
సాక్షి, విజయవాడ: బోగస్ ఓట్ల తొలగింపుపై హైకోర్టు స్పందించింది. రాష్ట్రంలో 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదుపై స్పందించిన కోర్టు ఎన్నికల కమిషన్‌కు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బోగస్ ఓట్లు తొలగించాలని న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. నెల రోజుల్లో ఎన్ని బోగస్ ఓట్లు తొలగించారో వివరాలు అందజేయాలని సూచించింది. బోగస్ ఓట్ల తొలగింపు వివరాలను ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిర్యాదుదారునికి తెలపాలని హైకోర్టు పేర్కొంది.