కురబలకోట : మండలంలోని అంగళ్లులో శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ అమ్మాయి కోసం ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ పడ్డారు. పోలీసుల కథనం మేరకు... అంగళ్లులో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న అమ్మాయిని మరో విద్యార్థి ఇష్టపడ్డాడు. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె అంగళ్లు వద్ద మరొకరి కారు ఎక్కడం చూసిన అతను స్నేహితులతో కలిసి అటకాయించాడు. దీంతో పరస్పరం గొడ వ పడ్డారు.
ఒకరికొకరు కొట్టుకోవడంతో పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. కొంత సేపటికి పోలీసులు అక్కడికి చేరుకుని వారిని వారించారు. విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నారు. ప్రేమ వ్యవహారమే కారణమని విచారణలో తేలింది.
అమ్మాయి కోసం విద్యార్థుల ఫైటింగ్..!
Published Sat, Jun 11 2016 2:46 AM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM
Advertisement
Advertisement