Viral Video: Monkey Selfie In Prakasam District Darsi - Sakshi
Sakshi News home page

Monkey Selfie Video: సెల్‌ఫోన్‌ లాక్కొని.. గోడపై కూర్చొని ‘సెల్ఫీ’ దిగిన కోతి..

Published Sat, May 21 2022 10:23 AM | Last Updated on Sat, May 21 2022 3:23 PM

Monkey Selfie In Prakasam District Darsi - Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: దర్శిలో ఓ కోతి సెల్ఫీలు దిగుతూ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొబైల్ ఫోన్‌ను చేతిలో పట్టుకుని వాకింగ్ చేస్తూ ఉన్న ఓ వ్యక్తి నుండి మొబైల్ ఫోన్‌ను ఓ వానరం లాక్కెళ్లింది. అంతటితో ఆగకుండా దగ్గరలో ఉన్న గోడపై కూర్చొని సెల్ఫీలో దిగుతూ గంట పాటు మొబైల్ ఫోన్‌ను ఇవ్వకుండా ఆ వ్యక్తి కి ముచ్చెమటలు పట్టించింది.
చదవండి: బెజవాడలో ఫేమస్‌.. రామకృష్ణ బుల్లెట్‌ గ్యారేజ్‌  

ఆ కోతి చేష్టలకు వాకింగ్ చేస్తూ ఉన్నవారంతా ఒక్కసారి నోరెళ్ల పెట్టి అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత మొబైల్‌ను నోటితో పట్టుకొని చెట్లపై అటు ఇటు దూకుతూ తన కోతి చేష్టలను చూపెట్టింది. గంట తర్వాత చిన్నగా ఓ గోడపై వదిలి వెళ్లగా ఆ యువకుడు నానా కష్టాలు పడి  గోడలు ఎక్కి మొబైల్ ఫోన్ తీసుకోవడంతో అక్కడి వారంతా కోతి చేష్టలకు ముక్కున వేలేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement