అక్రమ వ్యాపారులకు అనుగుణంగా అడుగులు
గుట్టు చప్పుడు కాకుండా అనుచరులతో దందాలు
ఎన్నికల ప్రచారంలో సైతం వారితోనే నేతలకు ప్రలోభాలు
భాను గెలుపే లక్ష్యంగా కాసులు వెదజల్లుతున్న స్మగ్లర్లు
గత టీడీపీ ప్రభుత్వంలో అక్రమ వ్యాపారాలకు అండగా నిలిచారు.. ఎర్ర దొంగలకు కాపుకాశారు.. మద్యం సిండికేట్‌లకు వెన్నుదన్నుగా నిలబడ్డారు.. బియ్యం స్మగ్లర్లతో దోస్తీ కట్టారు.. ఇదంతా ఎవరి గురించో నగరి నియోజకవర్గ ప్రజలందరికీ విధితమే. 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన భానుప్రకాష్‌తో అంటకాగిన వారందరూ తదనంతర కాలంలో వివిధ నేరాలు చేస్తూ పట్టుబడ్డారు. చీకటి సామ్రాజ్యంతో సంబంధాలు పెట్టుకుని యథేచ్ఛగా దందా సాగిస్తున్నందుకే అప్పటి ఎన్నికల్లో ప్రజలు ఓటు తగిన బుద్ధి చెప్పారు. నాటి ఘటనలను నేటికీ నగరి వాసులు మరువలేదు. ఓడించినా పాత పంథాలోనే ఇప్పటికీ సాగుతున్న చీకటి భానుడికి మళ్లీ గుణపాఠం నేర్పేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
చిత్తూరు : నగరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు సాగించారు. ఇప్పుడు కూడా భాను అండతోనే ఆయన అనుచరులు రెచ్చిపోతున్నారు. అధికారం లేకున్నా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తూ వచ్చిన భాను అనుచరులు ఇటీవల పట్టుబడటంతో వారి బండారం బయటపడింది. వారు భానుతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కూడా వెలుగు చూడడంతో, ఇప్పటి వరకు ఇవన్నీ ఆరోపణలే అనుకుంటున్న వారిని సైతం ఆలోచింపజేస్తున్నాయి.
హత్యాయత్నం కేసులోనూ..
తమిళనాడులోని తిరుత్తణిలో మంత్రి ఆర్‌కే రోజా కార్యాలయ కార్యదర్శి ప్రతీష్‌పై జరిగిన హత్యాయత్నం కేసులోనూ టీడీపీ వారే ప్రధాన నిందితులు. తిరుత్తణి పోలీసులు కేసు చేధించి అరెస్టు చేసిన నవీన్ అనే వెట్టునవీన్, చిరంజీవి, పరశురాం అలియాస్ మధులు కూడా భాను అనుచరులే అని స్పష్టమైంది. టీడీపీలో వారికి ఉన్న పదవులు, భాను ప్రకాష్‌తో వారు తీసుకున్న ఫొటోలతో అసలు నిజం బట్టబయలైంది.
అక్రమ వ్యాపారులదే ప్రధానపాత్ర
టీడీపీ అభ్యర్థి భాను ప్రకాష్‌కు మద్దతుగా ప్రస్తుత ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీలో అక్రమ వ్యాపారులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. భాను అధికారంలోకి వస్తే విచ్చల విడిగా తమ వ్యాపారాలను కొనసాగించుకోవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఊ్యహాత్మకంగా ఎవరికీ చిక్కకుండా డబ్బులు. మద్యం పంపిణీ చేస్తూ తమ పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైస్సార్‌సీపీ రెబల్‌గా పోటీచేసిన అభ్యర్థులు, అలక వహించిన నేతలను కూడా ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
గంజాయి దందా వారిదే..!
పుత్తూరుకు చెందిన టీడీపీ నేత హరికృష్ణ అతడి అనుచరుడు జి.హేమంత్ 2022 జనవరి 10వ తేదీన గంజాయి తరలిస్తూ విశాఖ –అరకు రోడ్డులో విజయనగరం జిల్లా శృంగవరపు కోట వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి 14 ప్యాకెట్లలో 28 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు నగరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి భానుప్రకాష్‌కు అత్యంత సన్నిహితులు. ఇదే వ్యక్తి 2023లో పుత్తూరు స్వర్ణా కాలనీలో గంజాయి విక్రయిస్తూ మరోమారు పోలీసులకు పట్టుబడ్డాడు. ఆపై టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో భానుప్రకాష్‌తో కలిసి హరికృష్ణ పాల్గొనడం వారి సాన్నిహిత్యానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. దీంతో భాను అనుచరులైన టీడీపీ నేతలే గంజాయి తరలింపునకు పాల్పడుతున్నట్లు ప్రజలకు స్పష్టమైంది.
సొంత పార్టీ నేతలే తీవ్ర ఆరోపణలు
టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్‌కు ఎర్రచందనం, గంజాయి, బియ్యం, అక్రమ మద్యం వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు చలపతి, లత ఆరోపించడం నియోజకవర్గంలో కలకలం రేపింది. వారు తమ అనుచరులతో కలిసి విన్నూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయడం స్థానకంగా సంచలనం సృష్టించింది. చీకటి వ్యాపారులతో కుమ్మకై ్కన అభ్యర్థి తమకు వద్దు అంటూ బహిరంగంగా నినాదాలు చేయడం ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment