ఇద్దరు విద్యార్థుల ఘర్షణ: ఒకరి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
చంద్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక చుండ్రుగొండ జడ్పీ పాఠశాలలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఘర్షణ పడగా ఒకరు మృతి చెందారు. తరగతి గదిలో ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో తంబళ్ల భానుప్రకాశ్(15) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ఇంటర్వెల్ సమయంలో భానుప్రకాశ్, మరో విద్యార్థి ఘర్షణ పడ్డారని తరగతికి వెళ్లిన తర్వాత కూడా తీవ్రంగా కొట్టుకున్నారని తోటి విద్యార్థులు తెలిపారు. కాగా ఇద్దరి మధ్య ఘర‍్షణలో మర్మావయవాలపై తీవ్రంగా దెబ్బ తగలడంతో భానుప్రకాశ్ తరగతిలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించారు.