సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్ రెడ్డిపై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీ ఫిర్యాదు చేశారు. ప్రవీణ్‌తో పాటు ఆయన కుటుంబీకులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలతో సహా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. సొంత గ్రామం కోగొట్టంతో పాటు ప్రొద్దుటూరులోనూ ఓట్లు ఉన్నాయని, ఒక్క చోటే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫారం7లో భూమిరెడ్డి వంశీ ఫిర్యాదు చేశారు.
ప్రొద్దుటూరులో టీడీపీ నాయకులు దొంగ ఓట్లు చేర్చడంపై భూమిరెడ్డి వంశీ మండిపడ్డారు. ప్రవీణ్, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకు రెండు చోట్ల ఓట్లు సిగ్గుచేటు. దొంగ ఓట్లు అంటూ వైఎస్సార్‌సీపీని విమర్శించే ప్రవీణ్కి తన దొంగ ఓట్లు కనిపించలేదా?. తన ఇంట్లో దొంగ ఓట్లు పెట్టుకుని.. దొంగ ఓట్లు తొలగించాలంటూ అధికారులకు ఎలా ఫిర్యాదు చేస్తారు?. తక్షణం ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఓట్లపై అధికారులు చర్యలు చేపట్టాలని వంశీ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఈసీని కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు
Comments
Please login to add a commentAdd a comment