గత అర్థరాత్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా సుమారు 100మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రాత్రంతా పలు ప్రాంతాల్లో తప్పి...చివరకు తెల్లవారుజామున సత్యవీడు పోలీస్ స్టేషన్ తరలించారు. అప్పటి నుంచి ఆయన పీఎస్‌లోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకు వెళతామన్నారు. పోలీసుల వేధింపులకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ ప్రమేయంతోనే వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్పీ భార్య చంద్రబాబు నాయుడు బంధువు అని, అందుకే ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు.