
సాక్షి, ప్రకాశంజిల్లా: దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు రాజీవ్, రోహితలను సీఎం జగన్ ఆశీర్వదించారు. జిల్లాకు వచ్చిన సీఎంకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
క్రిస్మస్ సందర్భంగా మంగళవారం సాయంత్రం విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందులో సీఎం జగన్ పాల్గొంటారు. ఇందుకోసం సాయంత్రం 5.30 గంటలకు ఏప్లస్ కన్వెన్షన్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment