pilli ananthalakshmi
-
కాకినాడ రూరల్‌లో టీడీపీ-జనసేన మధ్య వార్
సాక్షి, కాకినాడ: జనసేన తీరును టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణ తప్పుపట్టారు. నిన్న కాకినాడ రూరల్‌లో పార్టీ కార్యాలయాన్ని జనసేన ప్రారంభించింది. టికెట్ కేటాయించకుండానే పార్టీ ఆఫీస్ తెరవడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జనసేనకు టికెట్ ఇస్తే సహకరించబోమని నిన్న టీడీపీ నేతల ప్రకటించారు. ఆ ప్రకటనపై సారీ చెబుతూనే జనసేన తీరును పిల్లి సత్యనారాయణ తప్పుపట్టారు. తమ ఇష్టం వచ్చినట్లుగా కార్యక్రమాలు చేస్తే ఎలా అంటూ పిల్లి వర్గం పశ్నిస్తోంది. తమ కుటుంబంపై తప్పుగా చెప్పి టికెట్ రాకుండా దుష్టశక్తులు కుట్ర చేశాయని పిల్లి సత్యనారాయణ ఫైర్ అయ్యారు. జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా? అంటూ పిలి అనంతలక్ష్మి ధ్వజమెత్తారు. మాకు తెలియకుండా జనసేన కార్యాలయం ఎలా ప్రారంభిస్తారు. జనసేన తీరు వల్లే మా క్యాడర్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకు జనసేనే ఊపిరి పోసిందని ఓ ఆసామీ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు మేం చేతకాని వాళ్లలా ఊరుకోవాలా?’’ అని పిల్లి అనంతలక్ష్మి నిప్పులు చెరిగారు. ఇదీ చదవండి: కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్ -
ఆధిపత్య పోరు: ‘టీడీపీ’లో ‘పిల్లి’ మొగ్గలు
-
డ్రామా : ఫిరాయించిన ‘పిల్లి’ దంపతులు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆడలేక మద్దెల ఓడు.. అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. పార్టీ సానుభూతిపరులను పోటీకి పెట్టలేని వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ప్రభుత్వంపై అభాండాలు వేసి, తప్పించుకునే ఎత్తుగడలు వేస్తున్నారు. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి సహా అన్ని పదవులకూ రాజీనామా చేస్తు న్నట్టు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఆమె భర్త, పార్టీ ప్రధాన కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు) శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగి 24 గంటలు కూడా గడవకముందే పదవుల్లో కొనసాగుతామంటూ శనివారం వారు ప్లేటు ఫిరాయించారు. 24 గంటలుగా ఆ పారీ్టలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ‘తెలుగు’ డ్రామా బాగానే రక్తి కట్టినట్టు కనిపిస్తోంది. జిల్లాలో ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం అసలు పారీ్టలో ఏం జరుగుతోందని సీనియర్లను ప్రశ్నిస్తున్నారు. పదవుల నుంచి వైదొలగుతున్నామని, వెనక్కు తగ్గేది లేదని గంభీరంగా ప్రకటించిన సత్తిబాబు, అనంతలక్ష్మి దంపతులు.. తెల్లవారేసరికి నాలుక మడత పెట్టేయడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ నేతలు జ్యోతుల నవీన్, వర్మ, రామకృష్ణారెడ్డి బుజ్జగించేసరికి ప్లేటు ఫిరాయించేసే దానికి ఇంత హడావుడి దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు. (చదవండి: టీడీపీ సేవలో బీజేపీ) వ్యూహాత్మకంగానే హడావుడి! పార్టీని విస్మరించారనే ఫిర్యాదు ఏడాది క్రితం అధిష్టానం వద్దకు వెళ్లినప్పుడే ఇన్చార్జిని మార్చాలనే ఆలోచన పై స్థాయిలో జరిగిందని చెబుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మార్పు జరిగితే ఎదురయ్యే పరిణామాల దృష్ట్యా వేచి చూసే ధోరణికే పార్టీ మొగ్గు చూపింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల సమయంలో రూరల్‌లో ఉనికిని కాపాడుకోలేని దీనావస్థలోకి పార్టీ వెళ్లిపోయిందనే సమాచారం జిల్లా నేతల నుంచి హైకమాండ్‌కు మరోసారి వెళ్లింది. ప్రస్తుతం తటస్థంగా ఉన్న బొడ్డు భాస్కర రామారావును పారీ్టలోకి ఆహ్వానించి, రూరల్ ఇన్చార్జిగా తీసుకోవాలని ప్రతి పాదనతో చినరాజప్ప మానసిక వేదనకు కారణమ య్యారని స్వయంగా సత్తిబాబే ప్రకటించారు. అయితే ఇన్చార్జిగా తమను తప్పిస్తారనే సంకేతాలతోనే ఆయన వ్యూహాత్మకంగా రాజీనామా డ్రామాకు తెర తీసి ఉండవచ్చనే చర్చ పార్టీ సీనియర్ల మధ్య జరుగుతోంది.