nsp canal
-
దర్శికి చేరిన సాగర్ జలాలు
దర్శి: పట్టణానికి మంగళవారం సాగర్ జలాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎన్నెస్పీ ఈఈ రత్తయ్య మాట్లాడుతూ నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టులోని ఆరుదల పంటల కోసం సాగర్ జలాలు విడుదల చేసినట్లు తెలిపారు. ఇటీవల వర్షాలు లేక వేసిన పంటలు వాడు ముఖం పట్టడంతో ఆ పంటలను కాపాడేందుకు నీటి విడుదల చేశారన్నారు. ఈ నీరు 20 రోజుల పాటు వస్తుందని చెప్పారు. డ్యాంలో 538.80 అడుగుల నీటి మట్టం ఉన్నాయి. ఆర్సీఆర్లో 4 వేల క్యూసెక్కులు, బుగ్గవాగు 468.50 అడుగులు (5627 క్యూసెక్కులు), అద్దంకి బ్రాంచి కెనాల్ 1200 క్యూసెక్కులు, గుంటూరు బ్రాంచ్ కెనాల్ 1300 క్యూసెక్కులు, 57/2 మైలు రాయి వద్ద 2 వేల క్యూసెక్కులు, జిల్లా సరిహద్దు 85/3 మైలు రాయి వద్ద 1632 క్యూసెక్కులు, 126/0 మైలు రాయి వద్ద 1192 క్యూసెక్కులు, ఓబీసీ 883 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఆయకట్టు ప్రాంత రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. -
కాలువలో మహిళ మృతదేహం
దుర్గి (గుంటూరు) : నాగార్జున సాగర్ కుడి కాలువలో శుక్రవారం ఓ మహిళ మృతదేహం కొట్టుకొచ్చింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలంలో శుక్రవారం వెలుగుచూసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎన్ఎస్పీ కాలువ వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు కాలువలో పడిందా.. లేక ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈతకు వెళ్లి డిగ్రీ విద్యార్థి గల్లంతు
పెనుబల్లి : ఖమ్మం జిల్లా పెనుబల్లి ఎన్ఎస్పీ కెనాల్లో ఈతకు వెళ్లి ఓ డిగ్రీ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన మండలం లోని వీఎం బంజర్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. బుడగజంగాల కాలనీ చెందిన పెర్లా జంపాలు (20) ఖమ్మం పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం స్వగ్రామంలోని ఎన్ఎస్పీ కెనాల్లో ఈతక వెళ్లి గల్లంతయ్యాడు. అతడి కోసం స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు.