ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ! | Government cash distribution of voters! | Sakshi
Sakshi News home page

ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ!

Published Sun, Apr 27 2014 12:32 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM

ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ! - Sakshi

ఓటర్లకు టీడీపీ నగదు పంపిణీ!

ఓటర్లను స్కూల్‌కు రప్పించి, టీడీపీ తరఫున డబ్బులు పంచుతూ ప్రలోభానికి గురి చేస్తున్నారంటూ స్కూల్ సిబ్బందిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

  •     కాంగ్రెస్ నాయకుల ఆందోళన
  •      ఎన్నికల అధికారుల తనిఖీ
  •      రూ. 50 వేలు స్వాధీనం
  •      స్కూల్ వైస్ చైర్మన్‌పై కేసు నమోదు
  •  దూలపల్లి, న్యూస్‌లైన్: ఓటర్లను స్కూల్‌కు రప్పించి, టీడీపీ తరఫున డబ్బులు పంచుతూ ప్రలోభానికి గురి చేస్తున్నారంటూ స్కూల్ సిబ్బందిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు పాఠశాలలో ఉన్న రూ.50 వేలు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.

    సూరారం కాలనీలోని ఎంబీ గ్రామర్ హైస్కూల్‌లో మల్కాజిగిరి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతుగా స్కూ ల్ సిబ్బంది కరపత్రాల పంపిణీతోపాటు ఓటర్లకు డబ్బులు ఇస్తున్నారని శనివారం మధ్యాహ్నం స్థానిక కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు, దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు పాఠశాల వద్దకు చేరుకున్నారు.

    తనిఖీలు నిర్వహించగా రూ. 50 వేల నగదు, టీడీపీ జెండా లు, పోస్టర్లు లభిం చాయి. అసిస్టెంట్ ఎన్నికల వ్యయ పరిశీ లకుడు శ్రీనివాస్‌రాజు డబ్బుల విషయమై యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. అవి తమవి కాదని, కేవలం రూ. 5వేలు మాత్రమే ఉంచామని, మిగతా  డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదని చెప్పారు. దీంతో ఆ సొమ్మును సీజ్ చేసి పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మరియాదాస్‌పై కేసు నమోదు చేశారు.

    ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప్ మాట్లాడుతూ.. కొంతమంది నాయకులు తమ పాఠశాలలో ప్రవేశించి డబ్బులు, కరపత్రాలు దొంగచాటున ఉంచి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు పనులు చేసేవారిపై తాము కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement