cash distribution
-
రంజాన్ 2023: యెమెన్‌లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం
సనా: యెమెన్ దేశంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానికులకు తలో 7 డాలర్లమేర ఉచిత నగదు పంపిణీ కార్యక్రమం చివరకు ఘోర విషాదంతో ముగిసింది. వందల సంఖ్యలో జనం తరలిరావడం, వారిని అదుపుచేసేందుకు సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు గాల్లోకి కాల్పులు జరపడం, ఆ తూటాలు తగిలి విద్యుత్ తీగల వద్ద పేలిన శబ్దాలతో భయపడిన పేదజనం పరుగెత్తారు. దీంతో హఠాత్తుగా తొక్కిసలాట చోటుచేసుకుంది. యెమెన్ రాజధాని సనా సిటీలోని ఓ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ తొక్కిసలాటలో చిన్నారులు, మహిళలుసహా 78 మంది ప్రాణాలుకోల్పోయారు.73 మంది గాయపడ్డారు. 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు. ఓల్డ్‌సిటీ పరిధిలోని బాబ్ అల్–యెమెన్ ప్రాంతంలోని మయీన్ స్కూల్లో బుధవారం అర్ధరాత్రివేళ ఈ ఘోరం సంభవించింది. నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహణలో విఫలమవడంతో దాతలైన ఇద్దరు స్థానిక వ్యాపారవేత్తలను అరెస్ట్చేశామని హౌతీ రెబల్స్ నేతృత్వంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దారుణ మానవ విపత్తు 2014లో యెమెన్ ఉత్తర ప్రాంతంపై పట్టు కోల్పోయిన హౌతీ తిరుగుబాటుదారులు ఆ తర్వాతి ఏడాదే దేశ రాజధానిని తమ వశంచేసుకుని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. అదే ఏడాది గత ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి ప్రయత్నించినా ఇంతవరకూ సాధ్యపడలేదు. ఆ ఆగ్రహమే పలు మలుపులు తిరిగి నాటి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య శత్రుత్వాన్ని కొనసాగింది. ఇన్నాళ్లలో అక్కడి ఘర్షణల్లో 1,50,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో పౌరులు, సైనికులను పొట్టనబెట్టుకున్న ఈ సంఘర్షణ ప్రపంచంలోనే అత్యంత దారుణ మానవసంక్షోభాల్లో ఒకటిగా నిలిచింది. 2.1 కోట్ల దేశజనాభాలో మూడింట రెండొంతుల మంది పేదలు అంతర్జాతీయ సాయంకోసం అర్రులుచాస్తున్నారు. -
మునుగోడులో జోరుగా డబ్బు పంపిణీ
-
టీడీపీ నేతల బరితెగింపు
పెనుకొండ(అనంతపురం జిల్లా): టీడీపీ నాయకులు బరి తెగించారు. ఎన్నికల్లో ప్రజా మద్దతు లేకపోవడంతో అడ్డదారుల్లో వెళుతున్నారు. పెనుకొండ నగర పంచాయతీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో వారి ఆగడాలు శ్రుతిమించాయి. ఓటర్లను భారీఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలు ఎర వేస్తున్నారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఈరన్న, కందికుంట వెంకటప్రసాద్, ఉన్నం హనుమంతరాయ చౌదరితో పాటు టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్ తదితరులు మూడు వారాలుగా పెనుకొండలోనే మకాం వేశారు. ఒక్కొక్కరు ఒక్కో వార్డు బాధ్యతలు తీసుకుని, ఆ పరిధిలోని ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కర్ణాటక నుంచి భారీ ఎత్తున మద్యం తెప్పించి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేశారు. అక్కడి నుంచి ఓటర్లకు పంచి పెడుతున్నారు. ఇదివరకే ఒకటో వార్డులో స్వయాన బీటీ నాయుడు వాహనంలోనే మద్యం దొరకడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా జంకకుండా టీడీపీ నేతలు ప్రలోభపర్వం సాగిస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్న వార్డుల్లో ఏకంగా ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా పంచినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రచారం చివరిరోజైన శనివారం రోడ్‌షోలకు ఎస్పీ ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. దీంతో వైఎస్సార్సీపీ తరఫున మంత్రి శంకరనారాయణ, ఎంపీ గోరంట్ల మాధవ్ రోడ్‌షో నిర్ణయాన్ని ఉపసంహరించుకుని..ప్రచారానికే పరిమితమయ్యారు. టీడీపీ నేతలు మాత్రం పోలీసుల ఆంక్షలను యథేచ్ఛగా ఉల్లంఘించారు. వంద వాహనాలతో పట్టణంలో హల్చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు సార్వత్రిక ఎన్నికలకు మించి చేస్తున్న హడావుడి, ఆగడాలపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
టీడీపీ ప్రచారానికి జనం కరువు
సాక్షి, నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు విజయం చేకూర్చాలంటూ సభలు, సమావేశాలు, ర్యాలీలతో ప్రచారం ఉధృతం చేశారు. ఇప్పటికే ఒక్క అధికార వైఎస్సార్సీపీ అగ్రనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి మినహా మిగిలిన పార్టీల రాష్ట్ర, కేంద్ర స్థాయి అగ్రనేతలు ప్రచారం మమ్మురంగా చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు సాధ్యం కానీ హామీలతో జనాన్ని మాయ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ సభలను విజయవంతం చేసేందుకు స్థానిక నాయకత్వం అష్టకష్టాలు పడుతోంది. ఓ వైపు మమ్మురంగా వరి కోతలు, వ్యవసాయ పనులు, ఉపాధి హమీ పనులు జరుగుతున్నాయి. దీంతో పాటు మండుటెండలు కాస్తున్నాయి. దీంతో పాటు ప్రధానంగా కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభన చేస్తోంది. ఇన్ని రకాల కారణాల రాజకీయ సభలు, సమావేశాలకు జనం సమీకరించడం నియోజకవర్గ నేతలకు కష్టంగా మారుతోంది. జనాన్ని తోలినా.. నిలవని వైనం ఉప ఎన్నికల్లో జన సమీకరణ కోసం టీడీపీ నేతలు కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ ప్రజల్లో పరపతి కోల్పోయింది. పారీ్టకి జనాధారణ కరువైంది. ఆ పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్‌తో పాటు పలువురు మాజీ మంత్రుల పర్యటనలు విజయం చేయాలంటే స్థానిక నాయకత్వానికి చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుంది. టీడీపీ నేతల సభలు, సమావేశాలకు జనం పెద్దగా రావడం లేదు. రోడ్ షోలు వెలవెలపోతున్నాయి. దీంతో ఎలాగైనా జన సమీకరణ చేసి అగ్రనేతల ముందు పరువు నిలబెట్టుకునేందుకు జిల్లా నాయకత్వంతో పాటు నియోజకవర్గ నేతలు కుస్తీ పడుతున్నారు. ఇటీవల చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించడంతో బరిలో నిలిచిన తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి జనాన్ని తీసుకుని రమ్మని నియోజకవర్గ నేతలు స్థానిక నేతలకు చెప్పడంతో ‘మా ఎన్నికలను బహిష్కరించిన చంద్రబాబు గొప్పల కోసం మేమెందుకు ఇంకా జెండాలు మోయాలని, మాకేం ఖర్మ’ అంటూ ముఖం చాటేశారు. రెండు రోజులుగా చంద్రబాబు పర్యటించిన సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో రోడ్‌షో విజయవంతానికి స్థానిక నాయకత్వం అరువు కూలీలను తెచ్చుకోవాల్సి వచ్చింది. అయినా కూడా సభలు ఆశించిన మేర సక్సెస్ కాలేకపోయాయి. చంద్రబాబు సభలకు నియోజకవర్గంలోని స్థానిక నేతలు హాజరు పెద్దగా కనిపించలేదు. జిల్లా నలుమూలల నుంచి అరువు కూలీలను తరలించినట్లు తెలుస్తోంది. ఆ జనం ప్రసంగం పూర్తి కాకుండానే వెనుదిరుగుతున్న వైనం కనిపిస్తోంది. ఆ సభలకు హాజరైన జనానికి డబ్బులు పంచుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కూలీలను తెచ్చిన మేస్త్రీలకు ప్యాకేజీ ఇచ్చారంటా. ఇంతా చేసి చేతి చమురు వదిలించుకున్నా కూడా సభలు సక్సెస్ కాకపోవడంతో ఆ పార్టీ అగ్రనేతలు స్థానిక నాయకత్వంపై గుర్రుమన్నట్లు సమాచారం. చదవండి: హవ్వా.. ఇదేమి విచిత్ర ప్రచారం ‘హోదాపై సమాధానం చెప్పాల్సింది బీజేపీయే’ -
ముంగిట్లో జన్‘ధన్’!
సాక్షి, హైదరాబాద్: జన్ ధన్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు సాయాన్ని వారి చెంతనే పంపిణీ చేసేలా బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా నగదు ఉపసంహరణకు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా గ్రామాల్లో సింగిల్ టేబుల్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో కేంద్రం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని నేరుగా ఖాతాలో జమచేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 2 నుంచి నగదు జమ చేస్తోంది. ఖాతాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో నిర్దేశిత పద్దతిలో ఈ నగదును జమ చేస్తుండగా... నిర్దేశిత తేదీల్లో ఆయా ఖాతాదారులు నగదును విత్‌డ్రా చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఇప్పటికే 50శాతం ఖాతాల్లో నగదు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సులభంగా... వేగంగా... జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునేందుకు కేంద్రం నిర్దేశిత తేదీలు ప్రకటించింది. ఈనెల 10వ తేదీ నుంచి విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుం డా నేరుగా గ్రామంలోనే నగదును విత్‌డ్రా చేసుకునే వీలు కల్పిస్తోంది. బ్యాంకు మిత్ర, బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా బ్యాంకు శాఖ సర్వీస్ ఏరియాలోని ప్రతి గ్రామంలో సింగిల్ టేబుల్ కౌంటర్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఎస్ఎల్బీసీ సూచించిన విధంగా నగదు చెల్లింపులు చేపట్టనున్నాయి. రెండ్రోజులుగా కొ న్ని బ్యాంకులు ప్రయోగాత్మకంగా చెల్లింపులు ప్రారంభించగా... మిగతా బ్యాంకులన్నీ మరో రెండ్రోజుల్లో ఈ సింగిల్ టేబుల్ కౌంటర్లు ఏర్పా టు చేసేందుకు చర్యలు వేగవంతం చేశాయి. -
పీఎం–జీకేవై పంపిణీ సజావుగా జరపాలి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎం–జీకేవై) మంజూరుచేసిన రూ.27,500 కోట్లను లబ్ధిదారులకు సజావుగా పంపిణీ అయ్యేలా చూడాలని కేంద్రం కోరింది. హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖ రాశారు. శుక్రవారం నుంచి బ్యాంకుల్లో మొదలయ్యే నగదు పంపిణీ సమయంలో ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు గుమికూడకుండా వ్యక్తిగత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని బ్యాంకుల శాఖలు, ఏటీఎంల వద్ద శాంతిభద్రతల నిర్వహణకు అవసరమైన భద్రతా సిబ్బందిని నియమించాలన్నారు. -
ఆర్కే నగర్‌పై అట్టుడికిన అసెంబ్లీ
► ఉప ఎన్నికల అక్రమార్కులపై కేసులేవీ? ► ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్షం ► కేసులు పెట్టామన ముఖ్యమంత్రి ప్రకటన ► ఇక చర్చ అనవసరమన్న స్పీకర్ ధనపాల్ ► సీఎం రాజీనామా కోరుతూ డీఎంకే వాకౌట్ ‘‘ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో అధికార పక్షం అభ్యర్థి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు.. నగదు ప్రవాహం చేయడం ద్వారా ఐటీ దాడులు, ఈసీ ఆక్షేపానికి గురై ఎన్నికల రద్దుకు కారణమైన వారిపై ఎందుకు కేసులు బనాయించలేదు’’ అన్న అంశంపై సోమవారం అసెంబ్లీ అట్టుడికిపోయింది. కేసులు పెట్టినట్లు సీఎం ప్రకటించినా సభ సద్దుమణగలేదు. డీఎంకే సహా ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ మాట్లాడుతూ, ఆర్కే నగర్ ఎన్నికల్లో విచ్చలవిడిగా నగదు పంపిణీ చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు అందినా ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులపై కేసులు పెట్టలేదని ఆక్షేపించారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన వివరాలు వివిధ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదావేసి ఈసీ ఇచ్చిన ఆదేశాలపై చర్చకు పెట్టాలని కోరారు. అలాగే విశ్వాస పరీక్ష సమయంలో ఎమ్మెల్యేలకు ముడుపులపై ఆధారాలు సభకు సమర్పించామని తెలిపారు. స్పీకర్ ధనపాల్ మాట్లాడుతూ, సదరు ఆధారాలను ఉదయం 9 గంటల తరువాతనే సమర్పించారని, అయినా డీఎంకే ఇచ్చిన సీడీని పరిగణనలోకి తీసుకోజాలమని అన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో నగదు బట్వాడాపై సీఎంను బదులివ్వాలని కోరుతున్నట్లు స్పీకర్ అన్నారు. ఇంతలో డీఎంకే సభ్యులు అడ్డుతగులుతూ స్టాలిన్ మాట్లేందుకు మరింత అవకాశం ఇవ్వాలని, ఈ తరువాతనే సీఎం బదులివ్వాలని పట్టుపట్టారు. స్పీకర్ అనుమతితో స్టాలిన్ మాట్లాడుతూ, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో నగదు బట్వాడా సాగినట్లు తేలడంతో ఎన్నికలను రద్దుచేస్తూ ఏప్రిల్ 9వ తేదీన ఈసీ ఆదేశాలు జారీచేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఐటీ జరిపిన దాడుల్లో వైద్య మంత్రి విజయభాస్కర్ తదితర 21 చోట్ల ఆర్కే నగర్ అక్రమాలపై ఆధారాలు, రూ.89 కోట్లు పంపిణీ జరిగినట్లు రుజువులు లభించాయని ఆయన అన్నారు. మధ్యలో స్పీకర్ ధనపాల్ అడ్డు తగులుతూ ఈసీ ఇచ్చిన ఆదేశాలను గురించి మాత్రమే మాట్లాడాలని అన్నారు. మళ్లీ స్టాలిన్ కొనసాగిస్తూ ‘‘ఆర్కేనగర్లో నగదు బట్వాడాకు కారణమైన వారిపై కేసులు పెట్టాలని ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వక ఆదేశాలు పంపింది. అయితే నగదు పంపిణీ వ్యవహారంలో సాక్షాత్తు సీఎం, సహా పలువురు మంత్రులు ఉన్నారు. కేసులు పెట్టారా, ఒకవేళ పెట్టినా సీఎం, మంత్రులను పోలీసులు ధైర్యంగా విచారించే అవకాశం ఉందా’’ అని ప్రశ్నించారు. పదవీ బాధ్యతలు చేపట్టే సమయంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని ప్రమాణం చేసిన సీఎం, మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామాచేసి పారదర్శక విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. అయితే స్టాలిన్ ప్రసంగాన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగిస్తున్న స్పీకర్ ప్రకటించడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రసంగానికి అనుమతిచ్చిన స్పీకరే తన మాటలను రికార్డులను తొలగించారని ఎద్దేవా చేయడంతో డీఎంకే సభ్యులు లేచి నిలబడి నిరసన ప్రకటించారు. స్పీకర్ మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల్లో నిందితులుగా ఎవరి పేరూ ప్రస్తావించలేదని, అయితే కొందరి పేర్లున్నట్లు స్టాలిన్ పేర్కొనడంతో రికార్డుల నుంచి తొలగించాల్సి వచ్చిందని అన్నారు. స్టాలిన్ విమర్శలకు సీఎం ఎడపాడి బదులిస్తూ, న్యాయవాది వైరకన్నన్ సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్కే నగర్ ఉప ఎన్నికల వివరాలను అడిగారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఐటీ దాడుల తరువాత కొందరిపై కేసులు పెట్టారు, అవి ప్రస్తుతం విచారణలో ఉన్నాయని తాము బదులిచ్చామని చెప్పారు. సీఎం సమాధానానికి సంతృప్తి చెందని ప్రతిపక్షాలు మరోసారి స్టాలిన్‌కు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టాయి. అయితే స్పీకర్ ఇందుకు నిరాకరిస్తూ కేసులు పెట్టినట్లుగా సీఎం స్పష్టం చేసినందున ఇక చర్చ అనవసరమని అనడం, ఎవరెవరిపై కేసులు పెట్టారో సీఎం స్పష్టం చేయకపోవడంతో డీఎంకే వాకౌట్ చేసింది. అసెంబ్లీ మాట్లేడే అవకాశం ఇవ్వలేదని టీటీవీ దినకరన్ వర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే తంగ తమిళ్‌సెల్వన్ సైతం వాకౌట్‌చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సవాల్ చేయగా, స్థానిక సంస్థలపై అసెంబ్లీలో చర్చించరాదని స్పీకర్ తోసిపుచ్చారు. ప్రాథమిక విద్య సంచాలకుల కార్యాలయ ప్రాంగణంలో రూ.33 కోట్లతో ఎంజీఆర్ శతజయంతి స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. చిన్నతరహా వ్యాపారస్తులకు ఇచ్చే రుణాలను రూ.10 వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. ఉన్నత, సమోన్నత పాఠశాలల్లో రూ.437 కోట్లతో ఉన్నతస్థాయి వృత్తి విద్యా పరిశోధన కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు. -
ఓటర్లకు 80 కోట్ల పంపిణీ?
సాధారణంగా అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటేనే నిధుల వరద పొంగుతుంటుంది. అదే ఉప ఎన్నికలైతే మరికాస్త ఎక్కువ ఉండచ్చు. కానీ తమిళనాడులో ఇంతకుముందు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం డబ్బులు వరద కాదు ఉప్పెనలా పొంగుతున్నాయి. ఒక్కో ఓటుకు రూ. 10 నుంచి 15 వేల వరకు ఇస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు అక్కడ ఏకంగా 80 కోట్ల రూపాయలను కేవలం నగదు రూపంలోనే పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. శశికళ వర్గం తరఫున టీటీవీ దినకరన్, పన్నీర్ సెల్వం క్యాంపు నుంచి మధుసూదనన్, జయలలిత మేనకోడలు దీపా జయకుమార్.. ఇలా పలువురు హై ప్రొఫైల్ నాయకులు బరిలో ఉండటం, ఈ స్థానాన్ని అందరూ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఎలాగైనా దీన్ని సొంతం చేసుకోడానికి అందరూ చాలా ‘గట్టి’గానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ ఇంటి మీద, పలు ప్రాంతాల్లోను జరిగిన ఆదాయపన్ను శాఖ దాడులలో ఇందుకు సంబంధించిన ఆధారాలు బాగానే దొరికాయని అంటున్నారు. కేవలం ఒక్క దినకరన్ వర్గీయులే ఆర్కే నగర్ ఓటర్లకు రూ. 80 కోట్లు పంచారనడానికి తమకు పక్కా ఆధారాలు దొరికరాయని ఐటీ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇతర పార్టీలన్నీ కూడా కలుపుకొంటే ఎంత లేదన్నా కేవలం డబ్బు రూపంలోనే ఓటర్లకు దాదాపు రూ. 200–300 కోట్ల వరకు ముట్టాయని అనుకోవాల్సి ఉంటుంది. వీడియో బయటపడిన తర్వాతేనా.. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా చక్కర్లు కొట్టింది. అందులో ఒక వ్యక్తి కొంతమందికి ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తూ.. తప్పనిసరిగా టీటీవీ దినకరన్‌కే ఓటేయాలని వాళ్లను కోరుతుంటాడు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాతే ఆదాయపన్ను శాఖ అధికారులు మంత్రి ఇంటి మీద, నటుడు శరత్‌కుమార్ ఇంటి మీద దాడులు చేశారని అంటున్నారు. -
దర్శిలో ఓటుకు నోటు!
దర్శి: ఓటుకు నోటు టీడీపీ రూట్‌లా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులను సంతలో పశువులను కొన్నట్లు కొనేందుకు నానాతంటాలు పడ్డారు. పట్టభద్రులతో బేరాలాడి మరీ ఓట్లు వేయించుకునేందుకు నాయకులు విశ్వప్రయత్నాలు చేశారు. గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దర్శి మండలంలో ఓట్లు కొనుగోలుకు అధికార పార్టీ నాయకులు కొత్త పద్ధతి ప్రవేశ పెట్టారు. మధ్యాహ్నం వరకు ఓటింగ్ సరిళి తెలుసుకున్న ముఖ్య నేతలకు తమ పార్టీ అభ్యర్థులు ఓడిపోతారన్న సందేహం వ్యక్తమైంది. డబ్బులిస్తేనే ఓట్లు వేసేందుకు వస్తామని పట్టభద్రులు డిమాండ్ చేస్తున్నారని ముఖ్య నేతలకు స్థానిక నేతల ద్వారా సమాచారం అందింది. ఆయన హుటాహుటిన దర్శి వచ్చారు. నేరుగా టీడీపీ అభ్యర్థుల తరఫున స్లిప్పులు రాసే టెంట్ వద్దకు వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. ఎంత డబ్బు ఖర్చయినా ఓటర్లను రప్పించి ఓట్లేయించండని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ఆ పార్టీ నాయకులు పట్టభద్రులను బేరాలాడి మరీ పిలిపించి డబ్బులు పంచి ఓట్లేయించుకున్నారు. డబ్బు పంచింది ఇలా..: ఓటర్లకు టీడీపీ నాయకులు స్లిప్పులు పంచారు. వాటిపై ప్రదీప్ మెడికల్స్.. అనే స్టాంపు వేసి ఉంది. పట్టభద్రులతో బేరమాడి వారి అడిగినంత ఆ స్లిప్పుపై వేసి పంచారు. ముఖ్యనేత అనుచరుడి ఆస్పత్రిలోని మెడికల్ షాపులోకి వెళ్లి ఆ స్లిప్పు ఇచ్చి అందులో రాసినంత డబ్బు తీసుకుని వెళ్లి ఓటు వేసి వచ్చారు. -
అరకొరగా డబ్బొచ్చింది!
జిల్లాకు రూ.150 కోట్ల నగదు పంపిణీ ఇందులో రూ.30 శాతం కొత్త రూ.500 నోట్లు నెలాఖరులోగా ఆర్బీఐ నుంచి మరికొంత సొమ్ము విశాఖపట్నం : అసలే పండగ సీజను. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే తరుణం వస్తోంది. కొత్త దుస్తులు, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి సాధారణ రోజులకంటే ఎక్కువ సొమ్ము అవసరమవుతుంది. కానీ బ్యాంకుల్లో సరిపడినంత డబ్బున్నా చేతిలోకే రావడం లేదు. బ్యాంకుల్లో పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగడం లేదు. ఏటీఎంల వద్దకు వెళితే రూ.2 వేలకు మించి తీసుకునే వీలుండడం లేదు. గంటల తరబడి వేచి ఉంటే కొత్త రూ.2 వేల నోటే వస్తోంది. పెద్ద నోట్లు రద్దయిన 48 రోజుల నుంచి జనం ఇలాంటి కష్టాలను అనుభవిస్తూనే ఉన్నారు. మధ్యమధ్యలో రిజర్వు బ్యాంకు నుంచి నగదు వస్తున్నా అది రెండు మూడు రోజులకే సరిపోతోంది. మళ్లీ డబ్బు కొరత వేధిస్తోంది. విశాఖ నగరంలోనూ, జిల్లాలోనూ లావాదేవీలకు రోజుకు దాదాపు రూ.100 కోట్ల నగదు అవసరమవుతోంది. కానీ ఆర్బీఐ నుంచి వచ్చిన డబ్బు ఇలా రాగానే అలా అయిపోతోంది. విశాఖకు వచ్చింది తక్కువే.. ఈ నెల 20న ఆర్బీఐ నుంచి విశాఖ స్కేబ్‌కు పెద్దమొత్తంలో రూ.1550 కోట్ల సొమ్ము వచ్చింది. ఇందులో విశాఖకు రూ.300 కోట్లు కేటాయించగా మిగిలిన సొమ్ము రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల చెస్ట్ బ్రాంచిలకు పంపించారు. ఆ తర్వాత ఆర్బీఐ నుంచి ఈ నెల 26న మరో రూ.2400 కోట్లు స్కేబ్‌కు వస్తాయని బ్యాంకు అధికార వర్గాలు చెప్పాయి. కానీ అందులో మూడో వంతు అంటే.. రూ.805 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో విశాఖకు రూ.150 కోట్లు కేటాయించినట్టు సమాచారం. ఈ మొత్తంలో స్టేట్ బ్యాంకుకు రూ.45 కోట్లు, ఆంధ్ర బ్యాంకు చెస్ట్‌లకు రూ.105 కోట్లను పంపిణీ చేసినట్టు తెలిసింది. తాజాగా కేటాయించిన ఈ రూ.150 కోట్లను నగరంలోని వివిధ బ్రాంచిలకు పంపడంతో మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న నిల్వతో పాటు కొత్తగా వచ్చిన నగదు వెరసి రెండు రోజులకు మించి సరిపోదని అంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని నెలాఖరులోగా ఆర్బీఐ మరింత సొమ్ము పంపనుందని తెలుస్తోంది. తాత్కాలిక ఉపశమనం.. ఇలావుండగా కొత్తగా వచ్చిన రూ.150 కోట్లలో 30 శాతం కొత్త రూ.500 నోట్లున్నాయి. ఈ నోట్లలో కొంత మెత్తాన్ని ఏటీఎంల్లో ఉంచుతున్నారు. దీనివల్ల తాత్కాలికంగా కొంతవరకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రూ.2వేల నోట్లతో చిల్లర సమస్యలు ఎదుర్కొంటున్న జనానికి ఊరట కలగనుంది. కొన్నాళ్ల క్రితం పరిస్థితిని గమనిస్తే మంగళవారం ఏటీఎంల వద్ద క్యూలు కట్టిన జనం అంతగా కనిపించలేదు. -
అన్ని బ్యాంకులకూ సమానంగా ఇవ్వండి
- నగదు పంపిణీపై బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్ : రిజర్వ్‌బ్యాంకు నుంచి వచ్చే కరెన్సీ నోట్లను అన్ని బ్యాంకులకూ సమానంగా పంపిణీ చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశమైన ఆయన నోట్ల మార్పిడి సమయంలో ప్రజలకు కల్పిస్తున్న సేవలపై ఆరా తీశారు. చంటి పిల్లల తల్లులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పిల్లలకు పాలు అందించే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృద్ధులకు ఇబ్బందులు కలుగకుండా త్వరితగతిన వారికి నగదు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర జిల్లాల్లోని బ్రాంచులకు కరెన్సీని పంపించవద్దని సూచించారు. వివిధ బ్యాంకుల నుంచి నగదు తీసుకువచ్చేటప్పుడు పోలీసు సెక్యూరిటీ సేవలను బ్యాంకర్లు బుధవారం నుంచి ఉచితంగా పొందవచ్చన్నారు. ఏటీఎంలలో నగదు ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజలు కూడా అవసరం మేరకే బ్యాంకులకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఎల్డీఎం జయశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
విచ్చలవిడిగా డబ్బు పంపకం!
-
వరంగల్‌లో విచ్చలవిడిగా డబ్బు పంపకం!
వరంగల్: వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపకం కొనసాగుతున్నది. తాజాగా సోమవారం వరంగల్‌లోని దేవరుప్పలలో విచ్చలవిడిగా డబ్బు పంచుతూ టీడీపీ-బీజేపీ నేతలు మీడియా కెమెరాకు చిక్కారు. జనసమీకరణ కోసం ఆ రెండు పార్టీల నేతలు డబ్బులు పంచుతున్న దృశ్యాలను 'సాక్షి' కెమెరాలో బంధించింది. వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి దేవయ్య బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమితో నిరుత్సాహంగా ఉన్న బీజేపీ వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు భారీగా డబ్బులు పంచుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ-టీడీపీ నేతలు దేవరుప్పల్‌లో బహిరంగంగానే డబ్బులు పంచుతూ కనిపించారు. -
నగరిలో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో భారీగా మొత్తంలో నగదు, మద్యం పట్టుబడుతున్నాయి. ప్రలోభాల పర్వానికి తెలుగుదేశం పార్టీ తెరలేపింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఓట్ల కొనుగోలుకు సర్వశక్తులు వినియోగిస్తోంది. జిల్లాలో కీలకమైన కుప్పం, చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, నగరి, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు పంపకాలతో పాటు మద్యాన్ని ఏరులై పారిస్తోంది. అప్పలాయగుంట వద్ద 102 కేసుల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్ట్ చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. -
టెన్షన్ పడుతున్న బాలయ్య
అనంతపురం : పోలింగ్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ బాలయ్యకు టెన్షన్ పెరిగిపోతోంది. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఓటర్లకు డబ్బు ఎర వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. అయితే డబ్బు పంపిణీ విషయంలో స్థానిక నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి. పంపిణీ బాధ్యత తనకే ఇవ్వాలని ఓ మాజీ ఎమ్మెల్యే బాలయ్యను కోరుతుంటే ఆయన మాత్రం ససేమిరా అంటున్నట్లు సమాచారం. దీంతో బాలయ్య వైఖరిపై నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.... హిందుపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, హరికృష్ణలను స్థానికులు గెలిపించినట్లు తనను కూడా ఆదరిస్తారన్న ఉద్దేశంతో బాలకృష్ణ హిందుపురాన్ని ఎంచుకున్నారు. తీరా బరిలో దిగాక పరిస్థితులను చూసిన బాలయ్య బెంబేలెత్తిపోయారు. తన కుటుంబ సభ్యులతో పాటు సినీ నటుడు ఆలీని కూడా ప్రచారానికి దించారు. అయితే జనం నుంచి స్పందన లేకపోవటంతో ఓటర్లకు తాయిలాలు వేసే పనిలో పడ్డారు. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేయాలని ప్లాన్ వేశారు. అయితే ఇప్పటికే వర్గ విభేదాలతో సతమతమవుతున్న బాలయ్యకు డబ్బు పంపిణీ విషయం మరో సమస్యగా మారింది. ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేసినప్పటికీ ప్రజల నుంచి స్పందన లేకపోవటంతో మరో దఫా పందేరానికి బాలకృష్ణ సిద్ధం అయినట్లు సమాచారం. బెంగళూరు నుంచి పెద్ద మొత్తంలో తెప్పించిన నగదును హిందూపురం సమీపంలోని ఓ తోటలో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. తానే స్వయంగా డబ్బు పంపిణీ చేపడితే ఎక్కడ పట్టుబడతానోననే భయం, మరోవైపు ఎవరిని నమ్మాలనే సందేహంతో బాలయ్య సతమతమవుతున్నట్లు తెలిసింది. -
ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ!
కాంగ్రెస్ నాయకుల ఆందోళన ఎన్నికల అధికారుల తనిఖీ రూ. 50 వేలు స్వాధీనం స్కూల్ వైస్ చైర్మన్‌పై కేసు నమోదు దూలపల్లి, న్యూస్‌లైన్: ఓటర్లను స్కూల్‌కు రప్పించి, టీడీపీ తరఫున డబ్బులు పంచుతూ ప్రలోభానికి గురి చేస్తున్నారంటూ స్కూల్ సిబ్బందిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు పాఠశాలలో ఉన్న రూ.50 వేలు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. సూరారం కాలనీలోని ఎంబీ గ్రామర్ హైస్కూల్లో మల్కాజిగిరి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతుగా స్కూ ల్ సిబ్బంది కరపత్రాల పంపిణీతోపాటు ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారని శనివారం మధ్యాహ్నం స్థానిక కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు, దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పాఠశాల వద్దకు చేరుకున్నారు. తనిఖీలు నిర్వహించగా రూ. 50 వేల నగదు, టీడీపీ జెండా లు, పోస్టర్లు లభిం చాయి. అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీ లకుడు శ్రీనివాస్‌రాజు డబ్బుల విషయమై యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. అవి తమవి కాదని, కేవలం రూ. 5వేలు మాత్రమే ఉంచామని, మిగతా డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదని చెప్పారు. దీంతో ఆ సొమ్మును సీజ్ చేసి పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మరియాదాస్‌పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప్ మాట్లాడుతూ.. కొంతమంది నాయకులు తమ పాఠశాలలో ప్రవేశించి డబ్బులు, కరపత్రాలు దొంగచాటున ఉంచి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు పనులు చేసేవారిపై తాము కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
మాటలు మోస్తున్న ‘దేశం’
- డబ్బు పంపిణీకి మార్గం సుగమం చేసుకునే యత్నం - పోలీసుల కళ్లుగప్పి కాలనీలకు తరలుతున్న రూ.లక్షలు - ఎన్నికల సమయానికి ఉపయోగించుకునేలా చర్యలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు, సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచే ముందస్తు వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఎన్నికల సమయానికి నగదు పంపిణీ చేపట్టేందుకు ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున చిన్న చిన్న మొత్తాలను ఆయా ప్రాంతాలకు తరలిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాలనీలకు వెళుతూ, వెనుక కారులో ఉన్న నగదును ఆయా కాలనీల్లో తెలుగుదేశం నాయకుల ఇళ్లకు తరలిస్తున్నారు. అభ్యర్థులకు ఏర్పాటు చేసిన షాడో పార్టీ కళ్లుగప్పి, ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. శుక్రవారం కూడా ఒక ప్రముఖ నాయకుడు నగర శివారు ప్రాంతానికి ప్రచారానికి వెళ్లారు. ఆయనతోపాటు వెనుక వచ్చిన కారులో భారీ మొత్తాన్ని తరలించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఆ కాలనీలో తెలుగుదేశం నాయకుడి ఇంట్లో దాచినట్లు తెలిసింది. ఒక కాలనీలో వంద ఓట్లు ఉంటే, దానికి తగిన విధంగా మొత్తాన్ని సిద్ధం చేసి, ఆ మొత్తాన్ని కాలనీలోని ఒక నాయకుడి ఇంటికి పంపుతున్నారు. ఎన్నికల సమయంలో ఆ నగదు పంచిపెట్టే బాధ్యతను కూడా ఆ నాయకుడికే అప్పగిస్తున్నారు. ఈ విధమైన వ్యూహాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ పనులు చేపడుతున్నారు. ఎంపీ అభ్యర్థులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది. అదే విధంగా మద్యం పంపిణీకి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏదైనా ఎక్కువ మొత్తంలో ఉంటే పోలీసులు పట్టుకునే ప్రమాదం ఉంది కనుక, తక్కువ మొత్తంలో ఎక్కువ ప్రాంతాలకు త రలిస్తున్నారు. ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున ఇవ్వాలనుకున్నా, వంద ఓట్లకు లక్ష రూపాయలు సరిపోతాయని, ఒక ఇంట్లో లక్ష రూపాయలు ఉండటం పెద్ద నేరంగా పరిగణింపబడదని వీరు వాదిస్తున్నారు. అదే తీరులో డబ్బులు చేరవేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా మద్యం కూడా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది. మద్యం బాటిళ్లను ఒక కాలనీలోని ఇద్దరు, ముగ్గురు ఇళ్లకు చేరుస్తున్నారు. భారీగా ఉంటే సమస్య ఉంటుందని, తక్కువ మోతాదులో ఎక్కువ ప్రాంతాలకు తరలించడం వల్ల పోలీసులు పట్టుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నా, కాన్వాయ్లోఉన్న వాహనాలను వదిలి పెడుతున్నారు. ఇదే అదనుగా తీసుకుని తెలుగుదేశం నాయకులు ఇటువంటి పనులు చేస్తున్నారు. భారీగా తరలించడం వల్ల పోలీసులకు సమాచారం అందుతుందని, దీంతో వారు దాడులు చేసి పట్టుకునే అవకాశం ఉందని, తక్కువగా రవాణా చేయడం వల్ల ఎవరికీ అనుమానం రాదని, ఈ మార్గాన్ని అధిష్టానం సూచనల మేరకు అనుసరిస్తున్నట్లు ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు తెలిపారు. -
దొంగ ఓట్లు వేయించిన టీడీపీ అభ్యర్థి
-
దొంగ ఓట్లు వేయించిన టీడీపీ అభ్యర్థి
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అక్రమాలు, ఆగడాలు బయటపడుతున్నాయి. అనంతపురం జడ్పీ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి స్వరూప దొంగ ఓట్లు వేయించారు. ఆమె అలా దొంగ ఓట్లు వేయిస్తుండటంతో ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం కూడా జరిగింది. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా అధికారులు పట్టుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ శాంతినగర్ ప్రాంతంలో డబ్బులు పంచుతున్న నలుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 90 వేలు స్వాధీనం చేసుకున్నారు.