సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాకు సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులు వెలుగులోకి వస్తుండటంతో టీడీపీ, అనుబంధ మీడియా రోజుకో రకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లుతోంది. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలించడంతోపాటు ఆధార్‌కార్డును అనుసంధానిస్తుండటంతో ఎల్లో గ్యాంగ్ బెంబేలెత్తుతోంది.
దొంగే.. దొంగ దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈనాడు, తోక పత్రిక 2019లో జరిగిన తప్పులను కప్పిపుచ్చేందుకు తంటాలు పడుతుండగా మర్నాడు అవే వార్తలను చదువుతూ టీడీపీ నేతలు విలేకరుల సమావేశాలను నిర్వహిస్తున్నారు.
కొన్ని పత్రికల్లో వెలువడ్డ కథనాల ప్రకారం ఓటర్ల జాబితాను పరిశీలించగా అవన్నీ 2019కి ముందునుంచే ఉన్నట్లు తేలిందని, ప్రత్యేక ఓటర్ల సవరణ ద్వారా తప్పులను సరి చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా ఇప్పటికే ప్రకటించినా ఎల్లో మీడియా విష ప్రచారం యథాప్రకారం కొనసాగుతోంది.
ఇంటి నెంబరు లేకపోతే నేరమా?
దేశంలో 18 ఏళ్ల వయసు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఇంటి నెంబరు లేకపోయినా ఓటరుగా నమోదుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పూరి గుడిసెల్లో నివసించే వారికి ఇంటి నెంబరు ఉండదు కాబట్టి ఇంటి నెంబరు అనే చోట సున్నా అని పేర్కొంటూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అదే ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటి నెంబరు లేకుండా కొన్ని ఓట్లు ఎప్పటి నుంచో నమోదవుతున్నాయి.
ఇవన్నీ హఠాత్తుగా ఇప్పుడే జరిగినట్లు ‘సున్నా నెంబర్ ఇంట్లో 30 మంది ఓటర్లు’ అంటూ జూలై 1న ఈనాడు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాన్ని ప్రచురించింది. ఆధార్ కార్డులో ఇంటి నెంబరు లేనందున సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు ‘సున్నా’ అని పొందుపరిచినట్లు అధికారులు వివరణ ఇచ్చినా రామోజీ పాతపాటే పాడారు.
ఈ ఓటర్లకు సంబంధించి 2019 జాబితాను పరిశీలించగా అప్పుడు కూడా ఇంటి నెంబర్ అనే చోట సున్నాగానే ఉండటం గమనార్హం. అధికారులు వివరణ ఇచ్చినా పట్టించుకోకపోవడం, ఓ కథనాన్ని ప్రచురించే ముందు కనీసం నిర్ధారించుకోకుండా విషం చిమ్మడం ద్వారా తన దుర్బుద్ధిని రామోజీ మరోసారి చాటుకున్నారు.
రేపల్లెలో ఎడాపెడా అంటూ..
రేపల్లెలో ఎడాపెడా దొంగఓట్లు అంటూ జూలై 1న ప్రచురించిన కథనాన్ని పరిశీలించగా అవన్నీ 2019లో కూడా ఉన్నట్లు వెల్లడైంది. అయితే అవన్నీ దొంగ ఓట్లు అని చెప్పలేమని, ఓటర్ల నమోదు సమయంలో చాలా మంది ఇంటి నెంబరు చెప్పలేనప్పుడు వీధి పేరు లేదా అపార్టుమెంట్ నెంబర్‌తో నమోదు చేయడం వల్ల ఒకే ఇంటిపై అధిక ఓట్లు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వీటిని ప్రస్తుత ఓటర్ల సవరణ జాబితాలో పరిశీలించి దొంగఓట్లు ఉంటే కచి్చతంగా తొలగిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment