తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి ‘1+1, 1+2 ఆఫర్లు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వారి ఓట్లపై విచారణ చేపట్టారు. ఒకే చోట ఒకే ఓటు ఉండాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలను విస్మరించి రెండు, మూడు చోట్ల ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ ఓట్లను తొలగించేందుకు వారు చర్యలు చేపట్టారు. వీటిని అధికారికంగా తొలగించేందుకు కాకినాడ రూరల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. విచారణ జరుగుతోందని, అది పూర్తయిన వెంటనే కలెక్టర్‌కు ఫైల్ పంపుతామని రూరల్ తహసీల్దార్ చెబుతున్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబ సభ్యుల ఓట్లను అధికారికంగా తొలగించేందుకు చర్యలు చేపట్టడం కొసమెరుపు.
ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబ ఓట్లపై విచారణ
కాకినాడ సిటీ: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి ‘1+1, 1+2 ఆఫర్లు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వారి ఓట్లపై విచారణ చేపట్టారు. ఒకే చోట ఒకే ఓటు ఉండాలన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలను విస్మరించి రెండు, మూడు చోట్ల ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆ ఓట్లను తొలగించేందుకు వారు చర్యలు చేపట్టారు. వీటిని అధికారికంగా తొలగించేందుకు కాకినాడ రూరల్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. విచారణ జరుగుతోందని, అది పూర్తయిన వెంటనే కలెక్టర్‌కు ఫైల్ పంపుతామని రూరల్ తహసీల్దార్ చెబుతున్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబ సభ్యుల ఓట్లను అధికారికంగా తొలగించేందుకు చర్యలు చేపట్టడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment