ ఓట్ల నమోదుకు పూనుకున్నారు. దొంగ ఓట్ల నమోదును అడ్డుకోవాల్సిన అధికారులు కూడా టీడీపీ నేతలకు వంతపాడుతున్నారు. దీంతో జిల్లాలో అక్రమ ఓట్ల నమోదు వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు దొంగ ఓట్ల నమోదును జాతరలా చేపట్టారు. అక్రమ ఓట్ల నమోదును ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా అధికారుల సహకారంతో వ్యవహారాన్ని చాపకిందనీరులా చక్కబెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు చెందిన ఓట్లే కాకుండా పక్క జిల్లాలకు చెందిన ఓట్లను నమోదు చేస్తున్నారు. పాత, కొత్త డోర్ నంబర్లు చూపి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉండేలా చూస్తున్నారు. కొందరు ఆధార్ కార్డును చూపితే, మరికొందరు కరెంట్ బిల్లు, ఇంటి పన్నును చూపి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఓటర్ల జాబితా నమోదు గడువు సమీపిస్తుండడంతో అధికార పార్టీ నేతలు అక్రమ ఓట్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేశారు. జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో అక్రమ ఓట్లు నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో డబుల్ ఎంట్రీలతోపాటు పక్కల నియోజకవర్గాలు, పక్క జిల్లాల ఓట్లు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. ఇవి దొంగ ఓట్లు కాదా? ఒంగోలుకు చెందిన మాల్యాద్రికి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 131, 60వ పోలింగ్ బూత్‌ల్లో ఓటు నమోదైంది. ఐడీ నంబర్లు వేర్వేరుగా ఇచ్చారు. జ్యతి అనే యువతికి సైతం 131, 109 పోలింగ్ బూత్‌ల్లో రెండు ఓట్లు కల్పించారు. రాజేశ్వరి అనే యువతికి 131, 132 పోలింగ్ బూత్‌ల్లో రెండు ఓట్లు ఇచ్చారు. నూర్జహాన్‌కు 131, 183 పోలింగ్ బూత్‌ల్లో, స్వర్ణ అనే మహిళకు 131, 132 పోలింగ్ స్టేషన్లలో, మీరాబీకి 131, 78 పోలింగ్ బూత్‌ల్లో ఓట్లు నమోదయ్యాయి. మస్తాన్‌వళి అనే వ్యక్తికి 133, 102, 69, 120 పోలింగ్ బూత్‌ల్లో ఏకంగా నాలుగు ఓట్లు నమోదు చేశారు. అస్మా అనే మహిళకు 133, 51, 53 బూత్‌ల్లో మూడు ఓట్లు, ఒంగోలుకు చెందిన దుర్గాభవానికి 133, 5వ నంబర్ బూత్‌ల్లో ఓట్లున్నాయి. సాయి అనూష(24) అనే యువతికి ఒంగోలులోని బూత్ నంబర్ 140లో, అద్దంకి నియోజకవర్గం పోలింగ్ బూత్ నం.156లోనూ ఓటు నమోదైంది. సాయితేజ అనే యుతికి ఒంగోలులో 140 పోలింగ్ బూత్‌లో, నార్త్ అద్దంకిలోని 156 పోలింగ్ బూత్‌లో రెండు చోట్ల ఓటు నమోదైంది. ఒంగోలు 140 బూత్‌లో నమోదై ఉన్న జాకీర్ హుస్సేన్‌కు గుంటూరు జిల్లా మాచర్ల పోలింగ్ బూత్ నం.4లోనూ ఓటుంది. ఒంగోలుకు చెందిన అప్పారావుకు ఇక్కడి 140వ పోలింగ్ బూత్‌తోపాటు కృష్ణా జిల్లా గుడివాడ 42వ పోలింగ్ బూత్ పరిధిలో ఓటు నమోదు చేశారు. ఒంగోలు మున్సిపాలిటీకి చెందిన ఆదిలక్ష్మికి ఒంగోలుతోపాటు కొండపి నియోజకవర్గం పోలింగ్ బూత్ నం.260లోనూ ఓటు నమోదైంది. ఒంగోలు మున్సిపాలిటీ 138 పోలింగ్ బూత్ పరిధిలోని ఖాజాషేక్కు కర్నూలు జిల్లా కొడుమూరులో 94వ పోలింగ్ బూత్ పరిధిలోనూ ఓటు హక్కు కల్పించారు. వీరాంజనేయులు అనే వ్యక్తికి ఒంగోలుతోపాటు వైఎస్ఆర్ జిల్లా జమ్మల మడుగు పోలింగ్ బూత్ 299లో ఓటు నమోదైంది. షేక్ ఖాసింబీ అనేమ మహిళకు ఒంగోలుతోపాటు గుంటూరు వెస్ట్ 3వ పోలింగ్ బూత్‌లో ఓటు కల్పించారు. ఒంగోలుకు చెందిన సోమేశ్వరరావుకు ఒంగోలుతో పాటు గుంటూరు జిల్లా రేపల్లె 95వ పోలింగ్ బూత్‌లో ఓట్లు నమోదై ఉన్నాయి. ఒంగోలుకు చెందిన లక్ష్మీనరసింహకు ఒంగోలు 132వ పోలింగ్ బూత్‌తోపాటు కర్నూలు జిల్లా శ్రీశైలం 89వ పోలింగ్ బూత్ పరిధిలో ఓట్లు నమోదై ఉన్నాయి. ఇదే విధంగా భాస్కర్‌రావు అనే వ్యక్తికి సైతం పైన తెలిపిన రెండు చోట్ల ఓట్లు నమోదై ఉన్నాయి. ఒంగోలు 132వ పోలింగ్ బూత్ పరిధిలోని మల్లేశ్వరరావుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి 123వ పోలింగ్ బూత్‌లో ఓట్లు నమోదై ఉన్నాయి. ఒంగోలు మున్సిపాలిటీలో 131వ పోలింగ్ బూత్‌లో ఓటున్న ముసలయ్యకు మార్కాపురం నియోజకవర్గం 252వ పోలింగ్ బూత్లోనూ ఓటు నమోదై ఉంది. ఒంగోలు మున్సిపాలిటీలో ఓటు ఉన్న నాగార్జునకు కనిగిరిలోని 213 పోలింగ్ బూత్ పరిధిలోనూ ఓటుంది. అధికారుల ‘డబుల్’ గేమ్! జిల్లాకు చెందిన వ్యక్తులకు పక్క జిల్లాల్లో ఓటు హక్కు ఎలా కల్పించారో అధికారులే సెలవివ్వాలి. జిల్లాలోనే ఒక నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి మరో నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించడం వెనుక మతలబు ఏమిటి? అనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం కరువైంది. ఒక వ్యక్తికి రెండు, మూడు, నాలుగేసి ఓట్ల చొప్పున నమోదు చేయడంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నలు సంధిస్తుంటే అధికారులు నీళ్లు నములుతున్నారే కానీ ఓట్లు తొలగించేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే వేల సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేశారు. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఇతర జిల్లాలు, ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు నమోదై ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దొంగ ఓట్ల సంఖ్య లక్షకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితాలో బయటపడుతున్న అక్రమాలు, తప్పుడు ఓట్లను చూస్తుంటే అధికారులు ఈ–వెరిఫికేషన్‌ను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కేవలం అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లొంగి కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు టీడీపీ నేతలకు అనుకూలంగా ఓట్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాలో ఉన్న అక్రమ ఓట్లు, డబుల్ ఓట్ల వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్డీఓ మొదలుకుని, జేసీ, కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల అధికారికి అందించి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలుమార్లు కోరారు. అధికారులు మాత్రం అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా చోద్యం చూస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని వైఎస్సార్ సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఆగని అక్రమాల దందా ► ఒంగోలు తహశీల్దారు కార్యాలయంలో దొంగ ఓట్లు నమోదు ► టీడీపీ నేతలు ఇచ్చిన దరఖాస్తులు మాత్రమే ఆన్లైన్ ► అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నేత శింగరాజు వెంకట్రావు ► సక్రమ దరఖాస్తులంటూ బొంకిన తహసీల్దార్ బ్రహ్మయ్య ► దరఖాస్తుదారులకు రశీదులివ్వకపోవడంపై నిలదీత సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నియోజకవర్గంలో అక్రమ ఓట్ల నమోదు యథేచ్ఛగా సాగుతోంది. అధికార పార్టీ నేతలు బల్క్‌గా ఇచ్చిన దరఖాస్తులను అధికారులు ఆన్లైన్ చేస్తున్నారు. శనివారం సెకండ్ సాటర్డే అయినా తహశీల్దార్ బ్రహ్మయ్య మాత్రం తన కార్యాయానికి వచ్చి మరీ ఓటర్ల దరఖాస్తులను ఆన్లైన్ చేయించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు తన అనుచరులతో వెళ్లి తహశీల్దారు బ్రహ్మయ్యతో పాటు సిబ్బందిని నిలదీశారు. బల్క్‌గా వచ్చిన దరఖాస్తులు అధికార పార్టీ నేతలు ఇచ్చినవే కదా అని ప్రశ్నించారు. ఓటర్లు ఇచ్చిన దరఖాస్తులైతే పూర్తి స్థాయిలో ఫిలప్ చేసి ఉంటాయని, పైపెచ్చు దరఖాస్తుదారుడికి రశీదు ఇస్తారని, ఈ దరఖాస్తులు అలా లేవేంటని తహశీల్దార్‌ను అడిగారు. తాము సక్రమమైన దరఖాస్తులను ఆనలైన్ చేస్తున్నామని, దరఖాస్తుదారులు రశీదు తీసుకోలేదంటూ తహశీల్దార్ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. దీంతో శింగరాజుకు తహశీల్దార్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అక్రమ ఓట్లు నమోదు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని వెంకట్రావు తహశీల్దారును హెచ్చరించారు. ‘నాతో గొడవపడాల్సిన పని లేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోండి’ అంటూ తహశీల్దారు దొంగ ఓట్ల నమోదును కొనసాగించారు. అక్రమ ఓట్ల నమోదుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సైతం శింగరాజు ఫిర్యాదు చేశారు. అధికారులు అధికార పార్టీకి తొతుల్తుగా వ్యవహరిస్తూ అక్రమ ఓట్లు నమోదు చేస్తున్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
ఇక రెండేసి రాష్ట్రాల్లో ఓటు కుదరదు
సాక్షి, అమరావతి: ఇక నుంచి రెండేసి రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉండదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా స్పష్టం చేశారు. ఇటీవల పుణేలో, న్యూఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశాలను నిర్వహించిందని ఆయన సోమవారం సచివాలయంలో ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పరిధిలోనే రెండు లేదా మూడు చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.15 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని, వాటిని కూడా తొలగిస్తున్నామని వెల్లడించారు. పుణేలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రాష్ట్రాల ఓటర్లను అనుసంధానం చేసే ఈఆర్వో నెట్‌ను రూపొందించిందని, దీని ద్వారా ఒక రాష్ట్రంలో ఓటు ఉంటే మరో రాష్ట్రంలో ఓటు లేకుండా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా రెండేసి రాష్ట్రాల్లో ఉన్న ఓట్ల తొలగింపు ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వివరించారు. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లిన ఓటర్లకు ఆంధ్రప్రదేశ్‌లోనే ఓటు హక్కు ఉంటుందని, తెలంగాణలో ఉండదని, అలాగే హైదరాబాద్‌లో ఉన్నవారికి తెలంగాణలోనే ఓటు హక్కు ఉంటుందని, వారికి ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు ఉండదని స్పష్టం చేశారు. ఏదో ఒక రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు ఉండేలా కమిషన్ చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాజకీయ కారణాలతో ఓట్లు తీసేస్తున్నారనే ఆరోపణలపై ఆయన స్పందిస్తూ ఎస్ఎంఎస్ ద్వారా ఓటు హక్కు ఉందో, లేదో తెలుసుకునే వెసులుబాటు కల్పించామని, ఓటు హక్కు లేకపోతే ఓటర్‌గా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక నమోదు కొనసాగుతోందని, ఓటర్‌గా నమోదు చేసుకునేందుకు గడువును నవంబర్ 20 వరకు పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపు ఉండదని, ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.49 కోట్ల ఓటర్లున్నారని వెల్లడించారు. ఇప్పుడు సాగుతున్న ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం ద్వారా వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీయువకులకు ఓటు హక్కు కల్పిస్తామన్నారు. -
ఓటమి భయం.. నంద్యాలలో బోగస్ ఓట్ల కలకలం!
- భారీగా బోగస్ ఓట్ల సృష్టికి టీడీపీ యత్నం - కుట్రను పసిగట్టి, ఈసీకి ఫిర్యాదుచేసిన వైఎస్సార్సీపీ - ఎలక్టోరల్ అధికారికి ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ఖాయం కావడంతో అధికార తెలుగుదేశం పార్టీ భారీ అక్రమాలకు తెరలేపింది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 10 వేల పై చిలుకు బోగస్ ఓట్లను సృష్టించే యత్నచేసింది. ఒకే ఐపీ అడ్రస్ నుంచి వేల సంఖ్యలో అప్లికేషన్లు వైనాన్ని ఎన్నికల కమిషన్ సైతం గర్హించింది. టీడీపీ కుట్రయత్నాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎలక్టోరల్ అధికారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం ఒక లేఖరాశారు. బోగస్ ఓట్ల సృష్టికి సంబంధించిన వివరాలను సైతం లేఖకు జతచేశారు. ఇదే అంశంపై వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్‌కు ఫిర్యాదుచేసిన విషయాన్ని సైతం విజసాయిరెడ్డి గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల కమిషన్.. విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది నంద్యాల పట్టణంలోని ఇంటర్నెట్ సెంటర్లో తనిఖీలు చేశారు. అధికార పార్టీ కుటిల ప్రయత్నానికి కొందరు అధికారులు కూడా సహకరించినట్లు, అలాంటివారిపై ఈసీ కన్నేసినట్లు సమాచారం. ఒక్క జులై లోనే 11,500 అప్లికేషన్లు! 18 ఏళ్లు నిండి, దరఖాస్తు చేసుకునే పౌరులందరికీ ఎన్నికల సంఘం ఓటు హక్కుకల్పించడం సర్వసాధారణం. ఆయా నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నదే. అయితే నంద్యాల నియోజకవర్గం విషయానికి వచ్చే సరికి లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఈ ఏడాది జనవరిలో నంద్యాల నియోజకవర్గం నుంచి 1004 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరిలో 525 మంది, మార్చిలో 610 మంది, ఏప్రిల్‌లో 694 మంది, మేలో 1038 మంది, జూన్‌లో 735 మంది కొత్తగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. కాగా, జులైలో(1 నుంచి 28వ తేదీ వరకు) మాత్రం ఏకంగా 11,502 దరఖాస్తులు రావడం గమనార్హం. ఒకే ఐపీ నుంచి 4.5వేలా? నంద్యాలలో పట్టణంలోని ఓ ఇంటర్నెట్ సెంటర్ ద్వారా, ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఏకంగా 4.5వేల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నెట్ సెంటర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. బోగస్ ఓటర్లను చేర్పించే ప్రక్రియ మొత్తం టీడీపీ ఆధ్వర్యంలోనే జరిగినట్లు వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరింది. -
బీజేపీ నకిలీ ఓట్ల నాటకం
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ ఓటర్లను జాబితాలోకి చేర్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అర వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నకిలీ ఓటర్ల నాటకానికి ఆ పార్టీ తెర తీసిందన్నారు. నకిలీ ఓటర్లను చేర్చి ఆప్ ఓటర్లను తొలగించేలా చూడాలంటూ ఆ పార్టీ అగ్ర నేత ఒకరు అదే పార్టీకి చెందిన శాసనభ్యులను ఆదేశించారని ఆరోపించారు. ఓటర్ల పేర్ల తొలగింపు బీజేపీ డబ్బులు ఎరచూపుతోందన్నారు. ఈ విషయమై సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన శనివారం ఉదయం ట్వీట్ చేశారు. ‘ప్రతి నియోజకవర్గంలో కనీసం 5,000 మంది నకిలీ ఓటర్లను సృష్టించి , ఆప్ ఓటర్లను తొలగించాలంటూ బీజేపీ అగ్ర నాయకుడొకరు నగరంలోని శాసన సభ్యులందరినీ ఆదేశించారు. ఓటరు జాబితాలో చేర్చే ప్రతి కొత్త నకిలీ ఓటుకు రూ.1,500, తొలగించే