(చదవండి: నిమ్మగడ్డకు జైలు శిక్ష తప్పదు) తనంత తానుగా వైదొలగితే అధిష్టానం నుంచి లభించే సానుభూతి, తననే లక్ష్యంగా చేసుకుని చినరాజప్ప సాగిస్తున్న రాజకీయానికి ముగింపు పలికే వ్యూహంలో భాగం గానే రాజీనామా రచ్చ చేశారని అంటున్నారు. పనిలో పనిగా తన వైఫల్యాన్ని ప్రభుత్వంపై నెట్టేసే ఎత్తుగడ కూడా ఆయన వేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని గతంలో కాకినాడ రూరల్‌లో నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల పనులకు ఎడాపెడా మంజూరు ఇచ్చేశారు. తీరా ప్రభుత్వం మారేసరికి అడ్డగోలు పనులన్నింటిపైనా విచారణ జరుగుతున్న క్రమంలో బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ తరుణంలో వచ్చిన పంచాయతీ పోరులో పార్టీ సానుభూతిపరులను బరిలోకి దింపే సత్తా లేకే వెనకడుగు వేశారని, ఈ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకువెళ్లడం తమ తప్పె లా అవుతుందని రాజప్ప వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పైగా కోట్ల విలువైన బిల్లులు పెండింగ్ పడడంతో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదనే నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేసినంత మాత్రాన వాస్తవం తెరమరుగైపోదని చెబుతున్నారు. గత వైరం కూడా ఉందనే వాదనలు చినరాజప్ప, భాస్కర రామారావు మధ్య వైరం ఈనాటిది కాదు. పార్టీ ఆవిర్భావం నుంచీ భాస్కర రామారావు, దివంగత మాజీ మంత్రి మెట్ల సత్య నారాయణరావు ఒక వర్గంగా ఉండేవారు. నిమ్మకాయల చినరాజప్ప వైరివర్గంగా కొనసాగే వారు. భాస్కర రామారావు వర్గంలో పిల్లి సత్తిబాబు ముఖ్యుడిగా ఉండేవారు. అమలాపురం అసెంబ్లీ స్థానం జనరల్ కేటగిరీలో ఉన్నప్పుడు చినరాజప్ప దానిని ఆశించి భంగపడ్డారు. అప్పట్లో ఈ స్థానం మెట్లకే దక్కింది. అపμట్లో భాస్కర రామారావు పక్కదోవ పట్టించి టిక్కెట్టు దక్కకుండా చేశారనే ఆగ్రహం చినరాజప్పకు ఉంది. పార్టీ ఏదైనా వారిద్దరి మధ్య రాజకీయ వైరం ఇప్పటికీ అలానే ఉంది. తాజా పరిణామాల్లోకి చినరాజప్పను లాగడం వెనుక ఈ నేపథ్యం కూడా ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. అలాగని చినరాజప్ప వైఖరిని కూడా పార్టీ నేతలు ఏ కోశానా సమరి్థంచడం లేదు సరికదా తప్పు పడుతున్నారు. బీసీ నాయకుడైన సత్తిబాబును ఇలా అప్రతిష్ట పాలుచేసి బయటకు పంపే కుట్రలు పన్నుతారా అని వారు ప్రశ్నిస్తున్నారు. సత్తిబాబు వైఫల్యం ఉంటే జిల్లా స్థాయిలో అందరినీ కూర్చోబెట్టి చెప్పాలే తప్ప ఇలా చినరాజప్ప కక్ష సాధింపునకు దిగుతారా అని భాస్కర రామారావుతో పూర్వాశ్రమంలో కలిసి ఉన్న తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పార్టీలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో తేలాలంటే మరికొన్ని రోజులు తెలుగు డ్రామాను ఆసక్తిగా చూడాల్సిందే. టీడీపీ నేతల బుజ్జగింపులు కాకినాడ రూరల్: టీడీపీ పదవులకు రాజీనామాలు ప్రకటించిన ఆ పార్టీ కాకినాడ రూరల్ ఇన్ చార్జి పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులను ఆ పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్, పిఠాపురం, అనపర్తి మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బుజ్జగించారు. వారు శనివారం వాకలపూడిలోని అనంతలక్ష్మి దంపతుల నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు. దీంతో రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు అనంతలక్ష్మి దంపతులు ప్రకటించారు. తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని, కొత్త ఇన్చార్జిని నియమించే వరకూ పదవిలో కొనసాగుతామని వెల్లడించారు. యనమల రామకృష్ణుడు శుక్రవారం రాత్రి తమతో మాట్లాడారని, ఆయనకు అన్నీ చెప్పామని సత్యనారాయణమూర్తి అన్నారు. పార్టీకి ఎవరు వచ్చినా పని చేస్తామని చెప్పారు. అధికారంలో ఉండగా చేపట్టిన పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను పోటీకి పెట్టలేక పోయానని వివరించారు. పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. ఈ పరిణామాలు బాధాకరమని, ఇటువంటివి టీ కప్పులో తుపానులాంటివని జ్యోతుల నవీన్ అన్నారు. -
టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..
అధికారంలో ఉన్నప్పుడు సామ్రాజ్యాలను విస్తరించుకుపోయారు తెలుగు తమ్ముళ్లు. అప్పుడు ఒకరంటే ఒకరికి పడకున్నా చేతిలో పవర్ ఉండటంతో కిమ్మనకుండా ఉన్నారు. తీరా గత సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిని, అధికారానికి దూరమయ్యేసరికి వారి మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎన్నికలకు వెళ్లడమంటే డబ్బుతో కూడుకున్న పని. అందుకు ముఖం చాటేస్తున్న నేతలు ఆ నిందను ఒకరిపై మరొకరు నెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల తరువాత జరిగే రాజకీయ పరిణామాలకు ఇప్పటి నుంచే వ్యూహాల కత్తులకు పదును పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి,రాజమహేంద్రవరం: జిల్లా టీడీపీ నేతల మధ్య చాప కింద నీరులా ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు.. ప్రస్తుత పంచాయతీ పోరు పుణ్యమా అని రచ్చకెక్కాయి. ఆ పార్టీ పదవులకు, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, పార్టీ సీనియర్ నాయకుడు వీర వెంకట సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) శుక్రవారం గుడ్‌బై చెప్పారు. మీడియా ముందు రాజీనామా ప్రకటన వేళ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కంట తడి పెట్టారు. తమ రాజీనామాలకు మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కారణమని సత్తిబాబు ఆరోపించారు. (చదవండి: టీడీపీ పదవులకు మాజీ ఎమ్మెల్యే దంపతుల రాజీనామా) అయితే సత్తిబాబు దంపతుల మీడియా సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే చినరాజప్ప మాట్లాడుతూ, ఇందులో తన ప్రమేయం ఎంతమాత్రం లేదని అన్నారు. ఏడాది కాలంగా అనంతలక్ష్మి దంపతులు పార్టీ బాధ్యతల నుంచి వైదొలగుతామంటూ చెబుతూ వచ్చి, ఇప్పుడు హఠాత్తుగా తనపై నింద వేస్తున్నారని అన్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, బరువు మోయాల్సిన సమయంలో సత్తిబాబు కాడి వదిలేస్తున్నారని వైరి వర్గం ఆరోపిస్తోంది. ఈ వివాదానికి ఇరుపక్షాల నుంచి వినిపిస్తున్న వాదనలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ పచ్చ రచ్చకు అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. (చదవండి: చిత్తూరు జిల్లాలో టీడీపీ హైడ్రామా) భాస్కర రామారావును తీసుకువచ్చేందుకు.. ప్రస్తుతం తటస్థంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావును పార్టీలోకి క్రియాశీలకంగా తీసుకు రావాలనేది సత్తిబాబు వ్యూహం. పార్టీ ఆవిర్భావం నుంచి సత్తిబాబుకు భాస్కర రామారావు ప్రధాన అనుచరుడనే ముద్ర ఉంది. తాను త్యాగం చేసిన కాకినాడ రూరల్ స్థానానికి భాస్కర రామారావును తీసుకువచ్చి, చినరాజప్ప భవిష్యత్తు వ్యూహానికి చెక్ పెట్టాలనేది సత్తిబాబు ఎత్తుగడగా ఉంది. ఎక్కడో కోనసీమ నుంచి వచ్చి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి, తమ నియోజకవర్గంలో వేలు పెడితే తమ వ్యూహం తమకు ఉండదా అని సత్తిబాబు వర్గం ప్రశి్నస్తోంది. ఆర్థిక స్తోమతతో దూకుడుగా వ్యవహరించే భాస్కర రామారావును కాకినాడ రూరల్‌కు తీసుకువస్తే పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించినట్టవుతుందని సత్తిబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని ఇటీవల ఆయన వద్ద ప్రతిపాదించారు. ఈ విషయాన్ని సత్తిబాబే స్వయంగా మీడియాకు చెప్పడం గమనార్హం. అయితే భాస్కర రామారావును తీసుకు రావాలనుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదని చినరాజప్ప వర్గం పేర్కొంటోంది. భాస్కర రామారావును తీసుకురావాలనే సత్తిబాబు వ్యూహం బయటకు పొక్కడంతో తప్పు తమ నాయకుడిపై నెట్టేందుకు ప్రయతి్నస్తున్నారని చినరాజప్ప వర్గీయులు అంటున్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, పవర్ పోయేసరికి పార్టీని వదిలేసిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం తప్పేమిటని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఎంపీటీసీ ఎన్నికల నుంచి నేటి పంచాయతీ ఎన్నికల వరకూ నియోజకవర్గ ఇన్చార్జిగా సత్తిబాబు అభ్యర్థులను నిలబెట్టకుండా పార్టీని నిరీ్వర్యం చేయడం వాస్తవం కాదా అని రాజప్ప వర్గీయులు ప్రశి్నస్తున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు పయనిస్తుందో వేచి చూడాల్సిందే. ఈలోగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇరు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. మా కుటుంబంపై మీకేమైనా గౌరవం ఉంటే, మాజీ శాసన సభ్యురాలిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే ఉద్దేశం ఉంటే నేను, నా భార్య అనంతలక్ష్మి చనిపోయిన తరువాత తెలుగుదేశం జెండా కప్పి శ్మశానానికి తీసుకువెళ్లండి. మీతో అభిప్రాయ భేదాలు కాదు.. నేను మనస్తాపం చెందాను. నా కుటుంబం ఇబ్బంది పాలయింది. నా కుర్రాళ్లు ‘తిరం’ కాదు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. అర్హత ఉన్న వారిని పెట్టుకోమని చెబుతున్నాను. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు ఇబ్బందులు వచ్చాయి. నెల కిత్రం చంద్రబాబుతో జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాను. ఆయన సమస్య రెక్టిఫై చేస్తానన్నారు. కానీ రానురానూ జిల్లా పార్టీ యంత్రాంగంలో నాకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కొంతమంది నాయకులకు నేనంటే ఇష్టం లేదు. ఇష్టం ఉన్న నాయకుడిని పెట్టుకోండి. నాకు ఇబ్బంది లేదు. బొడ్డు భాస్కర రామారావు వద్దకు వెళ్లి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, నీ వద్ద ఉన్న డబ్బు, సత్తా, ఎప్పియరెన్స్కు కచ్చితంగా నెగ్గుతావని అన్నాను. చినరాజప్ప తదితరులతో మనస్పర్థలున్నాయి. బొడ్డు భాస్కర రామారావును రమ్మనడం వలన ఇబ్బందులు పెడుతున్నారేమో అర్థం కాలేదు. – పిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి రూరల్‌పై రాజప్ప కన్ను వేయడమే కారణమా! టీడీపీలో రగిలిన ఈ రచ్చకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కేంద్ర బిందువనే చర్చ నడుస్తోంది. రెండుసార్లుగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప వచ్చే ఎన్నికలకు కాకినాడ రూరల్‌పై కన్ను వేశారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో చినరాజప్ప కాకినాడ రూరల్ నుంచి పోటీకి దిగుతారని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో చినరాజప్పను పెద్దాపురం నుంచే రెండోసారి బరిలోకి దింపారు. పెద్దాపురంలో పార్టీ శ్రేణులు చెల్లాచెదురై ఆదరణ తగ్గిపోవడంతో మూడేళ్లు ముందే కొత్త స్థానం కోసం చినరాజప్ప వెతుకులాడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో తాను ఆశించిన కాకినాడ రూరల్ నియోజకవర్గంపై ఆయన కన్ను వేశారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాకినాడ రూరల్‌లో లైన్ క్లియర్ చేసుకునే లక్ష్యంతోనే చినరాజప్ప ఆ నియోజకవర్గ ఇన్చార్జి సత్తిబాబు దంపతులపై ఏడాది కాలంగా అధిష్టానానికి వ్యూహాత్మకంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేశారని చినరాజప్ప పార్టీ అధినేత చంద్రబాబుకు పదేపదే ఫిర్యాదులు చేస్తూ, తమను తక్కువ చేస్తున్నారని సత్తిబాబు వర్గీయులు మండిపడుతున్నారు. అనంతలక్ష్మి దంపతులను కాకినాడ రూరల్ నుంచి పొమ్మనకుండానే పొగ పెట్టేందుకే రాజప్ప ఈవిధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాజకీయ వేధింపులకు తోడు ఇటీవల కుటుంబ పరంగా ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలోనే పార్టీ పదవులు, ఇన్చార్జి బాధ్యతల నుంచి వైదొలగాల్సి వస్తోందని సత్తిబాబు చెబుతున్నారు. ఆ ప్రకటన బాధాకరం.. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి నా కారణంగా బయటకు వెళ్తున్నట్టు శుక్రవారం విలేకర్ల సమావేశంలో చెప్పారు. వీరిద్దరూ గత ఏడాది కాలంగా ఇంటి నుంచి బయటకు రాలేదు. అనంతరం చంద్రబాబు, యనమల రామకృష్ణుడితో పాటు నా వద్దకు కూడా వచ్చి తాను ఇన్చార్జ్గా ఉండలేనని చెప్పారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టాలని రామకృష్ణుడు చెప్పారు. ఆవిధంగానే గ్రామాల్లో అభ్యర్థులను ఏర్పాటు చేశారు. ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు నా కారణంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం బాధాకరం. నేను పార్టీ కోసం పని చేస్తాను. పార్టీకి నష్టం కలిగించే పని చేయను. – నిమ్మకాయల రాజప్ప, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే, పెద్దాపురం -
టీడీపీ పదవులకు మాజీ ఎమ్మెల్యే దంపతుల రాజీనామా
కాకినాడ రూరల్/మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త వీరవెంకట సత్యనారా యణమూర్తి తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. వాకలపూడిలోని తమ నివాసంలో శుక్రవారం మీడియా సమక్షంలో వారు కన్నీరు పెట్టుకుంటూ ఈ విషయం వెల్లడించారు. రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పదవికి అనంతలక్ష్మి, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి సత్యనారాయణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, కానీ.. పార్టీలో క్రియాశీలక సభ్యులుగా జీవితాంతం కొనసాగుతామని చెప్పారు. పార్టీలో చినరాజప్ప తదితరులతో మనస్పర్థలున్నాయని.. ఆయన తనను ఇబ్బందులు పెడుతున్నారని సత్యనారా యణమూర్తి చెప్పారు. మరోవైపు.. రాజీనామాలు వెనక్కి తీసుకోవాలంటూ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు అనంతలక్ష్మి దంపతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
రెండో పెళ్లికి యత్నం; టీడీపీ నేతలే పెద్దలు
తెలుగుదేశం పార్టీ ప్రముఖులే పెళ్లి పెద్దలుగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుమారుడికి రెండో వివాహం చేసేందుకు జరిగిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : తెలుగుదేశం పార్టీ ప్రముఖులే పెళ్లి పెద్దలుగా ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడికి రెండో వివాహం చేసేందుకు జరిగిన యత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడి స్వగ్రామం తొండంగి మండలం ఏవీ నగరం ఈ వ్యవహారానికి వేదిక అయ్యింది. పోలీసులు, స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతుల కుమారుడు రాధాకృష్ణకు బుధవారం అర్ధరాత్రి రెండో వివాహం చేసేందుకు యత్నించారు. దీనికి మాజీమంత్రులు యనమల, చినరాజప్ప తదితర టీడీపీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే, రాధాకృష్ణ ఇదివరకే తనను పెళ్లి చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు పుట్టాక తనను మోసంచేసి, ఇప్పుడు రెండో వివాహం చేసుకుంటున్నాడని సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన పిల్లి మంజుప్రియ బుధవారం కాకినాడ ‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జారుకున్న యనమల, చినరాజప్ప ఇదిలా ఉంటే.. పోలీసులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో యనమల, చినరాజప్ప, ఇతర టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. తాము వెళ్లేసరికి కల్యాణ వేదిక వద్ద పెళ్లి కుమారుడు, కుటుంబ సభ్యులు ఉన్నారని.. దీంతో వివాహాన్ని నిలిపివేశామని పోలీసులు తెలిపారు. కాగా, తనను వదిలించుకుని రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాధాకృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని మంజుప్రియ డిమాండ్ చేశారు. అతడికి కొంతమంది మాజీమంత్రుల మద్దతు ఉందని ఆరోపించారు. దీనిపై నిర్దిష్టంగా ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
పిల్లి అనంతలక్ష్మి కుటుంబ ఓట్లపై విచారణ
తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి ‘1+1, 1+2 ఆఫర్లు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వారి ఓట్లపై విచారణ చేపట్టారు. ఒకే చోట ఒకే ఓటు ఉండాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలను విస్మరించి రెండు, మూడు చోట్ల ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ ఓట్లను తొలగించేందుకు వారు చర్యలు చేపట్టారు. వీటిని అధికారికంగా తొలగించేందుకు కాకినాడ రూరల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. విచారణ జరుగుతోందని, అది పూర్తయిన వెంటనే కలెక్టర్‌కు ఫైల్ పంపుతామని రూరల్ తహసీల్దార్ చెబుతున్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబ సభ్యుల ఓట్లను అధికారికంగా తొలగించేందుకు చర్యలు చేపట్టడం కొసమెరుపు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబ ఓట్లపై విచారణ కాకినాడ సిటీ: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి ‘1+1, 1+2 ఆఫర్లు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వారి ఓట్లపై విచారణ చేపట్టారు. ఒకే చోట ఒకే ఓటు ఉండాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలను విస్మరించి రెండు, మూడు చోట్ల ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ ఓట్లను తొలగించేందుకు వారు చర్యలు చేపట్టారు. వీటిని అధికారికంగా తొలగించేందుకు కాకినాడ రూరల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. విచారణ జరుగుతోందని, అది పూర్తయిన వెంటనే కలెక్టర్‌కు ఫైల్ పంపుతామని రూరల్ తహసీల్దార్ చెబుతున్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబ సభ్యుల ఓట్లను అధికారికంగా తొలగించేందుకు చర్యలు చేపట్టడం కొసమెరుపు. -
టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఏడు దొంగ ఓట్లు!
-
టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో ఏడు దొంగ ఓట్లు!
తూర్పుగోదావరి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పిందే నిజమైంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఓటరు జాబితాలో దొంగ ఓట్లు చేర్పించారని వైఎస్సార్సీపీ ఆరోపించిన మాటలు రుజువయ్యాయి. అక్రమంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగించడం, టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఒకే నియోజకవర్గంలో లేదా పక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్కరి పేరు మీద రెండు నుంచి మూడు దొంగ ఓట్లు చేర్పించడం చాలా చోట్ల జరిగింది. ఇదే విషయం సాక్షి పరిశీలనలో వెలుగు చూసింది. కాకినాడ రూరల్ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీతో పాటు వాళ్ల ఇంట్లోని సభ్యులకు ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు ఓట్లు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లోనే 7 దొంగ ఓట్లు ఉన్న విషయం బయటపడింది. నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తల పేరు మీద ఎన్ని దొంగ ఓట్లు సృష్టించి ఉంటారో అంతుపట్టకుండా ఉంది. అధికారులు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించలేదని ఈ ఘటనతో స్పష్టంగా బయటపడింది. ప్రతి ఓటుకు ఆధార్ నంబర్ లింక్ చేస్తే గానీ దొంగ ఓట్ల బెడద పోయేలా లేదు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఈ విషయంపై దృష్టి పెడితే గానీ దొంగ ఓట్ల విషయం కొలిక్కి వచ్చేలా లేదు. పిల్లి అనంత లక్ష్మి కుటుంబ సభ్యులకు ఉన్న దొంగ ఓట్లను ఒక్కసారి పరిశీలిస్తే.. ఆమెకు పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెంబర్ 188లో HSF2456226 ఓటర్ నెంబర్‌తో ఒక ఓటు ఉంది. ఆమె ఫోటో, పేరుతోనే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 38లో IMZ2075331 ఓటర్ నెంబర్‌తో మరో ఓటు ఉంది. వాళ్ల కుటుంబసభ్యుల పేరు మీద ఉన్న ఓట్లను పరిశీలించగా.. పిల్లి అనంతలక్ష్మీ(టీడీపీ ఎమ్మెల్యే) - 2 ఓట్లు. 1).పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెం: 188 ఓటర్ నెంబర్: HSF2456226 2).కాకినాడ రూరల్‌లో బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2075331 పిల్లి సత్యన్నారాయణ మూర్తి (ఎమ్మెల్యే భర్త) - 3 ఓట్లు. 1).పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెం: 188 ఓటర్ నెం: APO70430519155 2).కాకినాడ రూరల్‌లో... బూత్ నెం: 38 ఓటర్ నెం: INZ2078319 3).కాకినాడ రూరల్‌లో... బూత్ నెం: 106 ఓటర్ నెం: INZ1724087 పిల్లి కృష్ణ ప్రసాద్( ఎమ్మెల్యే మొదటి కుమారుడు)- 2 ఓట్లు 1). పెద్దాపురం నియోజకవర్గంలో బూత్: 188 ఓటర్ నెం: APO70430519410 2).కాకినాడ రూరల్‌లో బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2068310 పిల్లి కృష్ణ కళ్యాణ్(ఎమ్మెల్యే రెండవ కుమారుడు) - 3 ఓట్లు 1). పెద్దాపురం నియోజకవర్గంలో బూత్: 188 ఓటర్ నెం: HSF1182708 2).కాకినాడ రూరల్‌లో.. బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2068211 3).కాకినాడ రూరల్‌లో బూత్ నెం: 46 ఓటర్ నెం: IMZ1493402 పిల్లి రాధాకృష్ణ (ఎమ్మెల్యే మూడవ కుమారుడు)- 3 ఓట్లు 1).పెద్దాపురం నియోజకవర్గంలో బూత్ నెం: 188 ఓటర్ నెం: HSF1182757 2).కాకినాడ రూరల్‌లో. బూత్ నెం: 38 ఓటర్ నెం: IMZ2067205 3).కాకినాడ రూరల్‌లో .. బూత్ నెం: 46 ఓటర్ నెం:IMZ1493550 -
అజ్ఞాతంలోకి టీడీపీ మహిళా ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అధికారులు పట్టించుకోలేదని ఇప్పటికే అలక మీదున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మరోసారి తన అక్కసును వెళ్లబుచ్చారు. తనను అవమానించేలా వ్యవహరించారని బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు ఆమె భర్త, రూరల్ ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. జరిగిన పరాభవాన్ని తట్టుకోలేక ఏకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జిల్లా మంత్రులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో అట్టహాసంగా ప్రారంభిద్దామనుకున్న బీచ్ ఫెస్టివల్‌కు ఆదిలోనే నేతల షాక్ తగిలినట్టయ్యింది. భర్తను వేదికపైకి పిలవలేదని.. గతేడాది జరిగిన బీచ్ ఫెస్టివల్లో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రతికూల పరిస్థితి ఎదురైంది. సీఎం సమక్షంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పిలిచి ఆమె భర్త సత్తిబాబును పిలవకపోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున వేదిక వద్ద నిరసనతో పాటు ఆందోళన చేశారు. వేదికపైకి ఎక్కిన ఎమ్మెల్యేను కిందికి దిగిపోవాలని పిల్లి అనుచరులందరూ పెద్ద పెద్ద నినాదాలతో హల్చల్ చేశారు. వాస్తవానికి, ఇది పూర్తిగా అధికారిక కార్యక్రమం. ఏ పదవిలోనూ లేని పిల్లి సత్తిబాబును పిలవాల్సిన అవసరం లేదు. అధికారులు అనుసరించిన తీరు సరైనదే. కానీ ఎమ్మెల్యే భర్త అన్న హోదాలో పిలవాలన్న డిమాండ్‌తో పరిస్థితి చేయిదాటిపోతుండడంతో సీఎం జోక్యం చేసుకుని పిల్లి సత్తిబాబును వేదికపైకి పిలిచారు. దీంతో వివాదం సద్దుమణిగింది. పట్టించుకోలేదన్న ఆవేదన బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్ల నుంచి ప్రారంభోత్సవం వరకు తనను పట్టించుకోలేదన్న ఆవేదనతో రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు ఉన్నారు. అన్నీ తమకు తెలిసే జరగాలన్న అభిప్రాయంతో ఉన్న వారిని అధికారులు పట్టించుకోలేదు. ఇది పార్టీ కార్యక్రమం కాదని, పూర్తిగా అధికారిక కార్యక్రమమని అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది రూరల్ ఎమ్మెల్యేకు రుచించలేదు. దీంతో ఎమ్మెల్యే వర్గం రగిలిపోతూ వచ్చింది. ప్రారంభోత్సవానికి గైర్హాజర్ అవమాన బాధతో కుంగిపోయి ఏకంగా ప్రారంభోత్సవానికి గైర్హాజయ్యారు. తమ ఎమ్మెల్యేకు పరాభవం జరిగిందని ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ, సర్పంచ్‌లు, ఇతర నాయకులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఈ పరిణమాలను గమనించిన మంత్రులు కళా వెంకటరావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప మంగళవారం ఉదయం నుంచి ‘ఎమ్మెల్యే అనంతలక్ష్మి’ ఫ్యామిలీకి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ, ఎమ్మెల్యే, ఆమె భర్త, ఇతర నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో బుజ్జగింపు కుదరలేదు. ఎంత యత్నించినా ఫోన్లో కూడా ఎమ్మెల్యే అందుబాటులో రాకపోవడంతో చేసేదేం లేక షెడ్యూల్ ప్రకారంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంత్రులు కానిచ్చేశారు. అక్కసుతోనే.. అవమాన భారంతో రగిలిపోతున్న రూరల్ ఎమ్మెల్యేకు అధికారులు తీసుకున్న తాజా నిర్ణయం మరో సంకటంగా పరిణమించింది. వీఐపీ పాసులు తక్కువగా జారీ చేయడం గాయంపై కారం చల్లినట్టయ్యింది. పాసుల విషయంలో నియంత్రణ పాటించడంతో రూరల్ ఎమ్మెల్యే తట్టుకోలేక పోయారు. తన నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమానికి పాసుల పరిమితి ఏంటంటూ అధికారులపై విరుచుకుపడటం ప్రారంభించారు. ఇదే సందర్భంలో కొన్ని రోజులుగా ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కినుక వహించారు. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని, కనీసం కార్యక్రమానికి రమ్మని ఆహ్వానం పలకలేదని, ఏర్పాట్లలో కార్పొరేషన్ అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని, ఫెస్టివల్‌కు ముందు నిర్వహించిన 2కే రన్‌కు ఆహ్వానించలేదని, తన సలహా లేకుండా, మాట వరస చెప్పకుండా ఏర్పాట్లన్నీ చేశారని, ప్రోటోకాల్ విషయంలో మేయర్కిచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వలేదని, రూరల్‌లో జరిగిన కార్యక్రమంలో మేయర్‌కు పెద్దపీట వేయడమేంటన్న అక్కసుతో అలకబూనారు. -
కరాటే అంటే ప్రాణం
కాకినాడ : ప్రస్తుతం తాను నాలుగు భాషల్లో సినిమాలు చేస్తున్నానని సినీహీరో సుమన్ తెలిపారు. సోమవారం కాకినాడలోని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా సుమన్ విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి టీటీడీ పాలకవర్గ సభ్యురాలిగా ఎంపిక కావడం ఆనందంగా ఉందని, పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన తాను ఆమె కుటుంబ సభ్యులను కలసి వెళ్లడానికి వచ్చానని చెప్పారు. ప్రస్తుతం తాను నటించిన రుద్రమదేవి సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని, దిల్‌రాజు దర్శకత్వంలో సాయిథరమ్‌తేజ్ హీరోగా, సునీల్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నట్లు వివరించారు. మలయాళంలో ఒకటి, కన్నడలో మూడు, తెలుగులో మూడు, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. చంద్రమహేష దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పోలీసు కమిషనర్ పాత్ర చేసినట్లు వెల్లడించారు. కరాటే అంటే తనకు ప్రాణమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాకినాడకు చెందిన ఓ సంస్థ కరాటే పోటీలను గుంటూరులో ప్రారంభిస్తున్నారని వివరించారు. ఆయనతోపాటు స్వర్ణాంధ్ర సేవా సంస్థ కార్యదర్శి గుబ్బల రాంబాబు, పిల్లి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.