దర్శికి చేరిన సాగర్ జలాలు
దర్శికి చేరిన సాగర్ జలాలు
Published Tue, Nov 1 2016 10:03 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
దర్శి: పట్టణానికి మంగళవారం సాగర్ జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్నెస్పీ ఈఈ రత్తయ్య మాట్లాడుతూ నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టులోని ఆరుదల పంటల కోసం సాగర్ జలాలు విడుదల చేసినట్లు తెలిపారు. ఇటీవల వర్షాలు లేక వేసిన పంటలు వాడు ముఖం పట్టడంతో ఆ పంటలను కాపాడేందుకు నీటి విడుదల చేశారన్నారు.
ఈ నీరు 20 రోజుల పాటు వస్తుందని చెప్పారు. డ్యాంలో 538.80 అడుగుల నీటి మట్టం ఉన్నాయి. ఆర్‌సీఆర్‌లో 4 వేల క్యూసెక్కులు, బుగ్గవాగు 468.50 అడుగులు (5627 క్యూసెక్కులు), అద్దంకి బ్రాంచి కెనాల్ 1200 క్యూసెక్కులు, గుంటూరు బ్రాంచ్ కెనాల్ 1300 క్యూసెక్కులు, 57/2 మైలు రాయి వద్ద 2 వేల క్యూసెక్కులు, జిల్లా సరిహద్దు 85/3 మైలు రాయి వద్ద 1632 క్యూసెక్కులు, 126/0 మైలు రాయి వద్ద 1192 క్యూసెక్కులు, ఓబీసీ 883 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఆయకట్టు ప్రాంత రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Advertisement