
వరంగల్‌లో విచ్చలవిడిగా డబ్బు పంపకం!
వరంగల్: వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపకం కొనసాగుతున్నది. తాజాగా సోమవారం వరంగల్‌లోని దేవరుప్పలలో విచ్చలవిడిగా డబ్బు పంచుతూ టీడీపీ-బీజేపీ నేతలు మీడియా కెమెరాకు చిక్కారు. జనసమీకరణ కోసం ఆ రెండు పార్టీల నేతలు డబ్బులు పంచుతున్న దృశ్యాలను 'సాక్షి' కెమెరాలో బంధించింది.
వరంగల్ ఉప ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షం బీజేపీ అభ్యర్థి దేవయ్య బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఓటమితో నిరుత్సాహంగా ఉన్న బీజేపీ వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు భారీగా డబ్బులు పంచుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ-టీడీపీ నేతలు దేవరుప్పల్లో బహిరంగంగానే డబ్బులు పంచుతూ కనిపించారు.