సాక్షి, కాకినాడ: వైఎస్సార్‌సీపీ దళిత నేత సూరిబాబుపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగారు. అనుమతులు లేవని నిర్మాణంలో ఉన్న ఇంటిపై అంతస్తును కూల్చివేయించారు. మున్సిపల్ సిబ్బంది, పోలీసులతో వచ్చి పైఅంతస్తు కూల్చివేయించారు. ఎమ్మెల్యే కొండబాబు తీరును దళిత సంఘల నేతలు ఖండించారు.
విజయవాడలో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. చెరువు సెంటర్‌లోని వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మను టీడీపీ కార్యకర్తలు పగలగొట్టారు. ఎందుకు పగలగొట్టారని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి భర్త దుర్గారావుపై సుత్తులతో దాడి చేశారు. రక్తపు గాయాలతో భవానీపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన దుర్గారావు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రథమ చికిత్స అనంతరం జీజీహెచ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment