టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఏడు దొంగ ఓట్లు! | Sakshi
Sakshi News home page

ఓటర్ల జాబితాలో సిత్రాలు

Published Thu, Mar 7 2019 8:37 PM

Fake Votes In Kakinada Rural TDP MLA Pilli Anantha Laxmi Family - Sakshi

తూర్పుగోదావరి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చెప్పిందే నిజమైంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఓటరు జాబితాలో దొంగ ఓట్లు చేర్పించారని వైఎస్సార్‌సీపీ ఆరోపించిన మాటలు రుజువయ్యాయి. అక్రమంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగించడం, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఒకే నియోజకవర్గంలో లేదా పక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్కరి పేరు మీద రెండు నుంచి మూడు దొంగ ఓట్లు చేర్పించడం చాలా చోట్ల జరిగింది. ఇదే విషయం సాక్షి పరిశీలనలో వెలుగు చూసింది.

కాకినాడ రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీతో పాటు వాళ్ల ఇంట్లోని సభ్యులకు ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు ఓట్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లోనే 7 దొంగ ఓట్లు ఉన్న విషయం బయటపడింది. నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల పేరు మీద ఎన్ని దొంగ ఓట్లు సృష్టించి ఉంటారో అంతుపట్టకుండా ఉంది.  అధికారులు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించలేదని ఈ ఘటనతో స్పష్టంగా బయటపడింది. ప్రతి ఓటుకు ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేస్తే గానీ దొంగ ఓట్ల బెడద పోయేలా లేదు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్‌ ఈ విషయంపై దృష్టి పెడితే గానీ దొంగ ఓట్ల విషయం కొలిక్కి వచ్చేలా లేదు.



పిల్లి అనంత లక్ష్మి కుటుంబ సభ్యులకు ఉన్న దొంగ ఓట్లను ఒక్కసారి పరిశీలిస్తే.. ఆమెకు పెద్దాపురం నియోజకవర్గంలో బూత్‌ నెంబర్‌ 188లో ​HSF2456226 ఓటర్‌ నెంబర్‌తో ఒక ఓటు ఉంది. ఆమె ఫోటో, పేరుతోనే కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో బూత్‌ నెంబర్‌ 38లో IMZ2075331 ఓటర్‌ నెంబర్‌తో మరో ఓటు ఉంది. వాళ్ల కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఓట్లను పరిశీలించగా..

పిల్లి అనంతలక్ష్మీ(టీడీపీ ఎమ్మెల్యే) - 2 ఓట్లు.
1).పెద్దాపురం నియోజకవర్గంలో
బూత్ నెం: 188
ఓటర్ నెంబర్: HSF2456226
2).కాకినాడ రూరల్లో
బూత్ నెం: 38
ఓటర్ నెం: IMZ2075331

పిల్లి సత్యన్నారాయణ మూర్తి (ఎమ్మెల్యే భర్త) - 3 ఓట్లు.
1).పెద్దాపురం నియోజకవర్గంలో
బూత్ నెం: 188
ఓటర్ నెం: APO70430519155
2).కాకినాడ రూరల్లో...
బూత్ నెం: 38
ఓటర్ నెం: INZ2078319
3).కాకినాడ రూరల్లో...
బూత్ నెం: 106
ఓటర్ నెం: INZ1724087

పిల్లి కృష్ణ ప్రసాద్( ఎమ్మెల్యే మొదటి కుమారుడు)- 2 ఓట్లు
1). పెద్దాపురం నియోజకవర్గంలో
బూత్: 188
ఓటర్ నెం: APO70430519410
2).కాకినాడ రూరల్లో
బూత్ నెం: 38
ఓటర్ నెం: IMZ2068310

పిల్లి కృష్ణ కళ్యాణ్(ఎమ్మెల్యే రెండవ కుమారుడు) - 3 ఓట్లు
1). పెద్దాపురం నియోజకవర్గంలో
బూత్: 188
ఓటర్ నెం: HSF1182708
2).కాకినాడ రూరల్లో..
బూత్ నెం: 38
ఓటర్ నెం: IMZ2068211
3).కాకినాడ రూరల్లో 
బూత్ నెం: 46
ఓటర్ నెం: IMZ1493402

పిల్లి రాధాకృష్ణ (ఎమ్మెల్యే మూడవ కుమారుడు)- 3 ఓట్లు
1).పెద్దాపురం నియోజకవర్గంలో
బూత్ నెం: 188
ఓటర్ నెం: HSF1182757
2).కాకినాడ రూరల్లో.
బూత్ నెం: 38
ఓటర్ నెం: IMZ2067205
3).కాకినాడ రూరల్లో ..
బూత్ నెం: 46
ఓటర్ నెం:IMZ1493550

Advertisement
 
Advertisement
 
Advertisement