
మీడియాతో మాట్లాడుతున్న వీర వెంకట సత్యనారాయణమూర్తి, అనంతలక్ష్మి
కాకినాడ రూరల్/మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త వీరవెంకట సత్యనారా యణమూర్తి తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. వాకలపూడిలోని తమ నివాసంలో శుక్రవారం మీడియా సమక్షంలో వారు కన్నీరు పెట్టుకుంటూ ఈ విషయం వెల్లడించారు. రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పదవికి అనంతలక్ష్మి, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి సత్యనారాయణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, కానీ.. పార్టీలో క్రియాశీలక సభ్యులుగా జీవితాంతం కొనసాగుతామని చెప్పారు. పార్టీలో చినరాజప్ప తదితరులతో మనస్పర్థలున్నాయని.. ఆయన తనను ఇబ్బందులు పెడుతున్నారని సత్యనారా యణమూర్తి చెప్పారు. మరోవైపు.. రాజీనామాలు వెనక్కి తీసుకోవాలంటూ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు అనంతలక్ష్మి దంపతులతో సంప్రదింపులు జరుపుతున్నారు.