ఆప్ ఓటుకు రూ.200 లంచంగా ఇవ్వచూపుతున్నారు. బీజేపీకి చెందిన ఓ వ్యక్తి ఒకరు నాకు ఈ విషయం చెప్పారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల కమిషన్‌ను అధికారులను కలసి లాంఛనంగా ఫిర్యాదు చేస్తాం’ అని కేజ్రీవాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. బీజేపీ నకిలీ ఓట్ల కార్యక్రమం దిగ్భ్రమ కలిగిస్తోందని, నకిలీ ఓట్లను సృష్టించడం, ఓట్ల తొలగింపునకు సంబంధించి సమాచారం ఏదైనా ఉంటే తమకు తెలియజేయాలని, తాము దానిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31ృనుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, ఎల్జేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యవృుంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విది తమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
ఓటర్లను మింగుతున్న జాబితాలు
దొంగ ఓట్లను అరికట్టి, స్వేచ్ఛగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి ఓటర్ల జాబితాలు అత్యంత ఆవశ్యకం. కానీ ఈ ఎన్నికలలో ఓటర్ల జాబితాల విషయంలోనే ఎన్నికల సంఘం ఘాటు విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది. ‘ఓటు పౌరులందరి హక్కు’ అంటూ ఎన్నికల సంఘం ఇచ్చిన ప్రకటనలలో హాస్యనటుడు బ్రహ్మానందం కనిపిం చారు. కానీ ఆయనే ఆ హక్కును వినియోగించుకోలేకపోయారు. కారణం- ఓటర్ల జాబితాలో పేరు గల్లంతయింది. అది ఆ హాస్యనటుడి విషయంలో జరిగిన విషాదం మాత్రమే కాదు, దేశం నిండా అలాంటి ఫిర్యాదులే. ఈ ఎన్నికలు అనేక కోణాల నుంచి కొత్త చరిత్రను లిఖిం చాయి. రికార్డు స్థాయిలో 66.38 శాతం ఓటర్లు తమ హక్కు ను వినియోగించుకున్నారు. ఇందిర హత్య తరువాత 1984 - 85 నాటి ఎన్నికలలో పోలైన 64.01 శాతమే ఇంతవరకు పెద్ద రికార్డు. ఆ రికార్డు బద్దలయింది. తొమ్మిది దశలలో, రెండు మాసాల పాటు ఎన్నికల తతంగం కొనసాగడం మీద కొన్ని విమర్శలు వచ్చినా, ఇంత సమర్ధంగా ఎన్నికలు జరగ డం బహుశా ఇదే ప్రథమం. ఎన్నికల వ్యయంతో పాటు, సో షల్ మీడియా పాత్ర కూడా విస్తరించింది. రాజకీయ పార్టీలు 200 మిలియన్ ఓటర్లను ఆ మీడియా ద్వారానే పలకరించా యి. వీటితో పాటు, జాబితాల నుంచి ఓటర్ల పేర్లు గల్లంతు కావడంలోనూ ఈ ఎన్నికలు రికార్డు సృష్టించాయి. ప్రస్తుతం 700 మిలియన్ ఓటర్లతో నిజంగానే భారత్ పెద్ద ప్రజాస్వామిక దేశంగా గౌరవం పొందుతోంది. ఎన్నికల ప్రాధాన్యాన్ని గమనించిన రాజ్యాంగ నిర్మాతలు జనవరి 25వ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ మొత్తానికి కేంద్ర బిందువు ఓటర్ల జాబి తాల రూపకల్పన. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియను మరిం త బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టినదే- ఎలక్టోరల్ ఫో టో ఐడెంటిటీ కార్డ్ (ఎపిక్). దొంగ ఓట్లను అరికట్టి, స్వేచ్ఛ గా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి పటిష్ట ఓటర్ల జాబితాలు అత్యంత ఆవశ్యకం. కానీ ఈ ఎన్నికలలో ఓటర్ల జాబితాల విషయంలోనే ఎన్నికల సంఘం ఘాటు విమర్శలను ఎదుర్కొనవలసి వచ్చింది. ముంబై, పుణే నగరాలలోనే ఐదు లక్షల పేర్లు గల్లంతు కావడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ఐదు ప్రజాప్రయోజన వ్యా జ్యాలు దాఖలైనాయంటేనే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ సయితం ఈ గల్లంతు గారడీని చూసి విస్తుపోయారు. క్షమాపణలు చెప్పారు. ఎన్నికల జాబితాల నుంచి ఎలాంటి వ్యక్తుల పేర్లు మా యమైనాయో గమనించి దేశం కూడా విస్తుపోయింది. అన్నా బృందం సభ్యుడు, ఓటు హక్కు ప్రాధాన్యాన్ని విశేషంగా ప్రచారం చేసినవాడు అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఓటు హక్కు వినియోగించుకోకుండా గోవాలో ప్రచారానికి వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. అయితే ఘాజియాబాద్ (ఉత్తరప్రదేశ్)లోని ఇందిరాపురం ప్రాంతంలో ఓటు వేయడానికి వె ళ్లిన కేజ్రీవాల్ పేరు జాబితాలో గల్లంతయిన సంగతి తెలిసే గోవా వె ళ్లారు. చాలామందికి ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నా, జాబితాలలో పేర్లు లేవు. ముంబైలో ప్రఖ్యాత న్యా యవాది రామ్ జఠ్మలానీ, బీఎస్యీ చైర్మన్ ఆశిష్ కుమార్ చౌహాన్, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్, సినీ ప్రముఖుడు అమోల్ పాలేకర్ దంపతుల పేర్లు హుష్ కాకి అయ్యాయి. ముంబై, పుణే, నాగపూర్లది ఒకే రకం అనుభవం. దీని మీదే మహారాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, జాబితాలను తక్షణమే సరిచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు ఎందుకు తొలగిస్తారో అం తు పట్టని రీతిలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లున్న అదృష్టవంతులు వెంటనే జరిగే సాధారణ ఎన్నికలలో ఓటు వేయలేక నిరాశ పడవచ్చు. ఒడిశాలో ఇదే జరిగింది. అలాగే కొద్దికాలం క్రితమే జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేసిన వారు లోక్‌సభ ఎన్నికలలో ఆ అదృష్టానికి నోచుకోలేకపోయారు. ఢిల్లీ పరిధిలో 13.58 లక్షల ఓటర్ల పేర్లు జాబితాల నుంచి తొలగించారని 23-8-‘13న అప్పటి న్యా యశాఖ మంత్రి కపిల్ సిబల్ రాజ్యసభలో ప్రకటించారు. ఇది ఎవరినైనా విస్తుపోయేటట్టు చేయగలదు. అన్ని ఓట్లు తొలగించడానికి ఎవరైనా ఏ కారణం చూడగలరు, తీవ్ర నిర్లక్ష్యాన్ని తప్ప. 1989లో కాశ్మీర్ నుంచి వచ్చిన పండిట్ల ఓట్లు లక్ష వరకు ఉండేవి. ఇప్పుడు పదిహేను వేలకు చేరాయి. అసలు స్థానిక, అసెంబ్లీ, లోక్‌సభ - ఏ ఎన్నికలకైనా ఓటర్లు వారే. మాయంతా జాబితాల తయారీ దగ్గరే. రాజకీయ పక్షాల, ముఖ్యంగా స్థానిక నేతల కుట్ర ఇందులో కొట్టిపారేయ లేనిదే. ఓటర్ల జాబితాల తయారీలో దోషాల రేటు సగటున నలభై శాతమని కర్ణాటకలో రెండు నియోజకవర్గాలలో సర్వే చేసిన ఒక స్వచ్ఛంద సంస్థ తేల్చింది. ఎలాంటి తనిఖీ లేకుండానే పేర్లు తొలగింపు యథేచ్ఛగా జరిగిపోతోందని అనిపిస్తుంది. దీని మీద కొత్త పార్లమెంట్ పటిష్టమైన చట్టం చేసి, సరిచేయడం అవసరం. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
ఫ్యాన్‌కు ఓటేశాడని వృద్ధుడి హత్య
* వైఎస్సార్ సీపీ దెందులూరు అభ్యర్థిపై దాడి * అచ్చెన్నాయుడి ప్రోత్సాహంతో యువకుడిని కొట్టిన టీడీపీ కార్యకర్తలు సాక్షి నెట్వర్క్: ఎన్నికల సందర్భంగా బుధవారం పలుచోట్ల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. పలు చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. దొంగ ఓట్లు వే యటానికి ప్రయత్నించిన వారిని నిలదీసి నందుకు చితక్కొట్టారు. ఫ్యాన్‌కు ఓటేశానన్న వృద్ధుడి మీద దాడిచేయటంతో అతడు అక్క డికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దాడులు, దౌర్జన్యాలకు తోడు టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలింగ్ సమయంలోనూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం రాయన్నపాలెంలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకటనాగేశ్వరరావుపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కారుమూరి గన్‌మన్‌కు తీవ్రగాయాలయ్యాయి. కామవరపుకోట మండలం తడికలపూడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఏలూరు పార్లమెంటరీ టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. గణపవరం మండలం అర్ధవరంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు కొట్టారు. పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనటంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. పాలకొల్లు మండలం అరట్లకట్టలో టీడీపీ వారు ఓటర్లకు గిఫ్ట్‌కూపన్లు పంపిణీ చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి పోలింగ్ బూత్ వద్దే ప్రచారం నిర్వహించారు. పెరవలి మం డలం తీపర్రులో టీడీపీ నాయకులు నకిలీ నోట్లు పంచటంతో ఓటర్లు ఆందోళన చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరం మండలం ఇనగంటివారిపేటలో ఓటేసి వస్తున్న మెర్ల దశయ్య (70)ను టీడీపీ నాయకుడుమొగతడకల వెంకటమోహన్ ‘ఎవరికి ఓటేశావు’ అని అడిగాడు. ‘ఫ్యాన్‌కు వేశా’నని చెప్పడంతోనే వెంకటమోహన్ దుర్భాషలాడుతూ గుండెలపై మోదడంతో దశయ్య కుప్పకూలి మృతి చెందాడు. రామచంద్రాపురం మండలం నరసాపురపేట, కె.గంగవరం మండలం ఉడుమూడి, సుందరపల్లిల్లో దొంగ ఓట్లు వేస్తున్న తమ కార్యకర్తలను అడ్డుకుంటున్నారనే ఆగ్రహంతో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ నాయకులపై దాడులకు దిగారు. సుందరపల్లికి చెందిన టీవీవీ సత్యనారాయణ, ఉడుమూడికి చెందిన సాదే వెంగళరావు, సాదే భద్రరావులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదే కారణంతో రామచంద్రపురంలో వైఎస్సార్ సీపీ నాయకుడు కొండేపూడి సురేష్‌పై టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సోదరుడి కుమారుడు తోట బాబు, అతడి అనుచరులు దాడిచేసి తల పగులగొట్టారు. కోటనందూరు మండలం అగ్రహారంలో క్యూలైన్లో నిల్చుంటే ప్రచారం చేస్తున్నాడంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్త రమణపై టీడీపీకి చెందిన బర్ల రాజు, యలమంచలి రమణ, మిరియాల మంగ దాడిచేసి గాయపరిచారు. వేట్లపాలెంలో ఓటేసి బయటకొచ్చి ‘ఫ్యాన్’ జోరుగా తిరుగుతోందన్న ఎస్సీ వర్గీయులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఎస్సీలు ప్రతిదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. జ్యోతులపై దాడికి యత్నం గండేపల్లి మండలం సింగరంపాలెంలో చనిపోయిన, పొరుగూరిలో ఉన్న వారి ఓట్లను కూడా టీడీపీ నాయకులు వేయిస్తుండడం గమనించిన వైఎస్సార్ సీపీ ఏజెంట్ అడ్డుకోవడంతో బలవంతంగా బయటకు పంపించేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జగ్గంపేట అసెంబ్లీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పోలింగ్ బూత్‌కు చేరుకుని అధికారులను నిలదీశారు. ఇంతలో అక్కడకు వచ్చిన టీడీపీ నేతలు నెహ్రూను దూషిస్తూ దాడి చేయబోయారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదంలో నెహ్రూ అనుచరుడు భూపాలపట్నం ప్రసాద్‌ను కిర్లంపూడి పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. కాకినాడలో సిటీ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రోద్బలంతో ఏటిమొగకు చెందిన మత్స్యకారులు పెద్దసంఖ్యలో తమ ఓట్లు గల్లంతయ్యాయనే నెపంతో పోలింగ్ సిబ్బందిని రెండుగంటల పాటు నిర్బంధించారు. సాంబమూర్తినగర్‌లో వైఎస్సార్ సీపీ నేత, మాజీ కార్పొరేటర్ కొప్పుల విజయకుమారి ఇంట్లోకి కాంగ్రెస్, టీడీపీ నేతలు చొరబడి డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ దౌర్జన్యం చేయటంతో వైఎస్సార్ సీపీ వారు ఆందోళన చేశారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి చంద్రశేఖర రెడ్డి అక్కడికి చేరుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొండంగి మండలం పెరుమాళ్లపురం పోలింగ్‌బూత్‌లో బూత్ లెవెల్ అధికారి.. ఓటర్ స్లిప్‌లు లేని వారికి పోలింగ్ స్టేషన్లోనే స్లిప్‌లు ఇస్తుండగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నావంటూ టీడీపీ వారు ఆయనపై దౌర్జన్యానికి దిగారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తిర్లంగిలో మూడు నెలల కింద మరణించిన తన సోదరుడి ఓటు వేసేందుకు వచ్చిన టీడీపీ వర్గీయుడిని నిలదీసిన ఓ యువకుడిపై ఆ పార్టీ కార్యకర్తలు దాడిచేశారు. మరణించిన బంటాల శివ ఓటు వేసేందు కు అతడి తమ్ముడు యివ్వరాజు పోలింగ్ బూత్‌లోకి రాగా బగాది సురేష్ అనే యువకుడు నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు సురేష్‌పై దాడి చేశారు. సురేష్ అక్కడికి కొద్దిదూరంలో గల బడ్డ బాబూరావు ఇంటికి వెళ్లిపోయాడు. తెలుగు తమ్ముళ్లు సురేష్‌ను బయటకు ఈడ్చుకొచ్చి మళ్లీ కొట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న అచ్చెన్నాయుడు కార్యకర్తలను మరింత ఉసిగొల్పారు. దీంతో వారు.. సురేష్‌ను రక్షించుకునేందుకు వచ్చిన అతడి తల్లిదండ్రులు బగాది మల్లేసు, సుందరమ్మలపైనా దాడిచేశారు. గాయపడిన సురేష్‌ను టెక్కలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్ల దొంగ ఓట్ల దందా
పరిషత్ ఎన్నికల్లో దొంగ ఓట్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు పోలింగ్ కేంద్రాలను తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు వేయిస్తున్నారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెంలో దొంగఓట్లు వేసేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నించగా, వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో కూడా దొంగ ఓట్ల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ కార్యకర్తలు దొంగఓట్లను ప్రోత్సహించడంతో రత్నాబాయి అనే మహిళ వారిని నిలదీసింది. అయితే, ఆమెపై టీడీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోనే దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. మరోవైపు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణా కాలనీలో 400 ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై ఓటర్లు ఆందోళనకు దిగారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లిలో ఓటరు జాబితా తప్పుల తడకగా ఉంది. దీంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. -
దొంగ ఓట్లు వేయించిన టీడీపీ అభ్యర్థి
-
దొంగ ఓట్లు వేయించిన టీడీపీ అభ్యర్థి
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు, ఆగడాలు బయటపడుతున్నాయి. అనంతపురం జడ్పీ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి స్వరూప దొంగ ఓట్లు వేయించారు. ఆమె అలా దొంగ ఓట్లు వేయిస్తుండటంతో ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం కూడా జరిగింది. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా అధికారులు పట్టుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ శాంతినగర్ ప్రాంతంలో డబ్బులు పంచుతున్న నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 90 వేలు స్వాధీనం చేసుకున్నారు. -
కుప్పంలో దొంగఓట్లపై ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు