పార్వతీపురం (విజయనగరం) : పిక్నిక్ కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు ప్రమాదవశాత్తు నదిలో పడి మృతిచెందారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా డి.సిర్లాం సమీపంలోని సువర్ణముఖి నది వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మందలుక్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థినులు పిక్నిక్ కోసం సువర్ణముఖి నది వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కర్రి కవిత(13), తులసి(13) అనే ఇద్దరు ఆడుకుంటూ వెళ్లి సువర్ణముఖిలో పడి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. విద్యార్థినులు పిక్నిక్ వెళ్తున్న విషయం పాఠశాల యాజమాన్యానికి తెలియదని అంటున్నారు.