Counselor
-
టీడీపీ నేత ప్రవీణ్ ఇంట్లో దొంగ ఓట్లు..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్ రెడ్డిపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీ ఫిర్యాదు చేశారు. ప్రవీణ్‌తో పాటు ఆయన కుటుంబీకులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ ఆధారాలతో సహా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. సొంత గ్రామం కోగొట్టంతో పాటు ప్రొద్దుటూరులోనూ ఓట్లు ఉన్నాయని, ఒక్క చోటే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఫారం7లో భూమిరెడ్డి వంశీ ఫిర్యాదు చేశారు. ప్రొద్దుటూరులో టీడీపీ నాయకులు దొంగ ఓట్లు చేర్చడంపై భూమిరెడ్డి వంశీ మండిపడ్డారు. ప్రవీణ్, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకు రెండు చోట్ల ఓట్లు సిగ్గుచేటు. దొంగ ఓట్లు అంటూ వైఎస్సార్సీపీని విమర్శించే ప్రవీణ్‌కి తన దొంగ ఓట్లు కనిపించలేదా?. తన ఇంట్లో దొంగ ఓట్లు పెట్టుకుని.. దొంగ ఓట్లు తొలగించాలంటూ అధికారులకు ఎలా ఫిర్యాదు చేస్తారు?. తక్షణం ప్రవీణ్ రెడ్డి ఇంట్లో ఓట్లపై అధికారులు చర్యలు చేపట్టాలని వంశీ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు -
సొంతవారిపైనే ‘నోకాన్ఫిడెన్స్’!
ఉమ్మడి నల్లగొండ నందికొండ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వర్గీయ కౌన్సిలర్ల మధ్య విభేదాలు అవిశ్వాసానికి దారితీశాయి. చైర్పర్సన్ కర్న అనూషారెడ్డిపై ఎనిమిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లతలపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాస తీర్మానం పెట్టే క్రమంలో ఏడుగురు కౌన్సిలర్లు గోవా క్యాంపునకు వెళ్లారు. ఒకటీ రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వాలనే ఆలోచనలో వారున్నట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: బల్దియాల్లో అవిశ్వాసాల రచ్చకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో అసంతృప్త కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలకు సై అంటున్నారు. కొన్నిచోట్ల చైర్మన్లు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కౌన్సిలర్లను పట్టించుకోక పోవడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అక్రమ కట్టడాలు, రియల్ఎస్టేట్ వెంచర్లు, ఇంటి నిర్మాణాల అనుమతుల్లో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారుతున్నాయి. ఈ పంపకాల్లో తేడాలు కూడా పలుచోట్ల అసంతృప్తికి దారితీసి అవిశ్వాసాలకు కారణమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. మరికొన్ని చోట్ల.. ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చు చేసి గెలుపొందిన కౌన్సిలర్లు పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిని చైర్మన్లు వ్యతిరేకించడం కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదు. ఈ నేç³థ్యంలోనే మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న చైర్మన్లు, వైస్ చైర్మన్లపై నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానాలకు తెర లేపుతున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఉన్నవారు 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న పక్షంలోనే అవిశ్వాస తీర్మానాలు పెట్టే సవరణ బిల్లుకు ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. దీంతో పలుచోట్ల అవిశ్వాసాల రచ్చ కొనసాగుతోంది. తిరుగుబాటు పార్టీపై కాదు ఒకటీ రెండు మినహా బల్దియాలన్నీ అధికార బీఆర్ఎస్ పార్టీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే దాదాపు అన్నిచోట్లా అధికార పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానాలకు నాయకత్వం వహిస్తున్నారు. వీరికి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు మద్దతు తెలుపుతుండటం గమనార్హం. అయితే తాము పారీ్టకి వ్యతిరేకం కాదని, కేవలం చైర్మన్ పదవుల్లో కొనసాగుతున్న వారి తీరుకు మాత్రమే వ్యతిరేకమని కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వారు స్పష్టం చేస్తున్నారు. కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు బల్దియాల్లో అవిశ్వాసాల రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్లకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున అవిశ్వాస తీర్మానాల నోటీసులపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ఆ నోటీసులను మున్సిపల్ పరిపాలన శాఖకు పంపాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టాలంటే ఆయా మున్సిపాలిటీల్లో ఉన్న కౌన్సిలర్ల సంఖ్యలో 50 శాతం మంది స్వయంగా కలెక్టర్ ముందు హాజరు కావాలి. తమకు సంబంధించిన వ్యక్తిగత ధ్రువీకరణ (ఐడెంటిటీ ప్రూఫ్) చూపించి కలెక్టర్ ముందే నోటీసుపై సంతకాలు చేయాలి. అనంతరం కలెక్టర్ సర్వ సభ్య సమావేశం తేదీ ప్రకటించాల్సి ఉంటుంది. అయితే పలుచోట్ల కలెక్టర్లు అందుబాటులో లేకపోవడంతో అసమ్మతి కౌన్సిలర్లు అదనపు కలెక్టర్లకు, ఏఓలకు నోటీసులు అందజేస్తున్నారు. వారు తీసుకునేందుకు నిరాకరించడంతో ఇన్వర్డ్ సెక్షన్లలో ఇచ్చి వెళ్తున్నారు. ఇలా అవిశ్వాస నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు ప్రత్యేక శిబిరాలకు వెళుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు ఏడుగురు గోవా వెళ్లారు. సంగారెడ్డి అసమ్మతి కౌన్సిలర్లు హైదరాబాద్‌లో ఓ రిసార్టుకు వెళ్లివచ్చారు. ‘మీరు ఇచ్చే నోటీసులు ప్రభుత్వ పరిశీలనకు పంపుతాం.. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలుంటాయి..’అంటూ సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానాల నోటీసు ఇచి్చన కౌన్సిలర్లకు ఆ జిల్లా కలెక్టర్ శరత్ స్పష్టం చేయడం గమనార్హం. అవిశ్వాస తీర్మానాలు తలనొప్పిగా మారడంతో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అసంతృప్తి కౌన్సిలర్లను బుజ్జగించే పనిలో పడ్డారు. -
మంత్రి రాజప్పకు సొంతపార్టీ కౌన్సిలర్ ఝలక్
పెద్దాపురం: అధికార పార్టీలో అభివృద్ధే తమదేనంటూ ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు ఆ పార్టీ కౌన్సిలర్ సయ్యద్ అమీనా బీబీ ఝలక్ ఇచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో శుక్రవారం కౌన్సిలర్ అమీనాబీబీ, ఆమె భర్త సయ్యద్ కరీమ్ (జానీ)తో పాటు సుమారు 200 మంది ముస్లింలు, వార్డులోని టీడీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. కో–ఆర్డినేటర్ దొరబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీలో చేరిన అమీనాబీబీ, జానీ మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. అశ్లీల నృత్యాలు ఫేస్బుక్లో అప్లోడు చేసిన వ్యక్తిని మంత్రి రాజప్ప నెత్తిన పెట్టుకున్నారన్నారు. కౌన్సిలర్ భర్తపై పోలీసులు చేయిచేసుకుంటే కనీసం కౌన్సిలర్ కోరిన విధంగా క్షమాపణ కూడా చెప్పించలేని పరిస్థితి ప్రస్తుత పాలకులదన్నారు. ప్రజా పాలనను గాలికి వదిలి అక్రమ మట్టి తవ్వకాలతో సొమ్ములు చేసుకుంటున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. ఎన్నారై దొరబాబు మున్సిపాల్టీకి అందించిన మంచినీటి ట్యాంకర్లు, సేవా కార్యక్రమాలతో ఆకర్షితులం కావడమే కాకుండా జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందనే నమ్మకంతో పార్టీలో చేరామన్నారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం, దవులూరి దొరబాబును ఎమ్మెల్యేగా గెలిపించడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామన్నారు. సుమారు 200 మంది ముస్లింలు, మహిళలు, వార్డు కార్యకర్తలకు దొరబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి దొరబాబు, దవులూరి సుబ్బారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, కరణం భాను, ఎలిశెట్టి నరేష్, గోకేడ రాజా, ముస్లిం కమిటీ పెద్దలు సర్దార్, పబ్బీర్, నూరీ, బషీర్, జిలాల్, చందు, సందీప్, జాపూర్, ఇస్మాయేలు, రబ్బాని, సంధాని తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్లో కౌన్సిలర్ వీరంగం
సాక్షి, నిర్మల్: సమాచారం ఇవ్వకుండా ఓ దుకాణాన్ని తొలగించారంటూ నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ అలీమ్ సోమవారం వీరంగం సృష్టించారు. మున్సిపల్ కార్యాలయంలోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని మౌసిన్ అనే వ్యక్తికి సంబంధించిన దుకాణాన్ని సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ అలీమ్ టీపీఎస్ ఉదయ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో ఆయన టేబు ల్పైన ఉన్న కంప్యూటర్ను కింద పడేశారు. అనంతరం బయట గదిలో సిబ్బంది ఉపయోగిస్తున్న కంప్యూటర్‌నూ కింద పడేశారు. దీంతో రెండు కంప్యూటర్లూ దెబ్బతిన్నట్లు సిబ్బంది తెలిపారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా.. ఇటీవల జిల్లాకేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈక్రమంలో రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు. బైల్‌బజార్ నుంచి కంచెరోని చెరువు వరకు ఉన్న ఫుట్‌పాత్ దుకాణాలను, తోపుడు బండ్లను తీయించేస్తున్నారు. ఎన్టీఆర్ మినీస్టేడియం వద్ద ఉన్న ఆక్రమణలను ఇటీవల తొలగించి, రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. దీనిపై స్థానిక వ్యాపారులు హైకోర్టుకు వెళ్లారు. సదరు స్థలంలో ఎలాంటి పనులు చేపట్టకుండా యథాస్థితిని కొనసాగించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధం లేకుండా శనివారం రాత్రి వ్యాపారులు మళ్లీ తమ దుకాణాలను అదే స్థలంలో వేసుకున్నారు. కోర్టు యథాస్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినా మళ్లీ దుకాణాలను పెట్టుకోవడంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం ఉదయం ఆక్రమణలను తొలగించి, చెట్లను నాటారు. ఆక్రమణల తొలగింపులో భాగంగా బస్టాండ్ ఇన్‌గేట్ పక్కనే ఖాళీగా ఉన్న టేలాను మున్సిపల్ సిబ్బంది తీసేశారు. తనకు సంబంధించిన వ్యక్తి టేలాను తొలగించడంతో కౌన్సిలర్ అలీమ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కంప్యూటర్లను ధ్వంసం చేసినట్లు మున్సిపల్ సిబ్బంది పేర్కొన్నారు. జరిగిన ఘటనపై టీపీఎస్ ఉదయ్‌కుమార్ ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి కౌన్సిలర్ అలీమ్‌ను తీసుకెళ్లారు. అనంతరం ఇన్చార్జి కమిషనర్ సంతోష్ ధ్వంసమైన కంప్యూటర్లను పరిశీలించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. -
గుడివాడలో టీడీపీ నేతల కక్షసాధింపు!
-
గుడివాడలో టీడీపీ నేతల కక్షసాధింపు!
సాక్షి, కృష్ణా : గుడివాడలో టీడీపీ నేతల కక్షసాధింపు చర్యలకు దిగారు. ఇటీవల గూడివాడ మున్సిపల్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కౌన్సిలర్ కిమిలి వెంకటరెడ్డి టీడీపీకి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో స్థానిక టీడీపీ నేతలు కుటిలయత్నాలకు తెరలేపారు. కిమిలి వెంకటరెడ్డిపై ఎక్సైజ్ అధికారులతో తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు చెందిన కిరాణా దుకాణంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కిరాణా షాపులో మద్యం బాటిళ్లు దొరికాయంటూ ఈ తనిఖీల సందర్భంగా హడావుడి చేశారు. కౌన్సిలర్ సోదరిని విచారణ పేరుతో ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ తమ వద్ద ఉన్న మద్యం బాటిళ్లను చూపి ఎక్సైజ్ అధికారులు ఆమెపై కేసు నమోదుకు ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ విషయం తెలియడంతో ఎమ్మెల్యే కొడాలి నాని వెంటనే అక్కడికి చేరుకున్నారు. మద్యం బాటిళ్లపై ఉన్న లేబుళ్లను పరిశీలించి.. ఇవి టీడీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి బంధువు దుకాణానికి సంబంధించినవని గుర్తించారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులను నిలదీయడంతో వారు కంగారుపడ్డారు. కేవలం విచారణ కోసమే కౌన్సిలర్ సోదరిని తీసుకొచ్చామని చెప్తూ.. ఆమెను విడిచిపెట్టారు. టీడీపీ రాజకీయ కక్షసాధింపులకు అధికారులు సహకరిస్తే సహించబోమని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. -
నవ నిర్మాణ దీక్షలో మహిళకు వేధింపులు
పార్వతీపురం టౌన్ : టీడీపీ చేపడుతున్న నవనిర్మాణ దీక్షలు వేధింపుల దీక్షలుగా మారుతున్నాయి. దీక్షలకు జనాన్ని తీసుకురావాలని ప్రజాప్రతినిధులు అంగన్వాడీ, వెలుగు, ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. జనాలను తీసుకురాని సిబ్బందిపై దుర్భాషలాడుతున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం పురపాలక సంఘంలోని 5వ వార్డులో సోమవారం జరిగిన నవనిర్మాణ దీక్ష వేదిక సాక్షిగా అదే వార్డుకు చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్తపై అసభ్యకరంగా మాట్లాడిన వార్డు కౌన్సిలర్ చొక్కాపు వెంకటరావును కార్యకర్త భర్త కొట్టిన సంఘటన సమావేశానికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సమావేశంలో కౌన్సిలర్ వెంకటరావు మాట్లాడడానికి సిద్ధపడుతుండగా, బాధితురాలైన అంగన్వాడీ కార్యకర్త భర్త కలుగజేసుకుని మహిళలంటే అంత చులకనా నీకు.. ఎంతకాలం వేధింపులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో టీడీపీ నాయకులు కలుగజేసుకుని కార్యకర్త భర్తను అక్కడ నుంచి పంపించివేశారు. అంతకుముందు జనాలను తీసుకురావడంలో విఫలమైందని ఆరోపిస్తూ సదరు కౌన్సిలర్ వెంటకరావు అంగన్వాడీ కార్యకర్తను దుర్భాషలాడారు. దీంతో బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. రాజీ ప్రయత్నాలు జరిగిన విషయంపై అంగన్వాడీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎలాగైనా ఇరువర్గాలను రాజీ కుదర్చి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నలిగిపోతున్న ఉద్యోగులు... నవనిర్మాణ దీక్షలకు జనాన్ని తీసుకువచ్చే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు, బీఎల్ఓలు, వెలుగు సిబ్బంది నలిగిపోతున్నారు. మండుతున్న ఎండలో పెడుతున్న సమావేశాలకు జనం తీసుకురావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే అధికార పార్టీ నాయకులు ఎక్కడ మండిపడతారోననే ఉద్దేశంతో సిబ్బంది ఏదో ఒక రకంగా ప్రజలను తీసుకువస్తున్నారు. -
హౌస్ ఫర్ సేల్
‘పురపాలికల్లో ఇళ్ల కోసం అధికారులను మాత్రమే సంప్రదించాలి. మధ్యవర్తులు, ఇతరులను సంప్రదించవద్దు’.. ఆదివారం విజయనగరంలో పురపాలక మంత్రి నారాయణ పేదలకిచ్చే ‘హౌస్ ఫర్ ఆల్’ పథకంపై స్వయంగా చెప్పిన మాటలు.. పై చిత్రం చూశారా.. బొబ్బిలి మున్సిపాలిటీలోని పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల విభాగానికి చెందిన కార్యాలయంలో కంప్యూటర్ల ముందు కూర్చున్నవారు అధికారులు కారు. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు. హౌస్ ఫర్ ఆల్ పథకానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం.. అర్హులంటూ తమ వారిని ఎంపిక చేసుకోవడం వారి పని. మొత్తంగా ఇళ్ల ఎంపిక బాధ్యతను వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఇటీవల వారం రోజులుగా బొబ్బిలి మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయాల్లోనే తిష్ట వేసి లబ్ధిదారుల పేర్లు, కొత్త దరఖాస్తులు చేస్తున్నారు. కేవలం అధికారులే చేయాల్సిన పనిని వీరు అక్కడి కంప్యూటర్ ఆపరేటర్లతో చేయించుకోవడం గమనార్హం. ఈ విషయం తెల్సినా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. మరికొందరు అధికారులు సహకరిస్తున్నారు. బొబ్బిలి: టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆరాచక పాలన సాగిస్తోంది. పింఛన్లు, ఇళ్లు, రేషన్ కార్డులు ఇలా.. అన్నింటిలోనూ రాజకీ య వివక్ష చూపుతోంది. జన్మభూమి కమిటీల సభ్యులు, పార్టీ చోటా నాయకులతో అవినీతి చేస్తోంది. పథకానికి ఓ రేటు చొప్పున దందా చేస్తోందంటూ జనం మండిపడుతున్నారు. ప్రజా ధనంతో అమలుచేసే పథకాలు అర్హులకు అందడం లేదని వాపోతున్నారు. పట్టణాల్లో పేదలకు ఇచ్చే ఇళ్లలోనూ టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని, తమ వారికే ఇళ్లు కేటాయించేలా జాబితాలు రూపొంది స్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పేదలు బతకడం కష్టం గా మారిందని, పనులు మానుకుని ఇంటిళ్లపాదీ నేతల సేవ చేస్తే తప్ప ప్రభుత్వ పథకాలు అందేలా లేవంటూ మదనపడుతున్నారు. టీడీపీ పాలనా తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. దగ్గరుండి జాబితాల రూపకల్పన.. పట్టణ పేదల కోసం కేటాయించిన హౌస్ ఫర్ ఆల్ పథకం.. హౌస్ ఫర్ టీడీపీగా మారింది. ఓ పక్క అర్హులను కొర్రీలు వేసి తొలగిస్తూనే.. కొత్త దరఖాస్తులంటూ అధికార పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలో కూర్చుని తమ వారి జాబితాలు రూపొందిస్తున్నారు. అధికారుల్లా కార్యాయాల్లో ని కంప్యూటర్ల ముందు కూర్చొని జాబితాలు సిద్ధం చేస్తున్నా రు. అన్నింటా తామై ఉండి నడిపించాల్సిన పట్టణ ప్రణాళికా విభాగం చేష్టలుడిగి చూస్తోంది. బొబ్బిలి మున్సిపాలిటీలో కంప్యూటర్ల ముందు కౌన్సిలర్ల పెత్తనమే కనిపిస్తున్నా కిమ్మనడంలేదు. ఎవరికి దరఖాస్తు చేయాలి? మరెవరిని అనర్హులు గా చూపించాలనే విషయంలో అధికారమంతా అధికార పార్టీ కౌన్సిలర్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఇక్కడి అధికార విభాగం లోపభూయిష్టంగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌన్సిలర్లు కూడా తమ వర్గానికి చెందిన వారికే ఇళ్ల లబ్ధిదారులుగా గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో ఉన్న నిరుపేదలు, ఎటువంటి ఆసరా లేని వారికోసం ఈ ఇళ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మాణాలు చేయాలని సంకల్పించారు. ఇప్పుడు కౌన్సిలర్లకు అధికారం ఇవ్వడంతో అర్హులను వివిధ కారణాలతో తొలగి స్తున్నారన్న వ్యాఖ్యలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఎవరికోసం ఈ ఇళ్లు? జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, నెల్లిమర్ల, సాలూరు ము న్సిపాలిటీల్లో ఈ ఇళ్లను నిర్మించేందుకు స్థలాలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి ప్రాంతా ల్లో స్థలాలను కేటాయించారు. ఆయా మున్సిపాలిటీల్లో సొంత ఇల్లు లేనివారు, సొంత ఇంటి స్థలం లేనివారిని గుర్తించాల్సి ఉంది. మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే నివసిస్తున్న వారు అర్హులు. అలాగే, సంవత్సరాదాయం రూ.3 లక్షలకు మించి ఉండరాదు. గతంలో ఎటువంటి గృహరుణం పొంది ఉండకూడదు. అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం యంత్రాలతో మట్టి నమూనాలు సేకరిస్తున్న కాంట్రాక్టర్లు నామమాత్రంగా సిబ్బంది నియామకం.. వార్డుల్లో మున్సిపల్ సిబ్బందిని అర్హుల ఎంపికకు నియమిస్తున్నామని మున్సిపాలిటీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కేవలం నామమాత్రంగానే వీరిని నియమించారని, వార్డుల్లో ఇళ్ల గురించి చెప్పేది మాత్రం కౌన్సిలర్లేననీ, సంబంధిత అధికారులు ఎవరూ రావడం లేదని వార్డువాసులు చెబుతున్నారు. చాలా వార్డుల్లో నియమించిన మున్సిపల్ సిబ్బందిని వార్డుల్లోకి రావద్దని కౌన్సిలర్లు ముందే హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసి ఉన్న వారి సంఖ్య సుమారు 20 వేలకు పైగానే ఉంది. రుణాలిచ్చేదుందా? హౌస్ ఫరాల్ పథకంలో రుణాలు, డిపాజిట్లు ముఖ్యం. కేటగిరీల ప్రకారం ఒకటో కేటగిరీలో రూ.2.65లక్షలు, రెండో కేటగిరీకి రూ.3.15 లక్షలు, మూడో కేటగిరీకి రూ.3.65 లక్షల రుణం బ్యాంకులు ఇవ్వాలన్నది పథక నిర్ణయం. దీంతో ఈ రుణాలు నిజంగా బ్యాంకులు ఇస్తాయా అని జనం నోరెళ్లబెడుతున్నారు. దీంతో పాటు నిరుపేదలంతా మూడు కేటగిరీల్లోనూ రూ.500, 50,000, 100,000 వంతున డిపాజిట్లు చెల్లించాల్సి ఉంది. ఈ డిపాజిట్ల చెల్లింపుతో పాటు రుణ వాయిదాలు చెల్లించాలి. దీంతో ఈ గృహ నిర్మాణాలపై నమ్మకం లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. రైల్వే శాఖ అనుమతిస్తేనే ఇళ్ల నిర్మాణం.. బొబ్బిలిలో నిరుపేదల కోసం అందరికీ ఇళ్లు పథకంలో ప్లాట్లు నిర్మించేందుకు గ్రోత్ సెంటర్ పక్కన 34 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ స్థలానికి వెళ్లేందుకు దారి లేదు. రైల్వే లైన్ దాటి వెళ్లాల్సిన అవసరం ఉన్నందున అధికారులు ఇప్పుడు డీఆర్ఎంకు లేఖ రాస్తున్నారు. ఇక్కడ గేటు వేయడం లేదా ఓవర్ బ్రిడ్జి నిర్మించడం అవసరం. గేట్లను ఇప్పటికే రైల్వే శాఖ తొలగిస్తున్నది. దీంతో ఓవర్‌బ్రిడ్జి తప్పనిసరి. ఇదంతా అయ్యే పనేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు ఎదురుగా ఉన్న స్థలం చూపించిన అధికారులు దానిని ఎందుకు మార్చాతో తెలియడంలేదు. దారిలేని చోటును ఎందుకు కేటాయించారో వారికే తెలియాలి. మొత్తం అన్ని మున్సిపాలిటీల్లోనూ స్థల సేకరణ జరిగాక నిర్మాణాలు ప్రారంభిస్తామని టెండర్ దక్కించుకున్న సంస్థ చెబుతుండగా.. ముందుగా అర్హులను తేల్చేందుకు కౌన్సిలర్లు ఉబలాట పడుతుండటం కొసమెరుపు. బొబ్బిలి పట్టణంలోని ఆరో వార్డులో గెంబలి కవిత అనే మహిళ ఉంది. అదే పేరుతో ఐదో వార్డులో మరో మహిళ ఉంది. ఇద్దరూ ఇల్లు కోసం దరఖాస్తు చేశారు. ఇందులో గెంబలి కవిత పేరున ఇల్లు మంజూరై ఉందని మరొకరి దరఖాస్తును తిరస్కరించారు. కాదు బాబోయ్ అంటున్నా అటు హౌసింగ్, ఇటు మున్సిపల్ కార్యాలయానికి తిప్పుతున్నారే తప్ప సమస్యను పరిష్కరించడంలేదు. వీరే కాదు పట్టణంలోని హౌస్ఫర్ఆల్ పథకానికి వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 30 శాతం ఇళ్లున్నాయని, ఇక్కడి వారు కాదని తిరస్కరిస్తున్నారు. మా పేరు గల్లంతైందని పట్టణ ప్రణాళికా విభాగం అధికారిని ప్రశ్నిస్తున్న కవిత ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఈశ్వరరావు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య సుమ, కుమార్తె హారికలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. సొంత ఇల్లు లేకపోవడంతో ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తనకొచ్చే కొద్దిపాటి సంపాదనలోనే రూ.1500 నెలకు అద్దె చెల్లిస్తున్నాడు. హౌస్ ఫర్ ఆల్ పథకంలో ఇటువంటి వారికి ఇల్లు మంజూరు చేస్తారనే సరికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇతనికి ఆధార్ లింక్ కావడం లేదని జాబితా లోంచి పేరు తొలగించారని ఆవేదన చెందుతున్నాడు. -
సమస్య తీర్చమంటే బెదిరింపులు
► పీఎస్‌లోనే బెదిరించినట్లు కౌన్సిలర్‌పై ఆరోపణ ► మంత్రి కేటీఆర్‌కు బాధితుడు లేఖ సిరిసిల్ల క్రైం: సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిన నాయకులు ప్రతివాదులుగా మారి పార్టీ పరువు బజారుకీడుస్తున్న సంఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటి తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. మొన్న మున్సిపల్లో వాటాలు కుదరకపోవడంతో వాట్సప్‌లో పంపకాల పర్వంతో పరువు తీసుకున్న కౌన్సిలర్లు మళ్లీ వివాదాల్లోనే కొనసాగుతున్నారు. అప్పుడు ఆర్థిక లావాదేవీల వివాదంలో కేంద్రబిందువులుగా ఉన్నవాళ్లు ఇప్పుటు భార్యభర్తల గొడవల్లో తలదూర్చారు. దీంతో ఓ నేతకార్మికుడు చావే శరమణ్యమంటూ మంత్రి కేటీఆర్‌కు స్వయంగా లేఖ రాశాడు. బాధితుడి వివరాల ప్రకారం.. గోపాల్‌నగర్‌కు చెందిన ప్రసాద్ నేతకార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈయన మొదటి భార్యకు సంతానం కలుగలేదు. దీంతో తమ్ముడి పిల్లలను దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నాడు. భార్య నిరాకరించడంతో తాను పని చేసే చోటే మరో మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యకు బాబు జన్మించాడు. ఇదే సమయానికి మొదటి భార్య గర్భవతి అని తెలిసింది. దీంతో కుటుంబంలో పలు సమస్యలు రావడంతో చిన్న భార్య చెప్పకుండా పుట్టింటికి వెళ్లింది. ప్రసాద్ పలుమార్లు ఆమె ఇంటికి రావడానికి ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఈ విషయంలో విడాకులు కావాలని రెండో భార్య స్థానిక కౌన్సిలర్‌తో చెప్పింది. పోలీస్ స్టేషన్లో ఈ సమస్య పరిష్కరించడానికి సదరు కౌన్సిలర్ ఠాణాకు పిలిపించారు. ఠాణాలో కౌన్సిలింగ్ నిర్వహించే ప్రాంతానికి వచ్చిన కౌన్సిలర్ దుర్భాషలాడుతూ, భార్యను ఇంటికి రామ్మంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ప్రసాద్ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు, జిల్లా ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బెదిరించలేదు భార్యభర్తల మధ్య గొడవకు సంబంధించిన ఫిర్యాదు ఠాణాలో ఉంది. వాళ్ల సమస్యను తీర్చేందుకు పెద్దమనిషిగా నా వద్దకు వచ్చారు. మార్కండేయ గుడిలో పంచాయితీ చేయడానికి నిర్ణయించారు. కానీ ఇరువర్గాల వాళ్లు రాలేదు. నేను పోలీస్‌స్టేషన్‌లో ఎలా బెదిరిస్తాను. - యెల్ల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సిరిసిల్ల అలాంటి ఫిర్యాదు రాలేదు... భార్యభర్తలకు సంబంధించిన ఫిర్యాదు రాలేదు. కుటుంబ సమస్యలుంటే దానిని కౌన్సిలింగ్‌తో పరిష్కరిస్తామే తప్ప ఇతరులను చూడమని చెప్పే అవకాశం లేదు. - సీహెచ్ శ్రీనివాస్‌రావు, సీఐ, సిరిసిల్ల -
హు... హ... హు?
ఈ పిల్లవాడెవరు? చిందులేస్తాడు.. ఎగురుతాడు.. తంతాడు.. కరాటే నేర్చుకోకపోయినా బ్లాక్బెల్డ్లా హు...హ.. హు.. అంటాడు. పదేళ్ల బిడ్డకు అంత నైపుణ్యం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? గత జన్మనుంచా? హు.. హ.. హు..?? (who) ‘‘అక్కా, అవినాశ్ మూసిన కన్ను తెరవడం లేదు. నాకు భయంగా ఉంది. నువ్వు తొందరగా రా!’’ అంది పద్మ ఫోన్లో. పద్మ గొంతులో ఆందోళన గమనించిన అక్క రజిత ‘‘ఏమైందే? నిన్న బాగానే ఉన్నాడు, స్కూల్ కెళ్తున్నాడు అని చెప్పావుగా!’’ అంది ఆదుర్దాగా!‘‘అవన్నీ నువ్వొచ్చాక చెబుతా! రా ముందు’’ ఏడుపు గొంతుతో అంది పద్మ. ‘‘సరే, టెన్షన్ పడకు. వస్తున్నా!’’ అంది రజిత.గంటలో పద్మ ఇంటి ముందుంది రజిత. లోపల చడీచప్పుడు లేదు. కొంచెం ఆందోళన గానే బెడ్రూమ్లోకెళ్లింది. పద్మ ఏడుస్తూ బెడ్‌మీద కూర్చుని ఉంది. బెడ్ మీద అవినాశ్ పడుకుని ఉన్నాడు. ఇంట్లో మరిది శ్రీనివాస్ లేనట్టున్నాడు. పద్మకు ఒక్కడే కొడుకు అవినాశ్. ఐదవ తరగతి చదువుతున్నాడు. దగ్గరగా వెళ్లి ‘‘పద్మా! ఏమైందే!’’ అని భుజంపై చెయ్యి వేసి అడిగింది రజిత. అక్కను చూడగానే ఆమెను పట్టుకొని బావురుమంది పద్మ.‘‘వాడేమైపోతాడోనని భయంగా ఉందే!’’ అని ఏడుస్తూనే ఉంది. అవినాశ్ ఒంటిమీద చెయ్యి వేసి చూసింది రజిత. ఒళ్లు బాగా కాలిపోతోంది. ఒంటి మీద చర్మం కమిలిన గుర్తులు కనిపించాయి. ‘‘ఏమైంది? శ్రీనివాస్ ఎక్కడ?పిల్లవాడికి ఇలాగుంటే ఎక్కడికెళ్లాడు?’’ అందోళనగా అడిగింది రజిత. పద్మ ఏడుస్తూనే ఉదయం జరిగిన విషయం అంతా చెప్పుకొచ్చింది. రోజూ గొడవలే! ‘‘వీడితో రోజూ ఏదో సమస్య వచ్చి పడుతూనే ఉందక్కా. ఉదయం స్కూల్ నుంచి ఫోన్ రావడంతో నేను మీ మరిది వెళ్లాం. ‘మీ అబ్బాయిని తీసుకెళ్లండి, టీసీ ఇచ్చేస్తాం’ అన్నారు ప్రిన్సిపల్. క్లాస్‌మేట్‌తో గొడవ పడ్డాడట. ఆ పిల్లవాడిని వీడు కొట్టడంతో తలకు దెబ్బతగిలిందట. ఆసుపత్రిలో చేర్చారు. ఎప్పుడు చూసినా క్లాస్‌రూమ్‌లో కరాటే ఫీట్లు చేస్తాడట. ఈ కరాటే పిచ్చి ఎక్కడ పట్టుకుందో, ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నీకు తెలుసు కదా! ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే. వీడు చేసిన పనికి ఆ పిల్లవాడి తల్లితండ్రులు వచ్చి మమ్మల్ని తిట్టారు. దీంతో శ్రీనివాస్ ఆవేశంలో వీడిని చితకబాదాడు. అడ్డు వచ్చిన నన్ను కూడా తోసేశాడు. బిడ్డకు ఒళ్లంతా వాతలు తేలాయి. బాగా భయపడ్డాడు. జ్వరం వచ్చేసింది. కోపంలో పొద్దుననగా వెళ్లిన శ్రీనివాస్ ఇప్పటిదాకా రాలేదు. ఫోన్ చేస్తే.. ‘ఛస్తే.. చావనీ’ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నాకేం తోచక నీకు ఫోన్ చేశాను’’...ఏడుస్తూనే చెప్పింది పద్మ. అవినాశ్ విషయం రోజూ రజితకు తెలుస్తూనే ఉంటుంది. మూడేళ్ల వయసు నుంచే ‘హ.. హు....’ అంటూ కరాటే ఫైట్లు చేసేవాడు. అడ్డున్న వస్తువులు వాడి ఫీట్లకు ముక్కలవ్వాల్సిందే! స్కూల్‌కి వెళ్లమంటే మాత్రం చుక్కలు చూపించేవాడు. కరాటే స్కూల్లో చేర్పించమంటే శ్రీనివాస్ వినేవాడు కాదు. చదువుపై శ్రద్ధ ఉండదు వేరే వ్యాపకాలుంటే బుద్ధిగా చదువుకోమని హెచ్చరించేవాడు. అవినాశ్ మొండిగా ప్రవర్తించేవాడు. విసిగినప్పుడల్లా తిడుతూనో, కొడుతూనో వాడిని అదుపులో పెట్టాలనుకునేవాడు శ్రీనివాస్. ఆలోచనల నుంచి తేరుకున్న రజిత ‘ఆసుపత్రికెళ్దాం పద’ అని బయల్దేరదీసింది. ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకునేసరికి శ్రీనివాస్ వచ్చి ఉన్నాడు. కొడుకు పరిస్థితి చూసిన శ్రీనివాస్‌కు కళ్లనీళ్లు ఆగలేదు. కోపంలో ఎంతగా కొట్టిందీ గుర్తు తెచ్చుకొని మరీ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు.‘‘వీడు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడంలేదొదినా! అన్నీ టైమ్‌కి అమర్చి పెడుతున్నా చదువుకోకుండా ఈ పిచ్చిపనులేంటో’’ అన్నాడు శ్రీనివాస్. ‘‘శ్రీనివాస్! నేను చెప్పిన చోటుకి వాడిని తీసుకొస్తే సమస్యేంటో మీకూ, వాడికీ తెలుస్తుంది. అప్పుడీ గొడవలూ, ఏడ్పులూ ఉండవు’’ అంది రజిత. ‘‘అక్కా! ఏదైనా చేయి. ఎక్కడకు రమ్మన్నా వస్తాం. వాడు బాగుపడితే అంతే చాలు!’’ అంది రజిత చేతులు పట్టుకొని పద్మ. వెలుగు చూపిన ప్రయాణం అవినాశ్ చుట్టూ ఆసక్తిగా చూస్తున్నాడు. తల్లీ తండ్రి అక్కడ ఉన్న అతనితో తన గురించి చెబుతుంటే మౌనంగా వింటున్నాడు. అన్నీ విన్న కౌన్సెలర్ అవినాశ్‌కు దగ్గరగా వచ్చి అతణ్ణి మెత్తని వాలు కుర్చీలో కూర్చోబెట్టాడు. ‘‘అవినాశ్! ఇక్కడ నీకు నచ్చినట్టే ఉండు. అమ్మా నాన్న ఏమీ అనరు. వాళ్లు ఏమైనా అన్నా మేం ఊరుకోం. మేం చెప్పినట్టు చేస్తావా?’’ అని అడిగాడు. ‘చేస్తాను’ అన్నట్టు తల ఊపాడు అవినాశ్. ‘‘అవినాశ్! కళ్లు మూసుకొని ప్రశాంతంగా పడుకో. ఏ భయాలూ పెట్టుకోకు. నేను అడిగినప్పుడు నీ కళ్ల ముందు ఏమేం కనిపిస్తాయో, అనిపిస్తున్నాయో అవన్నీ చెబుతూ ఉండు..’’ కౌన్సెలర్ చె ప్పాడు. ఎదురుగా కౌన్సెలర్, అమ్మనాన్న, పెద్దమ్మ.. వారందరినీ చూసి కళ్లు మూసుకొన్నాడు అవినాశ్. పది నిమిషాలు నిశ్చల స్థితిని అనుభవించేంత సమయం ఇచ్చిన కౌన్సెలర్ అవినాశ్‌కు సూచనలివ్వడం ప్రారంభించాడు. అవినాశ్ అంతర్ చేతనలో తను ఎక్కడ ఉన్నది, ఏమేం చేస్తున్నది, దృశ్యంగా కనిపిస్తున్నవి ఏంటి... వరుసగా చెబుతున్నాడు. పద్మ, రజిత, శ్రీనివాస్‌లు మౌనంగా చూస్తున్నారు. అవినాశ్ చెబుతున్నాడు.. ‘అమ్మ దగ్గర ఆడుకోవడం, అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగుంది. ఈ స్కూల్ అంటే ఇష్టం లేదు. చదువంటే భయం. నా కంపాస్ బాక్స్ కిశోర్ లాక్కున్నాడు. అడిగితే నన్ను కొట్టాడు. నేను ఒక్క ‘కిక్’ ఇచ్చాను. అంతే, గొడకు కొట్టుకొని దెబ్బ తగిలింది. టీచర్ నన్నే కొట్టింది. నేను ఆ టీచర్‌కీ కిక్ ఇచ్చాను. నాన్న నన్ను కొడుతున్నాడు. నాన్నా... నన్ను కొట్టద్దు నాన్నా! ప్లీజ్ నాన్నా!’ అంటున్న అవినాష్ బుగ్గల మీద ధారాపాతంగా కన్నీళ్లు. అవినాశ్ స్థితిని చూస్తున్న పద్మ, రజిత, శ్రీనివాస్‌లు విలవిలలాడిపోయారు. కౌన్సెలర్ సూచనలు అవినాశ్‌కు ఇంకా అందుతున్నాయి. ‘‘నీకు ఇంకా ఏం ఇష్టం, ఇంకా వెనక్కి వెళ్లగలవు. అది నీ గత జీవితం అవుతుంది. ప్రయత్నించు’’ అని చెప్పాడు. అవినాశ్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. అంతా విచిత్రంగా చూస్తున్నారు. ‘నా ఊరు చైనాలో ఉంది. నాకు ‘నింజా’ అనే కరాటే స్కూల్ ఉంది. నేను టీచర్ని. శిష్యులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే నాకు ప్రాణం. నేను ముసలోడినైపోయాను. నా స్కూల్ పాడైపోతోంది, ఎవరూ పట్టించుకోవడంలేదు. నేను అక్కడికే వెళ్లిపోతాను’ ...పలవరిస్తున్నట్టుగా చెబుతున్నాడు అవినాశ్. అవగాహనతో సాధన థెరపీ పూర్తయింది. అవినాశ్‌ను విశ్రాంతి తీసుకోమని చెప్పి పద్మ, శ్రీనివాస్‌లను బయటకు తీసుకువచ్చారు కౌన్సెలర్. ‘‘శ్రీనివాస్! మీరూ విన్నారుగా అవినాశ్ అంతర్చేతనంలో ఎలాంటి భావాలున్నాయో! అవి ఇప్పటివి కాదు. అతని గత జన్మలోనివి. కరాటే అంటే అతనికి ప్రాణం. అతని కల తీరకుండానే మరణించి, అదే ఊపిరిగా తిరిగి జన్మించాడు. తను ఏం చేయాలనుకొని ఈ భూమ్మీదకు వచ్చాడో ఆ పనికి అడ్డుపడకండి. పెద్దలుగా మీకున్న కలలు మీ బిడ్డ మీద రుద్దకుండా అతడికి ఏమవ్వాలని ఉందో దాంట్లో తర్ఫీదు ఇప్పించండి. మీ బిడ్డ జీవితం మెరుగవుతుంది’’ అన్నారు కౌన్సెలర్. ‘తప్పకుండా’అన్నారు శ్రీనివాస్, పద్మ మనస్ఫూర్తిగా. ఇప్పుడు అవినాశ్‌కి పధ్నాలుగేళ్లు. 8వ తరగతి చదువుతున్నాడు. కౌన్సెలర్ సూచనల ప్రకారం అవినాశ్‌ను కరాటే స్కూల్లో చేర్పించాడు శ్రీనివాస్. కరాటేలో రాష్ట్రస్థాయి పోటీల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. చదువు ఇష్టం లేదన్నా, మెల్లగా తన మనసును అక్షరాలపై కుదిరేలా చేసుకున్నాడు. నేషనల్ ఛాంపియన్ అవ్వాలనే ధ్యేయంతో సాధన చేస్తున్నాడు. 3 వేల మంది పిల్లలపై పరిశోధన డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ అమెరికాలో ప్రముఖ సైకియాట్రిస్ట్. వర్జీనియా విశ్వవిద్యాలయంలో 50 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. 40 ఏళ్ల వయసులో ప్రపంచంలోని 3000 మంది పిల్లల నుంచి రిగ్రెషన్ థెరపీ ద్వారా వారి గత జీవితం తాలూకు విశేషాలను రాబట్టారు. దీని బట్టి, ‘చేతన’ ప్రయాణం ఎప్పటికీ ఆగిపోదని బలంగా చెప్పారు అయాన్. బాల మేధావులెందరో..! కొంతమంది పిల్లల్లో అసాధారణ కళ, నైపుణ్యం ఆశ్చర్యపరుస్తుంటుంది. కిందటి జన్మలో ఆ కళ పట్ల వారికి అపారమైన అనుభవం, అభిమానం ఉండి ఉంటాయి. దాన్ని పూర్తి చేసుకో లేక తమ పుట్టుకతో పాటూ ఈ జన్మకూ మోసుకువస్తారు. తమకు నచ్చిన ఆ కళనే సాధన చేస్తుంటారు. అంతః చేతనలో ఉండే ఆ కళను వారు దర్శించగలిగితే సాధనమార్గాలు సులువు అవుతాయి. నైపుణ్యం పెరుగుతుంది. - డాక్టర్ లక్ష్మీ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్, లైఫ్ రీసెర్చి అకాడమీ, హెదరాబాద్ జ్ఞాపకాల గని కరోల్ బౌమ్యాన్ పాస్ట్ లైఫ్ థెరపిస్ట్. పరిశోధకురాలు. పిల్లల గత జీవిత జ్ఞాపకాలను వెలికి తీసి ‘చిల్డ్రన్ పాస్ట్ లైవ్స్’ (పిల్లల గత జీవితాలు) పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకం ప్రపంచంలో 22 భాషల్లో అనువాదమైంది. మొజార్ట్ కూడా అంతే! మొజార్ట్ ఆస్ట్రియావాసి. కీబోర్డ్, వయొలిన్ అంటే పిచ్చి. ఎవరూ అతనికి సంగీతనం నేర్పించలేదు. కానీ, సమర్థంగా రాగాలను పలికించేవాడు. 5 ఏళ్ల వయసులోనే యురోపియన్ రాజవంశీయుల ముందు తన సంగీత ప్రతిభను చూపి ప్రశంసలు అందుకున్నాడు. సంగీతంలో ప్రపంచ ప్రసిద్ధుడయ్యాడు. - నిర్మల చిల్కమర్రి -
డర్టీ మిర్రర్
నన్ను నేను చూడలేను. అద్దం ముందు నిలబడలేను. నిజానికి ఎవరిముందూ నిలబడలేను. అవును. నన్ను నేను చూడలేను. కమిలిన గుర్తులు నన్ను వెక్కిరిస్తున్నాయి. చేతులతో వెక్కిరిస్తున్నాయి. చేతలతో వెక్కిరిస్తున్నాయి. గుర్తులు గుర్తుకొస్తున్నాయి. అవును. నన్ను నేను చూడలేను. ఒక్కొక్కసారి మరకలు మన మీద కాదు... సమయం అనే అద్దం మీద ఉంటాయి. ఆ డర్టీ మిర్రర్ మీద కనిపించే కమిలిన గుర్తులు తుడిచేస్తే పోవా? పోతాయి. సోఫాలో అత్తగారి పక్కనే కూర్చుంది శైలజ. భర్త విశ్వ వచ్చి ఆమె పక్కన కూర్చోగానే దిగ్గున లేచి వెళ్లి కుర్చీ వెనకాల నిలబడింది. విశ్వ మొహం ఎర్రబడింది. అసహనంగా కదిలాడు. తల్లివైపు తిరిగి ‘‘నాకు విడాకులు కావాలి! అందుకే మిమ్మల్ని పిలిచాను’’ అన్నాడు.నిర్ఘాంతపోయారు ఇరువైపు పెద్దలు. మౌనంగా ఉన్న శైలజను చూస్తూ తల్లి అలివేలు ‘‘ఏం మాట్లాడవేంటే, ఏమైంది?’’ ఆదుర్దాగా అంది . ‘‘అమ్మాయి బాగుందని, ముచ్చటపడితేనే కదరా ఈ పెళ్లి చేసింది. ఇప్పుడు వద్దు, విడిపోతానంటే ఏంటర్ధం?’’ విసుగ్గా కొడుకును మందలించింది పుణ్యవతి. శైలజ, విశ్వల పెళ్లై ఆరునెలలవుతోంది. పెళ్లికి వచ్చిన వారంతా జంట బాగుందని ఎంతో మెచ్చుకున్నారు. అంతలోనే విడాకులు కావాలంటూ విశ్వ గొడవ. ‘‘లేదమ్మా! ఒక కప్పు కింద పరాయివాళ్లలా ఏళ్లకు ఏళ్లు ఉండటం సాధ్యం కాదు. విడిపోవడమే మేలు’’ మాట్లాడేదేమీ లేనట్టుగా అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు విశ్వ. శైలజ మౌనంగా తన గదివైపు వెళ్లింది.పెద్దలు ముఖముఖాలు చూసుకున్నారు. విడాకులు తప్పవా?! శైలజ, విశ్వ చెరో గదిలో ఉండటం గమనించింది అలివేలు. ‘‘శైలూ...’’ గదిలో పడుకుని పైకప్పు కేసి చూస్తూ ఉన్న శైలజ తల్లి మాటలకు ఉలిక్కిపడి ఏంటన్నట్టు చూసింది. ‘‘ఏంటే ఇది.. నీ వెనుక చెల్లీ, తమ్ముడు ఉన్నారని మరిచిపోయావా? విడాకులు తీసుకుని పుట్టింటికి వస్తే నలుగురూ ఏమనుకుంటారు? చెల్లికి పెళ్లి అవుతుందా?! అయినా ఏమైందే?! సొంత ఇల్లు, ఇంటినిండా సామాను. బీరువా నిండా చీరలు, నగలు. పైగా పల్లెత్తు మాట అనడు అల్లుడు. ఇంతకన్నా ఏం కావాలే! ఈ విడాకుల గొడవేంటి’’ తల్లి మాటలకు మౌనంగా ఉంది శైలజ.‘‘నువ్వు మాట్లాడవే! చిన్నప్పటి నుంచీ ఇంతేగా! నీకు పిచ్చి పట్టింది. ఏదడిగినా మౌనంగా ఉంటావు. నీకొచ్చిన కష్టమేంటో చెప్పకపోతే .. మాకు మాత్రం ఏం తెలుస్తుంది? అయినా నిన్ను గారాబం చేసి చెడగొట్టాడే మీ నాన్న. అదే ఇప్పుడు నా తలమీదకొచ్చింది. విడాకులిస్తే ఇంకెక్కడికైనా పో.. మా ఇంటికి మాత్రం రాకు...’’ అంటూ విసురుగా వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయింది శైలజ. మరణమే సమాధానమా! ఆసుపత్రి బెడ్ మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది శైలజ. విశ్వ ఫోన్ చేసి చెప్పడంతో తలీతండ్రి, అత్తామామ వచ్చారు. ‘‘విషం తాగింది..’’ చెప్పాడు విశ్వ. కూతురి ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళనగా అడిగారు తల్లీతండ్రి. వారి చేతికి శైలజ రాసిన ఉత్తరం ఇచ్చి, అక్కడ నుంచి మౌనంగా వెళ్లిపోయాడు విశ్వ.శైలజ ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి ముందు రాసిన ఉత్తరం అది... ‘‘అమ్మా! విడాకులు తీసుకొని నీ దగ్గరకు వస్తే మీ పరువు పోతుంది. అలాగని ఇక్కడే ఉంటే ప్రతీ రోజూ నా ప్రాణంపోయినంత పనౌతూవుంది. ఇందులో విశ్వ తప్పేమీ లేదు. నాకు అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని ముందే చెబితే.. అప్పుడు నువ్వే మాత్రం ఒప్పుకోలేదు. పైగా చచ్చిపోతానని బెదిరించి నా నోరు కట్టేశావు. తల్లిదండ్రులుగా మీ బాధను చూడలేక ఈ పెళ్లికి ఒప్పుకున్నా! కానీ, విశ్వను నేను అంగీకరించలేకపోతున్నా! అతన్ని చూస్తేనే నాకు భయం వేస్తోంది. నా మీద చెయ్యి వేస్తే ఒళ్లంతా గొంగళి పురుగులు పాకినట్టుగా ఉంది. నా శరీరం మీద నాకు అసహ్యం కలుగుతోంది. అమ్మా, ఇదంతా నీకు చెప్పాలని, నీ ఒళ్లో తలపెట్టుకొని ఏడ్వాలని ఉంది. కానీ, నువ్వా అవకాశాన్ని నాకెప్పుడూ ఇవ్వలేదు. అందుకే నీకే అవకాశాన్ని ఇచ్చి వెళ్లిపోతున్నాను.. బై!’’. ఉత్తరం చదివిన అలిమేలు మంగ ఏడుస్తూనే ఉంది. ‘నా కూతురుని బతికించు దేవుడా!’ అని దేవుళ్లకు మొక్కుంది. రెండు రోజుల తర్వాత శైలజకు ప్రమాదం తప్పిందని చెప్పారు డాక్టర్లు. కొత్త జన్మ శైలజ కౌన్సెలర్ ఎదురుగా ఉంది. తను చనిపోకుండా ఎందుకు బతికానా అని ఏడుస్తూ ఉంది. కౌన్సెలర్ ఆమె మాటలను శాంతంగా విన్నాడు. ‘‘శైలజా, ఇది మీకు కొత్త జన్మగా భావించండి. మీరు ఆత్మహత్య వైపుగా ఎందుకు మొగ్గుచూపారో.. అక్కడ నుంచే మీ ప్రయాణాన్ని మొదలుపెడితే సమస్య తగ్గే అవకాశం ఉంది. అందుకు గతం తాలూకు చేదును వెలికి తీసి, మీ మనసుకు సాంత్వన చేకూర్చే ఈ థెరపీ మీకెంతో మేలు చేస్తుంది..’ అన్నారు కౌన్సెలర్. శైలజ తల్లి, తండ్రి అక్కడే ఉన్నారు. కూతురు జీవితం బాగయ్యే మార్గం వెతుకుతున్నప్పుడు దొరికిన ఆలంబన ‘ఫాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపీ.’ మానసిక స్వస్థతను కలిగించే ఈ థెరపీ తమను తాము అర్థం చేసుకుంటూ సమస్యలకు పరిష్కారం దొరికేలా చేస్తుందని తెలుసుకుని ఈ థెరపీకి శైలజను తీసుకువచ్చారు. టైమ్ మిషన్! శైలజకు థెరపీ ఇవ్వడం మొదలైంది. నిపుణులు చెప్పిన విధంగా ధ్యానముద్రలో కళ్లుమూసుకున్న శైలజ తన కళ్ల ముందు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయో.. దర్శించడం మొదలుపెట్టింది. కౌన్సెలర్ తన సూచనలను కొనసాగిస్తూ..‘‘శైలజా మీకు ఇప్పుడు పాతికేళ్లు. ఈ వయసు నుంచి 15 ఏళ్ల మధ్యలోకి ధ్యానం ద్వారా టైమ్ మిషన్‌లో ప్రయాణిస్తున్నట్టుగా వెళతారు. ఈ మధ్యలో మిమ్మల్ని కుదిపేసిన విషయాల మీద దృష్టి నిలపండి. అక్కడ మీరు ఏం సందర్శిస్తున్నారో.. ఆ విషయాలను మాకు చెప్పండి’’ అన్నారు. కాసేపటికి శైలజ మళ్లీ మాట్లాడం మొదలుపెట్టింది. ‘‘పదో తరగతిలో ర్యాంకు రాలేదు. అమ్మకు కోపం వచ్చింది. నాన్న బాధ పడుతున్నారు.. అప్పటి విషయాల గురించి చెబుతోంది శైలజ. కాసేపటికి, కౌన్సెలర్ సూచనలు మళ్లీ మొదలయ్యాయి. ఎనిమిదేళ్ల వయసులో... ‘‘మీరు ఇంకా వెనక్కి అంటే... 15 నుంచి 5 ఏళ్ల మధ్య మీ వయసు ఉందని భావించండి. ఈ పదేళ్లలో ఏం జరిగిందో మీ మనోనేత్రంతో దర్శిస్తూ చెప్పండి’’. కౌన్సెలర్ చెబుతున్న సూచనలతో శైలజకు అందుతున్నాయి. కాసేపటికి.. శైలజ ‘‘నా వయసు 8 ఏళ్లు..’ అంటూ ఆగిపోయింది. ఆమె కళ్ల నుంచి ధారగా నీళ్లు చెక్కిళ్ల మీదకు చేరుతున్నాయి. నిలువెల్లా వణికిపోతోంది... ‘అమ్మా, అమ్మా..!’ అని అరుస్తోంది. ‘వద్దు.. ప్లీజ్ అంకుల్.. నన్నేమీ చేయద్దు. వదిలేయండి...’ అంటూ వేడుకుంటోంది. ‘‘ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావు..’’ అడిగారు కౌన్సెలర్. ‘‘మా ఇంటి ఎదురుగా ఉండే అంకుల్. మంచివాడు కాదు. ఆంటీ లేదు. అమ్మ నన్ను అంకుల్‌కి స్వీట్లు ఇచ్చి రమ్మంటే వెళ్లాను. అక్కడ.. ఆ అంకుల్ నన్ను డర్టీగా పట్టుకున్నాడు. నా ఒళ్లంతా తడిమాడు. నేను పారిపోయి వచ్చేశాను’’ అని చెప్పుకుంటూ పోతోంది. కూతురు అవస్థ చూస్తున్న అలిమేలు మంగ కళ్లలో నీళ్లు ఆగడం లేదు. ఎనిమిదేళ్ల వయసులో ఎదురింటి వాళ్ల గురించి శైలజ చెప్పిన విషయం ఆమెకు గుర్తుకువ చ్చింది. కడిగేసుకున్న మురికి శైలజ ఇంకా చెబుతోంది..‘‘అమ్మకు చెబుదామని పరిగెత్తుకువచ్చాను. కానీ, భయమేసింది. బాగా జ్వరం. ఓ రోజు అమ్మతో ‘ఆ అంకుల్ మంచివాడు కాదమ్మా!’ అంటే.. నన్నే తిట్టింది. ‘నాన్నకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే.. ఆ అంకుల్, ఆంటీలే ఆసుపత్రికి వచ్చి ఎంత సాయంగా ఉన్నారు. అలాంటి వారిని పట్టుకొని మంచివాడు కాదంటావా?’ అని కసిరింది. దాంతో ఏమీ చెప్పలేకపోయాను. నేను స్కూల్కెళుతుంటే ఆ అంకుల్ నన్ను చూసి నవ్వాడు. నాకు వణుకు పుట్టింది. నాకు మగవాళ్లంటేనే భయం మొదలైంది. ఆ అంకుల్ని చంపేయాలి’’ శైలజ ఏడుస్తూనే చెబుతోంది. ఆమెలో దుఃఖం తగ్గాక ‘‘దీనికి, ప్రస్తుత మీ జీవితానికి ఏదైనా సంబంధం ఉందా?’ అని కౌన్సెలర్ అనగానే.. ‘ఉంది. నేను మలినమయ్యాను. విశ్వ మంచివాడు. కానీ, అతణ్ణి చూస్తేనే భయమేస్తోంది’’ అంటూ ఏడుస్తూనే ఉంది శైలజ. ఆమె దుఃఖం తీరేంతవరకు ఆగిన కౌన్సెలర్... ‘మీ ఎనిమిదేళ్ల వయసులో జరిగిన చర్యను ఇప్పడు క్షమాపూర్వకంగా చూడండి. మిమ్మల్ని బాధించిన ఆ వ్యక్తిని క్షమించే ప్రయత్నం చేయండి. అప్పటి మీ అంతఃచేతనకు ఏ భయ మూ లేదని నచ్చచెప్పండి..’ సూచనలు ఇస్తున్నారు. అలా అవి ఆమె సమస్య ప్రక్షాళనకు ఉపయోగపడ్డాయి. తన పట్ల నీచంగా ప్రవర్తించిన వ్యక్తిని క్షమించగలిగింది. అక్కణ్ణుంచి తెరిపిన పడిన మనసుతో మెల్లగా కళ్లు తెరిచింది. ఎదురుగా... తల్లి, తండ్రి. చిన్నవయసులో కూతురుకు ఎదురైన సమస్యను ఇన్నేళ్లకు గానీ అర్థం చేసుకోలేకపోయింది అలివేలు. మనస్ఫూర్తిగా తనను క్షమించమని కూతురుని కోరింది. తల్లిని హత్తుకుపోయి తన వేదనంతా మరిచిపోయింది శైలజ. శైలజ నవ్వుతోంది. చాలా ఆనందంగా.. తన భర్తతో కూర్చొని కులాసాగా కబుర్లు చెబుతోంది. తమ ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు, అత్తమామలకు అతిథి మర్యాదలు చేస్తున్న ఆమెను సంతోషంగా చూస్తూ ఉండిపోయారు కుటుంబ సభ్యులంతా. నమ్మకం ముఖ్యం బాల్యదశలో పిల్లల మెదళ్లలో చేరే భయం తాలూకు ‘బ్లాక్స్’ను తొలగించకపోతే అవి వారి జీవి తంపై చెడు ప్రభావాలు చూపు తాయి. శైలజ విషయంలో అదే జరిగింది. తల్లి తన బాధను చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం నుంచి గతానికి ప్రయాణించడం, తనలో ఉన్న అంతర్శిశువుకి నచ్చజెప్పడంతో తిరిగి తన మనసును సవరించుకుంది. భర్తను అంగీకరించగలిగింది. దీంతో ఆమె తర్వాతి జీవితం ఆనందకరంగా సాగింది. డాక్టర్ న్యూటన్ కొండవీటి, లైఫ్ రీసెర్చ్ అకాడమీ, హైదరాబాద్ తండ్రి అసహజ ప్రవర్తన హిట్లర్ బాల్యంలో ఎన్నో సృజనాత్మక పనులవైపు మొగ్గు చూపేవాడు. తల్లితో స్నేహంగా, సున్నితమైన హృదయం గలవాడుగా ఉండేవాడు. తండ్రి తన మాటే వినాలని అతనిని తరచూ కొట్టేవాడు. దీంతో హిట్లర్ మనసులో ఒక సంఘర్షణ. ‘నా తండ్రి నన్ను కొట్టినప్పుడు ఇంక ఏడ్వకూడద’ని ఓ రోజు నిర్ణయించుకున్నాడు. తండ్రిపై తిరుగుబాటు చేశాడు. అతనితోపాటే పెరిగిన ద్వేషంతో నియంతగా మారాడు. మానవజాతి మొత్తం వ్యతిరేకించే ఏకైక వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయాడు. - నిర్మల చిల్కమర్రి -
‘ఆసరా’ అడిగితే కొట్టాడు
21వ వార్డు కౌన్సిలర్‌పై వృద్ధురాలి ఫిర్యాదు కామారెడ్డిటౌన్ : ఆసరా ఫించన్ వచ్చేలా చూడాలని కోరితే తనపై కౌన్సిలర్ చేయి చేసుకున్నాడని కామారెడ్డి 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు లక్ష్మి ఆరోపించింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తనకు 70 ఏళ్లు ఉంటాయని తెలిపింది. మూడు నెలలుగా పింఛన్ వస్తలేదని పేర్కొంది. దరఖాస్తు చేసుకున్నా పింఛన్ రాకపోవడంతో వార్డు కౌన్సిలర్ జొన్నల నర్సింలును వేడుకోవడానికి గురువారం ఉదయం వెళ్లానని తెలిపింది. ఆయన కోపంతో తన చెంపపై కొట్టి నెట్టివేశాడని ఆరోపించింది. దీంతో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపింది. ఈ విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. తాను లక్ష్మిపై చేయి చేసుకోలేదని, కొందరు తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని కౌన్సిలర్ పోలీసులతో తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో పేరు లేకపోవడంతో లక్ష్మికి పింఛన్ రాలేదన్నారు. సర్వే చేయించామని పేర్కొన్నారు. ఈ సంఘటనపై సీఐ శ్రీనివాస్‌రావు సంప్రదించగా ఇంకా కేసు నమోదు చేయలేదని, విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
మాకు తెలియకుండా డబ్బెలా ఇస్తారు?
జోగిపేట : ‘మాకు తెలియకుండా ఆలయాలకు, మసీదులకు రూ.93 వేలు ఎలా పంపిణీ చేస్తారు?, మీ ఇష్టానుసారంగా ఇచ్చిన డబ్బులకు మేము ఆమోదం తెలుపం, ఇలా చేస్తే మిమ్మల్ని సరెండర్ చేయాల్సి వస్తుంది’ అని కమిషనర్ విజయలక్ష్మిపై పలువురు కౌన్సెలర్లు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సూచన మేరకు ఆ నిధులు మంజూరు చేసినట్లు కమిషనర్ సభ్యులకు తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశానికి చైర్పర్సన్ కవిత అధ్యక్షత వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రదీప్‌గౌడ్, శరత్‌బాబులు నగరపంచాయతీకి సంబంధించి అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 2.63 కోట్ల పనులను సీడీఆర్ ప్రాజెక్టుకుఅప్పగించాలని తీర్మానం ప్రవేశపెట్టగా దానికి మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే టీడీపీకి చెందిన కౌన్సిలర్ శ్రీకాంత్, టీఆర్ఎస్కు చెందిన లక్ష్మణ్‌లు ఇందుకు వ్యతిరేకించారు. అయితే 18 మంది కౌన్సిలర్లు చేతులెత్తి తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశంలో ఆదాయం, ఖర్చులకు సంబంధించిన నివేదిక ఇవ్వకపోవడంతో సభ్యులు కమిషనర్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు నివేదికను కమిషనర్ విజయలక్ష్మి తయారు చేసి చదివి వినిపించినా సభ్యులు సంతృప్తి చెందలేదు. ఒక్కోక్క వార్డులో సుమారుగా రూ.8 లక్షల పనులకు సంబంధించి ప్రతిపాదనలను తయారు చేయించాలని కౌన్సిలర్లు కమిషనర్ విజయలక్ష్మికి సూచించారు. అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 2.63 కోట్లు, బీఆర్ జీఎఫ్ కింద రూ.19.64 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయని, 13 ఫైనాన్స్ కింద రూ.53 లక్షలు మంజూరయ్యాయని కమిషనర్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. తైబజారు వేలం పాటను ఈనెల 23న నిర్వహించాలని, బకాయిలున్న వారిని వేలం పాటలో అనుమతించకూడదని కౌన్సిలర్ గోపి, సునీల్‌కుమార్‌లు సూచించారు. కూరగాయల మార్కెట్‌ను నెల రోజుల్లోగా నగర పంచాయతీకి అప్పగించాలని కలెక్టర్, పంచాయతీరాజ్ ఈఈలకు లేఖ రాయాలని కౌన్సిలర్ ప్రదీప్‌గౌడ్ కమిషనర్‌కు తెలిపారు. గాంధీ పార్కు షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలను పెంచాలని వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు నవీన్, లక్ష్మణ్‌లు కోరారు. కౌన్సిలర్లుకు తెలియకుండా అనుమతులివ్వొద్దు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఆయా వార్డుల కౌన్సిలర్లకు చెప్పకుండా అనుమతులు ఇవ్వరాదని కౌన్సిలర్లు లక్ష్మణ్, మోహన్‌లాల్ జాదవ్ సభ దృష్టికి తెచ్చారు. అయితే సమావేశంలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహరాజు సమాధానమిస్తూ నగర పంచాయతీ యాక్టులో అలాంటి నిబంధన ఏదీలేదని తెలిపారు. మాకూ మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నీ అంశాలను మీరే మాట్లాడితే ఎలా? తమకు కూడా అవకాశం ఇవ్వాలని మహిళా కౌన్సిలర్ తోట్ల మమత కోరారు. ఒక్క సమస్యపైనే సభను సాగదీస్తే ఎలా ముందుకు వెళతామని ఆమె ప్రశ్నించారు. 14వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి మాట్లాడుతూ తమ వార్డులో తాగునీటి పైపు ఏర్పాటుపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
ఇదేం ప్రజాస్వామ్యం !
సత్తుపల్లి: ప్రభుత్వ కార్యక్రమాన్ని సొంత పార్టీ కార్యక్రమంలా మార్చేశారు తెలుగు తమ్ముళ్లు.. అధికారికంగా గెలిచిన వార్డు కౌన్సిలర్‌ను కాదని.. ప్రత్యేకంగా వేరే వీధిలో మరొక వార్డు సభ పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేశారు. ఈ సంఘటన సత్తుపల్లి నగరపంచాయతీ పరిధిలోని 5వ వార్డులో శుక్రవారం చోటు చేసుకుంది. అధికారికంగా నిర్వహించాల్సిన చోట కాకుండా మరో చోట సభ ఏర్పాట్లు చేయడం పట్ల వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్ తోట సుజలారాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘వార్డు కౌన్సిలర్ లేకుండా వేరేచోట సభ ఎలా నిర్వహిస్తారు..? ఇది అధికారిక కార్యక్రమమా..? పార్టీ కార్యక్రమమా..? మేము ప్రజల ఓట్లతోనే గెలిచాం.. ప్రతిపక్ష వార్డు కౌన్సిలర్లు గెలిచిన చోట ఈ విధంగానేనా వ్యవహరించేది.. ఇన్చార్జ్ కమిషనర్ బి.వందనం పక్షపాతంగా వ్యవహరించి అక్కడ కూడా నగరపంచాయతీ సిబ్బందితో టెంట్, కుర్చీలు వేయించారు’ అని ఆమె ఆరోపించారు. ఇదెక్కడి న్యాయమని అధికారులను ప్రశ్నించారు. అయితే ఈ టెంటుకు, తనకు ఏం సంబంధం లేదని, అధికారిక కార్యక్రమం ఇక్కడే జరుగుతుందని వందనం నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి టెంటు తొలగించే వరకు సభ జరగనీయమంటూ సుజలారాణి అధికారులకు తేల్చి చెప్పటంతో సుమారు గంటసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఆమె జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదానికి కారణమేంటీ.. ‘మనవార్డు-మన ప్రణాళిక’లో భాగంగా 5వ వార్డులో తోట వెంకటరావు వీధిలో అధికారికంగా కౌన్సిలర్ అధ్యక్షతన సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు వార్డుల్లో మైక్ ద్వారా ప్రచారం చేశారు. అయితే టీడీపీ పట్టణ అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్ చల్లగుండ్ల కృష్ణయ్య పక్కనున్న రాజబాపయ్య వీధిలో ఓ టీడీపీ కార్యకర్త ఇంటి ఎదుట టెంటు వేసి ఇక్కడే ‘మనవార్డు-మనప్రణాళిక’ సభ జరుగుతుందని.. నగరపంచాయతీ చైర్పర్సన్ ఇక్కడికే వస్తారని అంటూ దరఖాస్తులు స్వీకరించే ఏర్పాటు చేశారు. దీనిపై 5వ వార్డు కౌన్సిలర్ తోట సుజలారాణి జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. అలాగే తహశీల్దార్ బి.మల్లయ్య, ఇన్చార్జ్ కమిషనర్ బి.వందనంకు ఈ అనధికారిక సభను రద్దు చేయాలని కోరుతూ లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. దీంతో చేసేదేమీలేక టెంట్ తొలగించాలనిఇన్చార్జ్ కమిషనర్ పోలీసులకు సూచించారు. ఆ తర్వాత సత్తుపల్లి ఎస్సై నాగరాజు రాజబాపయ్య వీధిలో టెంటు వేసి ఉన్న ప్రదేశానికి వెళ్లి.. ‘ప్రభుత్వ కార్యక్రమానికి పోటీగా ఇతర కార్యక్రమం నిర్వహించకూడదు.. తక్షణం టెంటు, కుర్చీలను తొలగించా’లని కృష్ణయ్యను హెచ్చరించడంతో విధిలేక టెంటును తీసివేశారు. ప్రజల్లో అయోమయం... మనవార్డు-మనప్రణాళిక వార్డు సభలకు రెండుచోట్ల టెంట్లు వేయటంతో ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యారు. టీడీపీ నిర్వహించిన అనధికారిక సభలో కూడా కొందరు దరఖాస్తులు ఇచ్చారు. సొంత కార్యక్రమమా... : టీఆర్ఎస్ నేతల ప్రశ్న 20వ వార్డులో మనవార్డు-మన ప్రణాళిక సభలో కొద్దిసేపు వాగ్వాదం నెలకొంది. టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఎస్కె అయూబ్‌పాషా వార్డు ప్రణాళిక సభల్లో సీఎం ముఖచిత్రం, తెలంగాణ అధికారిక ముద్ర లోగోతో కూడిన ఫ్లెక్సీ పెట్టకపోవటం పట్ల ఇన్చార్జ్ కమిషనర్ బి.వందనంను నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమమా.. సొంత కార్యక్రమమా.. ఫ్లెక్సీ పెట్టే డబ్బులు కూడా లేవా.. సీఎం కేసీఆర్ ఫొటోతో కూడిన ప్లెక్సీలు ఎందుకు పెట్టలేదంటూ వాగ్వాదానికి దిగారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేక నిధులు ఏమీ రాలేదని.. సొంత డబ్బులతోనే ఈ సభలు నిర్వహిస్తున్నామని.. ప్రభుత్వం నుంచి మెటీరియల్ ఏమీ అందలేదని.. ఇన్చార్జ్ కమిషనర్ బి.వందనం చెప్పారు. కాగా, వేదికపై టీడీపీ నేతలు కూర్చోవటంతో ఇది ఆ పార్టీ కార్యక్రమాన్ని తలపించిందని పలువురు విమర్శించారు. -
బస్తీల్లో కొత్త జమానా
- జిల్లాలో కొలువుదీరిన కొత్త కౌన్సిళ్లు రాజమండ్రి మేయర్‌గా రజనీ శేషసాయి - రామచంద్రపురంలో టీడీపీ కుటిల వ్యూహం ఏలేశ్వరంలో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌కు ఎర సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి నగర పాలక సంస్థ, అమలాపురం, తుని, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం, ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీల తొలి కౌన్సిల్ సమావేశాలు గురువారం జరిగాయి. అన్నిచో ట్లా పురపాలన టీడీపీకే దక్కింది. ఎన్నికల అధికారులు ఉదయం 11.00 గంటలకు కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో తెలుగు అక్షర క్రమంలో ప్రమాణం చేయించారు. అనంతరం మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించారు. ముమ్మిడివరం మినహా అన్నిచోట్లా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. రాజమండ్రి మేయర్‌గా పంతం రజనీ శేషసాయి పేరును 22వ డివిజన్ కార్పొరేటర్ మాటూరి రంగారావు ప్రతిపాదించగా, 32వ డివిజన్ కార్పొరేటర్ ద్వారా పార్వతీసుందరి బలపరిచారు. మరో నామినేషన్ పడక పోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ప్రకటించారు. డిప్యూటీ మేయర్‌గా వాసిరెడ్డి రాంబాబు ఎన్నిక కూడా ఏకగ్రీవమైంది. సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ మాగంటి మురళీమోహన్, ఎమ్మెల్సీ ఆది రెడ్డి అప్పారావు, రాజమండ్రి రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి,ఆకుల సత్యనారాయ ణ హాజరయ్యారు. అమలాపురంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఆర్డీఓ సీహెచ్ ప్రియాంక పర్యవేక్షణలో జరిగాయి. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు హాజరయ్యారు. పెద్దాపురంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఒక్కొక్క నామినేషనే పడ్డందున ఎన్నిక ఏకగ్రీవమైందని ఆర్డీఓ కూర్మానాథ్ ప్రకటించారు. పిఠాపురంలోనూ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రావ ు ప్రకటించారు. ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సమావేశానికి హాజరయ్యారు. మండపేటలో కూడా రెండు పదవులూ ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా డీఈఓ శ్రీనివాసులురెడ్డి వ్యవహరించారు. సామర్లకోటలో ఆయనకు బదులు ఆవిడ.. సామర్లకోటలో చైర్మన్ ఎన్నిక అనుకోని మలుపు తిరిగింది. ముందుగా చైర్మన్‌గా మన్యం చంద్రరావు పేరును ఖరారు చేసినా.. చివరి క్షణంలో సామాజిక సమీకరణాల పేరుతో పోటీ నెలకొనడంతో చంద్రరావు భార్య, 26వ వార్డు కౌన్సిలర్ సత్యవతికి ఆ పదవిని కట్టబెట్టారు. ఇతరుల అసంతృప్తిని మహిళా సెంటిమెంట్‌తో అధిగమించే ప్రయత్నం చేశారు టీడీపీ పెద్దలు. సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పరిస్థితిని సమీక్షించి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవం చేశారు. బలమున్నా.. ఇండిపెండెంట్‌కు పట్టం రామచంద్రపురంలో టీడీపీకి మెజారిటీ సభ్యులున్నా పార్టీ అభ్యర్థిని కాక ఇండిపెండెంట్‌ను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా ఎన్నికలకు ముందే ఎస్ఆర్కే గోపాల్‌బాబును ప్రకటించారు. తీరా ఆయన ఓటమి పాలవడంతో కంగు తిన్న పార్టీ నేతలు కొత్త ఎత్తుగడగానే ఇండిపెండెంట్‌కు పట్టం కట్టించారని తెలుస్తోంది. త్వరలోనే ఇండిపెండెంట్ చై ర్మన్తో రాజీనామా చేయించి అదే స్థానంలో మళ్లీ గోపాల్‌బాబును గెలిపించి చైర్మన్ చేయాలన్నదే ఆ ఎత్తుగడ అని పార్టీ వర్గాలంటున్నాయి. చైర్ పర్సన్ విప్ ధిక్కరణపై ఫిర్యాదు ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్మన్ పీఠం కోసం టీడీపీ తప్పుడు రాజకీయానికి పాల్పడింది. ఇక్కడ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన టీడీపీకి ఆ కేటగిరీలో విజేతే లేకపోయా రు. దీంతో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఆరో వార్డు కౌన్సిలర్ కొప్పాడ పార్వతికి చైర్మన్ పదవిని ఎరగా చూపి తమ వైపు తిప్పుకొన్నారు. గురువారం ఆమెనే చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ తమ కౌన్సిలర్‌ను కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. పార్వతి విప్ ధిక్కరించడంపై వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు చేయగా నిబంధనల ప్రకారం నోటీసు జారీ చేస్తామని ఎన్నికల అధికారిగా వ్యవహరించిన పోలవరం ప్రాజెక్టు భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్ విజయ సారథి చెప్పారు. గొల్లప్రోలులోనూ కుట్రే గొల్లప్రోలు నగర పంచాయతీలోనూ టీడీపీ కుటిల రాజకీయాలకు పాల్పడింది. ఇక్కడ టీడీపీకి 10, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 10 ఓట్ల బలం ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే వర్మతో టీడీపీ ఓట్లు 11 అవుతాయి. అయినా వైఎస్సార్ సీపీకి చెందిన 10వ వార్డు కౌన్సిలర్ పడాల రాంబాబుకు వైస్ చైర్మన్ పదవిని ఆశ చూపి ఓటింగ్‌కు గైర్హాజరయ్యేలా చేశారు. ప్రమాణ స్వీకారం చేశాక రాంబాబు చైర్మన్ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. చైర్మన్ ఎన్నిక అనంతరం టీడీపీ కౌన్సిలర్లు పడాలను వైస్‌చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ విప్ తెడ్ల చిన్నారావు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి అయిన పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ టి.విఎస్.జి.కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరంలో ఓటింగ్‌లో గెలిచిన చెల్లి ముమ్మిడివరం నగర పంచాయతీలో చైర్మన్ పదవికి జరిగిన ఓటింగ్‌లో టీడీపీ అభ్యర్థి చెల్లి శాంత కుమారికి 13 ఓట్లు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి కాశిన బాల ముని కుమారికి 9 ఓట్లు వచ్చాయి. ఎన్నికల్లో రెండుపార్టీలకు చెరో ఎనిమిది వార్డులు లభించగా నలుగురు ఇండిపెం డెంట్లలో ముగ్గురిని టీడీపీ తన వైపు తిప్పుకుంది. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఎంపీ రవీంద్రబాబు, ఎమ్మె ల్యే దాట్ల బుచ్చిబాబు ఓట్లతో కలిపి 13 ఓట్లు సాధిం చింది. తునిలో ‘వైస్ కోసం తెలుగుతమ్ముళ్ల పోటీ తునిలో చైర్మన్ పదవి ఏకగ్రీవమైనా వైస్ చైర్మన్ పదవికి కుచ్చర్ల జగన్నాథరాజు, కె.బాలాజీ పోటీ పడగా గంటపాటు అయోమయం నెలకొంది. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు యనమల కృష్ణుడు ఇద్దరికీ చెరో రెండున్నరేళ్లు పదవి ఇచ్చేలా రాజీ కుదిర్చారు. దీంతో తొలి విడతకు జగన్నాథరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మున్సిపాలిటీలకు ఎన్నికలు మార్చి 30న జరిగాయి. ఆరు మున్సిపాలిటీల్లో 189 వార్డులు ఉండగా, ఆదిలాబాద్‌లోని 34వ వార్డు, భైంసాలోని మూడో వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 187 వార్డులకు ఎన్నికలు జరగ్గా, ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటల నుంచి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో వార్డుకు పోటీ చేస్తున్న అభ్యర్థులవారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఆరు మున్సిపాలిటీల ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో భద్రపర్చారు. వీటికి నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ, భారీ భద్రత సిబ్బంది మధ్య స్ట్రాంగ్ గదుల్లో పెట్టారు. వాయిదా పడుతూ వస్తున్న పుర ఫలితాలు దాదాపు 40 రోజుల తర్వాత వెలువడనుండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఆరు మున్సిపాలిటీలకు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఆరు మున్సిపాలిటీల ఓట్లను లెక్కించేందుకు 58 టేబుళ్లు వేశారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు అధికారుల చొప్పున నియమించారు. 40 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచారు. వీటితో కలిపి మొత్తం కౌంటింగ్ సిబ్బంది 300 మందిని నియమించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది, అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. కంప్యూటర్లు, స్ట్రాంగ్ రూంలో సౌకర్యాలు, వార్డులవారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తుతోపాటు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అభ్యర్థుల్లో ఆందోళన నలబై రోజులుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న మున్సిపల్ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కౌన్సిలర్ అభ్యర్థుల కలలు నేటితో సాకారం అవుతాయా? బెడిసి కొడతాయా? అనేది సోమవారం ఓటరు తీర్పుతో తేటతెల్లంకానుంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెలువడాలి. కానీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాయిదా పడింది. ఇదిలా ఉండగా, ఆరు మున్సిపాలిటీల్లో భైంసా మున్సిపాలిటీ ఫలితాలు ఉదయం 10 గంటల వరకు వెలువడే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటు న్నారు.