గుంటూరు: నరసరావుపేట సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి జైలు బ్యారక్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నను చంపిన కేసులో నిందితునిగా ఉన్న భీమవరపు ప్రసన్నకుమార్ (38) ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి నరసరావుపేట సబ్ జైలులో ఉంటున్నాడు. అన్నను చంపిన సమయంలోనే అతను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. సబ్‌జైలులో ఉన్నప్పుడు భార్యాబిడ్డలెవరూ చూసేందుకు కూడా రాకపోవడంతో మనస్తాపం చెందిన ప్రసన్నకుమార్ గురువారం బ్యారక్‌లోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.