దొంగ ఓట్లు వేయించిన టీడీపీ అభ్యర్థి
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు, ఆగడాలు బయటపడుతున్నాయి. అనంతపురం జడ్పీ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి స్వరూప దొంగ ఓట్లు వేయించారు. ఆమె అలా దొంగ ఓట్లు వేయిస్తుండటంతో ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం కూడా జరిగింది.
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా అధికారులు పట్టుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ శాంతినగర్ ప్రాంతంలో డబ్బులు పంచుతున్న నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 90 వేలు స్వాధీనం చేసుకున్నారు.