
సాక్షి, కాకినాడ: జనసేన తీరును టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణ తప్పుపట్టారు. నిన్న కాకినాడ రూరల్‌లో పార్టీ కార్యాలయాన్ని జనసేన ప్రారంభించింది. టికెట్ కేటాయించకుండానే పార్టీ ఆఫీస్ తెరవడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
జనసేనకు టికెట్ ఇస్తే సహకరించబోమని నిన్న టీడీపీ నేతల ప్రకటించారు. ఆ ప్రకటనపై సారీ చెబుతూనే జనసేన తీరును పిల్లి సత్యనారాయణ తప్పుపట్టారు. తమ ఇష్టం వచ్చినట్లుగా కార్యక్రమాలు చేస్తే ఎలా అంటూ పిల్లి వర్గం పశ్నిస్తోంది. తమ కుటుంబంపై తప్పుగా చెప్పి టికెట్ రాకుండా దుష్టశక్తులు కుట్ర చేశాయని పిల్లి సత్యనారాయణ ఫైర్ అయ్యారు.
జనసేనకు బీసీల ఓట్లు అవసరం లేదా? అంటూ పిలి అనంతలక్ష్మి ధ్వజమెత్తారు. మాకు తెలియకుండా జనసేన కార్యాలయం ఎలా ప్రారంభిస్తారు. జనసేన తీరు వల్లే మా క్యాడర్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకు జనసేనే ఊపిరి పోసిందని ఓ ఆసామీ మాట్లాడారు. ఆ వ్యాఖ్యలకు మేం చేతకాని వాళ్లలా ఊరుకోవాలా?’’ అని పిల్లి అనంతలక్ష్మి నిప్పులు చెరిగారు.
ఇదీ చదవండి: కుప్పం నుంచే చంద్రబాబు బైబై అంటున్నాడు: సీఎం జగన్