Bhanu Prakash
-
గాలి భానుప్రకాష్ అతి.. ఓట్ల లెక్కింపునకు ముందే..!
నగరి: నగరి నియోజకవర్గం పుత్తూరులో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓట్ల లెక్కింపు జరగముందే తానే ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయించారు. కొందరు దీన్ని చూసి అంత తొందరేల భానూ.. అంటూ నవ్వుకున్నారు. ఇందంతా ఒక పథకం ప్రకా రం రెచ్చగొట్టడమేనని భావిస్తున్నారు. నేర చరిత కలిగిన వారిని జనంలోకి రప్పించడం.. గతంలో గంజాయి సరఫరా జరిగిందని ప్రచారం జరిగిన ప్రాంతంలో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభించడం ఏంటని చర్చించుకుంటున్నారు. అది బ్యాడ్మింటన్ కోర్టు కాదు.. విధ్వంస కుట్రలకు కేంద్రంగా చేసుకున్నారని అనుమానిస్తున్నారు. ఇదంతా ఎన్నికల కమిషన్‌కు కనబడలేదా అని జనం ప్రశి్నస్తున్నారు.ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది టీడీపీ నేతల పరిస్థితి. ఓట్ల లెక్కింపు జరగలేదు. గెలుస్తారో లేదో కూడా తెలియదు. నగరిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎమ్మెల్యే అంటూ పుత్తూరు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం హాస్యాస్పదంగా మారింది. ఇదేం విడ్డూరం అంటూ జనం నవ్వుకుంటున్నారు.బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభోత్సవంలో గాలి భానుప్రకాష్పుత్తూరు మున్సిపాలిటీ చింతలగుంటలో గతంలో బీఎస్ జిమ్ నిర్వహించేవారు. ఏడాది క్రితం ఈ జిమ్ నిర్వాహకుడు టీడీపీ నేత హరి విశాఖపట్నం అరకు వద్ద గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత ఆ జిమ్ నిరుపయోగంగా మారింది. ఈ జిమ్ నుంచే గంజాయి సరఫరా జరిగేదంటూ అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అనంతరం ప్రచారాల్లోను, పలు కార్యక్రమాల్లోను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్తో పాటు గంజాయి స్మగ్లర్, అతని అనుచరులు పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. వివాదాలకు చిరునామాగా ఉన్న వీరంతా తాజాగా మరో వివాదానికి తెరతీశారు. నిరుపయోగంగా ఉన్న జిమ్‌ను బ్యాడ్మింటన్ కోర్టుగా మార్చి ఎన్ని కల కోడ్ ఉండగానే టీడీపీ అభ్యరి్థతో ప్రారం¿ోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో భానుప్రకాష్ ఎమ్మెల్యే, నగరి అంటూ ముద్రించి ప్రదర్శనగా ఉంచారు.కోడ్ వర్తించదా? ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల నిబంధనలు వర్తించవా అంటూ నగరి నియోజకవర్గ ప్రజలు ప్రశి్నస్తున్నారు. బహిరంగంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రారం¿ోవాలు చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రెచ్చగొట్టి విధ్వంసాలకు పాల్పడేందుకేనా?ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే పుత్తూరు టీడీపీ నాయకుల దుశ్చర్యను చూసి వైఎస్సార్సీపీ నాయకులు, స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. రాజకీయ పారీ్టలను రెచ్చగొట్టి.. గొడవలు సృష్టించి విధ్వంసాలకు పాల్పడేందుకే పథకం వేశారని స్థానికులు భయపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించేందుకే నేరచరిత కలిగిన వారిని టీడీపీ నాయకులు జనంలోకి తీసుకొస్తున్నట్టు సమాచారం. -
టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా
-
Nagari: భాను.. డాను
గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమ వ్యాపారాలకు అండగా నిలిచారు.. ఎర్ర దొంగలకు కాపుకాశారు.. మద్యం సిండికేట్లకు వెన్నుదన్నుగా నిలబడ్డారు.. బియ్యం స్మగ్లర్లతో దోస్తీ కట్టారు.. ఇదంతా ఎవరి గురించో నగరి నియోజకవర్గ ప్రజలందరికీ విధితమే. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన భానుప్రకాష్తో అంటకాగిన వారందరూ తదనంతర కాలంలో వివిధ నేరాలు చేస్తూ పట్టుబడ్డారు. చీకటి సామ్రాజ్యంతో సంబంధాలు పెట్టుకుని యథేచ్ఛగా దందా సాగిస్తున్నందుకే అప్పటి ఎన్నికల్లో ప్రజలు ఓటు తగిన బుద్ధి చెప్పారు. నాటి ఘటనలను నేటికీ నగరి వాసులు మరువలేదు. ఓడించినా పాత పంథాలోనే ఇప్పటికీ సాగుతున్న చీకటి భానుడికి మళ్లీ గుణపాఠం నేర్పేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. చిత్తూరు : నగరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు సాగించారు. ఇప్పుడు కూడా భాను అండతోనే ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారు. అధికారం లేకున్నా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తూ వచ్చిన భాను అనుచరులు ఇటీవల పట్టుబడటంతో వారి బండారం బయటపడింది. వారు భానుతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా వెలుగు చూడడంతో, ఇప్పటి వరకు ఇవన్నీ ఆరోపణలే అనుకుంటున్న వారిని సైతం ఆలోచింపజేస్తున్నాయి. హత్యాయత్నం కేసులోనూ.. తమిళనాడులోని తిరుత్తణిలో మంత్రి ఆర్కే రోజా కార్యాలయ కార్యదర్శి ప్రతీష్పై జరిగిన హత్యాయత్నం కేసులోనూ టీడీపీ వారే ప్రధాన నిందితులు. తిరుత్తణి పోలీసులు కేసు చేధించి అరెస్టు చేసిన నవీన్ అనే వెట్టునవీన్, చిరంజీవి, పరశురాం అలియాస్ మధులు కూడా భాను అనుచరులే అని స్పష్టమైంది. టీడీపీలో వారికి ఉన్న పదవులు, భాను ప్రకాష్‌తో వారు తీసుకున్న ఫొటోలతో అసలు నిజం బట్టబయలైంది. అక్రమ వ్యాపారులదే ప్రధానపాత్ర టీడీపీ అభ్యర్థి భాను ప్రకాష్‌కు మద్దతుగా ప్రస్తుత ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీలో అక్రమ వ్యాపారులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. భాను అధికారంలోకి వస్తే విచ్చల విడిగా తమ వ్యాపారాలను కొనసాగించుకోవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఊ్యహాత్మకంగా ఎవరికీ చిక్కకుండా డబ్బులు. మద్యం పంపిణీ చేస్తూ తమ పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైస్సార్సీపీ రెబల్‌గా పోటీచేసిన అభ్యర్థులు, అలక వహించిన నేతలను కూడా ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయి దందా వారిదే..! పుత్తూరుకు చెందిన టీడీపీ నేత హరికృష్ణ అతడి అనుచరుడు జి.హేమంత్ 2022 జనవరి 10వ తేదీన గంజాయి తరలిస్తూ విశాఖ –అరకు రోడ్డులో విజయనగరం జిల్లా శృంగవరపు కోట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 14 ప్యాకెట్లలో 28 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు నగరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి భానుప్రకాష్‌కు అత్యంత సన్నిహితులు. ఇదే వ్యక్తి 2023లో పుత్తూరు స్వర్ణా కాలనీలో గంజాయి విక్రయిస్తూ మరోమారు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆపై టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో భానుప్రకాష్తో కలిసి హరికృష్ణ పాల్గొనడం వారి సాన్నిహిత్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. దీంతో భాను అనుచరులైన టీడీపీ నేతలే గంజాయి తరలింపునకు పాల్పడుతున్నట్లు ప్రజలకు స్పష్టమైంది. సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్‌కు ఎర్రచందనం, గంజాయి, బియ్యం, అక్రమ మద్యం వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు చలపతి, లత ఆరోపించడం నియోజకవర్గంలో కలకలం రేపింది. వారు తమ అనుచరులతో కలిసి విన్నూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడం స్థానకంగా సంచలనం సృష్టించింది. చీకటి వ్యాపారులతో కుమ్మకై ్కన అభ్యర్థి తమకు వద్దు అంటూ బహిరంగంగా నినాదాలు చేయడం ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి. -
కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్‌పై పేరెంట్స్ దాడి
సాక్షి, అనంతపూర్: విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు విద్యార్థినిల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. తాజాగా కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ లైంగిక వేధింపులకు పాల్పడటంతో బాధితురాలి పేరెంట్స్ అతడిపై దాడి చేశారు. ఈ ఘటన అనంతపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఎస్కేయూలోని కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ భాను ప్రకాశ్ నాయక్ విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. విద్యార్థులను భాను ప్రకాశ్ దుర్భాషలాడాడు. ఇక, విద్యార్థులు తమ పేరెంట్స్‌కు చెప్పారు. దీంతో, ఆగ్రహానికి లోనైన విద్యార్ధులు పేరెంట్స్, బంధువులు.. భానుప్రకాశ్‌కు దేహశుద్ది చేశారు. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయంలో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అంతేకాకుండా భాను ప్రకాశ్‌పై ప్రిన్సిపాల్‌కు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: Cyber Crime: రూ. 5 కట్టమని.. రూ.1.85 లక్షలు దోచుకున్నారు -
హీరోయిన్గా ఉన్నప్పుడే చెన్నైలో ఇల్లు కట్టుకున్నా: ఎమ్మెల్యే రోజా
సాక్షి, నగరి: తనపై అసత్య ప్రచారాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే ఆర్కే రోజా గాలి భానుప్రకాష్‌పై మండిపడ్డారు. ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో తనపై గాలి భానుప్రకాష్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఓడిపోయి రెండేళ్లుగా నియోజకవర్గం వైపు తిరిగిచూడని ప్రబుద్ధుడు ఇప్పుడు ప్రత్యక్షమై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవినీతిపరుడైన భానుకు అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తారన్నారు. తాను నంబర్‌వన్ హీరోయిన్గా ఉన్నప్పుడే మద్రాసులో ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీలోకి రాకముందు హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్నానని, నగరిలో ఇల్లు పార్టీ అపోజిషన్‌లో ఉన్నప్పుడు కట్టానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండాలని ఇల్లు కట్టుకుట్టున్నట్టు వెల్లడించారు. ప్రతి ఒక్కటీ తన సొంత డబ్బుతో కట్టిందేనన్నారు. అక్రమంగా సంపాదించాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. జగనన్న అడుగుజాడల్లో క్రమశిక్షణతో పనిచేసే తనకు ఒకరికి ఇవ్వడమే కానీ, తీసుకోవడం అలవాటు లేదన్నారు. ఈ నేపథ్యంలోనే రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు. నీ కారణంగానే ముద్దుకృష్ణమ మృతి చెందారట! ఈయన కారణంగానే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయారని ఆయన తల్లి, తమ్ముడు అసహ్యించుకుంటున్నారని, ముందు వారి కాళ్లమీద పడి క్షమాపణ చెప్పుకోవాలన్నారు. తన సొంత ఇంటిలోనే అతనికి మంచి పేరులేదని, ఇంట గెలవలేని ఈయన రచ్చ ఎలా గెలుస్తాడన్నారు. రాజీనామా వార్త అవాస్తవం తాను రాజీనామా చేస్తున్నట్లు సోషల్‌మీడియా, మీడియాలో వస్తున్న వార్తలపైనా ఆమె స్పందించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తెలంగాణకు వెళుతున్నానని అసత్య ప్రచారాలు కొందరు పనిగట్టుకుని చేస్తున్నారన్నారు. తానెందుకు పార్టీ నుంచి వెళతానని ప్రశ్నించారు. తప్పుచేసినవారు వెళ్లాలన్నారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. సొంత చెల్లిగా భావించి రెండు సార్లు ఎమ్మెల్యేను చేసిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు. -
కుర్రాడు భాను.. స్టార్ హీరోల పక్కన
సాక్షి, హైదరాబాద్: వయసు తొమ్మిదేళ్లు.. 15కి పైగా సినిమాలు.. డైలాగ్ చెప్పడం మొదలు పెడితే అనర్గళమే.. వయసుకు మించిన పరిణితితో నటనకు సంబంధించిన అన్ని ఫార్మాట్లలో ప్రావీణ్యం. ఇవన్నీ ఒక్క చైల్డ్ ఆర్టిస్ట్ గురించే.. ఆ కుర్రాడే భాను ప్రకాష్. అనతికాలంలోనే స్టార్ హీరోల పక్కన అవకాశాలు దక్కించుకుంటూ మోస్ట్ ఎలిజిబుల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్–2, గమనం లాంటి పాన్ ఇండియా మూవీస్‌లో సైతం భాను నటిస్తుండటం విశేషం. సినిమా ఆర్టిస్ట్‌గా రాణించాలని చాలామంది అనుకుంటారు. కానీ కొందరే ఆ కలను నిజం చేసుకుంటారు. నిరంతర కృషి, సినిమా పట్ల అంకితభావం, ఎప్పటికప్పుడు నటనలో మెలకువలు నేర్చుకోవడం వల్లే అది సాధ్యమవుతుందని అంటున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ భాను ప్రకాష్. ఐదేళ్ల ప్రాయం నుంచే కెమెరా ముందు తన నటనతో అందరినీ ఆకర్షించాడు. అలా అతితక్కువ సమయంలోనే టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారాడు భాను. కేజీఎఫ్‌లో ఓన్లీ వన్.. క్రేజీ ప్రాజెక్ట్ కేజీఎఫ్–2లో నటిస్తున్న తొలి తెలుగు నటుడు భాను కావడం విశేషం.. అంతేగాకుండా ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న గమనం సినిమాలో నటించాడు. ఇందులో ప్రముఖ నటి శ్రియ శరన్‌తో పాటు ఒక ప్రత్యేక పాత్రలో భాను నటిస్తున్నాడు. ఈ మధ్యే గమనం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్‌కి ఇప్పటికే 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో పాటు శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న లవ్‌స్టోరీలో కూడా మెరుస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు, వెంకీమామ, ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడుతో పాటు పలు హిట్ సినిమాల్లో నటించాడు. నాన్నే నడిపించాడు.. తండ్రి సురేష్ సినిమాలపై ప్రేమతోనే సిటీకి వచ్చాడని, తను చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించడం వెనుక నాన్న కృషి మాటల్లో చెప్పలేనిది గుర్తుచేసుకున్నాడు. ఐదేళ్ల వయసులోనే దానవీర శూర కర్ణ సినిమాలోని ‘ఏమంటివి ఏమంటివి.. లాంటి భారీ డైలాగ్స్‌ని సునాయాసంగా అభినయ సహితంగా చెప్పడం గమనించి నాన్న తనను బాగా ప్రోత్సహించాడని భాను చెప్పాడు. నటనలో ఓనమాలు నేర్పిందీ నాన్నే అంటున్నాడు. మొదట్లో ఎక్కడ ఆడిషన్స్ ఉన్నా తనని తీసుకెళ్లి ఎలా చేయాలి? ఎక్స్‌ప్రెషన్స్‌లో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి తదితర అంశాల్లో మెలకువలు నేర్పేవాడని గుర్తు చేసుకున్నాడు. తనకు మెదటిసారిగా ‘ఒక్క క్షణం’ సినిమాలో అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకున్నాక అనేక సినిమాల్లో అవకాశాలు వెల్లువెత్తాయని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తక్కువ సమయంలోనే క్రిష్, అనిల్ రావిపూడి లాంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో అవకాశాలు పొందడం, తద్వారా వారి పర్యవేక్షణలో నటనలో మంచి ప్రావీణ్యం సంపాదించానని చెబుతున్నాడు. ప్రస్తుతం తాను 3వ తరగతి చదువుతూ అటు సినిమాలను ఇటు చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా కష్టపడుతున్నాడు. ఔట్‌డోర్ షూటింగ్స్ ఉన్న సమయాల్లో ఆన్లైన్లో తన సబ్జెక్ట్‌ని నేర్చుకుంటున్నాడు. నటనలోనైనా, చదువులోనైనా అన్నింటికీ మార్గదర్శి మాత్రం నాన్నే అంటున్నాడు భాను. ఈ సందర్భంగా ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డ్ సాధించి నాన్నకు బహుమతిగా ఇవ్వాలన్నదే తన లక్ష్యమని వినయంగా తెలిపాడు. యాక్టర్.. ఆల్ రౌండర్.. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్, షార్ట్ఫిలిమ్స్, వెబ్‌సిరీస్, యాడ్స్, టీవి షోలు, నాటకాలు ఇలా అన్ని ఫార్మాట్లలో భాను తనని తాను నిరూపించుకుంటున్నాడు. మెట్రో కథలు, గీతా సుబ్రహ్మణ్యం తదితర వెబ్ సిరీస్‌లు, జబర్దస్త్ షోలో సైతం కొన్ని ఎపిసోడ్స్‌లో చేశాడు. అంతేగాకుండా ఆహా వేదికగా సమంత చేస్తున్న సామ్‌జామ్ షోలోనూ మెరిశాడు. అతి చిన్న వయసులోనే ఇలా విభిన్న ఫార్మాట్లలో ప్రావీణ్యం చూపడం చాలా అరుదు. ‘దారి’ షార్ట్‌ఫిల్మ్‌లో తన నటనతో అందరి మన్ననలను పొందడమే కాకుండా ఏఎన్నార్ అవార్డ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ఇదే ఫిల్మ్‌కి మినీమూవీ ఫెస్టివల్ అవార్డ్ కూడా వరించింది. ఇష్టపడి.. కష్టపడి.. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌లోనూ, నటనలోనూ భాను ఉత్సాహం చూసి ముచ్చటేసేది. తనలో కళ ఉంది. దానికి మెళుకువలద్ది సరైన దారిలో పెట్టడమే నా భాధ్యతగా భావించా. వయస్సు చిన్నదే అయినా సినిమాలు, నటనలో డెడికేటివ్గా ఉంటాడు. ఉన్నతంగా ఆలోచించడం భాను మరో కోణం. మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయంటే దానికి భాను పడిన కష్టం, తాపత్రయం నాకు మాత్రమే తెలుసు. కొన్ని ఆడిషన్స్‌లో వేల మంది పాల్గొన్నప్పటికీ భాను మాత్రమే సెలక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సినిమా నటుడిగా నిరూపించుకోవడం కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో భాను ఉండటం చాలా సంతోషాన్నిస్తోంది. – సురేష్ అమాస, భాను తండ్రి. -
లెక్కల్లో సూపర్ మ్యాన్
సాక్షి, హైదరాబాద్: అతనికి లెక్కలంటే లెక్కే లేదు..! అంకెలు.. సంఖ్యలే అతడి మెదడులో ఎప్పుడూ మెదులుతుంటాయి. గణితంతో అం దరూ కుస్తీ పడుతుంటే.. అతడు మాత్రం ఏ సమస్యనైనా క్షణాల్లో కంప్యూటర్ కన్నా వేగంగా పరిష్కరిస్తాడు.. అతడే హైదరాబాద్‌కు చెందిన నీలకంఠ భాను ప్రకాశ్. గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తిచేసిన మానవ కంప్యూటర్‌గా పేరొందాడు. నగరంలోని మోతీనగర్‌లో నివాసముంటున్న భానుప్రకాశ్ వయసు 21 ఏళ్లు. ఈ ప్రాయంలోనే అతను విశ్వవిఖ్యాత హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం విశేషం. ఈనెల 15న లండన్‌లో నిర్వహించిన మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్‌లో గణితంలో అసాధారణ తెలివితేటలు చూపి గోల్డ్ మెడల్ సాధించి అత్యంత ఫాస్టెస్ట్ హ్యూమన్ కేలిక్యులేటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ పోటీలో సుమారు 13 దేశాలకు చెందిన 30 మంది మేధావులు పాల్గొన్నారు. ఐదేళ్ల ప్రాయం నుంచే అనితరసాధ్యమైన సాధనతో గణితంలో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారాలను కనిపెడుతున్న భాను ప్రకాశ్ ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీలో బీఎస్సీ మ్యాథమ్యాటిక్స్ (హానర్స్) చదువుతున్నాడు. భాను గతంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు 5 వరల్డ్ రికార్డులు, 50 లిమ్కా వరల్డ్ రికార్ట్స్‌ను సాధించి అందరి మన్ననలు పొందాడు. గణిత ల్యాబ్ ఏర్పాటే లక్ష్యం.. భాను ప్రకాశ్‌కు తండ్రి శ్రీనివాస్, తల్లి హేమ, సోదరి మన్మోహణి ఉన్నారు. జూబ్లీ హిల్స్‌లోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం, ఇంటర్మీ డియట్ చుక్కా రామయ్య ఇన్స్టిట్యూట్లో పూర్తి చేశాడు. భవిష్యత్‌లో గణిత ల్యాబ్‌ను ఏర్పాటు చేసి గణితంలో అంతుచిక్కని సమస్యలను సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని చెప్పాడు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు భానుప్రకాశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. -
కేజీఎఫ్–2 చైల్డ్ స్టార్.. సేవకు సలాం
మనం బతకడానికి సమాజం ఎన్నో అవకాశాలను ఇస్తుంది. మనకంటూ ఒక స్థాయిని ఇస్తుంది. అలాంటి సమాజం రుణం తీర్చుకునే అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే సాధారణ జీవితం.. సార్థకం అవుతుంది. చిన్న వయసులోనే ఆ ఘనత సాధించగలిగాడు సిటీ కుర్రాడు భాను ప్రకాష్(7). సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపుతెచ్చుకుంటూ కేజీఎఫ్–2 లాంటి పెద్ద సినిమాలోనూకనిపించబోతున్న ఈ చైల్డ్స్టార్.. టాలెంట్ చూపించడంలో మాత్రమే కాదు సమాజానికి తిరిగి ఇవ్వడంలో కూడావయసుకు మించిన పరిణితి చూపిస్తున్నాడు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్నార్థులకు, అభాగ్యులకుఆసరాగా నిలుస్తున్నాడు. ఈ కుర్రాడికి తోడుగా నిలిచిన సేవాహృదయాలు కలిసి టీమ్ ఎఫ్ఎమ్గా ఏర్పడటంతో సిటీలో విభిన్న రూపాల్లో సేవా స్ఫూర్తిని పంచుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ సమయంలో సిటీలో 53 రోజులుగా నిత్యాన్నదానాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. టీమ్ ఎఫ్ఎమ్ పేరుతో కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాలకు తండ్రి సురేష్ అమాస అండగా నిలుస్తున్నారు. ‘లాక్‌డౌన్‌తో పాటే మొదలైన దినసరి కూలీలు, నిరుపేదల ఆకలి ఆర్థనాదాలు నన్ను టీమ్‌ని కదిలించాయి. సాటి మనుషులు ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడటాన్ని జీర్ణించుకోలేకపోయా’ అంటున్న తండ్రి సురేష్.. అనూహ్యంగా సక్సెస్ అయిన తన చిన్నారి ద్వారా వచ్చిన ప్రతిపైసా సద్వినియోగం చేయడానికి ఇదే సమయం అనుకున్నారు. ఈ విషయం భాను ప్రకాష్‌కి కూడా అర్థమయ్యేలా చెప్పి.. అన్నార్తుల ఆకలి తీర్చే ఒక ఫుడ్ మొబైల్ వ్యాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 53 రోజులుగా సిటీలో ఎక్కడ ఆకలి ఉందని తెలిస్తే అక్కడికెళ్లి భోజనం అందించారు. అలా ప్రతిరోజు దాదాపు 500 మందికి పైగా కడుపునింపారు. వీరికి తోడయ్యారు ఔత్సాహిక సినీనటులు మణికంఠ వారనాసి, ఎస్ఎమ్ఎస్ సురేష్‌లు. సేవల్ని విస్తరిస్తూ.. ఈ బృంద సభ్యులు టీమ్ ఎఫ్ఎమ్(ఫ్రీ మీల్స్) పేరుతో ఇందిరానగర్ పరిసర ప్రాంతాల్లోని సినిమా కార్మికులకు (నాన్ కార్డ్ హోల్డర్స్) ప్రతిరోజూ మీల్స్‌ని అందించారు. సోమాజిగూడ, నందినీహిల్స్, బోరబండ ప్రాంతాల్లో అన్నార్థులకు స్వయంగా వండిన ఆహారాన్ని అందించారు. సోమాజిగూడ పార్క్ హయత్ దగ్గరలోని బస్తీ వాసులకు ఈ 50 రోజుల్లో నిత్యావసర సరుకులు నింపిన 1500 కిట్స్ అందించారు. అంతేగాకుండా మేడ్చల్, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలోని వలస కూలీలకు ఫుడ్ వండి వడ్డించారు. పలు ప్రాంతాల్లో లాక్డౌన్ సమయంలో విధులు నిర్వర్తించిన పోలీసులకు పండ్లు, మజ్జిగ, భోజనాలను సమకూర్చారు. ప్రతినిత్యం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గమనించిన తమ స్నేహితులు కొందరు ఆర్థికంగా సహకారం అందించారని బృంద సభ్యులు తెలిపారు. వలస కూలీలకు బాసటగా.. ఈ విపత్కర పరిస్థితుల్లో సొంత ఊరికి చేరాలనుకున్న ఎంతో మంది వలస కూలీలకు ఆ మార్గంలో ఆకలి అవరోధంగా మారింది. చిన్నపిల్లలతో కలిసి వందల కిలోమీటర్లు నడిచి వివిధ ప్రాంతాల్లోని తమ గ్రామాలకు చేరుకున్న కుటుంబాలు ఎన్నో.. అలాంటి వారికి కూడా సాయం అందించాలనే తపనతో, పోలీసువారి అనుమతితో ఎన్నో కుటుంబాలను వారి ప్రాంతాలకు చేరుకునేందుకు వాహనాలు సమకూర్చారు. ఈ విధంగా నగరం నుంచి కర్నూలు, ఖమ్మం, మహబూబ్‌నగర్, రాజమండ్రిలాంటి తదితర ప్రాంతాలకు ఎంతో మందిని తమ వ్యాన్ సహాయంతో చేరవేసి వారధులుగా నిలిచారు. వెండితెరపై ప్రకాశిస్తున్న ‘భాను’డు ఈ మధ్య వచ్చిన సరిలేరునీకెవ్వరు, వెంకీమామ, కథానాయకుడు, మిస్టర్ మజ్ను, ఒక్క క్షణంలాంటి 15 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు భానుప్రకాష్. ప్రస్తుతం కేజీఎఫ్–2, నాగచైతన్య లవ్‌స్టోరిలో కూడా మెరవనున్నాడు. సినిమాల్లోనే కాకుండా టీవీ షోలు, సీరియల్స్, నాటకాలు, తదితర రంగాల్లో తన నటనతో రాణిస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తన తండ్రి సురేష్ కూడా సినిమా రంగానికి చెందినవాడే.. సురేష్ 30కి పైగా షార్ట్ మూవిస్ చేశాడు. హార్ట్ బీట్ అనే ఇండిపెండెంట్ సినిమా చేశాడు. -
నగరి.. గ్రూపులతో సరి!
నగరి నియోజకవర్గ రాజకీయం రంజుగా మారింది. టీడీపీ టికెట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు. దివంగత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు పెద్ద కుమారుడు భానుప్రకాష్ తనకే టికెట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. అదే కుటుంబానికి చెందిన ముద్దుకృష్ణమ సతీమణి, చిన్న కుమారుడు జగదీష్ మాత్రం అకోశ్రాజు వెంట నడుస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి డాక్టర్ సుభాషిణి తనకు టికెట్ ఇవ్వాలని అభ్యర్థించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సాక్షి, చిత్తూరు, తిరుపతి: నగరి తెలుగు దేశం పార్టీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో రోజుకొకరు తెరపైకి వస్తున్నారు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణానంతరం నగరి అసెంబ్లీ టికెట్ కోసం మూడువర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. గాలి పెద్ద కుమారుడు భానుప్రకాష్ ఒకవర్గం, చిన్న కుమారుడు జగదీష్ మరో వర్గంగా ఏర్పడి టికెట్ కోసం పోటీపడుతున్నారు. జగదీష్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్రాజుతో కలసి ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. భాను మాత్రం తన అనుచరులతో రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో కొత్తగా మహిళా డాక్టర్ తెరపైకి వచ్చారు. నగరి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సుభాషిణి రెండు రోజుల క్రితం అధినేతను కలసి తన ఆసక్తిని తెలియజేశారు. దివంగత ముద్దుకృష్ణమ కుటుంబంలోనెలకొన్న విభేదాలతో తలబొప్పి కట్టిస్తున్న నేపథ్యంలో డాక్టర్ సుభాషిణి తెరపైకి రావడం నగరిలో చర్చనీయాంశమైంది. రాజుల సామాజిక వర్గానికి చెందిన అశోక్‌రాజు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అదే సామాజిక వర్గానికే చెందిన డాక్టర్ సుభాషిణి చంద్రబాబును కలిసి వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించమని కోరడం ఇటు అశోక్‌రాజు వర్గం.. అటు భాను వర్గం జీర్ణించుకోలేకపోతున్నాయి. దీంతో నగరి టీడీపీలో రాజకీయం వేడెక్కింది. ఉత్తర.. దక్షిణ ధ్రువాలు ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణించి ఏడాది పూర్తవుతున్నా.. టీడీపీ ఇన్చార్జి పదవి భర్తీకి నోచుకోలేదు. దీంతో నగరి టీడీపీ ఇన్చార్జ్ తనే అంటూ ఎవరికి వారు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గాలి సోదరుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు గత ఏడాది అమరావతి వేదికగా మధ్యస్తం జరిగినా ఫలితం లేకుండాపోయింది. పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ ఒక గ్రూప్‌నకు నాయకత్వం వహిస్తుండగా, మరో గ్రూప్‌కు అశోక్‌రాజు నాయకత్వం వహిస్తున్నారు. ముద్దుకృష్ణమ సతీమణి గాలి సరస్వతమ్మ, చిన్నకుమారుడు గాలి జగదీష్, రమేష్ చంద్రప్రసాద్, పాకా రాజా తదితరులు సైతం అశోక్‌రాజు గ్రూప్‌తో జతకట్టారు. ఈ నేపథ్యంలో శనివారం అశోక్‌రాజు నిర్వహించిన సమావేశానికి గాలి సరస్వతమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ‘నగరికి మంచి నాయకుడిని ఎన్నుకోండి’ అని సూచించడం ప్రకంపనలు సృష్టించింది. గతంలో నవనిర్మాణ దీక్ష సందర్భంగా ముద్దుకృష్ణమ వారసుడు చిన్నకుమారుడు గాలి జగదీషే అని ప్రకటించి వివాదానికి తెరలేపారు. దీంతో ముద్దు కుటుంబంలో లుకలుకలు ఇంకా సద్దుమణగలేదనే విషయం కేడర్‌కు స్పష్టమైంది. అశోక్‌రాజు తాయిలాలు ఎన్నికలు సమీపిస్తుండడంతో అశోక్‌రాజు తాయిలాల పర్వానికి తెరతీశారు. పసుపు–కుంకుమ పేరుతో అధినేత ప్రజాధనంతో డ్వాక్రా సంఘాలకు తాయిలాల ఎరవేయగా, అదే బాటలో అశోక్‌రాజు సైతం మహిళలకు చీరలను తాయిలాలుగా అందిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చిన్న చిన్న కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఉంటున్నానని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అశోక్‌రాజు సామాజిక వర్గం నుంచి డాక్టర్ సుభాషిణి తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. నగరి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణకు ఆమె దరఖాస్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అధినేతను కలసి బయోడేటాను అందించారు. వైద్యురాలిగా తనకు పరిచయాలు, సామాజిక వర్గ మద్దతు ఉందని ఆమె చంద్రబాబు వద్ద వివరించినట్లు తెలిసింది. అధినేత కూడా డాక్టర్ సుభాషిణి గురించి పూర్తి వివరాలు సేకరించి నివేదిక ఇవ్వమని సర్వే బృందాన్ని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. -
చంద్రబాబుకు దమ్మూ, ధైర్యం ఉంటే..
ఢిల్లీ: నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అబద్ధాల చిట్టా చెప్పారని ఏపీ బీజేపీ సెక్రటరీ భాను ప్రకాశ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో భాను ప్రకాశ్ విలేకరులతో మాట్లాడుతూ..40 ఏళ్లుగా ఏ తప్పు చేయలేదంటూ చంద్రబాబు నాయుడు చెబుతున్నారు..బాబుకి దమ్మూ ధైర్యం ఉంటే కాణిపాకం దేవుడిపై ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబు సక్రమంగా పరిపాలన చేస్తే బీజేపీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు సంవత్సరాలుగా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, మోదీని పొగిడిన విషయాన్ని గుర్తు చేశారు. 2019లో ఏపీ టీడీపీ సైకిల్ చక్రాలు ఊడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గవర్నర్‌కు ఎలాంటి అధికారాలు ఉంటాయో చదివి తెలుసుకోవాలని బాబుకు, టీడీపీ నేతలకు హితవు పలికారు. గవర్నర్‌కు ఏ అధికారితో నైనా మాట్లాడే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏపీ ప్రజల డబ్బుతో ఢిల్లీకి వస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పెట్టే ఖర్చులు, విమాన ఛార్జీలపై ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. -
కక్షకట్టి ‘లొకంటో’కీడ్చాడు!
సాక్షి, సిటీబ్యూరో: కాలేజ్‌లో చోటు చేసుకున్న చిన్న వాగ్వాదం నేపథ్యంలో ఓ యువతిపై కక్షగట్టిన ప్రబుద్ధుడు ఆమెను ‘లొకంటో’కీడ్చాడు. యువతి ఫొటోలతో పాటు అశ్లీలమైన రాతలు జోడించి వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించారు. నిందితుడు వి.భానుప్రకాష్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ తెలిపారు. బడంగ్‌పేట్‌కు చెందిన భాను ప్రకాష్ నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇదే కళాశాలతో ఇతడి స్నేహితుడు అఖిల్ మరో బ్రాంచ్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. అఖిల్ ఓ రోజు తన క్లాస్‌రూమ్‌లో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో భాను ప్రకాష్ అక్కడకు వెళ్ళి సపర్యలు చేయడానికి సిద్దమయ్యాడు. అయితే దీనికి ప్రొఫెసర్ అభ్యంతరం చెప్పడంతో పాటు ఓ విద్యార్థినితో వాగ్వాదం జరిగింది. ఆమెపై కక్షకట్టిన ప్రకాష్ లొకంటో సైట్లో ఆమె ఫొటోలతో ఖాతా తెరిచాడు. అశ్లీలమైన రాతలు రాయడంతో పాటు ఆమె సెల్‌నెంబర్ ఇచ్చాడు. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురైన బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతివలకు ‘హెల్’ఫోన్... నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు సెల్‌ఫోన్ వేధింపులు ఎదురయ్యాయి. వారి ఫిర్యాదులతో రంగంలోకి దిగిన సిటీ షీ–టీమ్స్ నిందితుల్ని పట్టుకున్నాయి.డిగ్రీ విద్యార్థినికి తన స్నేహితురాలి ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆమె తన సోదరుడిగా పరిచయం చెయ్యడంతో పాటు అతడి కోరడంతో బాధితురాలు తన సెల్ నెంబర్ చెప్పింది. అప్పటి నుంచి ఎస్సెమ్మెస్‌లు, కాల్స్‌తో వేధింపులు మొదలయ్యాయి. ఆమెకు వివాహమైనా బ్లాక్మెయిల్ చేస్తున్న అతగాడు రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో షీ–టీమ్స్ గాంధీనగర్‌కు చెందిన తరుణ్‌ను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించాయి. అలాగే ఫోన్ వేధింపులకు పాల్పడుతున్న గోపాల్ రాజ్ జైన్, ఎం.ఉపేందర్, నరేష్ వ్యాస్‌లను పట్టుకున్నాయి. -
ఎవరెస్టంత ఎదిగారు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఐదుగురు విద్యార్థులు గురువారం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మొత్తం 22 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లగా వారిలో ఒకరు విరమించుకున్నారు. మిగిలిన 21 మందిలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న జె.ప్రవీణ్, కొత్తూరు గురుకులంలో చదువుతున్న పి.భానుసూర్యప్రకాష్, విశాఖపట్నం జిల్లా వెలుగొండ గురుకులంలో జూనియర్ ఎంపీసీ చదువుతున్న జి.రాజు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలోని నెల్లూరు జిల్లా చిట్టేడు గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న ప్రసన్నకుమార్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన వారిలో ఉన్నారు. గతేడాది 9 మంది విద్యార్థులు ఈ రెండు విద్యా సంస్థల నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వీరు లడక్‌లో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో శిక్షణ పొందారు. మూడు బృందాలుగా బయల్దేరిన వీరిలో మొదటి బృందం విజయం సాధించింది. రెండో బృందం ఈ నెల 19వ తేదీ ఎవరెస్ట్‌ను అధిరోహించనుంది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గురువారం అభినందనలు తెలిపారు. ఆత్మ విశ్వాసం పెరగాలి: సీఎం విద్యార్థులు శిఖరమంతటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులను అభినందిస్తూ గురువారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అత్యంత కఠినమైన శిక్షణను తట్టుకొని అనుకున్న గమ్యం చేరుకున్న విద్యార్థుల మనోస్థైర్యాన్ని సీఎం చంద్రబాబు కొనియాడారు. శిఖరారోహణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, కష్టాలను తట్టుకునే ధృడత్వం అలవడుతుందన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన శేఖర్‌బాబును, ఆయా శాఖల అధికారులను సీఎం అభినందించారు. మరిన్ని అధిరోహణలు సాధించాలి: వైఎస్ జగన్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అధిరోహణలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
ప్రేమపేరుతో కానిస్టేబుల్ మోసం
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. ఊట్కూర్: ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి మైనర్‌ను మోసం చేశాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఊట్కూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న భానుప్రకాశ్ మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక (17)ను ప్రేమిస్తున్నానని వెంటబడ్డాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి వెంట తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి తెలియడంతో పెళ్లి చేసుకోవాలని బాలిక భానుప్రకాశ్‌ను కోరింది. తన ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని, కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుంటానని ఈ నెల 3వ తేదీన మాయమాటలు చెప్పి ఇంటికి పంపించాడు. మోసపోయినట్టు గమనించిన బాధితురాలు కానిస్టేబుల్‌ను నిలదీయడంతో ముఖం చాటేశాడు. సోమవారం నాడు బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‌పై అత్యాచారం, చీటింగ్ కేసులు నమోదు చేసినట్టు స్థానిక ఎస్ఐ విజయకుమార్ తెలిపారు. -
డస్టర్ లొల్లి ప్రాణం తీసింది
క్లాస్‌రూంలో తోటి స్నేహితుడిని మెడపై గుద్దిన విద్యార్థి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలొదిలిన పదో తరగతి విద్యార్థి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ జెడ్పీ హైస్కూల్లో ఘటన చండ్రుగొండ (అశ్వారావుపేట): వారిద్దరూ ఫ్రెండ్స్.. ఒకే క్లాస్.. రోజూ కలిసే బడికి వస్తారు.. శుక్రవారం అలాగే వచ్చారు.. తరగతి గదిలో డస్టర్ కోసం ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం మొదలైంది.. తోటి స్నేహితుడిని నిలువరించే క్రమంలో మెడపై గుద్దాడు రెండోవాడు.. అంతే.. అతడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలాడు! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాను కావాలని కొట్టలేదని, స్నేహితుడు చనిపోతాడని అనుకోలేదంటూ రెండో విద్యార్థి కన్నీరుమున్నీరయ్యాడు. ఇన్చార్జి హెడ్మాస్టర్ ఫిర్యాదు మేరకు ఆ విద్యార్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గొడవ మొదలైందిలా.. చండ్రుగొండ మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన భానుప్రకాశ్(16) పదో తరగతి చదువుతున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన మరో విద్యార్థి, ఇతడు స్నేహితులు. శుక్రవారం ఇద్దరూ స్కూలుకు వెళ్లారు. ఉదయం ఫస్ట్ పీరియడ్ ఇంగ్లిష్ క్లాస్ జరిగింది. సెకండ్ పీరియడ్ మొదలవగానే.. స్కూల్‌డే సందర్భంగా జరిగే క్రీడలకు ఎంపికలు నిర్వహించడానికి విద్యార్థులను గ్రౌండ్‌కు పిలిచారు. తర్వాత ఒక్కొక్కరుగా తరగతి గదులకు చేరుకుంటున్నారు. థర్డ్ పీరియడ్ తెలుగు సబ్జెక్ట్ బోధించాల్సి ఉండగా.. క్లాస్ బోర్డుపై ఇంగ్లిష్ పాఠం అని రాశారు. దీన్ని డస్టర్‌తో తుడిచేందుకు భానుప్రకాశ్ స్నేహితుడు యత్నించాడు. ఇదే సమయంలో భానుప్రకాశ్.. అతడి నుంచి డస్టర్ తీసుకోబోయాడు. దీంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. భానుప్రకాశ్‌ను వారిస్తూ అతడి మెడపై బలంగా గుద్దాడు అతడి స్నేహితుడు. దీంతో భానుప్రకాశ్ విద్యార్థులు కూర్చునే బల్లపై పడిపోయాడు. మెడపై బలమైన దెబ్బ తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విద్యార్థులంతా గట్టిగా కేకలు వేయడంతో ఉపాధ్యాయులు క్లాస్‌రూంకు చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న భానుప్రకాశ్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. జాతీయ రహదారిపై రాస్తారోకో విద్యార్థి మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ విజయవాడ – జగదల్పూర్ జాతీయ రహదారిపై మృతుడి బంధువులు, వివిధ పార్టీల నేతలు, దళిత సంఘాల నాయకులు రాస్తారోకో చేశారు. నాలుగు గంటల పాటు ఆందోళన జరిపారు. భానుప్రకాశ్ మృతికి బాధ్యులను చేస్తూ ప్రధానోపాధ్యాయురాలు బీపీఆర్ఎల్ కుమారి, పీడీ సృజనలను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో హయగ్రీవాచారి చెప్పారు. అనంతరం ఈ ఘటన విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు ఫోన్లో వివరించారు. భానుప్రకాశ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. చనిపోతాడనుకోలేదు ‘‘నా చేతిలో ఉన్న డస్టర్‌ను భాను ప్రకాశ్ లాక్కోబోయాడు. నేను వారించినా మళ్లీ అదే ప్రయత్నం చేశాడు. దీంతో కోపం వచ్చి కొట్టాను. చనిపోతాడనుకోలేదు.. నేను, భాను రోజూ ఇంటి నుంచి కలిసే బడికి వస్తాం. ఇలా జరుగుతుం దని అనుకోలేదు..’’అంటూ భానును కొట్టిన రెండో విద్యార్థి విలపించాడు. కాగా, అతడిపై పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం శివరామకృష్ణ ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
ఇద్దరు విద్యార్థుల ఘర్షణ: ఒకరి మృతి
చంద్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక చుండ్రుగొండ జడ్పీ పాఠశాలలో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు ఘర్షణ పడగా ఒకరు మృతి చెందారు. తరగతి గదిలో ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో తంబళ్ల భానుప్రకాశ్(15) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ఇంటర్వెల్ సమయంలో భానుప్రకాశ్, మరో విద్యార్థి ఘర్షణ పడ్డారని తరగతికి వెళ్లిన తర్వాత కూడా తీవ్రంగా కొట్టుకున్నారని తోటి విద్యార్థులు తెలిపారు. కాగా ఇద్దరి మధ్య ఘర్షణలో మర్మావయవాలపై తీవ్రంగా దెబ్బ తగలడంతో భానుప్రకాశ్ తరగతిలోనే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై ఉపాధ్యాయులు ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం అందించారు. -
సూపర్ స్ట్రార్
తలమీద వెంట్రుకలు కాసిన్ని ఎక్కువ పెరిగితేనే చిరాగ్గా ఉండే ఈ సీజన్లో.. ఏమిటీ కుర్రాడు తల నిండా కూల్‌డ్రింక్ స్ట్రాలు గుచ్చుకున్నాడు? అని చిరాకు పడితే మీరు డస్ట్‌బిన్‌లో కాలేసినట్టే. అదేదో ముదిరి రోకలి తలకి చుట్టుకున్నాడనేది పాత సామెత అయితే.. రికార్డుల సరదా ముదిరి స్ట్రాలు తల నిండా చుట్టుకున్నాడని మనవాణ్ని చూశాక కొత్తగా రాసుకోవచ్చు. ఇంతకీ రికార్డుల వేటలో ఉన్న ఈ జగద్గిరిగుట్ట కుర్రాడు సూపర్ ‘స్ట్రా’ర్ అవ్వాలనుకుంటున్న వెనుక ఉన్న కథా కమామిషు ఇది. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి ఇప్పుడు సిటీ కుర్రాళ్లు రికార్డులు బ్రేక్ చేసే పనిలో ఉన్నారు. అదీ ఇదీ అని కాదు అందుకోసం ఎంత కష్టానికైనా రెడీ అంటున్నారు. అదే కోవలో నగరానికి చెందిన భానుప్రకాష్ (25) కూడా ఈ రికార్డుల క్రేజ్‌ని బాగా తలకెక్కించుకున్నాడు. బీకామర్స్ పూర్తి చేసి హెల్త్‌కేర్‌లో వర్క్ చేస్తున్న ఈ కుర్రాడు ఇప్పటికే గంటలో అత్యధిక సెల్ఫీలు దిగడమనే ఫీట్ సాధించి బాగా పాపులర్ అయ్యాడు. అదే ఊపులో మరో అటెంప్ట్‌కి రెడీ అవుతున్నాడు. ప్లాస్టిక్ స్ట్రాలను అత్యధిక సంఖ్యలో తల వెంట్రుకల మధ్య పెట్టుకోవడమే ఈ అటెంప్ట్. టార్గెట్ ‘గిన్నిస్’.. తల వెంట్రుకల మధ్య అత్యధిక స్ట్రాలను పెట్టుకోవడంలో ఇప్పటికే పలు రికార్డులు నమోదయ్యాయి. పాత రికార్డుల సంగతి అటుంచితే తాజాగా రికార్డు మాత్రం అమెరికాకు చెందిన స్టీఫెన్ రిఫర్టీ పేరు మీద ఉంది. ఆయన 2014 ఫిబ్రవరి 14న ఒకేసారి 312 స్ట్రాలను తన వెంట్రుకల మధ్య పెట్టుకొనిత గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. భానుప్రకాష్ ఈ రికార్డును తిరగరాయాలని నిశ్చయించుకున్నాడు. అయితే 350 స్ట్రాలతో మరో రికార్డు కూడా ఉందని, ఆ వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని భాను చెప్పారు. కనీసం 400-500 స్ట్రాలను తాను వెంట్రుకల మధ్య ఇమడ్చగలనని భానుప్రకాష్ ధీమాగా చెబుతున్నాడు. ఇప్పటికే పలు దఫాలు దీనికి సంబంధించిన ప్రదర్శనలిచ్చిన భాను తన గిన్నిస్ రికార్డు ఫీట్‌ను వారం రోజుల్లో చేపట్టనున్నట్టు ‘సాక్షి’కి తెలిపారు. గిన్నిస్ షరతుల ప్రకారం...ఈ రికార్డు కోసం వినియోగించే స్ట్రాలు ప్రత్యేక సైజును కలిగి ఉంటాయి. స్ట్రాలు పెట్టుకున్నాక 10 సెకన్లు అలాగే ఉండాలి. ఈలోగా వాటిలో ఏ ఒక్కటి కిందపడినా అది కౌంట్ కాదు. ఇప్పటికే రెండు వీడియోలను రూపొందించిన ఈ కుర్రాడు తన ఫ్రెండ్స్ గ్రూప్ మధ్య మరోసారి ఈ ఫీట్ చేసి ఇంకో వీడియో తీస్తున్నానని చెప్పాడు. ‘మన దగ్గర దొరికే స్ట్రాలు ఎక్కువ సైజు ఉంటాయి. అందుకని వీటిని వెతికి ప్లాస్టిక్ షాప్ వాళ్ల దగ్గర కొన్నాను. లాంగ్ హెయిర్ ఉంటే ఎన్నో స్ట్రాలు పెట్టుకోవచ్చనుకుంటాం. కానీ ప్లాస్టిక్ కదా అన్నీ జారిపోతుంటాయి. చాలా జాగ్రత్తగా జడ అల్లినట్లు పెట్టాల’ని తన రికార్డు కష్టాలను వివరిస్తున్నాడీ కుర్రాడు. ఏదేమైనా ఈ కుర్రాడి ఫీట్ మనల్ని మరోసారి గిన్నిస్‌కు ఎక్కిస్తుందని ఆశిద్దాం. -
చిత్రం కాదు విచిత్రం!
విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు సినిమా తీయాలనుకుని ఓ ప్రదేశానికి వెళతారు. అక్కడ వారికి ఎదురైన అనుభవాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’. మనోజ్ నందం, చాందిని జంటగా భాను ప్రకాశ్ బలుసు దర్శకత్వంలో పి.ఉమాకాంత్ నిర్మించిన ఈ సినిమా ప్రచార చిత్రం ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ-‘‘ కథ విన్న వెంటనే నచ్చింది. అందరూ నవ్వుకునేలా ఓ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘అన్ని వాణిజ్య హంగులూ ఈ సినిమాలో ఉంటాయి. అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ వేడుకలో హీరో మనోజ్‌నందం, హీరోయిన్ చాందిని తదితరులు పాల్గొన్నారు. -
ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి
కొత్తగూడెం రూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలను మెరుగుపర్చాలని డీఎంహెచ్ఓ భానుప్రకాష్‌ను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మండలంలోని పెనుగడప గ్రామాన్ని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి ఎంపీ సోమవారం సందర్శించారు. తొలుత పెనుగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. రోజుకు ఎంతమంది ఓపీలను పరీక్షిస్తున్నారని, ఎంత మంది వైద్యు లు ఉన్నారని డాక్టర్ గురుభార్గవ్ను అడిగి తెలుసుకున్నారు. రోజుకు సుమారు వంద మందిని పరీక్షిస్తున్నామని, ఇద్దరు డాక్టర్లు ఇద్దరే ఉన్నారని గురుభార్గవ్ తెలిపారు. దీంతో డీఎంహెచ్ఓతో ఎంపీ ఫోన్లో మాట్లాడారు. ఏజెన్సీలో విష జర్వాలు ప్రబలుతున్నాయని, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైద్యులు తక్కువ ఉన్నచోట అదనంగా నియమించాలని ఆదేశించారు. పెనుగడప లో విషజర్వాలు తగ్గుముఖం పట్టే వరకూ వైద్య శిబిరం కొనసాగించాలన్నారు. జర్వ పీడితుల రక్తం సేకరించి పరీక్షలు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగహన కలిగి ఉండాలన్నారు. వర్షా కాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. ఇదిలా ఉండగా ఓపెన్‌కాస్ట్ వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోం దని పలువురు గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సింగరేణి అధికారులతో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పెనుగడపలో విష జర్వంతో మృతి చెందిన కమాలుద్దీన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఎంపీ పర్మామర్శించారు. డెంగ్యూ తో బాధపడుతున్న జలీల్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాణోతు కేస్లీ, సర్పంచ్ మాళోతు కళావతి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, మిట్టపల్లి పాండురంగచార్యులు, వైఎస్సార్సీపీ నాయకులు జె. బి.ఎస్.చౌదరి, కందుల సుధాకర్‌రెడ్డి, తహశీ ల్దార్ అశోక్ చక్రవర్తి, ఎంపీడీవో శాంత దేవి, ఈఓపీఆర్డీ రమేష్, ప్రబాకర్, రాజేశ్వరి, పెనుగడప గ్రామ కమిటీ అధ్యక్షుడు గోర్రె బాబు, దుర్గ, కిరణ్, కారం సీతయ్య, వేముల రాము, సుధాకర్, విజయ భాస్కర్ పాల్గొన్నారు. ట్రాక్టర్ల తయారీలో కొత్త టెక్నాలజీ రావాలి ఖమ్మం అర్బన్ : వ్యవసాయ రంగానికి మరింత ఉపయోగపడేలా ఆధునిక టెక్నాలజీతో ట్రాక్టర్లు తయారీ జరగాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పవర్ ట్రాక్ కంపెనీకి చెందిన శ్రీవెంకట పద్మావతి ట్రాక్టర్ల షోరూంను ఎంపీ సోమవారం సందర్శించారు. కూలీల కొరత, పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో ఆయా కంపెనీలు ట్రాక్టర్ల తయారీ చేపట్టాలన్నారు. ఎంపీతో వెంట శ్రీవెంకట పద్మావతి ట్రాక్టర్ షోరూం మేనేజింగ్ డెరైక్టర్ కోయ రాజేష్‌కుమార్, ప్రోప్రైటర్ కోయ రామయ్య, వైఎస్సార్సీపీ నాయకుడు ఆకుల మూర్తి తదితరులు ఉన్నారు. రామయ్య సన్నిధిలో పొంగులేటి భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట, పినపాక ఎమ్మేల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఏఈఓ శ్రవణ్‌కుమార్, ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆల య మర్యాదలతో స్వాగతం పలికారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసి, అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, అభయాంజనేయస్వామి వారి ఉపాలయాల్లో పూజలు జరిపారు. ఆలయ ప్రాశస్థాన్ని అర్చకులను అడిగి తెలుసుకున్నారు. రుష్యమూఖ మ్యూజియంలో సీతారామ లక్ష్మణుల ఆభరణాలను తిలకించి వాటి గురించి వివరాలు తెలుసుకున్నారు. దేవస్థానం తరఫున ఎంపీ, ఎమ్మేల్యేలకు ఏఈఓ శ్రావణ్‌కుమార్ జ్ఞాపిక, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావ్, బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కడియం రామాచారి, సీనియర్ నాయకులు మంత్రిప్రగడ నర్సింహారావు, గంటా కృష్ణ, మహిళా నాయకురాలు దామర్ల రేవతి, మహేష్, బిజ్జెం శ్రీనివాసరెడ్డి, వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో పల్స్ పోలియో విజయవంతం..
కూసుమంచి, న్యూస్‌లైన్: జిల్లాలో 2.98లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కల మందు వేయాలని లక్ష్యం నిర్ధేశించుకుని 2.78లక్షల మందికి వేశామని డీఎంహెచ్ఓ భానుప్రకాష్ తెలిపారు. మిగిలిన వారికి కూడా సోమ, మంగళవారాలో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా పూర్తి చేస్తామని అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పాలేరు, నర్సింహులగూడెం, చౌటపల్లి గ్రామల్లో ఇంటింటి సర్వేను పరిశీలించారు. అనంతరం కూసుమంచి పీహెచ్‌సీని తనిఖీ చేసి విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో డెంగీ, మలేరియా పరీక్షల నిర్ధారణకు ఆరుగురు ల్యాబ్ టెక్నిషియన్లను నియమించామని, జిల్లాలో 61 వైద్యాధికారుల పోస్టులు ఖాళీ ఉండగా 59 భర్తీ చేశామని, మిగిలిన ఇద్దరు త్వరలో విధుల్లో చేరతారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన జిల్లాలో మరో 32 పీహెచ్‌సీలు అవసరం ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, వాటిల్లో నాలుగు పీహెచ్‌సీలు మంజూరయ్యాయని అన్నారు. జిల్లాలో 33 మంది స్టాఫ్ నర్సుల భర్తీకి సం బంధించి ఎంపికైన వారి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోందని, త్వరలోనే వీరు విధుల్లో చేరుతారని అన్నారు. భారత దేశం పోలి యో రహిత దేశంగా ఈ నెల 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని అన్నారు. పీహెచ్‌సీల పని తీరును మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నామని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మెడికల్ ఆఫీసర్ శంకర్కుమార్నాయక్ పాల్గొన్నారు. 59 మంది వైద్యాధికారులను నియమించాం నేలకొండపల్లి: జిల్లాలో 59 మంది వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ భానుప్రకాష్ తెలిపారు. సోమవారం ఆయన నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలియో చుక్కల కేంద్రాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 61 సార్లు పోలియో చుక్కల మందును పంపిణీ చేశామని తెలిపారు. జిల్లాలో 3327 బూత్‌లు, 3308 మొబైల్ పార్టీల ఏర్పాటు చేసి చుక్కల మందు పంపిణీ చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా 2.98 లక్షల మందికి పోలియో చుక్కల మందు వేశామని అన్నారు. ఈ సమావేశంలో క్లస్టర్ అధికారి మోహన్‌రావు, మం డల వైద్యాధికారి సురేష్‌నారాయణ, దంత వైద్యులు మురళీకృష్ణ, స్వప్న, నివేదిత, పార్మసిస్ట్ అప్పారావు, హెచ్ఈఓ జగదీశ్వర్ పాల్గొన్నారు.