
పాఠశాల ఫ్లెక్సీ కడుతూ..
విద్యుదాఘాతంతో మతిస్థిమితం కోల్పోయిన ఇద్దరు విద్యార్థులు
మునుగోడు: పాఠశాల ప్రచారం కోసం ఫ్లెక్సీ కడుతూ ఇద్దరు విద్యార్థులు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమం గా ఉంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలో చోటుచేసుకుంది. గూడపూర్‌లోని శాంతినికేతన్ పాఠశాల ఎదుట బడి ప్రచారం కోసం ముద్రించిన ఫ్లెక్సీని అదే పాఠశాలకు చెందిన విద్యార్థులు దోటి రాజేశ్ (బీరేల్లిగూడెం), ఏరుకొండ వినోద్ (చీకటిమామిడి) కడుతున్నారు. బ్యానర్ కట్టేందుకు అవసరమైన కట్టెలకు బదులు పాఠశాల యాజమాన్యం పొడుగాటి ఇనుపకడ్డీలు ఇచ్చింది.
వాటిని నాటేందుకు పలువురు విద్యార్థులతో కలసి రెండు గుంతలను తవ్వా రు. వాటిపైన సమాంతరంగా ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్‌ను గమనించకుండా విద్యార్థులు పైప్‌లను ఏర్పాటు చేసేం దుకు ప్రయత్నించారు. ఇనుప కడ్డీలు కరెంటు తీగలకు తగలడంతో విద్యా ర్థులు విద్యుదాఘాతానికి గురయ్యా రు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు పూర్తిగా కాలిపోయి స్పృహ లేకుండా పడిపోయారు. చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థులు మతిస్థితిమితం కోల్పోయి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు.