రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య | Prisoner commits suicide | Sakshi
Sakshi News home page

రిమాండ్‌ ఖైదీ ఆత్మహత్య

Published Sun, Dec 10 2017 2:55 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Prisoner commits suicide

ప్రకాశం : అండర్‌ ట్రైల్‌లో ఉన్న ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి సబ్‌ జైలులో చోటుచేసుకుంది. రిమాండ్‌ ఖైదీ రమేష్‌(21)  టాయిలెట్‌ రూంలో తన లుంగీతో  ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన పోలీసులు రమేష్‌ను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఓ దొంగతనం కేసులో రమేష్‌ రిమాండ్‌ ఖైదీగా ఉన్నట్లు జైలు సూపరిండెంట్‌ వసంత రావు తెలిపారు. రమేష్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement