కరాటే అంటే ప్రాణం | Hero Suman interview with sakshi | Sakshi
Sakshi News home page

కరాటే అంటే ప్రాణం

Published Tue, Sep 1 2015 8:19 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

కరాటే అంటే ప్రాణం - Sakshi

కరాటే అంటే ప్రాణం

కాకినాడ  : ప్రస్తుతం తాను నాలుగు భాషల్లో సినిమాలు చేస్తున్నానని సినీహీరో సుమన్ తెలిపారు.  సోమవారం కాకినాడలోని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా  సుమన్ విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యే అనంతలక్ష్మి టీటీడీ పాలకవర్గ సభ్యురాలిగా ఎంపిక కావడం ఆనందంగా ఉందని, పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన తాను ఆమె కుటుంబ సభ్యులను కలసి వెళ్లడానికి వచ్చానని చెప్పారు. ప్రస్తుతం తాను నటించిన రుద్రమదేవి సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని, దిల్‌రాజు దర్శకత్వంలో సాయిథరమ్‌తేజ్ హీరోగా, సునీల్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నట్లు వివరించారు.
 
 మలయాళంలో ఒకటి, కన్నడలో మూడు, తెలుగులో మూడు, తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. చంద్రమహేష దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పోలీసు కమిషనర్ పాత్ర చేసినట్లు వెల్లడించారు. కరాటే అంటే తనకు ప్రాణమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాకినాడకు చెందిన ఓ సంస్థ కరాటే పోటీలను గుంటూరులో ప్రారంభిస్తున్నారని వివరించారు. ఆయనతోపాటు స్వర్ణాంధ్ర సేవా సంస్థ కార్యదర్శి గుబ్బల రాంబాబు, పిల్లి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement