సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీలకు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ ఖరారైంది. ఈ నెల 28న సాయంత్రం 4.30 గంటలకు సీఈసీని కలవనున్నారు. ఓట్ల జాబితాపై టీడీపీ దుష్ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీలు.. సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో దాదాపు 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్పించింది. వాటిలో దాదాపు 30 లక్షల దొంగ ఓటర్లను నాడే వైఎస్సార్సీపీ తొలగించి వేయించింది. 2019 నాటికి ఏపీలో ఓటర్ల సంఖ్య 3,98,34,776 కాగా, 2023 మార్చి 31 నాటికి ఏపీలో ఓటర్ల సంఖ్య 3,97,96,678. చంద్రబాబు హయాంతో పోలిస్తే ఓటర్ల సంఖ్య తగ్గినప్పటికీ, దొంగ ఓటర్లను చేర్పిస్తున్నారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది.
దొంగ ఓట్లను తొలగిస్తున్నాం: మంత్రి పెద్దిరెడ్డి
టీడీపీ హయాంలో నమోదైన దొంగ ఓట్లను తొలగిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దొంగ ఓట్లను తొలగిస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారు. దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబు తథ్యమని, హిందూపురంలోనూ వైఎస్సార్‌సీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి అన్నారు.
చదవండి: బుద్ధప్రసాద్‌కు షాకిచ్చిన దివిసీమ రైతులు
Comments
Please login to add a commentAdd a comment